ఆనంద్‌ మహీంద్రా చెప్పినట్లుగానే చేశారే..! | Anand Mahindra Gifts XUV700 To Neeraj Chopra Sumit Antil | Sakshi
Sakshi News home page

Anand Mahindra Gifts XUV700: మహీంద్రా ఎక్స్‌యూవీ700 జావెలిన్‌ ఎడిషన్‌పై ఓ లుక్కేయండి..!

Published Sun, Oct 31 2021 8:57 AM | Last Updated on Sun, Oct 31 2021 10:47 AM

Anand Mahindra Gifts XUV700 To Neeraj Chopra Sumit Antil - Sakshi

Anand Mahindra Gifts XUV700 To Neeraj Chopra Sumit Antil: ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ జావెలిన్‌ త్రో విభాగంలో గోల్డ్‌ మెడల్‌ గెలిచిన నీరజ్‌చోప్రా, సుమిత్‌ ఆంటిల్‌కు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా వారికి బహుమతిగా  లిమిటెడ్‌ ఎడిషన్‌ మహీంద్రా 700ఎక్స్‌యూవీ కార్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆనంద్‌ మహీంద్రా చెప్పినట్లుగానే తన వాగ్ధానాన్ని నిలబెట్టుకున్నారు.

పారాలింపియన్‌ సుమిత్‌ ఆంటిల్‌కు మహీంద్రా 700ఎక్స్‌యూవీ పర్సనలైజ్‌డ్‌ కారును మహీంద్రా కంపెనీ అక్టోబర్‌ 30న బహుకరించింది. ఈ విషయాన్ని సంస్థ ట్విటర్‌లో షేర్‌ చేసింది. కార్‌ డెలివరీ విషయంపై ఆనంద్‌ మహీంద్రా కూడా స్పందించారు. ఆనంద్‌ మహీంద్రా తన ట్విట్‌లో...‘ మహీంద్రా 700ఎక్స్‌యూవీ జావెలిన్‌ ఎడిషన్‌ కారును మీతో పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. మే ద ఫోర్స్‌ విత్‌ యూ ’ అంటూ శుభాకాంక్షలను తెలిపారు.



ఇదిలా ఉండగా...టోక్యో ఒలింపిక్స్‌ 2020లో గోల్డ్‌మెడల్‌ గెలిచిన నీరజ్‌ చోప్రా కూడా తన ట్విటర్‌ హ్యండిల్‌లో జావెలిన్‌ ఎడిషన్‌ మహీంద్రా 700ఎక్స్‌యూవీ కార్‌తో దిగిన ఫోటోను పోస్ట్‌ చేశారు. ఆనంద్‌ మహీంద్రాకు నీరజ్‌ చోప్రా ధన్యవాదాలు తెలిపారు.
 


జావెలిన్‌ త్రో..కార్‌పై..!
నీరజ్‌ చోప్రాకు, సుమిత్‌ ఆంటిల్‌కు ఇచ్చిన మహీంద్రా 700ఎక్స్‌యూవీలో టోక్యోలో జరిగిన జావెలిన్‌ త్రో విభాగంలో వారు విసిరిన దూరాన్ని సూచిస్తూ జావెలిన్‌ సింబల్‌ను సూచించేలా కారును రూపొందించారు. 


మహీంద్రా 700ఎక్స్‌యూవీ రికార్డు...!
మహీంద్రా 700ఎక్స్‌యూవీ ప్రి-బుకింగ్స్‌లో దుమ్మురేపింది.  మహీంద్రా తన ఎక్స్‌యువి700 ఎస్‌యూ‌వి కారు బుకింగ్స్ తెరిచిన కేవలం గంట లోపు 25,000 మంది బుకింగ్ చేసినట్లు కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో ఇది ఒక సరికొత్త రికార్డు అని కంపెనీ పేర్కొంది.

చదవండి: కేవలం 4రోజుల్లో రూ.1000 పెట్టుబడితో రూ.3.45లక్షల్ని సంపాదించారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement