hurdles
-
ప్రపంచ రికార్డు... పసిడి పతకం
పారిస్: ఒలింపిక్స్‌లో మహిళల 400 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్‌ను ప్రవేశపెట్టి 40 ఏళ్లయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఈ విభాగంలో ఏ అథ్లెట్ వరుసగా రెండు స్వర్ణాలు సాధించలేదు. కానీ ‘పారిస్’లో అమెరికా క్రీడాకారిణి సిడ్నీ మెక్లాఫ్లిన్ లెవ్రోన్ ఈ ఘనత సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకం గెలిచిన సిడ్నీ మెక్లాఫ్లిన్ అదే ఫలితాన్ని పారిస్‌లో పునరావృతం చేసింది. ఈసారి ఏకంగా కొత్త ప్రపంచ, ఒలింపిక్ రికార్డులను కూడా సృష్టించింది. శుక్రవారం జరిగిన 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 25 ఏళ్ల సిడ్నీ 50.37 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ, ఒలింపిక్ రికార్డులను నెలకొల్పింది. ఈ ఏడాది జూన్ 30న 50.65 సెకన్లతో తానే సాధించిన ప్రపంచ రికార్డును సిడ్నీ తిరగరాసింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో సిడ్నీ 51.46 సెకన్లలో గమ్యానికి చేరి పసిడి పతకం నెగ్గింది. ఈ సమయాన్ని కూడా ఆమె ‘పారిస్’లో అధిగమించింది. ఓవరాల్‌గా ఇప్పటి వరకు ఈ విభాగంలో సిడ్నీ మెక్లాఫ్లిన్ ఐదుసార్లు కొత్త ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టింది. -
జాతీయ క్రీడల్లో జ్యోతి యర్రాజీకి స్వర్ణం.. ఆంధ్రప్రదేశ్ ఖాతాలో మూడవది
పనాజీ: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌కు మూడో స్వర్ణ పతకం లభించింది. సోమవారం జరిగిన అథ్లెటిక్స్ ఈవెంట్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి యర్రాజీ చాంపియన్‌గా అవతరించింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 13.22 సెకన్లలో అందరికంటే వేగంగా ఫైనల్ రేసును ముగించి అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు తెలంగాణ ఖాతాలో 11వ పతకం చేరింది. మహిళల స్విమ్మింగ్ 800 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో వ్రితి అగర్వాల్ రజత పతకం సాధించింది. -
హీట్స్‌లోనే జ్యోతి నిష్క్రమణ
బుడాపెస్ట్ (హంగేరి): తొలిసారి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లో పోటీపడ్డ భారత మహిళా అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ ఒత్తిడికిలోనై నిరాశపరిచింది. మంగళవారం జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్లో విశాఖపట్నం జిల్లాకు చెందిన 23 ఏళ్ల జ్యోతి హీట్స్‌ను దాటి ముందుకెళ్లలేకపోయింది. ఇటీవల ఆసియా చాంపియన్‌షిప్ లో స్వర్ణ పతకం సాధించిన జ్యోతి ప్రపంచ చాంపియన్‌షిప్ లో మాత్రం ఓవరాల్‌గా 29వ స్థానంలో నిలిచి సెమీఫైనల్ దశకు అర్హత పొందలేకపోయింది. నాలుగో హీట్‌లో పోటీపడ్డ జ్యోతి 13.05 సెకన్లలో గమ్యానికి చేరి ఏడో ర్యాంక్ లో నిలిచింది. మొత్తం ఐదు హీట్స్ జరగ్గా... ఒక్కో హీట్‌లో టాప్–4లో నిలిచిన వారు నేరుగా సెమీఫైనల్‌కు చేరారు . మిగిలిన వారిలో బెస్ట్–4 టైమింగ్ నమోదు చేసిన అథ్లెట్లు కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించారు. జ్యోతి తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన (12.78 సెకన్లు) సమయాన్ని ఇక్కడ పునరావృతం చేసి ఉంటే ఆమెకు సెమీఫైనల్ బెర్త్ కచి్చతంగా ఖరారయ్యేది. ఎందుకంటే ఇక్కడ 12.92 సెకన్ల సమయం నమోదు చేసిన మేకీ జిన్లిమ్ (నెదర్లాండ్స్)కు చివరిదైన 24వ సెమీఫైనల్ బెర్త్ లభించింది. ‘సూపర్’ షకేరీ... మహిళల 100 మీటర్ల స్ప్రింట్‌లో కొత్త ప్రపంచ చాంపియన్ అవతరించింది. ఫైనల్లో అమెరికాకు చెందిన 23 ఏళ్ల షకేరీ రిచర్డ్సన్ 10.65 సెకన్లలో అందరికంటే వేగంగా గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. ప్రపంచ చాంపియన్‌షిప్ లో పాల్గొన్న తొలిసారే షకేరీ స్వర్ణ పతకం సాధించడం విశేషం. షకేరీ ధాటికి ఐదుసార్లు 100 మీటర్ల వరల్డ్ చాంపియన్ షెల్లీ ఆన్ ఫ్రేజర్ (జమైకా; 10.77 సెకన్లు) మూడో స్థానానికి పరిమితమై కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. -
కాంస్యంతో జ్యోతి జాతీయ రికార్డు
చెంగ్డూ (చైనా): భారత స్టార్ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ మరో ఘనత సాధించింది. ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును విశాఖపట్నం జిల్లాకు చెందిన 23 ఏళ్ల జ్యోతి 12.78 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో 12.82 సెకన్లతో గత ఏడాది తానే నెలకొల్పిన జాతీయ రికార్డును జ్యోతి బద్దలు కొట్టింది. గత నెలలో ఆసియా చాంపియన్‌గా నిలిచిన జ్యోతి తదుపరి ఈనెల మూడో వారంలో హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిలో పోటీపడుతుంది. అథ్లెటిక్స్‌లో శుక్రవారమే భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. పురుషుల 200 మీటర్ల విభాగంలో అమ్లాన్ బొర్గోహైన్ కాంస్య పతకం సాధించాడు. అమ్లాన్ 20.55 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం భారత జట్టు 11 స్వర్ణాలు, 5 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 25 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. -
జ్యోతి ‘స్వర్ణ’ చరిత్ర.. 100 మీటర్ల హర్డిల్స్‌లో విజేతగా తెలుగమ్మాయి
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర అమ్మాయికి పసిడి పతకం గతంలో ఏ భారతీయ అథ్లెట్‌కు సాధ్యంకాని ఘనతను తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ సాధించింది. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి జ్యోతి స్వర్ణ పతకంతో మెరిసింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో గురువారం జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.09 సెకన్లలో ముగించి చాంపియన్‌గా అవతరించింది. తద్వారా 50 ఏళ్ల ఈ పోటీల చరిత్రలో 100 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా జ్యోతి గుర్తింపు పొందింది. విశాఖ జిల్లాకు చెందిన జ్యోతి ఈ ప్రదర్శనతో వచ్చే నెలలో బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు కూడా అర్హత సాధించింది. ప్రస్తుతం భువనేశ్వర్‌లోని రిలయన్స్ అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో ఇంగ్లండ్‌కు చెందిన కోచ్ జేమ్స్ హీలియర్ వద్ద జ్యోతి శిక్షణ తీసుకుంటోంది. గత రెండేళ్లుగా జ్యోతి జాతీయ, అంతర్జాతీయ మీట్లలో నిలకడగా పతకాలు సాధిస్తోంది. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ తన తడాఖా చూపించింది. అంచనాలకు అనుగుణంగా రాణించిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి పతకంతో మెరిసింది. ఈ క్రమంలో 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా జ్యోతి గుర్తింపు పొందింది. వచ్చే నెలలో బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత పొందింది. జ్యోతితోపాటు పురుషుల 1500 మీటర్ల విభాగంలో అజయ్ కుమార్ సరోజ్... పురుషుల ట్రిపుల్ జంప్‌లో అబ్దుల్లా అబూబాకర్ పసిడి పతకాలు నెగ్గారు. బ్యాంకాక్: గత రెండేళ్లుగా జాతీయ, అంతర్జాతీయస్థాయి మీట్లలో నిలకడగా రాణిస్తున్న భారత అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని సాధించింది. ప్రతిష్టాత్మక ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో విశాఖపట్నం జిల్లాకు చెందిన 23 ఏళ్ల జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసులో జ్యోతి అందరికంటే వేగంగా 13.09 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా అవతరించింది. అసుక తెరెదా (జపాన్; 13.13 సెకన్లు) రజత పతకం, ఆకి మసుమి (జపాన్; 13.26 సెకన్లు) కాంస్య పతకం గెలిచారు. వర్షం కారణంగా తడిగా ఉన్న ట్రాక్‌పై జరిగిన ఫైనల్ రేసులో జ్యోతి ఆద్యంతం ఒకే వేగంతో పరిగెత్తి అనుకున్న ఫలితం సాధించింది. 50 ఏళ్ల చరిత్రగల ఆసియా చాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. 12.82 సెకన్లతో జ్యోతి పేరిటే జాతీయ రికార్డు ఉంది. గత నెలలో జాతీయ అంతర్ రాష్ట్ర చాంపియన్‌షిప్‌లో జ్యోతి 12.92 సెకన్ల సమయం నమోదు చేసి స్వర్ణం గెలిచింది. అయితే ఆసియా చాంపియన్‌షిప్‌లో వర్షం కారణంగా ట్రాక్ తడిగా ఉండటంతో జ్యోతి 13 సెకన్లలోపు పూర్తి చేయలేకపోయింది. స్వర్ణం నెగ్గిన జ్యోతికి కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, రిలయెన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ అభినందనలు తెలిపారు. ♦ పురుషుల 1500 మీటర్ల ఫైనల్ రేసును అజయ్ కుమార్ సరోజ్ 3ని:41.51 సెకన్ల లో ముగించి బంగారు పతకాన్ని సాధించా డు. ఈ పోటీల్లో అజయ్కిది మూడో పతకం. 2017లో స్వర్ణం, 2019లో రజతం గెలిచాడు. ♦ పురుషుల ట్రిపుల్ జంప్‌లో కేరళ అథ్లెట్ అబ్దుల్లా అబూబాకర్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం నెగ్గిన అబూబాకర్ ఆసియా చాంపియన్‌షిప్‌లో 16.92 మీటర్ల దూరం దూకి విజేతగా నిలిచాడు. ♦ పది క్రీడాంశాల సమాహారమైన పురుషుల డెకాథ్లాన్‌లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకాన్ని గెలిచాడు. ఢిల్లీకి చెందిన తేజస్విన్ 7,527 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచాడు. మహిళల 400 మీటర్ల విభాగంలో ఐశ్వర్య మిశ్రా 53.07 సెకన్లలో గమ్యానికి చేరి కాంస్య పతకాన్ని గెలిచింది. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాను. ఈ మెగా ఈవెంట్ కోసం తీవ్రంగా శ్రమించా. పూర్తి ఫిట్నెస్తో ఉన్నా. ఆసియా చాంపియన్‌షిప్‌లో నా అత్యుత్తమ సమయాన్ని నమోదు చేస్తానని ఆశించా. అయితే రేసు మొదలయ్యే సమయానికి వర్షం కురవడంతో ఇబ్బంది పడ్డా. ఐదో హర్డిల్‌లో ఆధిక్యం అందుకోగా, ఆరో హర్డిల్‌ను కూడా అలవోకగా అధిగమించాను. అయితే ఏడో హర్డిల్ దాటే సమయంలో కాస్త తడబడటంతో 13 సెకన్లలోపు రేసును ముగించలేకపోయా. జపాన్ అథ్లెట్స్ నుంచి గట్టిపోటీ ఎదురవుతుందని భావించా. పతకాల గురించి ఆలోచించకుండా సాధ్యమైనంత వేగంగా పరిగెత్తాలనే లక్ష్యంతో బరిలోకి దిగా. పలు టోర్నీలలో నేను క్రమం తప్పకుండా 13 సెకన్లలోపు సమయాన్ని నమోదు చేశా. భవిష్యత్‌లో నా సమయాన్ని మరింత మెరుగుపర్చుకొని మరిన్ని పతకాలు సాధిస్తాననే నమ్మకం ఉంది. ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించినందుకు ఆనందంగా ఉంది. –జ్యోతి యర్రాజీ -
జ్యోతికి రెండో స్వర్ణం
భువనేశ్వర్: జాతీయ సీనియర్ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ రెండో స్వర్ణ పతకంతో మెరిసింది. శుక్రవారం 100 మీటర్ల విభాగంలో బంగారు పతకం నెగ్గిన జ్యోతి... శనివారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ రేసులోనూ విజేతగా నిలిచి తన ఖాతాలో రెండో పసిడి పతకాన్ని జమ చేసుకుంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన 23 ఏళ్ల జ్యోతి అందరికంటే వేగంగా 12.92 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తెలంగాణ అమ్మాయి అగసార నందిని (13.55 సెకన్లు) కాంస్య పతకాన్ని గెల్చుకుంది. మహిళల 4గీ100 మీటర్ల రిలే ఫైనల్లో జ్యోతి యర్రాజీ, భగవతి భవాని యాదవ్, బొద్దిపల్లి దుర్గా, చెలిమి ప్రత్యూషలతో కూడిన ఆంధ్రప్రదేశ్ బృందం (46.61 సెకన్లు) రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించింది. మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన అగసార నందిని 5703 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. ఆసియా క్రీడల అర్హత ప్రమాణాన్ని (5654 పాయింట్లు) కూడా అధిగమించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సౌమ్య మురుగన్ (5323 పాయింట్లు) కాంస్యం సాధించింది. -
400 మీ. పరుగుపందెంలో చరిత్ర.. 31 ఏళ్ల రికార్డు బద్దలు
ఇండోర్ అథ్లెటిక్స్ 400మీ. పరుగుపందెంలో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. నెదర్లాండ్స్‌కు చెందిన ఫెమ్కె బోల్ డచ్ ఇండోర్ చాంపియన్‌షిప్‌లో గమ్యాన్ని 49.26 సెకండ్లలో చేరుకుని నూతన రికార్డును సృష్టించింది. 1982లో చెక్ అథ్లెట్ జర్మిల అక్రతొచిలోవ నెలకొల్పిన 49.59సె. రికార్డును బోల్ చెరిపేసింది. 22 ఏళ్ల బోల్ విజయంపై హర్షం వ్యక్తంచేస్తూ ఇక్కడ హాజరైన ప్రేక్షకుల ప్రోత్సాహంతో రికార్డును సాధించగలిగానని తెలిపింది. ప్రేక్షకుల హర్షధ్వానాలతో తాను రికార్డును నెలకొల్పినట్లు తెలిసిందంటూ హర్షం వ్యక్తం చేసింది. కాగా ఔట్‌డోర్‌లో జర్మనీ అథ్లెట్ మారిట కోచ్ 1985లో నెలకొల్పిన 47.60సె. రికార్డు ఇంకా చెక్కుచెదరలేదు. ¡Boom! Femke Bol, récord mundial de 400 en pista cubierta. 49.26 en Apeldoorn (Países Bajos) y borra el tope de Kratochvilova. 49.26 Femke Bol (2023) 49.59 Kratochvilova (1982) 49.68 Nazarova (2004) 49.76 Kocembova (1984)pic.twitter.com/RhuWkuBwcE — juanma bellón (@juanmacorre) February 19, 2023 -
Asian Indoor Athletics Championships 2023: ‘రికార్డు’తో మెరిసిన జ్యోతి
అస్తానా (కజకిస్తాన్): కొన్నాళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత యువ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ తన కెరీర్లో గొప్ప విజయం సాధించింది. ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జ్యోతి మహిళల 60 మీటర్ల హర్డిల్స్ విభాగంలో రజత పతకం గెల్చుకుంది. వైజాగ్‌కు చెందిన 24 ఏళ్ల జ్యోతి ఫైనల్ రేసును 8.13 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో జ్యోతి ఈ విభాగంలో మళ్లీ కొత్త జాతీయ రికార్డును నమోదు చేసింది. ఈ ఏడాది 60 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి జాతీయ రికార్డును నెలకొల్పడం ఇది ఐదోసారి కావడం విశేషం. శనివారం జరిగిన హీట్స్‌లో జ్యోతి 8.16 సెకన్లతో జాతీయ రికార్డు సృష్టించగా... రోజు వ్యవధిలోనే తన పేరిటే ఉన్న రికార్డును ఆమె సవరించడం విశేషం. ఫైనల్లో మాసుమి ఆకో (జపాన్; 8.01 సెకన్లు) అందరికంటే వేగంగా లక్ష్యాన్ని దాటి స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... చెన్ జియామిన్ (చైనా; 8.15 సెకన్లు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్ లో భారత్ ఒక స్వర్ణం, ఆరు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. తాజా ప్రదర్శనతో జ్యోతి 19 ఏళ్ల ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో 60 మీటర్ల హర్డిల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారతీయ అథ్లెట్‌గా నిలిచింది. 2008లో దోహా ఆతిథ్యమిచ్చిన ఆసియా ఈవెంట్లో భారత్‌కే చెందిన లీలావతి వీరప్పన్ 9.21 సెకన్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. జ్యోతి రజతం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. -
Asian Indoor Athletics Championship: జ్యోతి మళ్లీ జాతీయ రికార్డు
అస్తానా (కజకిస్తాన్): భారత యువ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ ఈ ఏడాది నాలుగోసారి 60 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు నెలకొల్పింది. ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం 60 మీటర్ల హర్డిల్స్ హీట్స్‌లో విశాఖపట్నం అమ్మాయి జ్యోతి 8.16 సెకన్లలో అందరికంటే వేగంగా గమ్యానికి చేరి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో గతవారం 8.17 సెకన్లతో ఫ్రాన్స్‌లో జరిగిన మీట్లో తానే నెలకొల్పిన జాతీయ రికార్డును జ్యోతి బద్దలు కొట్టింది. -
Elite Indoor Track Miramas: జాతీయ రికార్డుతో జ్యోతికి రజతం
సాక్షి, హైదరాబాద్: మిరామస్ ఎలైట్ ఇండోర్ ట్రాక్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ 60 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకం సాధించింది. అంతేకాకుండా 60 మీటర్ల హర్డిల్స్‌లో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. ఫ్రాన్స్‌లో జరిగిన ఈ మీట్లో విశాఖపట్నంకు చెందిన జ్యోతి ఫైనల్ రేసును 8.17 సెకన్లలో ముగించింది. సైప్రస్ అథ్లెట్ డాఫ్నీ జార్జియు కూడా 8.17 సెకన్లలోనే రేసును ముగించింది. అయితే రియాక్షన్ టైమ్ ఆధారంగా డాఫ్నీ (0.145 సెకన్లు) స్వర్ణ పతకం దక్కించుకోగా... జ్యోతి (0.175 సెకన్లు) ఖాతాలో రజతం చేరింది. అంతకుముందు హీట్స్‌లో జ్యోతి 8.18 సెకన్లతో జాతీయ రికార్డును సృష్టించగా... ఫైనల్లో తన రికార్డును ఆమె మరోసారి సవరించింది. -
World Athletics Championship: పసిడి... ప్రపంచ రికార్డు
యుజీన్ (అమెరికా): రేసు మొదలైన వెంటనే ట్రాక్‌పై వాయువేగంతో దూసుకెళ్తూ... ఒక్కో హర్డిల్‌ను అలవోకగా అధిగమిస్తూ... ఒక్కో ప్రత్యర్థిని వెనక్కి నెడుతూ... ఎవరూ ఊహించని సమయంలో లక్ష్యానికి చేరిన అమెరికా మహిళా అథ్లెట్ సిడ్నీ మెక్లాఫ్లిన్ తన పేరిట నాలుగోసారి ప్రపంచ రికార్డును లిఖించుకుంది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం జరిగిన మహిళల 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ ఈవెంట్లో 22 ఏళ్ల సిడ్నీ మెక్లాఫ్లిన్ 50.68 సెకన్లలో గమ్యానికి చేరి తొలిసారి స్వర్ణ పతకం సొంతం చేసుకోవడంతోపాటు ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రపంచ రికార్డు సాధించినందుకు సిడ్నీకి లక్ష డాలర్లు (రూ. 79 లక్షల 84 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఫెమ్కే బోల్ (నెదర్లాండ్స్; 52.27 సెకన్లు) రజతం, దాలియా మొహమ్మద్ (అమెరికా; 53.13 సెకన్లు) కాంస్యం సాధించారు. బంగారు పతకం గెలిచే క్రమంలో సిడ్నీ గత నెల 25న 51.41 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును సవరించింది. గత 13 నెలల కాలంలో సిడ్నీ ప్రపంచ రికార్డును తిరగరాయడం ఇది మూడోసారి కావడం విశేషం. మహిళల జావెలిన్ త్రో ఫైనల్లో భారత క్రీడాకారిణి అన్ను రాణి జావెలిన్‌ను 61.12 మీటర్ల దూరం విసిరి ఏడో స్థానంలో నిలువగా... డిఫెండింగ్ చాంపియన్ కెల్సీ బార్బర్ (ఆస్ట్రేలియా; 66.91 మీటర్లు) స్వర్ణం సాధించింది. -
100 మీటర్ల రేసులో 105 ఏళ్ల బామ్మ కొత్త చరిత్ర
100 మీటర్ల పరుగు పందెంలో 105 ఏళ్ల రామ్బాయి కొత్త చరిత్ర సృష్టించింది. ఆదివారం వడోదర వేదికగా జరిగిన నేషనల్ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో ఈ బామ్మ వంద మీటర్ల రేసులో భాగంగా 45.40 సెకన్లలోనే గమ్యాన్ని చేరింది. అయితే సమాచారం ప్రకారం ఈ రేసులో రామ్బాయి తప్ప మరెవరు పాల్గొనలేదంట. కేవలం 100 ఏళ్లు పైబడిన వారికే నిర్వహించిన రేసులో రామ్బాయి ఒక్కరే పాల్గొన్నారు. ఎవరు పోటీ లేకపోవడం.. తన రికార్డును తానే బద్దలు కొట్టి గమ్యాన్ని చేరిన రామ్బాయికి స్వర్ణ పతకం అందజేశారు. కాగా అదే రోజున నిర్వహించిన 200 మీటర్ల స్ప్రింట్‌ను ఒక నిమిషం 52.17 సెకన్లలో గమ్యాన్ని అందుకొని స్వర్ణం సాధించడం విశేషం. కాగా 100, 200 మీటర్ల రేసులో విజయం సాధించిన తర్వాత రామ్బాయిని స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులు చప్పట్లు, కేరింతలతో అభినందించారు. అనంతరం ఆమెతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఇక ఇదే గుంపులో రామ్బాయి మనవరాలు.. అథ్లెట్ అయిన షర్మిలా సంగ్వాన్ కూడా ఉంది. తన నానమ్మ విజేతగా నిలవడంతో ఆమె ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఆమె మాట్లాడుతూ.. ''మా నానమ్మ విజయం మాకు గర్వకారణం. ఈ విజయానికి ఆమె అర్హురాలు. ఎందుకంటే సాధారణ రోజుల్లో ఉదయాన్నే లేచి 3-4 కిలో మీటర్లు ఆగకుండా పరిగెత్తడం ఆమెకు అలవాటు. ఇది ఆమెను మరింత బలంగా తయారయ్యేలా చేసింది.'' అంటూ పేర్కొంది. At 105 years, super grandma sprints new 100m record. #Rambai ran alone in #Vadodara as there was no competitor above 85 competing at the National Open Masters Athletics Championship pic.twitter.com/iCIPTOkuFt — TOI Bengaluru (@TOIBengaluru) June 21, 2022 చదవండి: Cristiano Ronaldo: కోట్ల విలువైన కారుకు యాక్సిడెంట్.. రొనాల్డో క్షేమంగానే Manoj Tiwary On Work And Cricket: పొద్దంతా క్రికెట్.. రాత్రిళ్లు నియోజకవర్గం పని -
రజతం నెగ్గిన జ్యోతి యర్రాజీ
ఆంధ్రప్రదేశ్ మహిళా అథ్లెట్ జ్యోతి యర్రాజీ బెల్జియంలో జరిగిన ఐఫామ్ ఈఏ పర్మిట్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో రజత పతకం సాధించింది. వైజాగ్‌కు చెందిన జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.19 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచింది. జో సెడ్నీ (నెదర్లాండ్స్; 13.18 సెకన్లు) స్వర్ణం, జెన్నా బ్లన్‌డెల్ (బ్రిటన్; 13.30 సెకన్లు) కాంస్యం సాధించారు. హీట్స్‌లో జ్యోతి 13.26 సెకన్లతో రెండో స్థానంలో నిలిచింది. -
తన రికార్డు తానే బద్దలుకొట్టిన తెలుగుతేజం..
Jyothi Yarraji Breaks Down Her National Record: తెలుగుతేజం యర్రాజీ జ్యోతి వేగానికి రికార్డులే పరుగు పెడుతున్నాయి. 16 రోజుల వ్యవధిలోనే ఆమె 100 మీటర్ల హర్డిల్స్‌లో ముచ్చటగా మూడో జాతీయ రికార్డును నెలకొల్పింది. తద్వారా తన రికార్డును తానే మళ్లీ మళ్లీ తిరగరాసుకుంటోంది. వుట్ (నెదర్లాండ్స్)లో జరుగుతున్న డి హ్యారీ స్చల్టింగ్ గేమ్స్‌లో మహిళల 100 మీటర్ల హార్డిల్స్‌ను ఆమె 13.04 సెకన్ల టైమింగ్‌తో ముగించి... కేవలం వారం రోజుల్లోపే తన రికార్డును సవరించింది. అయితే ఈ ఈవెంట్ ఫైనల్లో జ్యోతి బరిలోకి దిగలేదు. మొదట ఈ నెల 10న సైప్రస్‌లో 13.23 సెకన్ల టైమింగ్‌తో ఇరవైఏళ్ల క్రితం (2002) అనురాధా బిస్వాల్ రికార్డు (13.28 సె.) చెరిపేసింది. తిరిగి ఈనెల 22న ఇంగ్లండ్‌లో 13.11 సెకన్ల టైమింగ్‌తో జ్యోతి తన రికార్డును తానే తిరగరాసింది. 22 ఏళ్ల జ్యోతి వేగవంతమైన టైమింగ్‌తో ఇదివరకే కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సంపాదించింది. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లోగా 13 సెకన్ల టైమింగ్‌ను నమోదు చేయాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. Constant Rain of National records this season in 100 meters Hurdle Women by Jyothi Yarraji. Clocked 13.04 seconds in Netherlands today. Wind (+1.4). #Indian Athletics touching Heights. @Adille1 @ril_foundation @Media_SAI @WorldAthletics pic.twitter.com/ASEBp0ZSlZ — Athletics Federation of India (@afiindia) May 26, 2022 -
సిక్కోలు చిన్నోడు ‘హర్డిల్స్’లో దూకుడు
సాక్షి, అమరావతి: పేదరికం అడ్డుగోడలను అధిగమించి సిక్కోలు చిన్నోడు చిన్ననాటి నుంచే ‘హర్డిల్స్’లో అదరగొడుతున్నాడు. గొప్ప అథ్లెట్ కావాలన్న ఆకాంక్షతో రికార్డులు సృష్టిస్తూ పతకాలను ఒడిసిపడుతున్నాడు. లావేటి యశ్వంత్ కుమార్ (20) రెండేళ్ల వ్యవధిలో 13 జాతీయ పతకాలను సాధించి క్రీడాలోకం దృష్టిని ఆకర్షించి మెరుపు వేగంతో అంతర్జాతీయ ట్రాక్‌వైపు దూసుకెళ్తున్నాడు. సీనియర్లతో తలపడి మరీ.. విజయనగరం జిల్లా రేగిడి మండలం అంబకండి గ్రామానికి (పాత శ్రీకాకుళం జిల్లా) చెందిన యశ్వంత్ కుమార్ హర్డిల్స్ 110 మీటర్ల విభాగంలో అద్భుత ప్రతిభ కనపరుస్తున్నాడు. వాలీబాల్ క్రీడాకారుడైన తండ్రి సూరంనాయుడు ప్రోత్సాహంతో క్రీడల్లో అడుగుపెట్టాడు. గతేడాది గౌహతిలో జరిగిన 36వ జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 110 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించడమే కాకుండా లక్ష్యాన్ని 13.92 సెకన్లలో పూర్తి చేసి జాతీయ రికార్డు నెలకొల్పాడు. సీనియర్ విభాగాల్లో సైతం పోటీపడి పతకాలు సాధించడం గమనార్హం. పాటియాలా సీనియర్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ మీట్లో కాంస్యం, ఢిల్లీలో అండర్–23 అథ్లెటిక్స్ మీట్లో రజతం, వరంగల్ సీనియర్ ఓపెన్ ఈవెంట్లో 5వ స్థానంతో సత్తా చాటాడు. ఈ ఏడాది సీనియర్ విభాగంలోకి అడుగిడిన యశ్వంత్ ఫిబ్రవరిలో మంగుళూరులో జరిగిన ఇంటర్ వర్సిటీ పోటీల్లో ఆచార్య నాగార్జున వర్సిటీ తరఫున 110 మీటర్ల లక్ష్యాన్ని 14.32 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణంతో మెరిశాడు. కసరత్తు చేస్తున్న యశ్వంత్ కుమార్ రెండేళ్లుగా బళ్లారిలో శిక్షణ యశ్వంత్ రెండేళ్లుగా బళ్లారిలోని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌నకు చెందిన ఇన్స్పైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. సిడ్నీ ఒలింపిక్ హర్డిల్స్ స్వర్ణ పతక విజేత మాజీ అథ్లెట్ అనియర్ గార్సియా పర్యవేక్షణలో కఠోర సాధన చేస్తున్నాడు. ప్రస్తుతం 110 మీటర్ల హర్డిల్స్‌లో యశ్వంత్ ఉత్తమ టైమింగ్ 14.10 సెకన్లుగా ఉంది. అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించాలంటే 13.62 సెకన్లు, ఒలింపిక్స్‌కు 13.32 సెకన్లు (పోటీల్లో విజేతల ప్రతిభను బట్టి ఈ సమయం మారుతుంటుంది) వేగం ఉండాలి. అండర్ 16, 18, జూనియర్, సీనియర్ హర్డిల్స్ ఎత్తులో వ్యత్యాసం ఉండటం, జూనియర్‌గా ఉన్నప్పుడే సీనియర్ పోటీల్లో పాల్గొన్న అనుభవం యశ్వంత్‌కు అంతర్జాతీయ పోటీల్లో సులభంగా అర్హత సాధించేందుకు దోహదపడనుంది. రెండేళ్ల క్రితమే సీనియర్ ఏషియన్ ఇండోర్, జూనియర్ ఏషియా, జూనియర్ వరల్డ్ చాంపియన్ షిప్ పోటీలకు అర్హత సాధించినప్పటికీ కరోనా అడ్డుతగిలింది. ఏషియన్, కామన్వెల్త్కు సిద్ధం.. ప్రస్తుతం సీనియర్లో విభాగంలో సిద్ధాంత్ తింగాలియ పేరుతో ఉన్న రికార్డు (13.48 సెకన్లు) బద్ధలుగొట్టి అంతర్జాతీయ పోటీలకు అర్హత పొందేలా యశ్వంత్ సిద్ధమవుతున్నాడు. ఈ నెల 29న కర్నాటకలో జరిగే ఖేలో వర్సిటీ పోటీల ద్వారా వరల్డ్ వర్సిటీ పోటీలకు, జూన్‌లో ఇంటర్ స్టేట్ చాంపియన్ షిప్ ద్వారా కామన్ వెల్త్, ఏషియన్ గేమ్స్‌లో అడుగుపెట్టేలా టెక్నిక్‌పై దృష్టి సారించాడు. స్పోర్ట్స్ స్కూల్ నుంచి... యశ్వంత్ హైదరాబాద్ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో నాలుగో తరగతి నుంచి తొమ్మిది వరకు చదివాడు. అనంతరం గోల్కొండలోని బాయ్స్ స్పోర్ట్స్ కోమ్ (ఆర్మీ ఆర్టీ సెంటర్ సెలక్షన్లో ఎంపికై) సీబీఎస్సీలో టెన్త్ పూర్తి చేశాడు. ఇంటర్ దూరవిద్యలో పూర్తైంది. తరువాత గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలోని టెన్విక్ అకాడమీలో (అనిల్ కుంబ్లే అకాడమీ) అంతర్జాతీయ శిక్షకుడు అద్రిమామ్(దక్షిణాఫ్రికా), ఎరిక్ డిక్సన్ (అమెరికా) వద్ద ఏడాది పాటు శిక్షణ పొందాడు. ప్రస్తుతం సత్తెనపల్లిలో డిగ్రీ ఫైనలియర్ బీకాం చదువుతున్నాడు. కుటుంబ నేపథ్యం.. యశ్వంత్ తండ్రి సూరంనాయుడు హైదరాబాద్‌లోని కొంపల్లిలో ఓ ప్రైవేటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. నేషనల్ వాలీబాల్, త్రోబాల్ రిఫరీగా ఉన్న ఆయనకు ఇద్దరు కుమారులు. వారి భవిష్యత్తు కోసం 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చేశారు. చిన్న కుమారుడు సిద్ధ వరప్రసాద్ జిమ్నాస్టిక్ క్రీడాకారుడు. ట్రైనింగ్ సెంటర్లో భోజన, వసతి సౌకర్యాలను మాత్రమే సమకూరుస్తారు. కుమారుల ప్రాక్టీస్ కోసం అవసరమైన షూలు, పౌష్టికాహారం, దుస్తుల కోసం నెలకు దాదాపు ఇద్దరు రూ.10వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. సొంత గ్రామంలో చిన్న ఇల్లు మినహా ఆ కుటుంబానికి వేరే ఆస్తులు లేవు. 110 మీటర్ల హర్డిల్స్‌లో విజయాలు.. ► 32వ సౌత్ జోన్ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్–2021లో స్వర్ణం ► ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020లో స్వర్ణంతో పాటు 14.10 సెకన్లలో లక్ష్యం పూర్తి చేసి కొత్త రికార్డు ► 35వ జూనియర్ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో సిల్వర్ మెడల్ ► 31వ సౌత్ జోన్ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్–2019లో స్వర్ణం ► గుంటూరు జాతీయ జూనియర్–2019 పోటీల్లో ద్వితీయ స్థానం ► 17వ ఫెడరేషన్ కప్ నేషనల్ జూనియర్ అథ్లెటిక్ చాంపియన్ షిప్–2019 రిలేలో (4 గీ 100) కాంస్యం. ► సౌత్‌జోన్ జాతీయ పోటీలు–2018లో 100 మీటర్ల మిడే రిలేలో స్వర్ణం, 100 మీటర్ల హర్డిల్స్‌లో కాంస్యం ► 2016లో విశాఖలో జరిగిన అంతర్ జిల్లాల జాతీయ పోటీల్లో కాంస్యం సాయం కావాలి.. రోజుకు ఒక సెషన్ చొప్పున వారంలో ఆరు సెషన్లు శిక్షణ ఉంటుంది. జిమ్, ట్రాక్‌పై కఠినంగా శ్రమించాలి. ఫిట్నెస్ కాపాడుకుంటూ సెలవు రోజు కూడా ప్రాక్టీస్ చేస్తున్నా. నా తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల్లోనూ లక్ష్యం వైపు నడిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి ప్రోత్సాహకాలు దక్కలేదు. ప్రభుత్వం సాయం అందించాలని కోరుతున్నా. – లావేటి యశ్వంత్ కుమార్, అథ్లెటిక్స్ క్రీడాకారుడు -
తన రికార్డును తానే బద్దలు కొట్టి స్వర్ణం కొల్లగొట్టాడు
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా 400 మీటర్ల హార్డిల్స్ ఫైనల్ రేసులో నార్వేకు చెందిన కార్స్టెన్ వార్లోమ్ చరిత్ర సృష్టించాడు. మంగళవారం జరిగిన 400 మీ హార్డిల్స్ ఫైనల్స్‌లో వార్లోమ్ 45.94 సెకండ్లలో గమ్యాన్ని చేరుకొని స్వర్ణం సాధించడమేగాక ప్రపంచరికార్డు నమోదు చేశాడు. ఇంతకముందు 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హార్డిల్స్ రేసులో కెవిన్ యంగ్ 46.70 సెకండ్లతో గమ్యాన్ని చేరుకొని స్వర్ణం సాధించాడు. తాజాగా వార్లోమ్ కెవిన్ యంగ్ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు. అంతేకాదు 400 మీటర్ల హార్డిల్స్‌లో వార్లోమ్ తన రికార్డును తానే బద్దలు కొట్టడం విశేషం. సరిగ్గా నెల రోజుల క్రితం ఓస్లో వేదికగా జరిగిన ఈవెంట్లో 400 మీటర్ల హార్డిల్స్‌లో 46.70 సెకండ్లలో గమ్యాన్ని చేరుకొని కెవిన్ యంగ్‌తో సమానంగా నిలిచాడు. ఇక ఒలింపిక్స్‌లోనూ 400 మీటర్ల హార్డిల్స్ హీట్ విభాగంలోనూ మంచి ప్రదర్శన కనబరిచిన వార్లోమ్ తాజాగా ఫైనల్స్‌లో ఏకంగా ప్రపంచరికార్డు నమోదు చేసి స్వర్ణం కొల్లగొట్టాడు. ఇక అమెరికాకు చెందిన రాయ్ బెంజమిన్ 46.17 సెకండ్లతో రజతం.. బ్రెజిల్‌కు చెందిన అలిసన్ దాస్ సాంటోస్ 46.72 సెకండ్లతో కాంస్యం దక్కించుకున్నాడు. WORLD RECORD‼️ Norway's Karsten Warholm breaks his OWN world record to win gold in the men's 400m hurdles and @TeamUSA's Rai Benjamin wins the silver. #TokyoOlympics 📺 NBC 💻 https://t.co/ZOFdXC4e4u 📱 NBC Sports App pic.twitter.com/lPSNrv2Qoo — #TokyoOlympics (@NBCOlympics) August 3, 2021 -
29 ఏళ్ల రికార్డు బద్దలైంది
ఓస్లో (నార్వే): ప్రపంచ చాంపియన్... ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. 29 ఏళ్ల ఘనమైన రికార్డుకు పాతరేశాడు. ఇక్కడ జరుగుతున్న డైమండ్ లీగ్ మీట్లో భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి జరిగిన పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో రెండు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన కార్స్టెన్ వార్హోమ్ (నార్వే) పోటీని అందరికంటే ముందు గా 46.70 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ క్రమంలో అతని వేగానికి దాదాపు మూడు దశాబ్దాల పాటు చెక్కుచెదరని రికార్డు చెదిరిపోయింది. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో అమెరికా అథ్లెట్ కెవిన్ యంగ్ (46.79 సె.) నెలకొల్పిన రికార్డు తెరమరుగైంది. నార్వే అథ్లెట్ ఈ సారి తప్పకుండా ఒలింపిక్స్‌లో చాంపియన్‌గా నిలుస్తానని చెప్పాడు. వేగం పెరిగిన తన ప్రదర్శనతోఒలింపిక్ రికార్డుపై కన్నేసినట్లు చెప్పాడు. గత రియో ఒలింపిక్స్ (2016)లో అతనికి నిరాశ ఎదురైంది. కెరీర్లో తొలిసారి పాల్గొన్న మెగా ఈవెంట్లో అతను పదో స్థానంలో నిలిచాడు. 25 ఏళ్ల కార్స్టెన్ 2017 నుంచి ట్రాక్‌పై అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆ ఏడా ది ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ 400 మీటర్ల హర్డిల్స్‌లో విజేతగా నిలిచాడు. పోలండ్ ఆతిథ్యమిచ్చిన యూరోపియన్ అండర్– 23 చాంపియన్‌షిప్‌లో 400 మీ.హర్డిల్స్‌తో పాటు 400 మీ. పరుగులో సత్తాచాటుకున్నాడు. హర్డిల్స్ లో స్వర్ణం సాధించిన కార్స్టెన్, పరుగులో రజతం నెగ్గాడు. మళ్లీ దోహా (2019) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో హర్డిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నాడు. -
మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో కొత్త ప్రపంచ రికార్డు
టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అమెరికా అథ్లెటిక్స్ జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్‌లో మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. 21 ఏళ్ల సిడ్నీ మెక్లాఫ్లీన్ ఈ ఘనత సాధించింది. సిడ్నీ మెక్లాఫ్లీన్ 400 మీటర్ల లక్ష్యాన్ని 51.90 సెకన్లలో అందుకుంది. 52.16 సెకన్లతో 2019లో దలీలా మొహమ్మద్ (అమెరికా) నెలకొల్పిన ప్రపంచ రికార్డును ఆమె బద్దలు కొట్టింది. ఇదే రేసులో పాల్గొన్న రియో ఒలింపిక్స్ చాంపియన్ దలీలా 52.42 సెకన్లతో రజతం సాధించింది. -
ఆ జంప్... ఆహా!
స్కూల్‌గేమ్స్‌లో అంజూ తొలి గెలుపు హర్డిల్స్‌లో! హర్డిల్స్ అంటే తెలుసుగా... అన్నీ దాటుకుంటూ సాగే పరుగు పందెం. ఈ పందెం అమె కెరీర్‌కు చక్కగా నప్పుతుంది. పాఠశాల స్థాయి పోటీల నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీల దాకా ఎదురొచ్చిన అన్ని అడ్డంకుల్ని దాటుకుంటూ చివరకు ప్రపంచ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించింది. ఏ భారతీయ అథ్లెట్‌కు సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకుంది. అంజూ బాబీ జార్జి ఎన్నో హర్డిల్స్నైతే అధిగమించింది కానీ... చరిత్రలో నిలిచింది మాత్రం హర్డిల్స్ క్రీడాంశంలో కాదు... లాంగ్‌జంప్‌తో! స్కూల్లో హర్డిల్స్‌తో మొదలైన తన ఆటల బాటలో రిలే, లాంగ్‌జంప్, హైజంప్, హెప్టాథ్లాన్లన్నీ ఉన్నాయి. ఇవన్నీ దాటుకుంటూ వెళ్లి చివరకు లాంగ్‌జంప్ వద్ద ఆగింది. ఈ జంప్‌తోనే ‘ప్రపంచ’ పతకాన్ని గెలిచింది. ఆ వెంటే ‘ఖేల్‌రత్న’ం వరించింది. కన్నోడు... కట్టుకున్నోడు... చిన్నారి అంజూ చురుకైంది. చదువులో తెలివైంది. ఆటల పోటీల్లో గెలుపు గుర్రంలాంటిది. అందుకే ఆమె కన్నతండ్రి తనకు పుట్టింది అమ్మాయేగా చదువొక్కటి అబ్బితే చాల్లే అని అనుకోలేదు. 40 ఏళ్ల క్రితం ఆయన అలా అనుకొని వుంటే 2003లో పారిస్ వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించేది కాదు. 1980లో ఆమెను చదువుకోవాలన్నాడు. పోటీపడతానంటే ‘సై’ అన్నాడు. దీంతో 1992లో స్కూల్ గేమ్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్ చాంపియనైంది. తదనంతరం క్రీడాకారుడే భర్తగా రావడం ఆమె కెరీర్‌ను ఉన్నతస్థితికి తీసుకెళ్లింది. ఇలా ఆమె జీవితంలో కన్నతండ్రి కె.టి.మార్కోజ్, కట్టుకున్న భర్త బాబీ జార్జిలది అమూల్యమైన ప్రోత్సాహం. వరల్డ్ ఫైనల్స్ చాంపియన్.... రెండేళ్ల తర్వాత (2005) మొనాకోలోని మోంటెకార్లోలో ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్ టోర్నీ జరిగింది. ఇందులో ఆమె 6.75 మీటర్ల దూరం గెంతి రజతం గెలిచింది. కానీ ఆమె రిటైరయ్యాక... తొమ్మిదేళ్లయ్యాక ఆ పతకం రంగు మారింది. ఆ పోటీల్లో స్వర్ణం నెగ్గిన తాతియానా కొటోవా (రష్యా–6.83 మీటర్లు) 2014లో డోపింగ్‌లో దొరికిపోవడంతో నిర్వాహకులు ఆమె స్వర్ణాన్ని రద్దు చేసి అంజూను చాంపియన్‌గా ప్రకటించి పసడి పతకాన్ని ఖాయం చేశారు. ఇలా భారత క్రీడాకీర్తిని ప్రపంచ పటంలో నిలిపిన అంజూ ప్రతిష్టాత్మక ‘రాజీవ్ ఖేల్‌రత్న’... ‘అర్జున’... ‘పద్మశ్రీ’ పురస్కారాలను అందుకుంది. ఆమె ఘనతలివీ.... ప్రపంచ అథ్లెటిక్స్ కంటే ముందే అంజూ మాంచెస్టర్ కామన్వెల్త్ గేమ్స్ (2002)లో కాంస్యంతో మెరిసింది. బుసాన్ (2002లో), దోహా (2006లో) ఆసియా క్రీడల్లో వరుసగా స్వర్ణం, రజతం గెలుచుకుంది. అలాగే వరుసగా ఇంచియోన్ (2005లో), అమ్మాన్ (2007లో) ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లోనూ స్వర్ణ, రజతాలను రిపీట్ చేసింది. ప్రస్తుతం 43 ఏళ్ల అంజూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకానికి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తోంది. ఐదో ప్రయత్నం... ప్రపంచ పతకం అంజూ 2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం తుది సన్నాహాల్లో ఉంది. అయితే ఈ క్రమంలో ఆమె తీవ్రమైన అలసటతో అస్వస్థతకు గురైంది. ఓ దశలో పారిస్ ఈవెంట్ నుంచి తప్పుకుందామని భావించింది. కానీ భర్త బాబీ ముందుండి ధైర్యం చెప్పాడు. బరిలో దిగేందుకు తోవ చూపాడు. అలా చివరకు ఓ మేజర్ ఈవెంట్‌కు అయిష్టంగానే వచ్చినా మొక్కుబడిగా తలపడలేదు. దేశం కోసం, పతకం కోసం వందశాతం అంకిత భావం కనబరిచింది. ప్రపంచ మేటి అథ్లెట్లు, డిఫెండింగ్ చాంపియన్లు బరిలో ఉన్న లాంగ్‌జంప్‌లో ఒక్కొక్కరి ప్రయత్నాలు మొదలయ్యాయి. అంజూ ఐదో ప్రయత్నంలో 6.70 మీటర్ల దూరం మేర దూకింది. నిజానికి ఇది ఆమె గొప్ప ప్రయత్నమేమీ కాదు. ఎందుకంటే షూస్ స్పైక్ ఒక కాలితో మరొకటి తచ్చాడటంతో ఇబ్బంది పడింది. క్షణాల్లోనే ఇదంతా జరిగినా కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకొని అంత దూరం గెంతడం అంత ఆషామాషీ కాదు. కాసేపయ్యాక ఆరో ప్రయత్నం చేసినా అదేమంతా సక్సెస్ కాలేదు. చివరకు అందరివీ అన్నీ ప్రయత్నాలు పూర్తయ్యాక చూస్తే అంజూ మూడో స్థానం ఖాయమైంది. పోడియంలో కాంస్యం అందుకొని చరిత్ర పుటలకెక్కింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన ఉత్సాహంలో 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన అంజూ ఐదో స్థానంలో నిలిచింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లోనూ ఆమె బరిలోకి దిగినా ఫైనల్ చేరలేకపోయింది. –సాక్షి క్రీడా విభాగం -
‘అందరికీ ఇళ్లు’లో అడ్డంకులొద్దు
న్యూఢిల్లీ: 2022కల్లా అందరికీ ఇళ్లు పథకం లక్ష్యా న్ని చేరుకోవడంలో ఎదురయ్యే అవాంతరాలను తొలగించాలని ఉన్నతాధికారులను ప్రధాని మోదీ ఆదేశించారు. కేంద్రంలో రెండోసారి ఎన్డీఏ సర్కార్ కొలువుదీరాక తొలి ‘ప్రగతి (ప్రో–యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్) సమీక్షా సమావేశం బుధవారం మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో పీఎం ఆవాస్ యోజన(పట్టణ) పథకంలో ఎదురవుతున్న అవాంతరాలను ఎలా అధిగమించాలనే దానిపై సమీక్షించారు. ‘నీటి సంరక్షణపైన ప్రత్యేకంగా వానాకాలంలో తీసుకున్న చర్యలపైనా రాష్ట్రాలు పూర్తి సన్నద్ధతతో పనిచేయాలని ప్రధాని సూచించారు’ అని ఓ అధికారిక ప్రకటన పేర్కొంది. మోదీ ప్రధానిగా ఎన్డీఏ తొలి పాలన కాలంలో ఇలాంటి 29 ‘ప్రగతి’ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో రూ.12లక్షల కోట్ల విలువైన 257 ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. ప్రజా సమస్యలు, అందరికీ ఆరోగ్యబీమా పథకమైన ‘ఆయుష్మాన్ భారత్’ అంశాలపైనా సమీక్ష జరిగింది. -
16 ఏళ్ల రికార్డు బద్దలు
డెస్ మొయినెస్ (అమెరికా): రియో ఒలింపిక్స్ చాంపియన్ దలీలా మొహమ్మద్ మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది. అమెరికాకు చెందిన 29 ఏళ్ల ఈ అథ్లెట్ యూఎస్ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల మహిళల హర్డిల్స్ రేసును 52.20 సెకన్లలో పూర్తి చేసింది. ఈ క్రమంలో 16 ఏళ్ల క్రితం 2003లో యులియా పెచొంకినా (రష్యా) నెలకొల్పిన 52.34 సెకన్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి బంగారు పతకం చేజిక్కించుకుంది. దోహా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే అమెరికా జట్టు ఎంపిక కోసం నిర్వహిస్తున్న ట్రయల్స్‌లో దలీలా ఈ ఘనత సాధించింది. అయితే ఈ కొత్త ప్రపంచ రికార్డు విషయం తనకు కోచ్ చెబితేగానీ తెలియదని ఆమె చెప్పింది. పురుషుల 200 మీటర్ల పరుగు పందెంలో అమెరికా స్టార్ నోవా లైల్స్ విజేతగా నిలిచాడు. అతను అందరికంటే ముందు పరుగును 19.78 సెకన్లలో పూర్తి చేయగా... క్రిస్టియాన్ కోల్మన్ (20.02 సెకన్లు) రజతం, అమీర్ వెబ్ (20.45 సెకన్లు) కాంస్యం గెలుపొందారు. -
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ అథ్లెట్ మృతి
నైరోబి : కెన్యాకు చెందిన ప్రముఖ అథ్లెట్ నికోలస్ బెట్(28) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. నైజీరియాలో జరిగిన ఆఫ్రికా హర్డల్స్ చాంపియన్ షిప్లో పాల్గొని ఇంటికి వెళ్తుండగా నాంది కౌంటీలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. బెట్ ప్రయాణిస్తున్న ఎస్యూవీ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన బెట్ ప్రమాద స్థలంలోనే మృతి చెందారని కౌంటీ అధికారులు తెలిపారు. ప్రపంచ చాంపియన్.. బెట్ 2015లో జరిగిన 400 మీటర్ల హర్డల్స్ పోటీల్లో బంగారు పతకం సాధించి ప్రపంచ చాంపియన్‌గా నిలిచారు. చైనాలో జరిగిన షార్ట్ డిస్టెన్స్ హర్డల్స్ రేస్ పోటీల్లో విజేతగా నిలిచి చైనాలో ఆ ఘనత సాధించిన మొదటి కెన్యా క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించారు. రెండుసార్లు ఆఫ్రికా హర్డల్స్ చాంపియన్‌షిప్ సొంతం చేసుకున్నారు. బెట్ సోదరుడు హరోన్ కోయిచ్ కూడా 400 మీటర్ల హర్డ్లర్ కావడం విశేషం. కాగా, 2016 లో బ్రెజిల్లో జరిగిన రియో ఒలింపిక్స్‌కు బెట్ అర్హత సాధించలేదు. BREAKING: 28 year old Beijing World Championship gold medalist Nicholas Bett dies in car crash in Nandi. He had just returned from the Continental Championships 😢 pic.twitter.com/ypndezlslh — Mr waddis The Brand (@kipronoenock) August 8, 2018 -
అప్పు పుట్టక.. ఎలా నాగలి నడక
సాక్షి ప్రతినిధి, ఏలూరు : బ్యాంకుల నుంచి అప్పు పుట్టడం లేదు. వెబ్‌ల్యాండ్‌కు బయోమెట్రిక్ విధానాన్ని అనుసంధానించటంతో విత్తనాలపై రాయితీ అందటం లేదు. జిల్లాలో మూడు లక్షల మంది కౌలు రైతులు ఉండగా.. ఖరీఫ్ సీజన్ ఆరంభమై 10 రోజులు కావస్తున్నా ఒక్కరికైనా పైసా రుణం దక్కలేదు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితుల్లో ఖరీఫ్ సాగును ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియక వారంతా సతమతమవుతున్నారు. జిల్లాలోని కౌలు రైతులను పెట్టుబడి సమస్య వెంటాడుతోంది. ఈ ఏడాది ఖరీఫ్ సాగును ముందస్తుగా చేపట్టామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. జూన్ 1న కాలువలకు గోదావరి జలాలు విడుదల చేశారు. తంటాలు పడి నారుమడులు పోసిన కౌలు రైతులు పెట్టుబడికి అప్పులిచ్చే వారికోసం వెతుకులాడే పనిలో నిమగ్నమయ్యారు. డెల్టాలో 80 శాతం మంది కౌలు రైతులే వరి సాగు చేస్తున్నారు. జిల్లాలో మూడు లక్షల మంది కౌలు రైతులు ఉండగా.. వారిలో అధిక శాతం మంది డెల్టాలోనే ఉన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 5.30 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. నెల రోజుల క్రితమే రబీ పం టను విక్రయించగా వచ్చిన సొమ్ము గత ఖరీఫ్, రబీ పంటల కోసం చేసిన అప్పులు తీర్చడానికి సరిపోయింది. దీంతో తొలకరి పంటకు సొమ్ములందక బిత్తరచూపులు చూస్తున్నారు. కౌలు రైతులకు బ్యాంకుల నుంచి అప్పు పుట్టే పరిస్థితి లేకుండా పోయింది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు అప్పులు కూడా దొరకడం కష్టంగా మారింది. ధాన్యాన్ని లెవీగా సేకరించే విధానం అమల్లో ఉన్నప్పుడు మిల్లర్లు, కమీషన్ వ్యాపారులు కౌలు రైతులకు అప్పులు ఇచ్చేవారు. కోతలు పూర్తయ్యాక వారే ధాన్యం కొని.. అప్పుపోగా మిగిలిన సొమ్మును వారి చేతిలో పెట్టేవారు. ఇప్పుడు ప్రభుత్వమే నేరుగా ధాన్యం సేకరిస్తుండటంతో మిల్లర్లు, కమీషన్ వ్యాపారులు అప్పులివ్వడం మానేశారు. ప్రైవే టు వ్యాపారులెవరైనా అప్పులిచ్చినా నూటికి రూ.2 నుంచి రూ.5 వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. ఎరువులు, పురుగు మందుల్ని అరువు పద్ధతిన కొనుగోలు చేయాల్సి రావడంతో కొందరు డీలర్లు నకిలీ, నాణ్యత లేనివాటిని అంటగడుతున్నారు. లక్ష్యానికి దూరంగా రుణాలు ఈ ఏడాది రూ.6,526 కోట్లను రైతులకు రుణా లుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా.. అం దులో 10 శాతం కౌలు రైతులకు అందేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. 80 శాతం పైగా పొలాలను సాగుచేసే కౌలు రైతులకు 10 శాతమే ఇచ్చేలా చూస్తామని ప్రభుత్వం చెబుతోంది. అదికూడా వారికి దక్కడం లేదు. గత ఏడాది రూ.5,176 కోట్లను 3.98 లక్షల మంది రైతులకు రుణాలుగా ఇచ్చారు. ఇందులో వ్యక్తిగత, రైతుమిత్ర, జేఎల్‌జీ గ్రూపుల ద్వారా కౌలు రైతులకు దక్కింది కేవలం రూ.21 కోట్లు మాత్రమే. అంటే మొత్తం రుణంలో 0.4 శాతం కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ.3,300 కోట్లను బ్యాంకర్లు రుణాలుగా ఇవ్వాల్సి ఉండగా.. అవి భూ యజ మానులకు దక్కుతున్నాయి తప్ప కౌలు రైతుకు చేరడం లేదు. ఒక సర్వే నంబర్‌పై ఒకరికే రుణం ఇస్తామంటున్న బ్యాంకర్లు క్షేత్రస్థాయిలో ఎవరు సాగు చేస్తున్నారు, ఎవరికి రుణం ఇవ్వాలనే అంశాన్ని పట్టించుకోవడం లేదు. మరోవైపు రుణం విషయంలో బ్యాంకులకు ప్రభుత్వం కూడా హామీ ఇవ్వలేకపోతోంది. రుణమాఫీలోనూ అన్యాయమే రుణమాఫీ విషయంలోనూ కౌలు రైతులకు అన్యాయం జరిగింది. జిల్లాలో కౌలు రైతులకు రూ.165 కోట్లు మాఫీ కావాల్సి ఉండగా.. ఈ మూడేళ్లలో కేవలం రూ.40 కోట్లు మాత్రమే మాఫీ అయ్యింది. రుణమాఫీ పథకానికి అర్హులైన రైతులను వడ్డీల భారం వేధిస్తోంది. ఆ మొత్తాన్ని రైతులు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో వారికి కొత్త రుణాలు ఇవ్వడం లేదు. చేటు తెచ్చిన బయోమెట్రిక్ విధానం తాజాగా రుణాల మంజూరు కోసం ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తోంది. దీనిని వెబ్‌ల్యాండ్‌కు అనుసంధానం చేశారు. ఇది సరిగా పనిచేయకపోవడంతో వ్యవసాయ శాఖ సకాలంలో దీనిని అమలు చేయలేకపోతోంది. వెబ్‌ల్యాండ్‌లో పేరు నమోదైన భూ యజమాని వచ్చి వేలిముద్ర వేస్తేనే వెబ్‌ల్యాండ్ ఓపెన్ అవుతోంది. అందువల్ల రుణాలు భూ యజమానులకే అందుతున్నాయి. కౌలు రైతులకు రుణార్హత గుర్తింపు కార్డులిచ్చినా.. వాటిని బయోమెట్రిక్ విధానానికి అనుసంధానం చేయలేదు. ఫలితంగా విత్తనాల కొనుగోలు, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పొందలేక కౌలు రైతు సతమతమవుతున్నాడు. వరి విత్తనాలపై కిలోకు రూ.ఐదు చొప్పున సబ్సిడీ ఇస్తుండగా.. 30 కిలోలకు రూ.150 మాత్రమే దక్కుతోంది. ఈ సొమ్ము వెబ్‌ల్యాండ్, ఇతర పనుల మీద తిరగడానికే సరిపోతోంది. వేసవిలో జీలుగ, పిల్లిపెసర, జనుము వంటి పచ్చిరొట్ట విత్తనాలపై 75 శాతం సబ్సిడీ ఇచ్చినా కౌలు రైతులకు ఒక్క రూపాయి కూడా అందలేదు. 2008లో రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. పంట రుణాలకు సంబంధించి రూ.లక్ష వరకూ ఎలాంటి హామీ అవసరం లేదు. కౌలు రైతు లేదా రైతు నుంచి వ్యక్తిగత ధ్రువీకరణ (సెల్ఫ్ డిక్లరేషన్) తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా లక్ష వరకు వడ్డీ లేని రుణం రైతుకు అందితే ఏడాదికి రూ.24 వేల వరకూ వడ్డీ రూపంలో లబ్ధి చేకూరుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కౌలు రైతులకు రుణాలు అందేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
100 మీటర్ల హర్డిల్స్‌లో కెండ్రా హ్యారిసన్
ప్రపంచ రికార్డు మరోవైపు మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో 28 ఏళ్ల నుంచి చెక్కు చెదరకుండా ఉన్న ప్రపంచ రికార్డు బద్దలైంది. అమెరికాకు చెందిన కెండ్రా హ్యారిసన్ 12.20 సెకన్లలో రేసును పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. దీంతో 1988లో యోర్డొంకా డొంకోవా (బల్గేరియా-12.21 సెకన్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డు తెరమరుగైంది. -
'రాజధాని నిర్మాణానికి ఇబ్బందులు'
-
కొత్త రాజధాని నిర్మాణానికి ఇబ్బందులు: చంద్రబాబు
కొత్త రాజధాని నిర్మాణానికి కొన్ని ఇబ్బందులున్నాయని, వాటిని అధిగమించి జూన్ 6న భూమిపూజ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సింగపూర్ ప్రభుత్వం నుంచి మాస్టర్ ప్లాన్ అందుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని కోసం ఈ ప్రాంతంలో 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులను తాను అభినందిస్తున్నానన్నారు. ఇప్పటికే 17 వేల ఎకరాలు అప్పగించారని, రైతులు ఉదారంగా ముందుకొచ్చారని ఆయన అన్నారు. రాజధాని ప్రాంతంలో భూమిలేని పేదలు కూడా చాలా ఉదారంగా ముందుకు వచ్చారని, వారికి నెలకు రూ. 2,500 పింఛను ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ఏపీ ప్రభుత్వంతో తమకున్న సన్నిహిత సంబంధాల కారణంగా వీలైనంత త్వరగా మాస్టర్ ప్లాన్ ఇవ్వగలిగినట్లు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ చెప్పారు. తాము హరిత రాజధాని కోసం ప్లాన్ ఇచ్చామని, ఆ మేరకే ప్రణాళిక కూడా ఇచ్చామని ఆయన అన్నారు.