ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా సెప్టెంబర్ 30న భారత మార్కెట్లలోకి మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎడిషన్ కార్లను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కార్లను కొనుగోలుదారులు ఎగబడి బుకింగ్ చేసుకున్నారు. కేవలం ఒక గంటలోపు 25 వేల మంది మహీంద్రా XUV700ను బుక్ చేసుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో ఇది ఒక సరికొత్త రికార్డును మహీంద్రా ఎక్స్‌యూవీ రికార్డును నమోదుచేసింది.
చదవండి: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన ఘనత...!
మహీంద్రా ఎక్స్‌యూవీ మరో రికార్డు...!
తాజాగా మహీంద్రా ఎక్స్‌యూవీ700 మరో జాతీయ రికార్డును నెలకొల్పింది. చెన్నై సమీపంలోని కొత్త ఎస్‌యూవీ ప్రూవింగ్ ట్రాక్ (ఎమ్‌ఎస్‌పీటీ) లో జరిగిన 24 గంటల స్పీడ్ ఎండ్యూరెన్స్ ఛాలెంజ్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ కొత్త జాతీయ రికార్డును సృష్టించింది.ఈ ఛాలెంజ్‌లోకి నాలుగు XUV700 SUV లు ఈవెంట్‌లో ఒక్కొక్కటి సుమారు 4000 కి.మీ. మొత్తంగా 17000 కిలోమీటర్ల మేర ప్రయాణించాయి. గతంలో ఈ రికార్డు 3161 కిలోమీటర్లతో ఉండేది.
మహీంద్రా XUV700 నాలుగు వేరియంట్లలో డీజిల్ మాన్యువల్ వేరియంట్ 4384.73 కిమీలతో , డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ 4256.12 కిమీ, పెట్రోల్ మాన్యువల్ 4232.01 కిమీ చేయగా, పెట్రోల్ ఆటోమేటిక్ 4155.65 కి.మీమేర ప్రయాణించి రికార్డును సృష్టించాయి. ఈ వాహనాలు సగటున 170 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో నడిచాయి.
చదవండి: 9 రోజుల్లో 1600 కోట్లు సంపాదించాడు..! ఎలాగంటే..!
Comments
Please login to add a commentAdd a comment