ప్యారిస్ ఒలింపిక్స్-2024 ఆరంభ వేడుకలకు ఒకరోజు ముందే ఆర్చరీ బృందం పోటీలకు సిద్ధమైంది. విశ్వ క్రీడల తాజా ఎడిషన్లో భాగంగా గురువారం మహిళల, పురుషుల ర్యాంకింగ్ రౌండ్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది.
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ నేటి షెడ్యూల్(భారత కాలమానం ప్రకారం)
👉జూలై 25, గురువారం- ఆర్చరీ
👉వేదిక- పర్షియన్ కాంప్లెక్స్‌లోని లెస్ ఇన్‌వాలిడెస్. 1867లో దీనిని నిర్మించారు.
👉మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్ - మధ్యాహ్నం ఒంటి గంటకు ఆరంభం
👉పురుషుల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్- సాయంత్రం 5:45 నిమిషాలకు ఆరంభం
క్వార్ట్సర్స్‌కు చేరిన భారత మహిళా ఆర్చరీ టీమ్..
ఒలింపిక్స్‌లో భారత మహిళా ఆర్చరీ బృందం శుభారంభం చేసింది. మహిళల టీమ్ ఈవెంట్‌లో అంకిత భకత్, భజన్ కౌర్, దీపికా కుమారితో కూడిన త్రయం క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. సీడింగ్ నిర్ణయాత్మక రౌండ్‌లో భారత బృందం నాలుగో స్ధానంలో నిలిచింది. భారత బృందంలో అంకిత భకత్ 666 పాయింట్లతో 11వ స్ధానంలో నిలవగా.. భజన్ కౌర్(659 పాయింట్లు), దీపికా కుమారి(658 పాయింట్లు) వరుసగా 22, 23వ స్ధానాల్లో నిలిచారు.
Update: నాలుగో స్ధానంలో భారత్..
11వ సెట్ ముగిసే సరికి భారత మహిళా ఆర్చరీ బృందం నాలుగో స్ధానంలో నిలిచింది. ఐదో స్ధానంలో ఉన్న జట్టు కంటే భారత్ 13 పాయింట్లు ఆధిక్యంలో ఉంది. మూడో స్ధానంలో ఉన్న మెక్సికోను ఆధిగమించే అందుకు భారత ఆర్చర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా టాప్-4లో నిలిచిన నాలుగు జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు ఆర్హత సాధిస్తాయి.
Update: ఫస్ట్‌హాఫ్(36 షాట్స్) ముగిసే సరికి భారత మహిళా అర్చర్లు ఏ స్ధానాల్లో ఉన్నారంటే?
🎯అంకిత భకత్ 335 పాయింట్లు- 12వ స్థానం
🎯భజన్ కౌర్ 330 పాయింట్లు- 23వ స్థానం
🎯దీపికా కుమారి 327 పాయింట్లు- 38వ స్థానం
🎯మహిళా టీమ్: ఆరో స్థానం
👉పోటీలో ఉన్న ఆర్చర్లు మొత్తం- 64
👉ఇంకా 6 ఎండ్స్(36 షాట్లు) మిగిలి ఉన్నాయి.
🎯1 ఎండ్= ఆరుసార్లు బాణం వేసే అవకాశం
అప్‌డేట్: 4 ఎండ్స్(24 షాట్స్) తర్వాత భారత మహిళా బృందం ఏ స్థానంలో ఉందంటే?
🎯అంకిత భకత్ 225 పాయింట్లు- 8వ స్థానం
🎯భజన్ కౌర్ 218 పాయింట్లు- 31వ స్థానం
🎯దీపికా కుమారి 217 పాయింట్లు- 38వ స్థానం
🎯మహిళా టీమ్: నాలుగో స్థానం
👉పోటీలో ఉన్న ఆర్చర్లు మొత్తం- 64
👉ఇంకా 8 ఎండ్స్(48 షాట్లు) మిగిలి ఉన్నాయి.
🎯1 ఎండ్= ఆరుసార్లు బాణం వేసే అవకాశం
మన ఆర్చర్లు వీరే..
భారత్ నుంచి మహిళా విభాగంలో మాజీ వరలల్డ్ నంబర్ వన్ దీపికా కుమారి, 26 ఏళ్ల అంకితా భకత్, 18 ఏళ్ల భజన్ కౌర్ పాల్గొంటున్నారు. దీపిక ఒలింపిక్స్‌లో పోటీపడటం ఇది నాలుగోసారి.
ఇక పురుషుల విభాగంలో తరుణ్‌దీప్ రాయ్, బొమ్మదేవర ధీరజ్, పర్వీన్ రమేశ్ జాదవ్ ఈసారి విశ్వక్రీడల్లో పాల్గొంటున్నారు. అయితే, ఈ ఆర్చరీలో భారత్‌కు ఇంత వరకు ఒక్కసారి కూడా పతకం లభించలేదు.
ర్యాంకింగ్ రౌండ్ ఫార్మాట్ ఇదీ
వ్యక్తిగత, టీమ్ ఈవెంట్ల ఆధారంగా ఆర్చర్లకు సీడింగ్ ఇస్తారు. అత్యుత్తమంగా రాణించిన ఆర్చర్లు, వారి బృందం తదుపరి దశకు అర్హత సాధిస్తుంది.
మెన్స్ టీమ్, వుమెన్స్ టీమ్ సీడింగ్స్‌ను ఆయా ఆర్చర్ల వ్యక్తిగత స్కోర్లను కలిపి నిర్ణయిస్తారు. టాప్ ఫోర్ సీడింగ్‌లో ఉన్న టీమ్‌లు నేరుగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెడతాయి. 5- 12 మధ్య సీడింగ్ ఉన్న జట్లు రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధిస్తాయి.
ఇక మిక్స్‌డ్ టీమ్ విభాగంలో మెన్స్, వుమెన్స్ అత్యుత్తమ స్కోర్ల ఆధారంగా సీడింగ్ ఇస్తారు. అత్యుత్తమ సీడింగ్‌లో ఉన్న 16 జట్లు మాత్రమే ఫైనల్ ఈవెంట్‌కు అర్హత సాధిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment