ఒలింపిక్స్‌లో మరో ప్రేమ జంట.. లవ్‌ ప్రపోజల్‌ వీడియో వైరల్‌ | Female French athlete proposes to boyfriend after finishing race at Paris Olympics | Sakshi
Sakshi News home page

ఒలింపిక్స్‌లో మరో ప్రేమ జంట.. లవ్‌ ప్రపోజల్‌ వీడియో వైరల్‌

Published Thu, Aug 8 2024 9:51 AM | Last Updated on Thu, Aug 8 2024 11:21 AM

Female French athlete proposes to boyfriend after finishing race at Paris Olympics

ప్యారిస్ ఒలింపిక్స్‌లో క్రీడాకారుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పాటు లవ్‌ ప్రపోజల్స్ కూడా అంద‌ర‌ని ఆకట్టుకుంటున్నాయి. ఈ విశ్వ క్రీడ‌ల వేదిక‌గా మ‌రో ప్రేమ జంట ప్ర‌పంచానికి ప‌రిచ‌యమైంది. 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో నాలుగో స్థానంలో నిలిచిన ఫ్రెంచ్ అథ్లెట్ అలిస్ ఫినోట్ త‌న ప్రియుడికి లవ్ ప్రపోజ్ చేసింది. 

కాగా ఆలిస్ ఫినోట్ రేసు ప్రారంభానికి ముందు ఓ ఛాలెంజ్ చేసింది. ఈ రేసును  తొమ్మిది నిమిషాలలోపు పూర్తి చేస్తే త‌న ప్రియుడికి అంద‌రి ముందు త‌న ప్రేమ‌ను తెలియ‌జేస్తాన‌ని స్నేహితుల‌తో కండీష‌న్ పెట్టుకుంది. అయితే అనుకున్న విధంగానే 9 నిమిషాల్లో ప‌రుగు పూర్తి చేసిన ఈ ఫ్రెంచ్ క్రీడాకార‌ణి.. బహిరంగంగా త‌న బాయ్‌ఫ్రెండ్‌కు తన ప్రేమను తెలియజేసింది.

రేసును ​ముగించిన వెంటనే తన ప్రియుడు వద్దకు వెళ్లిన ఫినోట్‌.. ఉంగరాన్ని తీసి మోకాళ్లపై కూర్చోని లవ్ ప్రపోజ్ చేసింది. తన ప్రేయసి తనకోసం వేసిన ప్రపోజల్‌ ప్లాన్‌తో ఒక్కసారిగా సదరు బాయ్‌ఫ్రెండ్ ఆశ్చర్యపోయాడు.

ఇందుకు సబంధిం‍చిన వీడి​యో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా 3000 మీటర్ల రేసును  అలిస్ ఫినోట్ ఎనిమిది నిమిషాల 58.67 సెకన్లలో పూర్తి చేసింది. తద్వారా ఈ రేసును అత్యంత వేగంగా పూర్తి చేసిన తొలి యూరోపియన్‌గా ఆమె రికార్డులకెక్కింది. 

కాగాఇంతకుముందు అర్జెంటీనా అథ్లెట్స్ సిమొనెట్, పిల‌ర్ కంపోయ్.. చైనా బ్యాడ్మింటన్ జోడీ హువాంగ్ యా కియోంగ్ ,లీ యుచెన్ జోడీ ఈ ప్యారిస్ ఒలింపిక్స్ వేదికగానే ఒక్కటయ్యారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement