ఇండోర్ అథ్లెటిక్స్ 400మీ. పరుగుపందెంలో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. నెదర్లాండ్స్‌కు చెందిన ఫెమ్కె బోల్ డచ్ ఇండోర్ చాంపియన్‌షిప్‌లో గమ్యాన్ని 49.26 సెకండ్లలో చేరుకుని నూతన రికార్డును సృష్టించింది. 1982లో చెక్ అథ్లెట్ జర్మిల అక్రతొచిలోవ నెలకొల్పిన 49.59సె. రికార్డును బోల్ చెరిపేసింది.
22 ఏళ్ల బోల్ విజయంపై హర్షం వ్యక్తంచేస్తూ ఇక్కడ హాజరైన ప్రేక్షకుల ప్రోత్సాహంతో రికార్డును సాధించగలిగానని తెలిపింది. ప్రేక్షకుల హర్షధ్వానాలతో తాను రికార్డును నెలకొల్పినట్లు తెలిసిందంటూ హర్షం వ్యక్తం చేసింది. కాగా ఔట్‌డోర్‌లో జర్మనీ అథ్లెట్ మారిట కోచ్ 1985లో నెలకొల్పిన 47.60సె. రికార్డు ఇంకా చెక్కుచెదరలేదు.
¡Boom! Femke Bol, récord mundial de 400 en pista cubierta.
— juanma bellón (@juanmacorre) February 19, 2023
49.26 en Apeldoorn (Países Bajos) y borra el tope de Kratochvilova.
49.26 Femke Bol (2023)
49.59 Kratochvilova (1982)
49.68 Nazarova (2004)
49.76 Kocembova (1984)pic.twitter.com/RhuWkuBwcE
Comments
Please login to add a commentAdd a comment