కోల్‌కత్తా: ఆర్చరీ శిక్షణా కార్యక్రమంలో జరిగిన హఠాత్పరిమాణం అక్కడున్న వారిని కంగారు పెట్టింది. అకస్మాత్తుగా దూసుకువచ్చిన ఓ బాణం క్రీడాకారిణి మెడలోకి కుడి పక్కగా దూసుకుపోయింది. అయితే పెద్దగా ప్రమాదం జరగకపోవడం అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ కోచ్‌ల నిర్లక్ష‍్యంపై విమర్శలు వెల్లువెత్తాయి.
బోల్పూర్ లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన ఆర్చర్ ఫజిలా ఖాతూన్(14) తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. శిక్షణలో భాగంగా తోటి ఆర్చర్ జువెల్ షేఖ్ సంధించిన బాణం ప్రమాదవశాత్తూ ఫజిలా మెడలోకి గుచ్చుకు పోయింది. అయితే అదృష్టవశాత్తూ అది విండ్ పైప్( గాలి గొట్టం)లోకి వెళ్లకపోవడంతో పెద్దప్రమాదం తప్పిందని.. ప్రస్తుతం ఆర్చర్ కోలుకుంటోందని ‘శాయ్’ ప్రాంతీయ డైరెక్టర్ గోండిడ్ ప్రకటించారు. ఆర్చరీ షూటింగ్ శిక్షణలో కోచ్‌లు చాలా బాధ్యతగా ఉంటారని, కఠినమైన నిబంధనలు అమల్లో ఉన్నాయని.. ఇది ఎలా జరిగిందో తనకు అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడతామని హామీ ఇచ్చారు.
కాగా గత జూలైలో జరిగిన జిల్లా పోటీల్లో విజయం సాధించిన ఫజిలా.. శాయ్ 23 మంది ట్రైయినీల్లో ఒకరిగా చేరారు. వచ్చే నెలలో కోల్‌కతాలో జరగనున్న ఇంటర్-శాయ్ టోర్నమెంట్ కోసం ఆమె శిక్షణ తీసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment