arrow in neck
-
కడుపులో మేకులు.. మెడలో బాణం
కోల్కటా : పశ్చిమ బెంగాల్ రెండు వేర్వేరు ఘటనల్లో బాధితులను వైద్యులు సురక్షితంగా రక్షించగలిగారు. ఆపరేషన్ చేసి ఓ వ్యక్తి కడుపు నుంచి 600కి పైగా మేకులు బయటకు తీయగా.. మరో ఘటనలో ప్రమాదవశాత్తూ బాణం మెడలోకి దూసుకుపోయిన ఓ బాలికను వైద్యులు రక్షించగలిగారు. కోల్‌కతాలోని ఉత్తర 24 పరగణా జిల్లాలో గోబర్దంగా ప్రాంతానికి చెందిన ఓ 48 ఏళ్ల స్క్రీజోఫ్రెనియాతో బాధపడుతున్నాడు. మేకులు, మట్టి ఎక్కువగా తినేయటంతో కడుపు నొప్పి ఎక్కువైంది. దీంతో ఆస్పత్రిలో కలకత్తా మెడికల్ కళాశాల, ఆసుపత్రిలో చేర్పించగా, వైద్యులు దాదాపు రెండు గంటల పాటు శస్త్ర చికిత్స చేసి 639 మేకులను బయటకు తీశారు. కడుపు దగ్గర చిన్న గాటుపెట్టి అయస్కాంతం సాయంతో వాటిని బయటకు తీయటం విశేషం. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు డాక్టర్ బిశ్వాస్ వెల్లడించారు. బాలిక మెడలో బాణం... బిర్భమ్ జిల్లాలోని సాయ్(స్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా) సెంటర్లో ప్రమాదవశాత్తూ ఓ బాలిక మెడలో బాణం గుచ్చుకుంది. జువెల్ షేక్ అనే ఆర్చర్ సాధన చేస్తున్న సమయంలో.. ప్రమాదవశాత్తూ అక్కడే ఉన్న మరో యువ ఆర్చర్ ఫజిల్లా ఖాటూన్(14) మెడలోకి బాణం దూసుకెళ్లింది. వెంటనే బాలికను బోల్పూర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు బాణాన్ని విజయవంతంగా తొలగించారు. ఫజిల్లాకు ప్రమాదమేం లేదని వైద్యులు వెల్లడించారు. బాలిక అతన్ని(జువెల్) గమనించకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కోచ్ తెలిపారు. -
బాలిక మెడలోకి దూసుకుపోయిన బాణం
కోల్కత్తా: ఆర్చరీ శిక్షణా కార్యక్రమంలో జరిగిన హఠాత్పరిమాణం అక్కడున్న వారిని కంగారు పెట్టింది. అకస్మాత్తుగా దూసుకువచ్చిన ఓ బాణం క్రీడాకారిణి మెడలోకి కుడి పక్కగా దూసుకుపోయింది. అయితే పెద్దగా ప్రమాదం జరగకపోవడం అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ కోచ్‌ల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. బోల్పూర్ లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన ఆర్చర్ ఫజిలా ఖాతూన్(14) తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. శిక్షణలో భాగంగా తోటి ఆర్చర్ జువెల్ షేఖ్ సంధించిన బాణం ప్రమాదవశాత్తూ ఫజిలా మెడలోకి గుచ్చుకు పోయింది. అయితే అదృష్టవశాత్తూ అది విండ్ పైప్( గాలి గొట్టం)లోకి వెళ్లకపోవడంతో పెద్దప్రమాదం తప్పిందని.. ప్రస్తుతం ఆర్చర్ కోలుకుంటోందని ‘శాయ్’ ప్రాంతీయ డైరెక్టర్ గోండిడ్ ప్రకటించారు. ఆర్చరీ షూటింగ్ శిక్షణలో కోచ్‌లు చాలా బాధ్యతగా ఉంటారని, కఠినమైన నిబంధనలు అమల్లో ఉన్నాయని.. ఇది ఎలా జరిగిందో తనకు అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడతామని హామీ ఇచ్చారు. కాగా గత జూలైలో జరిగిన జిల్లా పోటీల్లో విజయం సాధించిన ఫజిలా.. శాయ్ 23 మంది ట్రైయినీల్లో ఒకరిగా చేరారు. వచ్చే నెలలో కోల్‌కతాలో జరగనున్న ఇంటర్-శాయ్ టోర్నమెంట్ కోసం ఆమె శిక్షణ తీసుకుంటోంది. -
నిప్పుల బాణం.. మెడలోకి దూసుకెళ్లింది!
రియాల్టీ షో చేస్తుండగా ఓ అమ్మాయి వేసిన నిప్పుల బాణం.. అవతల ఉన్న వ్యక్తి మెడలోకి దూసుకెళ్లింది. అయినా, తాను బాగానే ఉన్నానని ఆ తర్వాత అతగాడు చెప్పాడు. ఇదంతా అమెరికాలోని ఎన్బీసీ టీవీ నిర్వహిస్తున్న 'అమెరికాస్ గాట్ టాలెంట్' అనే రియాల్టీ షోలో అనుకోకుండా జరిగింది. కత్తులను గొంతులోకి సులభంగా దింపుకొనే ర్యాన్ స్టాక్ ముందుగా రెండు మూడు రకాల కత్తులను గొంతులోకి దించుకుని, బయటకు తీసి చూపిస్తాడు. తర్వాత ఓ లైటుస్టాండు తీసి.. దాని రాడ్‌ను గొంతులో దించుకుంటాడు. దాని కింది భాగం బాణాలు వేసే టార్గెట్ (వృత్తాలతో కూడినది)లా ఉంటుంది. అతడికి కాబోయే భార్య ఆంబర్లిన్ వాకర్ ఆ టార్గెట్ మీద నిప్పులు చిమ్మే బాణంతో కొట్టాల్సి ఉంటుంది. ఆమె ఒక నిచ్చెన ఎక్కి మరీ జాగ్రత్తగా గురి చూసి బాణం విసిరింది. అయితే, మండుతున్న ఆ బాణం కాస్తా అతడి మెడకు గుచ్చుకుంది. దాంతో ఒక్కసారిగా అక్కడున్న జడ్జిలతో పాటు రియాల్టీ షో చూడటానికి వచ్చినవాళ్లు కూడా నివ్వెరపోయారు. కాసేపటికి స్టాక్ లేని, తాను బాగానే ఉన్నానని హోస్ట్ నిక్ కానన్‌కు చెప్పాడు. తర్వాత అతడిని వైద్యులు పరీక్షించారు. విల్లు సరిగా లేకపోవడం వల్లే ఇలా జరిగిందని, క్షేమంగా బయటపడినందుకు చాలా అదృష్టవంతుడినని స్టాక్ ఆ తర్వాత ట్వీట్ చేశాడు. We had a serious mishap tonight outage live on @nbcagt. A very unfortunate mechanical failure but I am very fortunate to walk away from it. — Ryan Stock (@comedydaredevil) 3 August 2016