నికోలస్ బెట్ (ఫైల్ ఫొటో)
నైరోబి : కెన్యాకు చెందిన ప్రముఖ అథ్లెట్ నికోలస్ బెట్(28) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. నైజీరియాలో జరిగిన ఆఫ్రికా హర్డల్స్ చాంపియన్ షిప్‌లో పాల్గొని ఇంటికి వెళ్తుండగా నాంది కౌంటీలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. బెట్ ప్రయాణిస్తున్న ఎస్‌యూవీ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన బెట్ ప్రమాద స్థలంలోనే మృతి చెందారని కౌంటీ అధికారులు తెలిపారు.
ప్రపంచ చాంపియన్..
బెట్ 2015లో జరిగిన 400 మీటర్ల హర్డల్స్ పోటీల్లో బంగారు పతకం సాధించి ప్రపంచ చాంపియన్‌గా నిలిచారు. చైనాలో జరిగిన షార్ట్ డిస్టెన్స్ హర్డల్స్ రేస్ పోటీల్లో విజేతగా నిలిచి చైనాలో ఆ ఘనత సాధించిన మొదటి కెన్యా క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించారు. రెండుసార్లు ఆఫ్రికా హర్డల్స్ చాంపియన్‌షిప్ సొంతం చేసుకున్నారు. బెట్ సోదరుడు హరోన్ కోయిచ్ కూడా 400 మీటర్ల హర్డ్‌లర్ కావడం విశేషం. కాగా, 2016 లో బ్రెజిల్‌లో జరిగిన రియో ఒలింపిక్స్‌కు బెట్ అర్హత సాధించలేదు.
BREAKING: 28 year old Beijing World Championship gold medalist Nicholas Bett dies in car crash in Nandi. He had just returned from the Continental Championships 😢 pic.twitter.com/ypndezlslh
— Mr waddis The Brand (@kipronoenock) August 8, 2018
Comments
Please login to add a commentAdd a comment