
భువనేశ్వర్: మూడున్నర దశాబ్దాలకుపైగా చెక్కు చెదరకుండా ఉన్న జాతీయ అథ్లెటిక్స్ రికార్డు శుక్రవారం బద్దలైంది. జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో సర్వీసెస్ తరఫున బరిలో దిగిన అవినాశ్ ఈ రికార్డును తిరగరాశాడు.
1981 టోక్యో అథ్లెటిక్స్ మీట్‌లో గోపాల్ సైనీ (8ని.30.88 సెకన్లు) నెలకొల్పిన రికార్డును తాజాగా ఈ 24 ఏళ్ల అథ్లెట్ సవరించాడు. అవినాశ్ 8 నిమిషాల 29.80 సెకన్లలో గమ్యాన్ని చేరి స్వర్ణం చేజిక్కించుకున్నాడు. రాకేశ్ కుమార్ స్వామి 8ని. 47.31 సెకన్లలో... దుర్గా బహదూర్ 8ని. 48.29 వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment