పారిస్ ఒలింపిక్స్‌లో త్రుటిలో పతకం చేజార్చుకున్న భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి.. విశ్వక్రీడల్లో మెడల్ గెలిచేంత వరకు కెరీర్‌కు రిటైర్మెంట్‌ను ప్రకటించనని వెల్లడించింది. వరుసగా నాలుగోసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన దీపిక... మహిళల వ్యక్తిగత విభాగం క్వార్టర్ ఫైనల్లో ఓడి నిష్క్రమించింది. అంతర్జాతీయ టోర్నీల్లో లెక్కకు మిక్కిలి పతకాలు నెగ్గిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ దీపికకు ఒలింపిక్ మెడల్ మాత్రం అందని ద్రాక్షలానే ఊరిస్తోంది.
‘కెరీర్ కొనసాగిస్తా.ఒలింపిక్ పతకం గెలవాలని బలంగా కోరుకున్నా. అది సాధించేవరకు ఆట నుంచి విశ్రాంతి తీసుకోను, నిష్క్రమించను. మరింత కఠోర సాధన చేసి బలంగా తిరిగి పుంజుకుంటా. వేగంగా బాణాలు వేయడంపై దృష్టి పెడతా. ఈ వేదికపై పొరబాట్లకు తావివ్వకూడదు. వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటా’ అని దీపిక వెల్లడించింది. కీలక పోరులో 7 పాయింట్లు సాధించడం ఫలితంపై తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొంది. అదొక్కటి మినహా పారిస్‌లో మంచి ప్రదర్శనే చేశానని దీపిక వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment