శీతల్‌ దేవీ.. ఓ అద్భుతం! రెండు చేతులు లేకపోయినా? | Emotions As Sheetal Devi Clinches Her First Paralympics Medal | Sakshi
Sakshi News home page

Paralympics: శీతల్‌ దేవీ.. ఓ అద్భుతం! రెండు చేతులు లేకపోయినా?

Sep 3 2024 11:48 AM | Updated on Sep 3 2024 12:54 PM

Emotions As Sheetal Devi Clinches Her First Paralympics Medal

ప్యారిస్ పారాలింపిక్స్‌లో అర్చర్‌ శీతల్ దేవి తన అద్భుత ప్రతిభతో  యావత్‌ క్రీడా ప్రపంచాన్నీ అందర్నీ ఆశ్చర్యపరిచింది. వ్యక్తిగత విభాగంలో త్రుటిలో పతకాన్ని చేజార్చుకున్న శీత‌ల్‌.. డబుల్స్‌లో మాత్రం సంచలన ప్రదర్శన కనబరిచింది. 

కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో మ‌రో ఆర్చ‌ర్ రాకేశ్‌ కుమార్‌తో క‌లిసి కాంస్యప‌త‌కం సాధించింది. హోరాహోరీగా సాగిన కాంస్య ప‌త‌క పోరులో  టాప్‌సీడ్‌ శీతల్‌- రాకేశ్ జోడీ 156-155 తేడాతో ఎలోనోరా- మాటియో (ఇటలీ)పై విజయం సాధించారు. 

ఈ మ్యాచ్‌లో తొలి రౌండ్లో 38-40తో భారత్‌ వెనుకబడింది. ఆ తర్వాత  రెండో రౌండ్‌లో తిరిగి పుంజుకున్న భారత జోడీ  40-38తో ప్రత్యర్ధిపై పై చేయి చేయి సాధించింది. మళ్లీ మూడో రౌండ్‌లో ఇటీలీ జంట రాకేశ్‌-శీతల్‌ను  38-39తో వెనక్కి నెట్టారు. అయితే ఫలితాన్ని తేల్చే నాలుగో రౌండ్‌లో భారత ద్వయం అద్బుతం చేశాడరు. 40-38తో ప్రత్యర్ధిని ఓడించి పతకాన్ని దక్కించుకున్నాడు.

ఆ షాట్ ఓ అద్భుతం.. 
నాలుగో రౌండ్‌లో 17 ఏళ్ల శీతల్ కొట్టిన షాట్ ఓ అద్బుతం అని చెప్పుకోవాలి. చివరి ఎండ్‌లో కాలితో విల్లు ఎక్కి పెట్టి  పది పాయింట్లను దేవి కొట్టింది. ఈ షాట్‌తో భారత్ విజయాన్ని అందుకుంది. వెంటనే స్టాండ్స్‌లో ఉన్న ఆమె కోచ్‌ కుల్దీప్ వెధ్వాన్ ఆనందంలో మునిగి తేలిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

చేతులు లేకపోతేనేమి..
ఏదైనా సాధించాలంటే మానవ అవయవాలతో సంబంధం లేదు.. దృఢ సంకల్పం ఉంటే చాలు అని ఆర్చర్‌ శీతల్ నిరూపించింది. ఆమె ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం ఓడిపోయింది. రెండు చేతులు లేకపోయినప్పటి పట్టుదలతో తన పేరును ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగేలా చేసింది. 

పుట్టుకతోనే రెండు చేతులు లేకున్నా కాలితోనే విల్లును పట్టి.. భుజంతో తాడును లాగి బాణం విసిరే ప్రత్యేకత ఆమెది. ఆ అరుదైన స్కిల్స్‌తోనే విశ్వవేదికపై శీతల్ సత్తాచాటింది. డబుల్స్‌తో పతకం సాధించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement