భువనేశ్వర్: జాతీయ సీనియర్ అంతర్‌రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌కు ఒక స్వర్ణ పతకం, ఒక కాంస్య పతకం లభించాయి. మహిళల 100 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ విజేతగా నిలువగా... ట్రిపుల్ జంప్‌లో మల్లాల అనూష గౌడ్ (13.24 మీటర్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది.
విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 100 మీటర్ల రేసును అందరికంటే వేగంగా 11.46 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. శ్రాబణి నందా (ఒడిశా; 11.59 సెకన్లు) రజతం, హిమశ్రీ రాయ్ (హరియాణా; 11.71 సెకన్లు) కాంస్య పతకం సాధించారు. తెలంగాణ అమ్మాయి నిత్య గాంధె (11.79 సెకన్లు) నాలుగో స్థానంలో నిలిచింది.
మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్‌లో నాలుగు ఈవెంట్లు (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్లు) ముగిశాక తెలంగాణకు చెందిన అగసార నందిని 3450 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉంది. నేడు మిగిలిన మూడు ఈవెంట్లు (లాంగ్‌జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్లు) పూర్తయ్యాక అత్యధిక పాయింట్లు సాధించిన అథ్లెట్ విజేతగా నిలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment