నిప్పుల బాణం.. మెడలోకి దూసుకెళ్లింది! | flaming arrow goes to performers neck in realty show | Sakshi
Sakshi News home page

నిప్పుల బాణం.. మెడలోకి దూసుకెళ్లింది!

Published Thu, Aug 4 2016 8:38 AM | Last Updated on Thu, Apr 4 2019 3:49 PM

నిప్పుల బాణం.. మెడలోకి దూసుకెళ్లింది! - Sakshi

నిప్పుల బాణం.. మెడలోకి దూసుకెళ్లింది!

రియాల్టీ షో చేస్తుండగా ఓ అమ్మాయి వేసిన నిప్పుల బాణం.. అవతల ఉన్న వ్యక్తి మెడలోకి దూసుకెళ్లింది. అయినా, తాను బాగానే ఉన్నానని ఆ తర్వాత అతగాడు చెప్పాడు. ఇదంతా అమెరికాలోని ఎన్‌బీసీ టీవీ నిర్వహిస్తున్న 'అమెరికాస్ గాట్ టాలెంట్' అనే రియాల్టీ షోలో అనుకోకుండా జరిగింది. కత్తులను గొంతులోకి సులభంగా దింపుకొనే ర్యాన్ స్టాక్ ముందుగా రెండు మూడు రకాల కత్తులను గొంతులోకి దించుకుని, బయటకు తీసి చూపిస్తాడు. తర్వాత ఓ లైటుస్టాండు తీసి.. దాని రాడ్‌ను గొంతులో దించుకుంటాడు. దాని కింది భాగం బాణాలు వేసే టార్గెట్ (వృత్తాలతో కూడినది)లా ఉంటుంది.

అతడికి కాబోయే భార్య ఆంబర్‌లిన్ వాకర్ ఆ టార్గెట్ మీద నిప్పులు చిమ్మే బాణంతో కొట్టాల్సి ఉంటుంది. ఆమె ఒక నిచ్చెన ఎక్కి మరీ జాగ్రత్తగా గురి చూసి బాణం విసిరింది. అయితే, మండుతున్న ఆ బాణం కాస్తా అతడి మెడకు గుచ్చుకుంది. దాంతో ఒక్కసారిగా అక్కడున్న జడ్జిలతో పాటు రియాల్టీ షో చూడటానికి వచ్చినవాళ్లు కూడా నివ్వెరపోయారు. కాసేపటికి స్టాక్ లేని, తాను బాగానే ఉన్నానని హోస్ట్ నిక్ కానన్‌కు చెప్పాడు. తర్వాత అతడిని వైద్యులు పరీక్షించారు. విల్లు సరిగా లేకపోవడం వల్లే ఇలా జరిగిందని, క్షేమంగా బయటపడినందుకు చాలా అదృష్టవంతుడినని స్టాక్ ఆ తర్వాత ట్వీట్ చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement