సత్తా చాటిన రాగవర్షిణి | Raga Varshini Proved With Two Gold Medals In Athletics | Sakshi
Sakshi News home page

సత్తా చాటిన రాగవర్షిణి

Published Fri, Aug 2 2019 1:59 PM | Last Updated on Fri, Aug 2 2019 1:59 PM

Raga Varshini Proved With Two Gold Medals In Athletics - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో బి. రాగవర్షిణి అద్భుత ప్రదర్శన కనబరిచింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో గురువారం జరిగిన అండర్‌–16 బాలికల 100మీ., 200మీ., పరుగులో ఆమె విజేతగా నిలిచి రెండు స్వర్ణ పతకాలను హస్తగతం చేసుకుంది. 100మీ. పరుగును 13.5 సెకన్లలో పూర్తి చేసిన ఆమె పసిడి పతకాన్ని అందుకోగా... జషిత సుంకరి (14.5సె.) రజతాన్ని, కీర్తన (15.2 సె.) కాంస్యాన్ని గెలుచుకున్నారు. 200మీ. పరుగులో రాగవర్షిణి ( 27.5 సె.), జషిత (30.9సె.), కీర్తన (32.4సె.) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు.  

ఇతర ఈవెంట్‌ల విజేతల వివరాలు

అండర్‌–16 బాలికల 400మీ. : 1. దివ్య, 2. ఆర్నవి, 3. సత్యశ్రీ; 800మీ.: 1. పి. శ్రీయ, 2. ఆర్నవి, 3. నైనిత రావు; డిస్కస్‌ త్రో: 1. సునయన, 2. పవిత్ర, 3. వేదప్రియ; షాట్‌పుట్‌: 1. నవ్య, 2. వేద ప్రియ, 3. పవిత్ర; లాంగ్‌జంప్‌: 1. పవిత్ర, 2. సత్యశ్రీ ఆశ్రిత, 3. క్షీరజ.

అండర్‌–14 బాలికల 100మీ. పరుగు: 1. కృతి, 2. కియోనా, 3. విభారావు; 600మీ. పరుగు: 1. యువిక, 2. సంజన, 3. ప్రీతి తివారీ; లాంగ్‌జంప్‌: 1. సుగంధి, 2. తార, 3. ఖుష్బూ.

అండర్‌–18 బాలికల 100మీ. పరుగు: 1. రియా గ్రేస్, 2. అనన్య, 3. శ్రుతి; 200మీ. పరుగు: 1. రియా గ్రేస్, 2. ప్రేరణ, 3. నిషిత; 800మీ. పరుగు: 1. నిషిత, 2. నందిని, 3. అక్షిత; షాట్‌పుట్‌: 1. కరిష్మా, 2. శ్రుతి తివారీ; లాంగ్‌జంప్‌: 1. అనన్య, 2. నందిని, 3. అక్షిత;  
అండర్‌–14 బాలుర 100మీ. పరుగు: 1. అనిరుధ్, 2. జాన్‌ డేవిడ్, 2. చోటు సింగ్‌; 600మీ. పరుగు: 1. అరవింద్, 2. చోటు సింగ్, 3. జాన్‌ డేవిడ్‌; షాట్‌పుట్‌: 1. వ్రజ్‌రాజ్, 2. ఆదిత్య, 3. అమిత్‌ కుమార్‌.

అండర్‌–18 బాలుర షాట్‌పుట్‌: 1. దత్త ప్రసాద్, 2. అభినయ్, 3. శివదత్త; 100మీ. పరుగు: 1. శశాంక్, 2. మనో వెంకట్, 3. చాంద్‌బాషా; 400మీ. పరుగు: 1. శ్రీకాంత్, 2. హవిశ్, 3. ఆశిష్‌.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement