బుడాపెస్ట్ (హంగేరి): ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఈవెంట్‌లో భారత అథ్లెట్ పారుల్ చౌధరీ ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన హీట్స్‌లో పారుల్ ఐదో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది.
రెండో హీట్‌లో పోటీపడ్డ పారుల్ తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. పారుల్ 9 నిమిషాల 24.29 సెకన్లలో గమ్యానికి చేరి ఐదో స్థానంలో నిలిచింది. మొత్తం మూడు హీట్స్ నిర్వహించారు. ప్రతి హీట్‌లో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన అథ్లెట్లు ఫైనల్‌కు అర్హత పొందారు. ఫైనల్ ఆదివారం జరుగుతుంది.
మరోవైపు పురుషుల లాంగ్‌జంప్ ఈవెంట్ ఫైనల్లో భారత అథ్లెట్ జెస్విన్ ఆ్రల్డిన్ నిరాశపరిచాడు. 12 మంది పాల్గొన్న ఫైనల్లో జెస్విన్ తొలి రెండు ప్రయత్నాల్లో ఫౌల్ చేశాడు. మూడో ప్రయత్నంలో 7.77 మీటర్ల దూరం దూకి 11వ స్థానంలో నిలిచాడు.
చదవండి: Asia Cup 2023: విరాట్ కోహ్లికి బీసీసీఐ వార్నింగ్.. కారణమిదే! మరోసారి అలా చేయొద్దంటూ!
Comments
Please login to add a commentAdd a comment