ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ పతకాల వేటలో దూసుకుపోతుంది. 5000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో ఇవాళ (అక్టోబర్ 3) పారుల్ చౌదరీ స్వర్ణం సాధించడంతో భారత్ పతకాల సంఖ్య 69కి (15 స్వర్ణాలు, 26 రజతాలు, 28 కాంస్యాలు) చేరింది. నిన్న 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో సిల్వర్ మెడల్ సాధించిన పారుల్ గంటల వ్యవధిలో తన స్వర్ణ కలను నెరవేర్చుకుంది. ఈ పతకంతో పారుల్ చౌదరీ స్వర్ణం నెగ్గిన మూడో భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా నిలిచింది.
Hangzhou Asian Games: India's Parul Chaudhary wins gold medal in Women's 5000-metre race
— ANI (@ANI) October 3, 2023
Photo source: Athletics Federation of India (AFI) pic.twitter.com/oxyHWYM2qN
5000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో తొలుత వెనుకపడిన పారుల్, ఆతర్వాత అనూహ్యంగ పుంజుకుని 15:14.75 సెకెన్లలో రేసును ముగించింది. ఈ ఈవెంట్‌లో జపాన్ అథ్లెట్ రిరికా హిరోనాకాకు (15:15.34) రజత పతకం లభించగా.. కజకిస్తాన్ అథ్లెట్ కరోలిన్ కిప్కిరుయ్‌కు (15:23.12) కాంస్యం దక్కింది. ఇదే ఈవెంట్‌లో మరో భారత అథ్లెట్ అంకిత (15:33.03) ఐదో స్థానంలో నిలిచింది.
ఇదిలా ఉంటే, 69 పతకాలతో భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. 292 పతకాలతో (159 గోల్డ్, 87 సిల్వర్, 46 బ్రాంజ్) చైనా అగ్రస్థానంలో దూసుకుపోతుంది. 129 పతకాలతో (33, 46, 50) జపాన్ రెండో స్థానంలో, 138 పతకాలతో (32, 42, 64) జపాన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment