
టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అమెరికా అథ్లెటిక్స్ జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్‌లో మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. 21 ఏళ్ల సిడ్నీ మెక్‌లాఫ్లీన్ ఈ ఘనత సాధించింది. సిడ్నీ మెక్‌లాఫ్లీన్ 400 మీటర్ల లక్ష్యాన్ని 51.90 సెకన్లలో అందుకుంది. 52.16 సెకన్లతో 2019లో దలీలా మొహమ్మద్ (అమెరికా) నెలకొల్పిన ప్రపంచ రికార్డును ఆమె బద్దలు కొట్టింది. ఇదే రేసులో పాల్గొన్న రియో ఒలింపిక్స్ చాంపియన్ దలీలా 52.42 సెకన్లతో రజతం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment