Archer
-
శీతల్ దేవీ.. ఓ అద్భుతం! రెండు చేతులు లేకపోయినా?
ప్యారిస్ పారాలింపిక్స్‌లో అర్చర్ శీతల్ దేవి తన అద్భుత ప్రతిభతో యావత్ క్రీడా ప్రపంచాన్నీ అందర్నీ ఆశ్చర్యపరిచింది. వ్యక్తిగత విభాగంలో త్రుటిలో పతకాన్ని చేజార్చుకున్న శీతల్.. డబుల్స్‌లో మాత్రం సంచలన ప్రదర్శన కనబరిచింది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో మరో ఆర్చర్ రాకేశ్ కుమార్‌తో కలిసి కాంస్యపతకం సాధించింది. హోరాహోరీగా సాగిన కాంస్య పతక పోరులో టాప్‌సీడ్ శీతల్- రాకేశ్ జోడీ 156-155 తేడాతో ఎలోనోరా- మాటియో (ఇటలీ)పై విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో తొలి రౌండ్లో 38-40తో భారత్ వెనుకబడింది. ఆ తర్వాత రెండో రౌండ్లో తిరిగి పుంజుకున్న భారత జోడీ 40-38తో ప్రత్యర్ధిపై పై చేయి చేయి సాధించింది. మళ్లీ మూడో రౌండ్లో ఇటీలీ జంట రాకేశ్-శీతల్‌ను 38-39తో వెనక్కి నెట్టారు. అయితే ఫలితాన్ని తేల్చే నాలుగో రౌండ్లో భారత ద్వయం అద్బుతం చేశాడరు. 40-38తో ప్రత్యర్ధిని ఓడించి పతకాన్ని దక్కించుకున్నాడు.ఆ షాట్ ఓ అద్భుతం.. నాలుగో రౌండ్లో 17 ఏళ్ల శీతల్ కొట్టిన షాట్ ఓ అద్బుతం అని చెప్పుకోవాలి. చివరి ఎండ్‌లో కాలితో విల్లు ఎక్కి పెట్టి పది పాయింట్లను దేవి కొట్టింది. ఈ షాట్‌తో భారత్ విజయాన్ని అందుకుంది. వెంటనే స్టాండ్స్‌లో ఉన్న ఆమె కోచ్ కుల్దీప్ వెధ్వాన్ ఆనందంలో మునిగి తేలిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చేతులు లేకపోతేనేమి..ఏదైనా సాధించాలంటే మానవ అవయవాలతో సంబంధం లేదు.. దృఢ సంకల్పం ఉంటే చాలు అని ఆర్చర్ శీతల్ నిరూపించింది. ఆమె ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం ఓడిపోయింది. రెండు చేతులు లేకపోయినప్పటి పట్టుదలతో తన పేరును ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగేలా చేసింది. పుట్టుకతోనే రెండు చేతులు లేకున్నా కాలితోనే విల్లును పట్టి.. భుజంతో తాడును లాగి బాణం విసిరే ప్రత్యేకత ఆమెది. ఆ అరుదైన స్కిల్స్‌తోనే విశ్వవేదికపై శీతల్ సత్తాచాటింది. డబుల్స్‌తో పతకం సాధించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. A triumph of teamwork and tenacity!Rakesh Kumar & Sheetal Devi, your Bronze Medal in the Para Archery Mixed Team Compound Open at #paralympics2024 speaks volumes about your hard work & dedication. Your journey together has been inspiring, showing that with mutual support &… pic.twitter.com/EFut4er5jk— Kiren Rijiju (@KirenRijiju) September 2, 2024 -
Paris Olympics 2024: అమ్మతనం ఆటకు అడ్డు కాలేదు
గర్భిణి స్త్రీలు ప్రతి విషయంలో ఆచితూచి ఉండాలి. అయితే కొన్ని సందర్భాలు సవాళ్లు విసురుతాయి. దేశం కోసం నిలబడమంటాయి. పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో ఇద్దరు మహిళలు గర్భంతో పోటీల్లో నిలిచి ఆశ్చర్యపరిచారు. ఈజిప్ట్ ఫెన్సర్ నదా హఫెజ్ ఆరునెలల గర్భంతో, అజర్బైజాన్ ఆర్చర్ యయలాగుల్ రమజనోవా ఐదున్నర నెలల గర్భంతో ప్రత్యర్థులతో పోరాడారు. గెలుపు ఓటముల కంటే కూడా వాళ్లు పాల్గొనడమే పెద్ద గెలుపు. వీరు మాత్రమే కాదు, గర్భిణులుగా బరిలోకి దిగిన అథ్లెట్స్ గత ఒలింపిక్స్ లోనూ ఎంతోమంది ఉన్నారు.పదహారవ రౌండ్లో ఓటమి తరువాత తాను ఏడు నెలల గర్భిణిని అని ప్రకటించింది ఈజిప్ట్ ఫెన్సింగ్ క్రీడాకారిణి నదా హఫీజ్. ఆమె ప్రకటన సంచలనం కలిగించింది. నిజానికి గర్భిణిగా ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన క్రీడాకారులు, ఒలింపిక్స్‌లోకి అడుగు పెట్టిన తరువాత గర్భిణి అని తెలుసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు....ఎలినార్ బర్కర్: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పుడు బ్రిటిష్ సైకిలింగ్ స్టార్ ఎలినార్ బర్కర్ మూడు నెలల గర్భిణి. ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకున్న ఎలినార్ ఆ తరువాతే తాను గర్భిణిని అనే విషయం ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. ‘రేసుకు కొద్దిరోజుల ముందు టోక్యోలో నేను గర్భవతినని తెలుసుకున్నాను. ఇది నేను ఊహించని విషయం. ఆ సమయంలో ఒత్తిడికి గురయ్యాను’ ఆరోజును గుర్తు చేసుకుంటుంది ఎలినార్. ఎలినార్ బార్కర్ ఎండోమెట్రియోసిస్‌తో బాధపడుతుండేది. దీని వల్ల గర్భిణులకు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉండడం ఆమె ఒత్తిడికి కారణం. కొద్దిరోజుల్లో ఆట, మరో వైపు కొండంత ఒత్తిడి. టీమ్ డాక్టర్, సైకియాట్రిస్ట్‌ను సంప్రదించి సలహాలు తీసుకుంది. ధైర్యం తెచ్చుకుంది. మెడల్ గెలుచుకుంది.ఆంకీ వాన్ గ్రన్సె్వన్: డచ్ డ్రెస్సేజ్ ఛాంపియన్ ఆంకీ వాన్ గ్రన్సె్వన్ అయిదు నెలల గర్భిణిగా ఒలింపిక్స్ బరిలోకి దిగి స్వర్ణ పతకం సాధించింది.క్రిస్టీ మూర్: అయిదు నెలల గర్భిణిగా 2010 ఒలింపిక్స్ బరిలోకి అడుగు పెట్టింది కెనడియన్ కర్లర్ క్రిస్టీ మూర్. కాస్త వెనక్కి వెళితే...ఒకరోజు కర్లింగ్ టీమ్ నుంచి క్రిస్టీకి ఫోన్ కాల్ వచ్చింది. ‘ఐయామ్ ప్రెగ్నెంట్’ అని చెప్పింది క్రిస్టీ. ‘ఆడడం మీకు కష్టమవుతుందా’ అవతలి గొంతు.ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. ఆ సమయంలో తన టీమ్మెట్ ఒకరు.... ‘నువ్వు ప్రెగ్నెంట్ మాత్రమే. చనిపోలేదు’ అన్నది. దీని అర్థం ‘నీలో పోరాడే సత్తా’ ఉంది అని. దీంతో మరో ఆలోచన చేయకుండా ఒలింపిక్ బరిలోకి దిగింది క్రిస్టీ మూర్.‘ఒలింపిక్స్‌లో పాల్గొనడం, మాతృత్వం... రెండూ అపురూపమే. పెద్ద సవాలు అని తెలిసినా ముందుకు వెళ్లాను’ ఆ రోజులను గుర్తు చేసుకుంటుంది క్రిస్టీ మూర్.మరి కొందరి విషయానికి వస్తే....అమెరికన్ ఐస్–హాకీ ప్లేయర్ లీసా బ్రౌన్ మిల్లర్ 1998 వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొంది, అక్కడికి వెళ్లాకే తాను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసింది. అమెరికన్ సాఫ్ట్‌బాల్ ప్లేయర్ మిషల్ గ్రెంజర్ మూడు నెలల గర్భిణిగా 1996 ఒలింపిక్స్‌లోకి అడుగు పెట్టింది. జర్మన్ ఆర్చర్ కర్నోలియ ఏడు నెలల గర్భిణిగా 2004 ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టింది... ఈ జాబితా ఇంకా ఉంది. వీరిలో స్వర్ణాలు గెలుచుకున్నవారు ఉన్నారు. గెలవకపోయినా సత్తా చాటిన వారు ఉన్నారు.‘వీడు కడుపులో ఉన్నప్పుడే నాతో పాటు ఒలింపిక్స్ ఆడాడు’ అని తమ బిడ్డల గురించి గర్వంగా చెబుతుంటారు ఆ అథ్లెట్ తల్లులు.ఆ సమయంలో...రక్తస్రావంలాంటి సమస్యలు ఉన్నప్పుడు తప్ప సాధారణంగా తేలికపాటి వ్యాయామాలను గర్భిణి అథ్లెట్లకు సూచిస్తాం. ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో రొటీన్ ఎక్సర్సైజ్లు చేసినా ఫరవాలేదు. ఎక్కువగా చేయడానికి ప్రయత్నించవద్దు. మితంగా చేస్తే చాలు అని చెబుతుంటాం. బ్యాడ్మింటన్, టెన్నిస్‌లాంటి ఆటలు ఆడాలనుకునేవారికి మాత్రం సాధ్యమైనంత వరకు వద్దనే చెబుతాం.– డా. ఆశా దలాల్, సర్ హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్స్ ఉమెన్ సెంటర్ డైరెక్టర్ -
ఒలింపిక్ పతకం నెగ్గేంతవరకు నిష్క్రమించను: ఆర్చర్ దీపిక కుమారి
పారిస్ ఒలింపిక్స్‌లో త్రుటిలో పతకం చేజార్చుకున్న భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి.. విశ్వక్రీడల్లో మెడల్ గెలిచేంత వరకు కెరీర్‌కు రిటైర్మెంట్ను ప్రకటించనని వెల్లడించింది. వరుసగా నాలుగోసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన దీపిక... మహిళల వ్యక్తిగత విభాగం క్వార్టర్ ఫైనల్లో ఓడి నిష్క్రమించింది. అంతర్జాతీయ టోర్నీల్లో లెక్కకు మిక్కిలి పతకాలు నెగ్గిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ దీపికకు ఒలింపిక్ మెడల్ మాత్రం అందని ద్రాక్షలానే ఊరిస్తోంది. ‘కెరీర్ కొనసాగిస్తా.ఒలింపిక్ పతకం గెలవాలని బలంగా కోరుకున్నా. అది సాధించేవరకు ఆట నుంచి విశ్రాంతి తీసుకోను, నిష్క్రమించను. మరింత కఠోర సాధన చేసి బలంగా తిరిగి పుంజుకుంటా. వేగంగా బాణాలు వేయడంపై దృష్టి పెడతా. ఈ వేదికపై పొరబాట్లకు తావివ్వకూడదు. వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటా’ అని దీపిక వెల్లడించింది. కీలక పోరులో 7 పాయింట్లు సాధించడం ఫలితంపై తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొంది. అదొక్కటి మినహా పారిస్‌లో మంచి ప్రదర్శనే చేశానని దీపిక వివరించింది. -
చేతులు లేని తొలి మహిళా పారా ఆర్చర్! రెండు పతకాలతో ప్రపంచాన్నే..
జీవితంలో ఎదురయ్యే చిన్నాచితకా కష్టాల గురించి ఇక మీదట నేను యాగీ చేయను. తల్లీ నువ్వొక గురువువి’ అని ట్వీట్ చేశాడు ఆనంద్ మహీంద్ర, పారా ఆర్చర్ శీతల్ దేవి గురించి. అంతే కాదు తమ సంస్థ నుంచి కోరిన కారు తీసుకోమన్నాడు.రెండు చేతులూ లేకపోయినా విలువిద్య అభ్యసించి ఆసియా పారాగేమ్స్‌లో స్వర్ణాలు సాధించిన కశ్మీర్ అమ్మాయి శీతల్‌దేవి జీవితాన్ని ఎలా ఎదుర్కొనాలో తన పట్టుదలతో చూపించింది. ఆమె జీవితం ఒక ఆదర్శమైతే ఆమె నేర్పిన పాఠం సాకులు చెప్పేవారికి గుణపాఠం. 2021లో బెంగళూరుకు చెందిన ‘బీయింగ్ యు’ అనే సంస్థ శీతల్‌కు ప్రోస్థెటిక్ చేతులు పెట్టించడానికి ఏర్పాట్లు చేసింది. ‘ప్రొస్థెటిక్ చేతులు పెడితే నువ్వు చేసే మొదటి పని ఏమిటి?’ అని అడిగితే ‘గాజులు వేసుకుంటా’ అని టక్కున సమాధానం చెప్పింది శీతల్. నిజానికి ఆ అలంకరణకు తప్పితే మిగిలిన అన్ని పనులకు, తన జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి శీతల్‌కు తన ఆత్మవిశ్వాసం చాలు. అందుకే ఆమె ప్రోస్థెటిక్ చేతులను పెద్దగా ఉపయోగించదు. దాదాపు పెట్టుకోదనే చెప్పాలి. ‘నేనెలా ఉన్నానో అలాగే ఉంటాను’ అంటుంది శీతల్. ఈ ధైర్యం ఎంతమందికి ఉంది? రికార్డులు తిరగరాసింది ఇటీవల చైనాలో ముగిసిన ‘ఆసియన్ పారా గేమ్స్’ (దివ్యాంగుల క్రీడలు)లో విలువిద్యలో రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించి రికార్డు సృష్టించింది శీతల్ దేవి. 16 ఏళ్ల వయసులో ఇలా మన దేశం నుంచి విలువిద్య లో రెండు స్వర్ణాలు సాధించిన క్రీడాకారులు లేరు. అది ఒక పెద్ద విశేషం అయితే అంతకన్నా పెద్ద విశేషం శీతల్‌కు రెండుచేతులూ లేకపోవడం. అయినా సరే కుడికాలితో విల్లు ఎత్తి, కుడి భుజంతో నారి సారించి, 50 మీటర్ల దూరంలో ఉండే లక్ష్యాన్ని గురి చూసి బాణం వదిలిందంటే కచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించాల్సిందే. అర్జునుడు రెండు చేతులతో బాణాలు సంధిస్తాడు కాబట్టి సవ్యసాచి అన్నారు. శీతల్‌కు చేతులు లేకపోయినా రెండు కాళ్లతో బాణాలు సంధిస్తే ఏమని పిలవాలో. ‘నవ్యసాచి’ అనాలేమో! " You will need Arms to compete at Archery " Sheetal Devi : OKAY , WATCH ME !!! First Female Armless Archer to play World Final 🤯#AsianParaGames #Praise4Para pic.twitter.com/8qS2THRxM0 — The Khel India (@TheKhelIndia) October 27, 2023 జీవితం గొప్పది ‘జీవితంలో నువ్వు ఫలానాది ఎందుకు సాధించలేదు, జీవితం అంటే ఎందుకు ఆసక్తి కోల్పోయావు, జీవితాన్ని ఎందుకు వృథా చేస్తున్నావు’ అని ఎవరినైనా అడిగితే సవాలక్ష వంకలు చెబుతారు, అడ్డంకులొచ్చాయంటారు, కష్టాలు వచ్చాయంటారు, రోజువారి జీవితంలో వచ్చే చిన్నాచితకా సమస్యలకు చికాకు పడిపోతుంటారు, జీవితం నుంచి దూరంగా వ్యసనాల్లోకి పారిపోవాలనుకుంటారు... కాని శీతల్‌ను చూస్తే ఆ అమ్మాయికి మించిన కష్టమా? అయినా కూడా ఆ అమ్మాయి సాధించలేదా? మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా అదే అన్నాడు శీతల్‌ను చూసి– ‘తల్లి.. నిన్ను చూశాక జీవితం విలువ తెలిసింది’ అని! ఆమెకు కారు ఆఫర్ చేశాడు. కశ్మీర్ అమ్మాయి శీతల్ దిగువ మధ్యతరగతి కశ్మీర్ అమ్మాయి. వీళ్లది కిష్టవర్ జిల్లా లియోధర్ గ్రామం. తండ్రి మాన్ సింగ్ రైతు, తల్లి శక్తిదేవి కాసిన్ని గొర్రెలను సాకుతుంటుంది. వీరి పెద్దకూతురు శీతల్. చిన్న కూతురు శివాని. శీతల్‌కు పుట్టుకతో చేతులు ఏర్పడలేదు. ఇలాంటి స్థితిని వైద్యపరిభాషలో ‘ఫొకొమెలియా’ అంటారు. అయితే శీతల్ నిరాశలో కుంగిపోలేదు. తల్లిదండ్రులు ఆమెను బేలగా పెంచలేదు. శీతల్ తనకు లేని చేతుల లోటును కాళ్లతో పూడ్చడానికి ప్రయత్నించేది. ఆమెకు చేతులు లేకపోవడం వల్ల మిగిలిన శరీరం అంతా మరింత సూక్ష్మంగా, దృఢంగా తయారయ్యింది. రెండు చేతులూ లేకపోయినా శీతల్ చెట్లు ఎక్కి ఆడుకునేదంటే ఆశ్చర్యం. స్కూల్లో కూడా కాళ్లతోనే నోట్స్ రాసుకోవడం, ఫోన్‌ను ఉపయోగించడం నేర్చుకుంది. 2 year's before whn I visited to #SheetalDevi village in Loi Dhaar (Kishtwar), she totally surprised me by her actions. She was adopted by Indian Army 11 RR Col. Shishpal & thy mde efforts & tried to tie up with no. of NGO's. It ws difficult task bt nvr fr Army @NorthernComd_IA pic.twitter.com/b69zvkDaEl — Deepak Prem Thakur 🇮🇳 (@DeepakThakur_10) October 30, 2023 జీవితం అలాగే సాగిపోయేదేమో కాని కరోనా లాక్డౌన్ వల్ల ఇంటర్నెట్లో తనలాంటి దివ్యాంగులకు సాయం చేసే సంస్థ– బీయింగ్ యు గురించి తెలిసింది. ఆ సంస్థకు చెందిన ప్రీతి రాయ్.. శీతల్లోని క్రీడాకారిణిని గుర్తించింది. దివ్యాంగుల క్రీడల పోటీల్లో ఆమె ప్రతిభ చూపగలదని గ్రహించి, తన సంస్థ స్పాన్సర్షిప్ కింద కశ్మీర్‌లోని కత్రాలో దివ్యాంగుల క్రీడా శిక్షణా కేంద్రానికి పంపింది. ఆగస్టు 2022 నుంచి మాత్రమే శీతల్ విలువిద్య సాధన మొదలెట్టింది. 2023 అక్టోబర్ నాటికి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఇంతకన్నా విజయం ఉందా? ‘నాకు ఎలాగైనా సాధించాలని ఉండేది. అందుకు ఏమిటి మార్గం అని మా కోచ్‌ను అడిగాను. కష్టపడాలి అన్నాడు. కష్టపడ్డాను. చాలా చాలా కష్టపడ్డాను’ అంటుంది శీతల్. అడ్డదారుల్లో వెళితే విజయం ఉండొచ్చు లేకపోవచ్చు. కాని కష్టపడితే? గెలుపు తథ్యం. శీతల్‌ను చూసి మన జీవితాల్లో లక్ష్యాన్ని గురి చూద్దాం. (చదవండి: ఎమర్జెన్సీపై ఇందిరా గాంధీ వ్యాఖ్యలు.. విలేకరుల ముఖంపై చిరునవ్వులు) -
బంగారు బాణం.. మన జ్యోతి సురేఖ! ఎన్నో ప్రపంచరికార్డులు
ఒకవైపు బెర్లిన్ , బర్మింగ్‌హామ్, పారిస్... మరో వైపు మెక్సికో, అంటాల్యా, సాల్ట్‌లేక్ సిటీ... ఇంకోవైపు గ్వాంగ్జూ, బ్యాంకాక్, ఢాకా, టెహ్రాన్ , షాంఘై... నగరం పేరు మారితేనేమి...ఫలితం మాత్రం అదే! వేదికతో, ప్రత్యర్థులతో పని లేదు. ఒక్కసారి గురి పెడితే ఆ బాణం కచ్చితంగా లక్ష్యం చేరాల్సిందే! దాదాపు దశాబ్ద కాలంగా భారత ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ చేస్తోంది అదే! వరుస విజయాలతో తనకంటూ ఎలాంటి పోటీ లేకుండా ఎదురు లేకుండా సాగిపోతోంది ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి. ఎక్కడ బరిలోకి దిగినా తనదైన రీతిలో సత్తా చాటి పతకం ఖాయం చేసుకోవడం సురేఖకు అలవాటుగా మారిపోయింది. ప్రపంచ చాంపియన్ షిప్ అయినా ప్రపంచ కప్ అయినా సురేఖ సాగిస్తున్న విజయయాత్ర భారత ఆర్చరీలో అనితర సాధ్యం. ఏకంగా 48 అంతర్జాతీయ పతకాలు ఆమె ఖాతాలో ఉండటం విశేషం. తాజాగా భారత జట్టు ప్రపంచ వేదికపై తొలి స్వర్ణంతో మెరవడంలోనూ సురేఖదే కీలక పాత్ర. మినీ నేషనల్ ఆర్చరీ చాంపియన్ షిప్, 2008... విజయవాడలో జరిగిన ఈ పోటీల్లో జ్యోతి సురేఖ కెరీర్లో తొలిసారి ఒక పతకం గెలుచుకుంది. ఈ టోర్నీలో మొత్తం ఐదు స్వర్ణాలతో మొదలైన ప్రస్థానం ప్రపంచ చాంపియన్ షిప్లో ఎనిమిది పతకాలు సాధించే వరకు, ప్రపంచ రికార్డులు నెలకొల్పే వరకు సాగుతోంది. అంతకు ఏడాది క్రితమే ఆమె మొదటిసారి ఆర్చరీ ఆటలోకి అడుగు పెట్టింది. అప్పటి వరకు ఆమెను మరో ఆటలో తీర్చిదిద్దాలని తండ్రి సురేంద్ర కుమార్, తల్లి శ్రీదుర్గ అనుకున్నారు. అందుకే మూడేళ్ల వయసులో స్విమ్మింగ్ వైపు సురేఖను తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఐదేళ్ల వయసు కూడా రాక ముందే సురేఖ ఐదు కిలోమీటర్ల పాటు కృష్ణా నదిని ఈది అరుదైన ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. దాంతో స్విమ్మర్‌గా ఆమె కెరీర్ మొదలైనట్లు అనిపించింది. అయితే కొంత కాలం తర్వాత స్విమ్మింగ్ ఈవెంట్లలో పోటీ పడే పరిస్థితికి వచ్చేసరికి అంతా మారిపోయింది. ఆమె బలహీనమైన కాళ్లు స్విమ్మింగ్‌లాంటి క్రీడాంశానికి సరిపోవని అక్కడి కోచ్‌లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్రెడ్డి చేతులమీదగా సత్కారం అందుకుంటున్న సురేఖ(2019) క్రీడలంటే ఎంతో ఆసక్తి ఉన్న సురేంద్ర ఎలాగైనా తన కూతురిని క్రీడల్లో మేటిని చేద్దామనే లక్ష్యంతో ఉన్నాడు. దాంతో ప్రత్యామ్నాయం గురించి ఆయన ఆలోచించాడు. టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి రాకెట్ స్పోర్ట్ విషయంలో కూడా మున్ముందు ఇదే సమస్య ఎదురు కావచ్చని అనిపించింది. దాంతో అన్ని విధాలుగా ఆలోచించి సురేఖను ఆర్చరీ వైపు నడిపించాడు. అయితే ఆ నిర్ణయం ఎంత సరైనదో తర్వాత ఆయనకూ తెలిసింది. 11 ఏళ్ల వయసులో ఆర్చరీ విల్లును చేతిలో పెట్టినప్పుడు సురేఖ ఇంత దూరం వెళుతుందని, ఇన్ని ఘనతలు సాధిస్తుందని సురేంద్ర ఊహించలేదు. కోచ్‌ల మార్గనిర్దేశనంలో... విజయవాడలోనే మాజీ ఆటగాడు జె.రామారావు వద్ద సురేఖ ఆర్చరీలో ఓనమాలు నేర్చుకుంది. నాలుగేళ్ల పాటు కోచ్‌గా ఆయనే పూర్తి స్థాయి శిక్షణనివ్వడంతో సురేఖ ఆట మెరుగైంది. ఈ క్రమంలో 2011లో సురేఖ అరుదైన ఘనతను సాధించింది. జాతీయ స్థాయి పోటీల్లో విశేషంగా రాణిస్తూ 15 ఏళ్ల వయసులో సీనియర్ చాంపియన గా అవతరించింది. అదే ఏడాది సబ్ జూనియర్, జూనియర్ నేషనల్స్‌లో విజేత అయిన ఆమె మూడు వయో విభాగాల్లోనూ ఒకే ఏడాది చాంపియ¯Œ గా నిలిచిన తొలి ఆర్చర్‌గా నిలిచింది. ఈ దశలో సురేఖ మరింత ముందుకు వెళ్లాలంటే ఆమెకు అత్యుత్తమ స్థాయి శిక్షణ అవసరమని కోచ్ సూచించారు. దాంతో రెండేళ్ల పాటు సొంత ఖర్చులతో తండ్రి ఆమెను అమెరికా పంపించి కోచింగ్ ఇప్పించాడు. ఈ శిక్షణతో ఆమె ఆట ఎంతో మెరుగైంది. స్వదేశం తిరిగొచ్చాక దాని ఫలితం బాగా కనిపించింది. 2014లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా ఆర్చరీ గ్రాండ్ ప్రీ టోర్నీలో మిక్స్డ్, వ్యక్తిగత విభాగాల్లో ఒక్కో స్వర్ణం సాధించి సురేఖ అందరి దృష్టిలో నిలిచింది. ఈ రెండు స్వర్ణాలు ఆమె కెరీర్‌కు బంగారు బాట వేశాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) జాతీయ క్యాంప్‌లో భారత చీఫ్ కోచ్ జీవ¯Œ జోత్ సింగ్ శిక్షణతో ఆమె కెరీర్ మరో మలుపు తిరిగింది. ఆయన కోచింగ్, మార్గనిర్దేశనం సురేఖను వరుస విజయాల వైపు నడిపించాయి. 2015 ఆసియా కప్‌లో సురేఖ ఖాతాలో తొలి వ్యక్తిగత అంతర్జాతీయ స్వర్ణం చేరింది. ఆ తర్వాత ఆమె ఎదురు లేకుండా సాగిపోయింది. సీనియర్ విభాగంలో 2014నుంచి 2023 వరకు ప్రతి ఏటా ఆమె పతకాలు గెలుస్తూనే రావడం విశేషం. గెలుపే లక్ష్యంగా... వ్యక్తిగత, మిక్స్డ్, టీమ్ విభాగాల్లో కలిపి సురేఖ ఇప్పటి వరకు 48 అంతర్జాతీయ పతకాలు గెలుచుకోగా, వాటిలో 16 స్వర్ణాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో కూడా ఆమె 62 పతకాలు అందుకుంది. ఇటీవల బెర్లిన్‌లో జరిగిన పోటీల్లో ఒక స్వర్ణం, ఒక కాంస్యం కూడా సాధించడంలో ఓవరాల్‌గా వరల్డ్ ఆర్చరీ చాంపియన్ షిప్లో ఆమె పతకాల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఏ రకంగా చూసినా ఈ ఘనత అసాధారణం. భారత ఆర్చరీ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో వరుసగా మూడు వరల్డ్ చాంపియన్ షిప్‌లలో పతకాలు గెలుచుకోవడం ఆమె ఘనతను చూపిస్తోంది. అయితే సురేఖ పాల్గొనే కాంపౌండ్ ఈవెంట్ ఒలింపిక్స్‌లో క్రీడాంశం కాకపోవడం వల్ల ఆమె సాధించిన విజయాలకు తగినంత గుర్తింపు దక్కలేదు. ఒలింపిక్స్‌లో రికర్వ్ ఈవెంట్ మాత్రమే ఉండటంతో ఆమెకు ఒలింపిక్స్‌లో పోటీ పడే అవకాశమే దక్కలేదు. అయితే ఇదేమీ ఆమె స్థాయిని తగ్గించదు. కెరీర్లో వేగంగా ఎదుగుతున్న సమయంలో ఈవెంట్ మారే అవకాశం రాకపోగా, తర్వాతి ఒలింపిక్స్‌లో కాంపౌండ్‌ను చేరుస్తారంటూ వచ్చిన వార్తలతో పూర్తిగా తన ఆటపైనే సురేఖ దృష్టి పెట్టింది. ఎక్కడ పోటీ పడినా గురి చూసి బాణాలు సంధించడం, పతకం సాధించడమే లక్ష్యంగా శ్రమించింది. సుదీర్ఘ కాలంగా సురేఖ భారత మహిళల ఆర్చరీకి ముఖచిత్రంగా మారింది. కఠోర శ్రమ, పట్టుదలతో పాటు మానసిక దృఢత్వం సురేఖను పదునైన ఆర్చర్‌గా మార్చాయి. ఇన్ని విజయాల తర్వాత కూడా నిర్విరామంగా సాధన చేస్తూ పోటీ పడుతున్న సురేఖ మున్ముందు మరిన్ని పతకాలు గెలుచుకోవడం ఖాయం. 713/720... పెద్ద సంఖ్యలో పతకాలు గెలుచుకోవడమే కాదు జ్యోతి సురేఖ పేరిట ప్రపంచ రికార్డు కూడా ఉంది. మహిళల కాంపౌండ్‌లో అత్యధిక పాయింట్లు స్కోరును ఆమె నమోదు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో తుర్కియేలోని అంటాల్యాలో జరిగిన వరల్డ్ కప్‌లో సురేఖ మొత్తం 720 పాయింట్లకుగాను 713 పాయింట్లు సాధించింది. 2015లో కొలంబియా ఆర్చర్ సారా లోపెజ్ సాధించిన వరల్డ్ రికార్డును ఆమె సమం చేసింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 709 పాయింట్లతో ఉన్న ఆసియా రికార్డును కూడా ఆమె బద్దలు కొట్టింది. ఆటలో ఘనతలు సాధిస్తూనే చదువులోనూ మేటిగా ఉన్న సురేఖ బీటెక్ (కంప్యూటర్స్), ఎంబీఏ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో పని చేస్తోంది. మొహమ్మద్ అబ్దుల్ హాది -
అడవి రాముడు లింబా రామ్.. గురి పెట్టాడో..!
వెదురుతో చేసిన విల్లు, బాణాలు.. అడవిలో సరదాగా పోటీలు.. చెట్టుకు కట్టిన మూటను సరిగ్గా గురి చూసి కొడితే బహుమతిగా బెల్లం..15 ఏళ్ల వయసు వచ్చే సరికి కూడా అతనికి అదే జీవితం.. ఏనాడూ అతను తన విలువిద్యతో ఊరు దాటగలనని, అంతర్జాతీయ స్థాయికి చేరగలనని ఊహించలేదు. కానీ ఆ కుర్రాడి అపార ప్రతిభకు అనూహ్యమైన గుర్తింపు లభించింది. దొరికిన అరుదైన అవకాశాన్ని ఒడుపుగా అంది పుచ్చుకున్న అతను తన తరంలో ఆర్చరీ క్రీడకు ఏకైక చిరునామాగా నిలిచాడు. సరైన మార్గనిర్దేశనంతో అతను ఏకంగా ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించగలిగాడు. మన దేశంలో ఆర్చరీ అప్పుడే తొలి అడుగులు వేస్తున్న సమయంలో టార్చ్ బేరర్‌గా మారి తర్వాతి రోజుల్లో భారత్‌లో ఆర్చరీ అభివృద్ధికి ఒక ఆటగాడిగా దారి చూపించాడు. ఒక దశలో ఆ క్రీడలో అతని పేరు మినహా ఇంకెవరినీ.. సాధారణ క్రీడాభిమాని గుర్తు పట్టలేని స్థాయికి చేరిన ఆ వ్యక్తి లింబా రామ్. అతిసాధారణ గిరిజన నేపథ్యం నుంచి ‘ట్రిపుల్ ఒలింపియన్’గా గుర్తింపు పొందిన ఆర్చర్. 1987.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి బియ్యాల పాపారావు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో ఉన్నతాధికారిగా పని చేస్తున్నారు. ఆ సమయంలో ‘సాయ్’లో వేర్వేరు క్రీడాంశాల్లో శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ‘సాయ్’లో ఒక రకమైన ప్రత్యేక టైమ్‌టేబుల్‌తో పాటు అక్కడ శిక్షణ కోసం ఎంపికయ్యేందుకు దాదాపు ఒకే తరహా పద్ధతిలో సెలక్షన్స్ జరుగుతున్నాయి. అంతా బాగానే ఉన్నా ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనేది పాపారావు ఆలోచన. సహజ ప్రతిభను వెలుగులోకి తెచ్చి తగిన రీతిలో శిక్షణ ఇస్తే సాధారణ నేపథ్యం ఉన్నవారు కూడా సత్తా చాటగలరనేది ఆయన నమ్మకం. అందుకే ఆయన దృష్టి్ట గిరి పుత్రులపై పడింది. వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం మహబూబాబాద్‌కి చెందిన వ్యక్తి కావడంతో వారి గురించి ఆయనకు అవగాహన ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. ‘స్పెషల్ ఏరియా గేమ్స్’ పేరుతో కొత్త తరహా సెలక్షన్స్‌కి శ్రీకారం చుట్టారు. ఆర్చరీలో కూడా ఇదే తరహాలో సెలక్షన్స్ జరిగాయి. అప్పటి వరకు అడవిలో విల్లు, బాణాలతో వేటకే పరిమితమైనవారికి ఇలా ఓపెన్ సెలక్షన్స్ ద్వారా అవకాశం లభించింది. కొందరు మిత్రులు ఇచ్చిన సమాచారంతో లింబా రామ్ కూడా దీనికి హాజరయ్యాడు. అతనిలోని సహజ ప్రతిభను అధికారులు గుర్తించి వెంటనే ఎంపిక చేశారు. అక్కడినుంచి లింబా రామ్ ప్రయాణం ఢిల్లీలోని ‘సాయ్’ కేంద్రానికి సాగింది. అది ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే వరకు చేరింది. అడవి బిడ్డ నుంచి ఆర్చర్‌గా.. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ జిల్లా సరాదీత్ గ్రామం లింబా రామ్ స్వస్థలం. ఐదుగురు సంతానంలో అతనొకడు కాగా, తండ్రి వ్యవసాయ కూలీ. వారి కుటుంబం ‘అహారి’ అనే గిరిజన తెగకు చెందింది. పేదరికం కారణంగా లింబా రామ్.. తన సోదరుల్లాగే కూలీ పనుల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ.. స్నేహితులతో కలసి సరదాగా వేటకు కూడా వెళ్లేవాడు. పుట్టినప్పుడు తల్లిదండ్రులు ‘అర్జున్ రామ్’ అనే పేరు పెట్టారు. అయితే చిన్న వయసులో ఒకసారి తీవ్ర అనారోగ్యానికి గురైన అతను దాదాపు మృత్యువుకు చేరువగా వెళ్లాడు. అదృష్టవశాత్తు కోలుకోవడంతో అర్జున్ అనే పేరు తీసేసి స్థానిక దేవత పేరు మీద ‘లింబా’ అని చేర్చారు. అలా ఆ పేరులోంచి అర్జునుడు పోయినా.. ఆ తర్వాత భవిష్యత్తులో అతను అభినవ అర్జునుడిలా బాణాలు సంధిస్తూ విలువిద్యలో నేర్పరి కావడం దైవానుగ్రహమే కావచ్చు! వెదురు బాణాలతో వేటాడటం, స్థానికంగా కొన్ని పోటీల్లో పాల్గొనడం మినహా ఆర్చరీ అనే ఒక అధికారిక క్రీడ ఉందని, అందులో విజయాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవచ్చనే విషయం అప్పటికి లింబా రామ్‌కి అసలు తెలీదు. అయితే ‘సాయ్’ సెలక్షన్స్ అన్నీ మార్చేశాయి. సరైన చోట, సరైన శిక్షణతో.. స్పోర్ట్స్ అథారిటీ కేంద్రంలో కొత్త విద్యార్థిగా చేరిన లింబా రామ్‌కి అక్కడి ప్రపంచం అంతా కొత్తగా అనిపించింది. అప్పటి వరకు వెదురు విల్లుకే పరిమితమైన అతని చేతికి తొలిసారి ఆధునిక విల్లు, బాణాలు వచ్చాయి. భారత కోచ్ ఆరెస్ సోధీ పర్యవేక్షణలో శిక్షణ మొదలైంది. రష్యా కోచ్ అలెగ్జాండర్ నికొలయ్ జట్టుకి కోచ్‌గా కొత్త తరహా శిక్షణ కార్యక్రమాలను తీసుకొచ్చాడు. ‘నువ్వు ఈ ఆట కోసమే పుట్టావురా’ అంటూ సోధీ చెప్పిన మాట లింబా రామ్‌లో స్ఫూర్తి నింపి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. తమ ఎంపికకు కారణమైన పాపారావు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని లింబా రామ్‌ని ప్రోత్సహించారు. దాని ఫలితాలు కొన్ని నెలలకే కనిపించాయి. బెంగళూరులో జరిగిన జూనియర్ నేషనల్స్‌లో విజేతగా నిలవడంతో లింబా రామ్‌పై అందరి దృష్టీ పడింది. ఆ తర్వాతా అదే జోరును కొనసాగించిన అతను సంవత్సరం తిరిగే లోపే జాతీయ స్థాయి సీనియర్ చాంపియన్‌గా కూడా మారాడు. దాంతో 16 ఏళ్ల వయసులోనే భారత ఆర్చరీ టీమ్‌లో లింబా రామ్‌కి చోటు దక్కింది. అప్పటి నుంచి దాదాపు దశాబ్ద కాలం పాటు భారత ఆర్చరీపై తనదైన ముద్ర వేసిన అతను ఎన్నో ఘనతలను తన ఖాతాలో లిఖించుకున్నాడు. ప్రపంచ రికార్డు కూడా.. 1989లో స్విట్జర్లాండ్‌లో జరిగిన ఆర్చరీ ప్రపంచ చాంపియన్ షిప్ తొలిసారి లింబా రామ్‌కి అంతర్జాతీయ వేదికపై గుర్తింపును అందించింది. ఈ ఈవెంట్లో అతను క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లగలిగాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆసియన్ కప్‌లో చక్కటి ప్రదర్శనతో లింబా ఆకట్టుకున్నాడు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించడంతో పాటు టీమ్ ఈవెంట్లో భారత్‌కి రజతం దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. తర్వాతి ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో భారత్‌కి నాలుగో స్థానం దక్కడంలో అతనిదే ప్రధాన భూమిక. మరో రెండేళ్ల తర్వాత జరిగిన ఆసియన్ ఆర్చరీ చాంపియన్ షిప్ లింబా రామ్ కెరీర్లో అత్యుత్తమ దశ. బీజింగ్‌లో జరిగిన ఈ పోటీల వ్యక్తిగత విభాగంలో అతను స్వర్ణం సాధించడంతో పాటు 358/360 స్కోరుతో అప్పటి ప్రపంచ రికార్డును సమం చేయడం విశేషం. 1995లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ ఆర్చరీ చాంపియన్ షిప్లో కూడా అతను ఒక స్వర్ణం, ఒక రజతంతో మెరిశాడు. కెరీర్ చివర్లో కుర్రాళ్ల మధ్య మరోసారి జాతీయ చాంపియన్‌గా నిలిచి లింబా తన ఆటను ముగించాడు. అచ్చిరాని మెగా ఈవెంట్.. ప్రతి క్రీడాకారుడి కెరీర్లో ఒలింపిక్స్ పతకం సాధించడం ఒక కల. లింబా రామ్‌కి వరుసగా మూడు ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం వచ్చినా పతకం మాత్రం దక్కలేదు. ‘ట్రిపుల్ ఒలింపియన్’గా గుర్తింపు తెచ్చుకున్నా, మూడుసార్లూ నిరాశే ఎదురైంది. 16 ఏళ్ల వయసులో తొలిసారిగా 1988 సియోల్ ఒలింపిక్స్‌లో ఆడినా.. అందులో అతని అనుభవరాహిత్యం కనిపించింది. 1992 బార్సిలోనా సమయంలోనైతే అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. తాజా వరల్డ్ రికార్డుతో అతనిపై మంచి అంచనాలూ ఉన్నాయి. తనపై మెడల్ గురించి ఉన్న ఒత్తిడిని అతను అధిగమించలేకపోయాడు. ‘నువ్వు పతకం గెలవడం ఖాయం. ఇక్కడి నుంచే మెడలో పతకంతో తీసుకెళ్లి భారత్‌లో మా భుజాలపై ఊరేగిస్తాం’ అంటూ ఫెడరేషన్ అధికారులు పదే పదే చెబుతూ వచ్చారు. చివరకు అక్కడ నిరాశే ఎదురైంది. 1996 అట్లాంటా ఒలింపిక్స్ సమయంలో కూడా ఆటగాడిగా మెరుగైన స్థితిలోనే ఉన్నా.. ఒలింపిక్స్ కొద్ది రోజుల ముందు ఫుట్‌బాల్ ఆడుతున్న అతని భుజానికి తీవ్ర గాయమైంది. దాని నుంచి పూర్తిగా కోలుకోలేకపోయాడు. లింబా రామ్ ఘనతను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అర్జున, పద్మశ్రీ పురస్కారాలతో అతనిని గౌరవించింది. ఈతరం ఆధునిక ఆటగాళ్ల ప్రదర్శనలతో పోలిస్తే లింబా రామ్ సాధించిన విజయాలు తక్కువగా అనిపించవచ్చు. కానీ భారత్‌లో ఆర్చరీకి గుర్తింపు తెచ్చి కొత్త బాట చూపించినవాడిగా అతని పేరు ఎప్పటికీ నిలిచిపోంది. - మొహమ్మద్ అబ్దుల్ హాది -
200 మీటర్ల విభాగంలో జ్యోతికి స్వర్ణ పతకం
Federation Cup 2023: జాతీయ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ రెండో స్వర్ణ పతకం సాధించింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి గురువారం జరిగిన మహిళల 200 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచింది. జ్యోతి 200 మీటర్ల రేసును అందరికంటే వేగంగా 23.42 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించింది. బుధవారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్‌లోనూ జ్యోతి బంగారు పతకం గెలిచింది. ఏడు క్రీడాంశాల సమాహారమైన హెప్టాథ్లాన్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సౌమ్య మురుగన్ పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఇవి కూడా చదవండి: పరాజయంతో మొదలు... అడిలైడ్: ఆస్ట్రేలియా మహిళల హాకీ జట్టుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత మహిళల హాకీ జట్టు ఓటమితో ప్రారంభించింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 2–4 గోల్స్‌తో పరాజయం పాలైంది. భారత్ తరఫున సంగీత (29వ ని.లో), షర్మిలా దేవి (40వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఈ మ్యాచ్‌తో భారత ప్లేయర్ మోనిక తన కెరీర్లో 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. సిరీస్‌లోని రెండో మ్యాచ్ శనివారం జరుగుతుంది. సెమీస్‌లో అవ్నీత్ కౌర్ షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నీ కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో అవ్నీత్ కౌర్... పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రథమేశ్ జావ్కర్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్లో అవ్నీత్ 147–144తో డాఫ్నీ క్వింటెరో (మెక్సికో)పై, ప్రథమేశ్ 149–148తో చోయ్ యోంగీ (దక్షిణ కొరియా)పై నెగ్గారు. భారత స్టార్ ప్లేయర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి సురేఖ మూడో రౌండ్లోనే వెనుదిరిగింది. -
వారెవ్వా.. సరికొత్త గిన్నిస్ రికార్డ్.. ‘కీహోల్’లోంచి ఏడు బాణాలు!
విలువిద్య పోటీల్లో గుండ్రటి బోర్డుపై ఉండే ‘బుల్స్ ఐ’ని ఆటగాళ్లెవరైనా గురిచూసి కొడితేనే ఆహా అద్భుతం అని మెచ్చుకుంటాం.. అలాంటిది ఓ చిన్న బెజ్జంలోంచి బాణాలను సంధించగల నేర్పరిని ఇంకేమని పొగడాలి?! ఎందుకంటే.. డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత విలుకాడు లార్స్ ఆండర్సెన్ నమ్మశక్యంకాని రీతిలో దీన్ని చేసి చూపించాడు మరి!! సంప్రదాయ ‘ఒట్టోమ్యాన్’ విల్లును ఉపయోగించి 30 అడగుల దూరంలో అది కూడా కేవలం ఒక సెంటీమీటర్ సైజున్న ‘కీహోల్’లోంచి అలవోకగా ఏడు బాణాలను వెంటవెంటనే సంధించాడు. కీహోల్లోకి బాణాలు దూరగలిగేందుకు వీలుగా ఈకల్లేని కార్బన్ బాణాలను ఉపయోగించాడు. ఇటీవల అతను చేసిన ఈ ప్రయోగం ద్వారా ‘కీహోల్లోంచి వరుసగా అత్యధిక బాణాలను సంధించిన వ్యక్తి’గా సరికొత్త గిన్నిస్ రికార్డును సృష్టించాడు. ఇందుకు సంబంధించిన సుమారు నిమిషం నిడివిగల వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. ఆండర్సెన్ ప్రతిభను చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఆండర్సెన్ ఇప్పటికే ఈ తరహా ఎన్నో అద్భుతాలను చేసి చూపించాడు. చదవండి: మద్యం మత్తులో బీజేపీ ఎమ్మెల్యే కొడుకు హంగామా.. నడిరోడ్డుపై.. విల్లు నుంచి ఏకకాలంలో ఎన్నో బాణాలను గురిచూసి సంధించడం, కేవలం 4.9 సెకన్ల వ్యవధిలో 10 బాణాలను వదలడం, బాణాలు గాల్లో వంపు తిరిగేలా సంధించడం, కదిలే లక్ష్యాలను బాణాలతో ఛేదించడం వంటి ఎన్నో ప్రయోగాలను విజయవంతంగా చేశాడు. విలువిద్యకు పూర్వ వైభవం తెచ్చే ఉద్దేశంతోనే తాను ఈ తరహా ప్రయోగాలు చేస్తున్నట్లు అతను చెప్పాడు. -
విలు విద్యలో రాణిస్తున్న మిహిర్ నితిన్ అపర్
సాక్షి, హైదరాబాద్: ఎన్టీపీసీ జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో మిహిర్ నితిన్ అపర్ సత్తా చాటాడు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సబ్ జూనియర్ కాంపౌండ్ బాలుర విభాగంలో తృతీయ స్థానంలో నిలిచాడు. మహారాష్ట్రలోని బుల్డానా జిల్లాకు చెందిన ఈ 16 ఏళ్ల చిచ్చరపిడుగు ఇప్పటికే పలు టోర్నమెంట్లలో పతకాలు సాధించి.. భవిష్యత్‌లో దేశానికి మరిన్ని పతకాలు తేవాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్నాడు. గతేడాది ఆగస్టులో పోలాండ్‌లో జరిగిన వరల్డ్ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ స్వయంగా రాజ్‌భవన్‌కు పిలిపించుకుని మిహిర్‌ను ప్రశంసించారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. మిహిర్ తల్లిదండ్రులు టీచర్లుగా పనిచేస్తున్నారు. పేరెంట్స్ పోత్సాహం, కోచ్ చంద్రకాంత్ ఇలాగ్ మార్గదర్శకత్వంతో మిహిర్ ఆర్చరీలో రాణిస్తున్నాడు. మిహిర్‌కు ఆత్మీయ సత్కారం విలు విద్యలో దూసుకుపోతున్న మిహిర్ నితిన్ అపర్‌ను ఇండియన్ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ సారంగపాణి సాదరంగా సన్మానించారు. ఎర్రగడ్డలోని తన నివాసంలో మిహిర్‌తో పాటు అతడి తండ్రిని చిరు సత్కారంతో గౌరవించారు. ఈ కార్యక్రమంలో సారంగపాణి కుటుంబ సభ్యులతో పాటు సీనియర్ కార్టూనిస్ట్ నారూ, తదితరులు పాల్గొన్నారు. (చదవండి: గాలి పీల్చుకోవడానికి రూ.15 లక్షలు ఖర్చు చేసిన రొనాల్డో!! ఎందుకంటే..) -
ఆడుతూ... పాడుతూ
హార్డ్ హిట్టర్లు... మెరుపు పేసర్లతో నిండిన ఇంగ్లండ్ జట్టులో హంగు ఆర్భాటాలు లేకుండా, తన పని తాను చేసుకుంటూ పోతూ, సాత్వికంగా కనిపించే ఆటగాడు జో రూట్. ఓ దశలో ఆ జట్టు దూకుడైన ఆటతో రూట్ అవసరం ఇక లేదనిపించింది. కానీ, అతడో వెలకట్టలేని ఆభరణం. అందుకే... ఎందరు విధ్వంసక బ్యాట్స్‌మెన్ పోటీకి వచ్చినా రూట్‌ను మాత్రం ఇంగ్లండ్ పక్కన పెట్టలేదు. ఈ నమ్మకానికి తగ్గట్లే... వన్డేలకు సరిగ్గా సరిపోయే సొగసైన ఆటతో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో తన విలువను మరోసారి చాటాడతడు. పార్ట్‌టైమ్ స్పిన్‌తో ప్రత్యర్థిని కీలక సమయంలో కోలుకోలేని దెబ్బకొట్టి... జట్టు అవసరాల రీత్యా ఓపెనింగ్‌కు దిగి అజేయ సెంచరీతో గెలిపించాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. సౌతాంప్టన్: జో రూట్ (94 బంతుల్లో 100 నాటౌట్; 11 ఫోర్లు; 2/27; 2 క్యాచ్‌లు) ఆల్‌రౌండ్ ప్రదర్శన మినహా... భారీ స్కోర్లు, మెరుపు ఇన్నింగ్స్ ఏమీ లేకుండా ఇంగ్లండ్– వెస్టిండీస్ మ్యాచ్ సాదాసీదాగా సాగిపోయింది. రెండు జట్ల మధ్య శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్లతో సునాయాస విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కరీబియన్ జట్టు బ్యాట్స్‌మెన్ పేలవ షాట్లతో వికెట్లు పారేసుకోవడంతో 44.4 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌటైంది. నికోలస్ పూరన్ (78 బంతుల్లో 63; 3 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్. ఓపెనర్ క్రిస్ గేల్ (41 బంతుల్లో 36; 5 ఫోర్లు, సిక్స్), హెట్‌మైర్ (48 బంతుల్లో 39; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఆతిథ్య జట్టు పేసర్లు మార్క్ వుడ్ (3/18), జోఫ్రా ఆర్చర్ (3/30) కట్టుదిట్టంగా బంతులేయగా, రూట్ కీలక సమయంలో రెండు వికెట్లు తీశాడు. అనంతరం అతడు బెయిర్‌స్టో (46 బంతుల్లో 45; 7 ఫోర్లు)తో కలిసి ఛేదనలో శుభారంభం అందించాడు. దీంతో జట్టు ఏ దశలోనూ ఇబ్బంది పడకుండా 33.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సమష్టి వైఫల్యంతో... మ్యాచ్‌లో వెస్టిండీస్ పరాజయానికి ఇంగ్లండ్ బౌలింగ్ ప్రతిభ కంటే బ్యాట్స్‌మెన్ చెత్త షాట్లే కారణం. కాస్త నిలదొక్కుకుంటే పరుగులు చేసే వీలున్నా... అడ్డదిడ్డంగా బాది వారు ఔటయ్యారు. అధ్వాన ఫామ్ కొనసాగిస్తూ ఓపెనర్ ఎవిన్ లూయిస్ (2) మూడో ఓవర్లోనే బౌల్డయ్యాడు. గేల్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినా... షై హోప్ (11) పూర్తిగా తడబడ్డాడు. వీరిద్దరూ రెండు బంతుల వ్యవధిలో వెనుదిరగడంతో జట్టు బాధ్యతంతా హెట్‌మైర్, పూరన్‌పై పడింది. ఈ కుర్రాళ్లు సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. రన్‌రేట్‌ను పెంచుకుంటూ పోతూ వీరు నాలుగో వికెట్‌కు 89 పరుగులు జోడించి పరిస్థితి చక్కదిద్దుతుండగా రూట్ దెబ్బకొట్టాడు. వరుస ఓవర్లలో హెట్‌మైర్, కెప్టెన్ హోల్డర్ (9)లను రిటర్న్ క్యాచ్‌లతో పెవిలియన్ చేర్చాడు. రసెల్ (16 బంతుల్లో 21; ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడుకు వుడ్ తెరదించాడు. ఆర్చర్ పదునైన పేస్‌తో పూరన్‌ను ఔట్ చేశాక విండీస్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతోసేపు పట్టలేదు. ఆతిథ్య జట్టు అలవోకగా... అడపాదడపా షార్ట్ పిచ్ బంతులు వేయడం మినహా విండీస్ పేసర్లు ప్రభావవంతంగా లేకపోవడంతో ఛేదన ఇంగ్లండ్‌కు నల్లేరుపై నడకే అయింది. బౌండరీలు బాదుతూ బెయిర్‌స్టో, రూట్ ఓవర్‌కు 6 పైగా పరుగులు చేస్తూ పోయారు. తొలి వికెట్‌కు 95 పరుగులు జోడించాక బెయిర్ స్టో ఔటయ్యాడు. రూట్‌తో రెండో వికెట్‌కు 104 పరుగులు జోడించిన క్రిస్ వోక్స్ (54 బంతుల్లో 40; 4 ఫోర్లు) లక్ష్యానికి చేరువలో వెనుదిరిగాడు. ఈ క్రమంలో రూట్ 50 బంతుల్లో అర్ధ సెంచరీ, 93 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెరీర్లో అతడికి 16వ వన్డే సెంచరీ కాగా, ఈ ప్రపంచ కప్‌లో రెండోది. స్టోక్స్ (6 బంతుల్లో 10 నాటౌట్; 2 ఫోర్లు) విజయ లాంఛనం పూర్తి చేశాడు. స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: గేల్ (సి) బెయిర్‌స్టో (బి) ప్లంకెట్ 36; లూయిస్ (బి) వోక్స్ 2; హోప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వుడ్ 11; పూరన్ (సి) బట్లర్ (బి) ఆర్చర్ 63; హెట్‌మైర్ (సి అండ్ బి) రూట్ 39; హోల్డర్ (సి అండ్ బి) రూట్ 9; రసెల్ (సి) వోక్స్ (బి) వుడ్ 21; బ్రాత్‌వైట్ (సి) బట్లర్ (బి) ఆర్చర్ 14; కాట్రెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆర్చర్ 0; థామస్ (నాటౌట్) 0; గాబ్రియెల్ (బి) వుడ్ 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (44.4 ఓవర్లలో ఆలౌట్) 212. వికెట్ల పతనం: 1–4, 2–54, 3–55, 4–144, 5–156, 6–188, 7–202, 8–202, 9–211, 10–212. బౌలింగ్: వోక్స్ 5–2–16–1; ఆర్చర్ 9–1–30–3; ప్లంకెట్ 5–0–30–1; వుడ్ 6.4–0–18–3; స్టోక్స్ 4–0–25–0; రషీద్ 10–0–61–0; రూట్ 5–0–27–2. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బెయిర్‌స్టో (సి) బ్రాత్‌వైట్ (బి) గాబ్రియెల్ 45; జో రూట్ (నాటౌట్) 100; వోక్స్ (సి) సబ్ (అలెన్) (బి) గాబ్రియెల్ 40; స్టోక్స్ (నాటౌట్) 10, ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (33.1 ఓవర్లలో 2 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–95, 2–199. బౌలింగ్: కాట్రెల్ 3–0–17–0, థామస్ 6–0–43–0, గాబ్రియెల్ 7–0–49–2, రసెల్ 2–0–14–0, హోల్డర్ 5.1–0–31–0, బ్రాత్‌వైట్ 5–0–35–0, గేల్ 5–0–22–0. ఇంగ్లండ్‌కు గాయాల బెడద హాట్ ఫేవరెట్ ఇంగ్లండ్‌కు ప్రపంచ కప్‌లో గాయాల బెడద తీవ్రమవుతోంది. కీలక బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ కండరాల గాయం నుంచి కోలుకున్నాడని ఊరట చెందుతుండగానే, స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌లు వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడ్డారు. విండీస్ ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ఫీల్డింగ్ చేస్తూ తొడ కండరాలు పట్టేయడంతో మైదానాన్ని వీడిన రాయ్ తిరిగి రాలేదు. నిబంధనల ప్రకారం అతడు మైదానం బయట ఎంత సమయమైతే ఉన్నాడో అంత సమయం, లేదంటే ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడిన తర్వాత బ్యాటింగ్‌కు రావాల్సి ఉంటుంది. దీంతో రాయ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే వీల్లేకపోయింది. ఇక మోర్గాన్... విండీస్ ఇన్నింగ్స్ 40వ ఓవర్లో వెన్నునొప్పితో తప్పుకొన్నాడు. ఈ నేపథ్యంలో బెయిర్‌స్టోతో కలిసి రూట్ ఓపెనింగ్‌కు దిగగా, వోక్స్‌ను వన్‌డౌన్‌లో పంపాల్సి వచ్చింది. మరోవైపు పేసర్ మార్క్ వుడ్ మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. అతడు శుక్రవారం ఫిట్నెస్ టెస్ట్ ఎదుర్కొని మరీ మ్యాచ్ ఆడటం గమనార్హం. ఆర్చర్ -
న్యాయంకోసం ’అర్జున’ జ్యోతి ఆమరణ దీక్ష
-
డబ్బులు ఇవ్వకుంటే ఆమరణ దీక్షే : జ్యోతి సురేఖ
సాక్షి, విజయవాడ : ప్రభుత్వం ఇస్తామన్న కోటి రూపాయలు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ అర్జున అవార్డు గ్రహీత, విలువిద్య క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నట్లు సమాచారం. తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇంతవరకూ ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదని జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. సురేఖ నిరాహార దీక్షకు దిగనుందనే సమాచారం అందుకున్న టీడీపీ నేత ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, సాఫ్ చైర్మన్ అంకయ్య చౌదరిలు జ్యోతి సురేఖతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాణిక్య వరప్రసాద్ సాయంత్రంలోగా జ్యోతి సురేఖ డబ్బులు ఇచ్చేవిధంగా జీవో ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అంతవరకూ దీక్ష ఆలోచనను విరమించుకోవాలని కోరారు. దీంతో సురేఖ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ క్రీడాకారులకు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చే మర్యాద ఇదేనా అని ప్రశ్నించారు. తనకు ఏనాడు ఆయన కోచ్‌గా వ్యవహరించని చెరుకూరి సత్యనారాయణకు తనకు కేటాయించిన నజరానాలో 15లక్షల రూపాయలు ఎలా ఇస్తారంటూ నిలదీశారు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఇంటి స్థలం, గ్రూపు–1 ఉద్యోగాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. 15లక్షలు ఇవ్వడం కుదరదు : సురేఖ తండ్రి జ్యోతి సురేఖకు అర్జున్ అవార్డు వచ్చినప్పుడు ప్రభుత్వం కోటి రూపాయలు నజరాన ప్రకటించిందని.. కానీ ఇప్పటి వరకూ డబ్బులు ఇవ్వలేదని సురేఖ తండ్రి సురేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాప్ అధికారుల నిర్లక్ష్యం వల్లే డబ్బు రావడంలో ఆలస్యమైందని, ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 2012లోనే జ్యోతి సురేఖ చెరుకూరి సత్యనారాయణ వద్ద శిక్షణ తీసుకోవడం మానేసిందని, కానీ అవార్డు వచ్చింది 2017 అని గుర్తుచేశారు. కోచ్‌కు 15లక్షల రూపాయలు ఇవ్వడం కుదరదన్నారు. సాయంత్రంలోపు డబ్బులు ఇవ్వకపోతే సురేఖ దీక్ష చేస్తుందని స్పష్టం చేశారు. -
బాలిక మెడలోకి దూసుకుపోయిన బాణం
కోల్కత్తా: ఆర్చరీ శిక్షణా కార్యక్రమంలో జరిగిన హఠాత్పరిమాణం అక్కడున్న వారిని కంగారు పెట్టింది. అకస్మాత్తుగా దూసుకువచ్చిన ఓ బాణం క్రీడాకారిణి మెడలోకి కుడి పక్కగా దూసుకుపోయింది. అయితే పెద్దగా ప్రమాదం జరగకపోవడం అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ కోచ్‌ల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. బోల్పూర్ లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన ఆర్చర్ ఫజిలా ఖాతూన్(14) తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. శిక్షణలో భాగంగా తోటి ఆర్చర్ జువెల్ షేఖ్ సంధించిన బాణం ప్రమాదవశాత్తూ ఫజిలా మెడలోకి గుచ్చుకు పోయింది. అయితే అదృష్టవశాత్తూ అది విండ్ పైప్( గాలి గొట్టం)లోకి వెళ్లకపోవడంతో పెద్దప్రమాదం తప్పిందని.. ప్రస్తుతం ఆర్చర్ కోలుకుంటోందని ‘శాయ్’ ప్రాంతీయ డైరెక్టర్ గోండిడ్ ప్రకటించారు. ఆర్చరీ షూటింగ్ శిక్షణలో కోచ్‌లు చాలా బాధ్యతగా ఉంటారని, కఠినమైన నిబంధనలు అమల్లో ఉన్నాయని.. ఇది ఎలా జరిగిందో తనకు అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడతామని హామీ ఇచ్చారు. కాగా గత జూలైలో జరిగిన జిల్లా పోటీల్లో విజయం సాధించిన ఫజిలా.. శాయ్ 23 మంది ట్రైయినీల్లో ఒకరిగా చేరారు. వచ్చే నెలలో కోల్‌కతాలో జరగనున్న ఇంటర్-శాయ్ టోర్నమెంట్ కోసం ఆమె శిక్షణ తీసుకుంటోంది. -
ఆమెలా బాణం ఎవ్వరూ వేయలేరు!
మాస్కో: గురిచూసి కొట్టడం అనే నైపుణ్యం మనకు విలువిద్యగా సుపరిచితమే. సాధారణంగా చేతులతోనే విల్లును ఎక్కుపెట్టి బాణాల్నిసంధిస్తాం.అయితే దానికి అతీతంగా అద్భుత విన్యాసాలతో అబ్బురుపరుస్తుంది ఒక యువతి. పురాణాల్లో అర్జునుడు మత్స్య యంత్రాన్ని నీటిలో చూసి ఛేదించే ఘట్టం కడు ఆసక్తికరమైతే, మరి ఈ అమ్మాయి తన రెండు కాళ్లనే చేతులుగా చేసుకుని విలు విద్యను ప్రదర్శిస్తోంది. అటు చేతులతోనూ, కాళ్లతోనూ తన గురి తప్పకుండా అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే ఈ విద్యలో పలు సాహసాలు చేసి శభాష్ అనిపించుకుంటోంది. అన్నా బెలిష్.. రష్యాకు చెందిన ఆ అమ్మాయి వయసు 19 ఏళ్లు. ఆమెకు ఆర్చరీ అంటే ప్రాణం. చిన్నప్పట్నుంచి అదే ధ్యాస, అదే శ్వాస. దాంతో ఇప్పడు ఆన్ లైన్ సెలబ్రెటీగా మారిపోయింది. ఆ విద్య అన్నాకు ఎలా వచ్చిందంటే మాత్రం దానికి సమాధానం దొరకపోయినా.. ఆమె చేసే సాహసాన్ని చూసిన వారిని మాత్రం తప్పకుండా ఆశ్చర్యపరచక మానదు. తమ అమ్మాయి చేసే ఈ విన్యాసాలను చూసి తల్లి దండ్రులు గర్వంగా ఫీలవుతున్నారు. తమది సామాన్య కుటుంబమే అయినా కూతురు చేసే ఫీట్లు ప్రపంచ వ్యాప్తం కావాలని తండ్రి సెర్జీ బెలిష్ ఆక్షాంక్ష. రైల్వే వర్కర్ గా జీవనం సాగిస్తున్న తనకు కూతురి ద్వారా సరికొత్త అనుభూతి కలుగుతుందని సెర్జీ వ్యాఖ్యానించాడు. ఆ విద్య కూతురికి ఎలా వచ్చిందో తనకు కూడా తెలియదని ఆమెలోని ప్రతిభను చూసి మురిసిపోతున్నాడు. బాల్యం నుంచి కూడా వ్యాయామంలో చక్కటి విన్యాసాలతో అన్నా ఆకట్టుకునేదన్నాడు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సాహస ప్రదర్శనకు సంబంధించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు కోసం అప్లై కూడా చేశారు. గిన్నిస్ లో రికార్డులో సంగతి అలా ఉంచితే, ఈ ప్రతిభావంతురాలు అంతర్జాతీయ యవనికపై అత్యుత్తమ విలువిద్య క్రీడాకారిణి అనిపించుకుంటుందో లేదో?చూడాల్సిందే. -
‘శాఫ్’ క్రీడలకు సురేఖ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ వచ్చేనెల లో జరిగే దక్షిణాసియా (శాఫ్) క్రీడల కు అర్హత సాధించింది. మేఘాలయాలోని షిల్లాంగ్‌లో బుధవారం ముగి సిన సెలక్షన్ ట్రయల్స్‌లో రాణించిన సురేఖ భారత మహిళల కాంపౌండ్ జట్టులోకి ఎంపికైంది. ఫిబ్రవరి 6 నుంచి 16 వరకు అస్సాంలోని గౌహతిలో ‘శాఫ్’ క్రీడలు జరుగుతాయి.