Steeple chase
-
ఒలింపిక్స్‌లో మరో ప్రేమ జంట.. లవ్ ప్రపోజల్ వీడియో వైరల్
ప్యారిస్ ఒలింపిక్స్‌లో క్రీడాకారుల ప్రదర్శనతో పాటు లవ్ ప్రపోజల్స్ కూడా అందరని ఆకట్టుకుంటున్నాయి. ఈ విశ్వ క్రీడల వేదికగా మరో ప్రేమ జంట ప్రపంచానికి పరిచయమైంది. 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో నాలుగో స్థానంలో నిలిచిన ఫ్రెంచ్ అథ్లెట్ అలిస్ ఫినోట్ తన ప్రియుడికి లవ్ ప్రపోజ్ చేసింది. కాగా ఆలిస్ ఫినోట్ రేసు ప్రారంభానికి ముందు ఓ ఛాలెంజ్ చేసింది. ఈ రేసును తొమ్మిది నిమిషాలలోపు పూర్తి చేస్తే తన ప్రియుడికి అందరి ముందు తన ప్రేమను తెలియజేస్తానని స్నేహితులతో కండీషన్ పెట్టుకుంది. అయితే అనుకున్న విధంగానే 9 నిమిషాల్లో పరుగు పూర్తి చేసిన ఈ ఫ్రెంచ్ క్రీడాకారణి.. బహిరంగంగా తన బాయ్‌ఫ్రెండ్‌కు తన ప్రేమను తెలియజేసింది.రేసును ముగించిన వెంటనే తన ప్రియుడు వద్దకు వెళ్లిన ఫినోట్.. ఉంగరాన్ని తీసి మోకాళ్లపై కూర్చోని లవ్ ప్రపోజ్ చేసింది. తన ప్రేయసి తనకోసం వేసిన ప్రపోజల్ ప్లాన్‌తో ఒక్కసారిగా సదరు బాయ్‌ఫ్రెండ్ ఆశ్చర్యపోయాడు.ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా 3000 మీటర్ల రేసును అలిస్ ఫినోట్ ఎనిమిది నిమిషాల 58.67 సెకన్లలో పూర్తి చేసింది. తద్వారా ఈ రేసును అత్యంత వేగంగా పూర్తి చేసిన తొలి యూరోపియన్‌గా ఆమె రికార్డులకెక్కింది. కాగాఇంతకుముందు అర్జెంటీనా అథ్లెట్స్ సిమొనెట్, పిలర్ కంపోయ్.. చైనా బ్యాడ్మింటన్ జోడీ హువాంగ్ యా కియోంగ్ ,లీ యుచెన్ జోడీ ఈ ప్యారిస్ ఒలింపిక్స్ వేదికగానే ఒక్కటయ్యారు. French athlete came in fourth in the 3000m steeplechase, a European record, and asked for her boyfriend's hand ...pic.twitter.com/ofs9DocirE— Figen (@TheFigen_) August 7, 2024 -
Asian Games 2023: భారత్ ఖాతాలో 15వ స్వర్ణం
ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ పతకాల వేటలో దూసుకుపోతుంది. 5000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో ఇవాళ (అక్టోబర్ 3) పారుల్ చౌదరీ స్వర్ణం సాధించడంతో భారత్ పతకాల సంఖ్య 69కి (15 స్వర్ణాలు, 26 రజతాలు, 28 కాంస్యాలు) చేరింది. నిన్న 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో సిల్వర్ మెడల్ సాధించిన పారుల్ గంటల వ్యవధిలో తన స్వర్ణ కలను నెరవేర్చుకుంది. ఈ పతకంతో పారుల్ చౌదరీ స్వర్ణం నెగ్గిన మూడో భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా నిలిచింది. Hangzhou Asian Games: India's Parul Chaudhary wins gold medal in Women's 5000-metre racePhoto source: Athletics Federation of India (AFI) pic.twitter.com/oxyHWYM2qN— ANI (@ANI) October 3, 2023 5000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో తొలుత వెనుకపడిన పారుల్, ఆతర్వాత అనూహ్యంగ పుంజుకుని 15:14.75 సెకెన్లలో రేసును ముగించింది. ఈ ఈవెంట్లో జపాన్ అథ్లెట్ రిరికా హిరోనాకాకు (15:15.34) రజత పతకం లభించగా.. కజకిస్తాన్ అథ్లెట్ కరోలిన్ కిప్కిరుయ్కు (15:23.12) కాంస్యం దక్కింది. ఇదే ఈవెంట్లో మరో భారత అథ్లెట్ అంకిత (15:33.03) ఐదో స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే, 69 పతకాలతో భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. 292 పతకాలతో (159 గోల్డ్, 87 సిల్వర్, 46 బ్రాంజ్) చైనా అగ్రస్థానంలో దూసుకుపోతుంది. 129 పతకాలతో (33, 46, 50) జపాన్ రెండో స్థానంలో, 138 పతకాలతో (32, 42, 64) జపాన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. -
Asian Games 2023: పతకాల వేటలో దూసుకుపోతున్న భారత్.. మరో 2 స్వర్ణాలు
ఏషియన్ గేమ్స్ 2023లో పతకాల వేటలో భారత్ దూసుకుపోతుంది. ఆదివారం టీమిండియా ఖాతాలో మరో 2 స్వర్ణ పతకాలు చేరాయి. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాశ్ సాబ్లే.. షాట్‌పుట్‌లో తజిందర్‌పాల్ సింగ్ తూర్ స్వర్ణాలతో మెరిశారు. ఈ రెండు మెడల్స్‌తో ప్రస్తుతం భారత్ ఖాతాలో 13 బంగారు పతకాలు చేరాయి. మొత్తంగా ఈ క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 45కు (13 గోల్డ్, 16 సిల్వర్, 16 బ్రాంజ్) చేరింది. 13th Gold Medal for India 🇮🇳 in Asian Games. - Tajinderpal Singh Toor is a hero.pic.twitter.com/dIfl9NN0DB — Johns. (@CricCrazyJohns) October 1, 2023 పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. చైనా 233 పతకాలతో (124 గోల్డ్, 71 సిల్వర్, 38 బ్రాంజ్) అగ్రస్థానంలో దూసుకుపోతుంది. రిపబ్లిక్ ఆఫ్ కొరియా 122 పతకాలతో (30, 34, 58) రెండో స్థానంలో, జపాన్ 110 మెడల్స్‌తో (29, 40, 41) మూడో స్థానంలో ఉన్నాయి. Avinash Sable - the hero of India today in Asian Games!A Gold Medal in record time in 3000m Steeplechase.pic.twitter.com/EpLjVD83YF— Mufaddal Vohra (@mufaddal_vohra) October 1, 2023 రికార్డు బద్దలు కొట్టిన సాబ్లే.. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో స్వర్ణ పతకం సాధించిన అవినాశ్ సాబ్లే 8:19:50 సెకెన్లలో పరుగును పూర్తి చేసి ఏషియన్ గేమ్స్ రికార్డును బద్దలు కొట్టాడు. రేస్ పూర్తియ్యే సరికి సాబ్లే దరిదాపుల్లో కూడా ఎవరు లేకపోవడం విశేషం. ఈ పతకం ప్రస్తుత ఎడిషన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం. నాలుగో షాట్‌పుటర్.. షాట్‌పుట్‌లో స్వర్ణంతో మెరిసిన తజిందర్ పాల్ సింగ్ తూర్ వరుసగా రెండో ఏషియన్ గేమ్స్‌లో (2018, 2023) గోల్డ్ మెడల్స్ సాధించిన నాలుగో షాట్‌పుటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో పర్దుమాన్ సింగ్ బ్రార్ (1954, 1958), జోగిందర్ సింగ్ (1966, 1970), బహదూర్ సింగ్ చౌహాన్ (1978, 1982) ఈ ఘనత సాధించారు. ప్రస్తుత క్రీడల్లో తూర్ సాధించిన పతకం భారత్‌కు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో రెండోది. దీనికి కొద్దిసేపటి ముందే అవినాశ్ సాబ్లే 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో స్వర్ణ పతకం సాధించాడు. -
3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఫైనల్లో పారుల్
బుడాపెస్ట్ (హంగేరి): ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఈవెంట్లో భారత అథ్లెట్ పారుల్ చౌధరీ ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన హీట్స్‌లో పారుల్ ఐదో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. రెండో హీట్‌లో పోటీపడ్డ పారుల్ తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. పారుల్ 9 నిమిషాల 24.29 సెకన్లలో గమ్యానికి చేరి ఐదో స్థానంలో నిలిచింది. మొత్తం మూడు హీట్స్ నిర్వహించారు. ప్రతి హీట్‌లో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన అథ్లెట్లు ఫైనల్‌కు అర్హత పొందారు. ఫైనల్ ఆదివారం జరుగుతుంది. మరోవైపు పురుషుల లాంగ్‌జంప్ ఈవెంట్ ఫైనల్లో భారత అథ్లెట్ జెస్విన్ ఆ్రల్డిన్ నిరాశపరిచాడు. 12 మంది పాల్గొన్న ఫైనల్లో జెస్విన్ తొలి రెండు ప్రయత్నాల్లో ఫౌల్ చేశాడు. మూడో ప్రయత్నంలో 7.77 మీటర్ల దూరం దూకి 11వ స్థానంలో నిలిచాడు. చదవండి: Asia Cup 2023: విరాట్ కోహ్లికి బీసీసీఐ వార్నింగ్.. కారణమిదే! మరోసారి అలా చేయొద్దంటూ! -
పారిస్ ఒలింపిక్స్‌కు అవినాశ్ సాబ్లే అర్హత
భారత అథ్లెట్ అవినాశ్ సాబ్లే వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఈవెంట్లో అర్హత సాధించాడు. పోలాండ్‌లో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల అవినాశ్ 8 నిమిషాల 11.63 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణ సమయాన్ని (8ని:15.00 సెకన్లు) అవినాశ్ అధిగమించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో హీట్స్‌లోనే వెనుదిరిగిన అవినాశ్ 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో, 2019 ఆసియా చాంపియన్‌షిప్‌లో రజత పతకాలు గెలిచాడు. -
అదరగొడుతున్న అథ్లెట్లు.. స్టీపుల్‌ఛేజ్‌లో అవినాష్ సాబ్లేకు రజతం
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు అదరగొడుతున్నారు. తొమ్మిదో రోజు వరుసగా రెండు రజతాలతో సత్తా చాటారు. తొలుత మహిళల 10000 మీటర్ల రేస్ వాక్ విభాగంలో ప్రియాంక గోస్వామి సిల్వర్ మెడల్‌తో బోణీ కొట్టగా.. తాజాగా పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాష్ సాబ్లే రజతంతో మెరిశాడు. SILVER FOR SABLE🥈@avinash3000m wins a 🥈in Men's 3000m Steeplechase event at #CommonwealthGames2022 with a Personal Best and National Record (8.11.20) Congratulations Avinash. India is very proud of you 🤩#Cheer4India #India4CWG2022 pic.twitter.com/lSmP1Ws4sk — SAI Media (@Media_SAI) August 6, 2022 అవినాష్ 8:11.20 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుని వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయడంతో పాటు జాతీయ రికార్డును నెలకొల్పాడు. అవినాష్.. కేవలం 0.05 సెకెన్ల తేడాతో స్వర్ణాన్ని కోల్పోయాడు. కెన్యాకు చెందిన అబ్రహామ్ కిబివోత్ (8:11.15) స్వర్ణం, అదే దేశానికి చెందిన ఆమోస్ సెరమ్ (8:16.83) కాంస్య పతకాలు సాధించారు. కాగా, ప్రస్తుత క్రీడల ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్ ఇదివరకే మూడు పతాకలు గెలిచింది. పురుషుల హై జంప్‌లో తేజస్విన్ యాదవ్ కాంస్యం, లాంగ్ జంప్‌లో శ్రీశంకర్ మురళీ రజతం, మహిళల 10000 మీటర్ల రేస్ వాక్‌లో ప్రియాంక గోస్వామి రజత పతకాలు సాధించారు. అవినాష్ పతకంతో ఈ విభాగంలో భారత్ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. ఓవరాల్‌గా భారత్ 28 మెడల్స్‌తో (9 స్వర్ణాలు, 10 రజతాలు, 9 కంస్యాలు) నాటౌట్‌గా నిలిచింది. చదవండి: భారత్ ఖాతాలో 27వ పతకం.. రేస్ వాక్‌లో ప్రియాంకకు రజతం -
World Athletics Championships: జెరుటో జోరు...
ఈవెంట్ ఆరో రోజు రెండు విభాగాల్లో ఫైనల్స్ జరిగాయి. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో నోరా జెరుటో (కజకిస్తాన్)కు స్వర్ణం దక్కింది. రేస్‌ను ఆమె 8 నిమిషాల 53.02 సెకన్లలో పూర్తి చేసి కొత్త చాంపియన్‌షిప్ రికార్డును నమోదు చేసింది. వెర్కుహ గెటాచూ (ఇథియోపియా – 8 నిమిషాల 54.61 సె.) రజతం సాధించగా, మెకిడెస్ అబీబీ (ఇథియోపియా – 8 నిమిషాల 56.08 సె.) కాంస్యం గెలుచుకుంది. ఈ ఈవెంట్లో టాప్–3లో నిలిచిన ముగ్గురు అథ్లెట్లు కూడా పరుగును 9 నిమిషాల్లోపే పూర్తి చేయడం వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో తొలి సారి కావడం విశేషం. జూనియర్ స్థాయిలో కెన్యాకు ప్రాతినిధ్యం వహించి గత ఏడాది కజకిస్తాన్‌కు వలస వెళ్లిన జెరుటో ఈ క్రమంలో టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని కూడా కోల్పోయింది. అయితే ఇప్పుడు వరల్డ్ చాంపియన్‌షిప్ బరిలోకి దిగి కజకిస్తాన్‌కు ఈ క్రీడల చరిత్రలో తొలి స్వర్ణాన్ని అందించింది. మహిళల డిస్కస్‌త్రోలో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత వలరీ అల్మన్ (అమెరికా)కు నిరాశ ఎదురైంది. డిస్క్‌ను 68.30 మీటర్లు విసిరిన అల్మన్ మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకుంది. చైనాకు చెందిన బిన్ ఫింగ్ స్వర్ణం గెలుచుకుంది. 69.12 మీటర్లతో ఆమె అగ్ర స్థానంలో నిలిచింది. సాండ్రా పెర్కోవిక్ (క్రొయేషియా – 68.45 మీ.)కు రజతం దక్కింది. -
3000 మీ. స్టీపుల్‌చేజ్‌లో పారుల్ జాతీయ రికార్డు
భారత అథ్లెట్ పారుల్ చౌదరీ 3వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో కొత్త జాతీయ రికార్డు సృష్టించింది. లాస్‌ఏంజెలిస్‌లో జరిగిన సౌండ్ రన్నింగ్ మీట్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 27 ఏళ్ల పారుల్ ఈ ఘనత సాధించింది. పారుల్ 3వేల మీటర్లను 8ని:57.19 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో తమిళనాడు అథ్లెట్ సురియా (9ని: 04.5 సెకన్లు; 2016లో) సాధించిన జాతీయ రికార్డును పారుల్ బద్దలు కొట్టింది. ఈనెలలో అమెరికాలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆమె బరిలోకి దిగనుంది. -
National Open Athletics: పారుల్ డబుల్ ధమాకా
సాక్షి, వరంగల్ స్పోర్ట్స్: రైల్వేస్ అథ్లెట్ పారుల్ చౌదరి(Parul Chaudhary) డబుల్ ధమాకా సాధించింది. జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆమె రెండో స్వర్ణం సాధించింది. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో ఆమె తాజాగా మహిళల 3000 మీ. స్టీపుల్‌చేజ్‌లోనూ విజేతగా నిలిచింది. పోటీల ప్రారంభ రోజే పారుల్ 5000 మీటర్ల పరుగులో కూడా బంగారు పతకం సాధించింది. శుక్రవారం జరిగిన మూడు వేల మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్లో పారుల్ చౌదరికి మహారాష్ట్ర అథ్లెట్ కోమల్ చంద్రకాంత్ జగ్దలే గట్టిపోటీ ఇచి్చంది. చివరకు 0.02 సెకన్ల అతి స్వల్ప తేడాతో పారుల్ (9ని.51.01 సె) పసిడి పతకం పట్టేసింది. కోమల్ 9 ని.51.03సెకన్ల టైమింగ్‌తో రజతంతో సరిపెట్టుకొంది. ఈ ఈవెంట్లో ప్రీతి (రైల్వేస్; 10 ని.22.45 సె.) కాంస్యం గెలిచింది. పోటీల మూడో రోజు కూడా రైల్వేస్ అథ్లెట్ల హవానే కొనసాగింది. ఐదు ఈవెంట్లలో రైల్వేస్ అథ్లెట్లు బంగారు పతకాలు సాధించారు. పురుషుల హైజంప్‌లో సందేశ్, షాట్‌పుట్‌లో కరణ్వీర్ సింగ్, మహిళల లాంగ్‌జంప్‌లో ఐశ్వర్య, హర్డిల్స్‌లో కనిమొని బంగారు పతకాలు సాధించారు. నిరాశ పరిచిన నందిని... తెలంగాణ అమ్మాయి అగసర నందిని 100 మీటర్ల హర్డిల్స్‌లో నిరాశపరిచింది. ఇటీవల నైరోబి (కెన్యా)లో జరిగిన ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో సెమీస్ చేరిన నందిని... ఆశ్చర్యకరంగా జాతీయ ఓపెన్ పోటీల్లో విఫలమైంది. శుక్రవారం జరిగిన మహిళల వంద మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో ఆమె 14.30 సెకన్ల టైమింగ్‌తో ఆరో స్థానంలో నిలిచింది. ఇందులో కనిమొని (రైల్వేస్; 13.54 సె.) విజేతగా నిలువగా, అపర్ణ రాయ్ (కేరళ; 13.58 సె.), కె.నందిని (తమిళనాడు; 13.90 సె) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు. మిక్స్డ్ 4్ఠ400 మీ.రిలేలో తెలంగాణ బృందం అసలు పరుగునే పూర్తి చేయలేకపోయింది. -
స్టీపుల్‌చేజ్ విజేత మహేశ్వరి
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ జాతీయ అథ్లెటిక్స్ టోర్నీలో జి. మహేశ్వరి రికార్డు స్వర్ణాన్ని సాధించింది. కర్ణాటకలో జరుగుతోన్న ఈ టోర్నీలో మహేశ్వరి 2000మీ. స్టీపుల్ చేజ్లో కొత్త జాతీయ రికార్డుతో పాటు, మీట్ రికార్డును నెలకొల్పింది. ఆమె 6 నిమిషాల 41 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని... 2015లో నమోదైన 7ని. 1.72 సెకన్లతో ఉన్న జాతీయ రికార్డును తిరగరాసింది. 200మీ. పరుగులోనూ దీప్తి మీట్ రికార్డును సాధిం చింది. పరుగును 24.84సెకన్లలో ముగించి స్వర్ణాన్ని గెలుచుకుంది. దీంతో అన్సీ జోసెఫ్ (25.09సె.) రికార్డు తెరమరుగైంది. హెప్టాథ్లాన్‌లోనూ నూతన జాతీయ రికార్డు నమోదైంది. నందిని 5046 పాయింట్లు సాధించి జాతీయ రికార్డుతో పాటు మీట్ రికార్డును సృష్టించింది. గతంలో ఈ రికార్డు స్వప్నా బర్మన్ 4992 పాయింట్లు) పేరిట ఉండేది. ఈ టోరీ్నలో తెలంగాణ 7 స్వర్ణాలు, 14 రజతాలు, 12 కాంస్యాలు సాధించింది. -
‘స్వర్ణ’ సుధ...
♦ మహిళల 3000 మీటర్ల ♦ స్టీపుల్‌చేజ్‌లో పసిడి పతకం ♦ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ భువనేశ్వర్: ఎట్టకేలకు భారత అథ్లెట్ సుధా సింగ్ అనుకున్నది సాధించింది. తాను పాల్గొన్న గత మూడు ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లలో స్వర్ణ పతకాన్ని నెగ్గలేకపోయిన సుధా సింగ్... స్వదేశంలో తన లక్ష్యాన్ని అందుకుంది. సుధా సింగ్ అద్వితీయ ప్రతిభ కారణంగా ఈ మెగా ఈవెంట్లో వరుసగా మూడో రోజు భారత్ ఖాతాలో స్వర్ణం చేరింది. శనివారం భారత్‌కు లభించిన ఏకైక పసిడి పతకం సుధానే అందించడం విశేషం. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్ ఫైనల్ రేసును ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుధా సింగ్ 9 నిమిషాల 59.47 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. గత మూడు ఆసియా చాంపియన్‌షిప్‌లలో రజత పతకాలు గెలిచిన 31 ఏళ్ల సుధా తాజా ప్రదర్శనతో వరుసగా మూడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. మరోవైపు మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో అను రాఘవన్ (57.22 సెకన్లు) రజత పతకాన్ని గెలుపొందగా... పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో ఎం.పి.జబీర్ (50.22 సెకన్లు) కాంస్యం సాధించాడు. మహిళల ట్రిపుల్ జంప్‌లో ఎన్.వి. షీనా (13.42 మీటర్లు) కాంస్యం దక్కించుకుంది. మెర్లీన్ జోసెఫ్, హిమశ్రీ రాయ్, శ్రాబణి నందా, ద్యుతీ చంద్‌లతో కూడిన భారత మహిళల బృందం 4గీ100 మీటర్ల రిలేలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మూడో రోజు పోటీలు ముగిశాక భారత్ 7 స్వర్ణాలు, 4 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 20 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.