తన రికార్డు తానే బద్దలుకొట్టిన తెలుగుతేజం.. | Jyothi Yarraji Breaks Down Her Record In 100m Hurdles Within 2 Weeks | Sakshi
Sakshi News home page

తన రికార్డు తానే తిరగరాసిన తెలుగుతేజం.. 16 రోజుల వ్యవధిలోనే..

Published Fri, May 27 2022 11:07 AM | Last Updated on Fri, May 27 2022 11:11 AM

Jyothi Yarraji Breaks Down Her Record In 100m Hurdles Within 2 Weeks - Sakshi

Jyothi Yarraji Breaks Down Her National Record: తెలుగుతేజం యర్రాజీ జ్యోతి వేగానికి రికార్డులే పరుగు పెడుతున్నాయి. 16 రోజుల వ్యవధిలోనే ఆమె 100 మీటర్ల హర్డిల్స్‌లో ముచ్చటగా మూడో జాతీయ రికార్డును నెలకొల్పింది. తద్వారా తన రికార్డును తానే మళ్లీ మళ్లీ తిరగరాసుకుంటోంది. వుట్‌ (నెదర్లాండ్స్‌)లో జరుగుతున్న డి హ్యారీ స్చల్టింగ్‌ గేమ్స్‌లో మహిళల 100 మీటర్ల హార్డిల్స్‌ను ఆమె 13.04 సెకన్ల టైమింగ్‌తో ముగించి... కేవలం వారం రోజుల్లోపే తన రికార్డును సవరించింది.

అయితే ఈ ఈవెంట్‌ ఫైనల్లో జ్యోతి బరిలోకి దిగలేదు. మొదట ఈ నెల 10న సైప్రస్‌లో 13.23 సెకన్ల టైమింగ్‌తో ఇరవైఏళ్ల క్రితం (2002) అనురాధా బిస్వాల్‌ రికార్డు (13.28 సె.) చెరిపేసింది.  తిరిగి ఈనెల 22న ఇంగ్లండ్‌లో 13.11 సెకన్ల టైమింగ్‌తో జ్యోతి తన రికార్డును తానే తిరగరాసింది. 22 ఏళ్ల జ్యోతి వేగవంతమైన టైమింగ్‌తో ఇదివరకే కామన్వెల్త్‌ గేమ్స్‌కు అర్హత సంపాదించింది.  బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడల్లోగా 13 సెకన్ల టైమింగ్‌ను నమోదు చేయాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement