Federation Cup 2023: జాతీయ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ రెండో స్వర్ణ పతకం సాధించింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి గురువారం జరిగిన మహిళల 200 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచింది.
జ్యోతి 200 మీటర్ల రేసును అందరికంటే వేగంగా 23.42 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించింది. బుధవారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్‌లోనూ జ్యోతి బంగారు పతకం గెలిచింది. ఏడు క్రీడాంశాల సమాహారమైన హెప్టాథ్లాన్ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సౌమ్య మురుగన్ పసిడి పతకాన్ని దక్కించుకుంది.
ఇవి కూడా చదవండి: పరాజయంతో మొదలు...
అడిలైడ్: ఆస్ట్రేలియా మహిళల హాకీ జట్టుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత మహిళల హాకీ జట్టు ఓటమితో ప్రారంభించింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 2–4 గోల్స్‌తో పరాజయం పాలైంది. భారత్ తరఫున సంగీత (29వ ని.లో), షర్మిలా దేవి (40వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఈ మ్యాచ్‌తో భారత ప్లేయర్ మోనిక తన కెరీర్‌లో 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. సిరీస్‌లోని రెండో మ్యాచ్ శనివారం జరుగుతుంది.
సెమీస్‌లో అవ్‌నీత్ కౌర్
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నీ కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో అవ్‌నీత్ కౌర్... పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రథమేశ్ జావ్కర్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్లో అవ్‌నీత్ 147–144తో డాఫ్నీ క్వింటెరో (మెక్సికో)పై, ప్రథమేశ్ 149–148తో చోయ్ యోంగీ (దక్షిణ కొరియా)పై నెగ్గారు. భారత స్టార్ ప్లేయర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి సురేఖ మూడో రౌండ్‌లోనే వెనుదిరిగింది.
Comments
Please login to add a commentAdd a comment