3000 మీ. స్టీపుల్‌చేజ్‌లో పారుల్‌ జాతీయ రికార్డు | Parul Chaudhary sets new 3000m national record in LA | Sakshi
Sakshi News home page

3000 మీ. స్టీపుల్‌చేజ్‌లో పారుల్‌ జాతీయ రికార్డు

Published Mon, Jul 4 2022 6:59 AM | Last Updated on Mon, Jul 4 2022 6:59 AM

Parul Chaudhary sets new 3000m national record in LA - Sakshi

భారత అథ్లెట్‌ పారుల్‌ చౌదరీ 3వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో కొత్త జాతీయ రికార్డు సృష్టించింది. లాస్‌ఏంజెలిస్‌లో జరిగిన సౌండ్‌ రన్నింగ్‌ మీట్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 27 ఏళ్ల పారుల్‌ ఈ ఘనత సాధించింది. పారుల్‌ 3వేల మీటర్లను 8ని:57.19 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో తమిళనాడు అథ్లెట్‌ సురియా (9ని: 04.5 సెకన్లు; 2016లో) సాధించిన జాతీయ రికార్డును పారుల్‌ బద్దలు కొట్టింది. ఈనెలలో అమెరికాలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆమె బరిలోకి దిగనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement