Bommadevara Dheeraj
-
గురి చెదిరింది.. కాంస్యం చేజారింది
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. ఒలింపిక్స్ ఆర్చరీలో సెమీఫైనల్‌కు చేరిన భారత మిక్స్డ్ జట్టు.. పతకం పట్టే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్–అంకిత భకత్ జోడీ.. ‘ప్యారిస్’ క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో దక్షిణ కొరియా జోడీ చేతిలో ఓడిన ధీరజ్–అంకిత జంట... కాంస్య పతక పోరులో అమెరికా ద్వయం చేతిలో ఓడి రిక్తహస్తాలతో వెనుదిరిగింది. 36 ఏళ్ల ఒలింపిక్స్ ఆర్చరీ చరిత్రలో తొలిసారివిశ్వక్రీడల్లో భారత ఆర్చర్లకు మరోసారి నిరాశ తప్పలేదు. 36 ఏళ్ల ఒలింపిక్స్ ఆర్చరీ చరిత్రలో తొలిసారి సెమీఫైనల్‌కు చేరి పతక ఆశలు రేపిన మన మిక్స్డ్ ఆర్చరీ జట్టు చివరకు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఒలింపిక్స్ చరిత్రలో మన ఆర్చర్లకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం.శుక్రవారం రికర్వ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో బొమ్మదేవర ధీరజ్–అంకిత భకత్ ద్వయం 2–6తో (37–38, 35–37, 38–34, 35–37) బ్రాడీ ఎలీసన్–క్యాసీ కౌఫ్‌హోల్డ్ (అమెరికా) జంట చేతిలో ఓడింది. ధీరజ్ గురి అంచనాలకు తగ్గట్లు సాగినా... ఒత్తిడికి గురైన అంకిత పలుమార్లు గురి తప్పడం ఫలితంపై ప్రభావం చూపింది. నాలుగు సెట్లలో కలిపి అంకిత రెండుసార్లు 7 పాయింట్లు సాధించడంతో జట్టు విజయావకాశాలను ప్రభావితం చేసింది. తొలి సెట్లో అంకిత 7 ,10 పాయింట్లు సాధించగా.. ధీరజ్ రెండు 10లు నమోదు చేశాడు. ప్రత్యర్థి ఆర్చర్లు 10, 9, 9, 10 పాయింట్లు సాధించి ముందంజ వేయగా.. రెండో సెట్‌ను కూడా అంకిత 7 పాయింట్లతో ప్రారంభించింది. చేజారిన కాంస్యంఈసారి కూడా ప్రత్యర్థిదే పైచేయి కాగా.. మూడో సెట్లో అంకిత 10, 9, ధీరజ్ 9, 10 పాయింట్లు గురిపెట్టారు. ప్రత్యర్థి జంట 10, 7, 9, 8 పాయింట్లు చేసి వెనుకబడింది. ఇక నాలుగో సెట్లో అంకిత రెండు బాణాలకు ఎనిమిదేసి పాయింట్లే రాగా.. ధీరజ్ 9, 10 పాయింట్లు గురిపెట్టాడు. అయితే వరుసగా 10, 9, 9, 9 పాయింట్లు సాధించిన అమెరికా జట్టు కాంస్య పతకం కైవసం చేసుకుంది.దక్షిణ కొరియా, జర్మనీ జోడీలకు స్వర్ణ, రజత పతకాలు లభించాయి. అంతకుముందు సెమీఫైనల్లో ధీరజ్–అంకిత జోడీ 2–6తో (38–36, 35–38, 37–38, 38–39) ప్రపంచ నంబర్‌వన్ కిమ్ వూజిన్–లిమ్ షిహ్యోన్ (కొరియా) జంట చేతిలో ఓడింది. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో భారత్ 5–3తో (38–37, 38–38, 36–37, 37–36) స్పెయిన్‌పై, తొలి రౌండ్లో 5–1తో (37–36, 38–38, 38–37) ఇండోనేసియాపై గెలిచింది. మహిళల వ్యక్తిగత విభాగంలో దీపికా కుమారి, భజన్ కౌర్ ఈరోజు బరిలోకి దిగనున్నారు. బల్‌రాజ్‌కు 23వ స్థానం పారిస్ ఒలింపిక్స్‌లో భారత రోవర్ బల్రాజ్ పన్వర్ 23వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల సింగిల్ స్కల్స్ ఈవెంట్ రౌండ్ ‘డి’ ఫైనల్లో శుక్రవారం బల్రాజ్ 7 నిమిషాల 2.37 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. అంతకుముందు రెపిచాజ్ రౌండ్లో రెండో స్థానంలో నిలిచి క్వార్టర్స్‌కు చేరిన బల్రాజ్... అక్కడ ఐదో స్థానానికి పరిమితమవడంతో ఫైనల్‌కు దూరమయ్యాడు. ఫైనల్ ‘ఎ’లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు లభిస్తాయి. -
Olympics: చరిత్ర సృష్టించిన భారత ఆర్చరీ జోడీ
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ మరో పతకానికి చేరువైంది. మిక్స్డ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్లో బొమ్మదేవర ధీరజ్- అంకితా భకత్ జోడీసెమీ ఫైనల్ చేరుకుంది. శుక్రవారం నాటి క్వార్టర్ ఫైనల్లో స్పానిష్ జంట కనాలెస్- గొంజాలెజ్‌పై విజయం సాధించింది. ఆద్యంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచి స్పెయిన్ ద్వయాన్ని 5-3తో ఓడించి జయభేరి మోగించింది.తద్వారా ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్ చేరిన భారత తొలి ఆర్చరీ జోడీగా చరిత్ర సృష్టించింది. మరో క్వార్టర్స్ పోరులో సౌత్ కొరియా జంట.. ఇటలీపై గెలుపొందింది. ఈ క్రమంలో భారత్- సౌత్ కొరియా జట్ల మధ్య సెమీ ఫైనల్ పోటీ మొదలుకానుంది.కాంస్య పతక పోరులో భారత్ ఓటమిమిక్స్డ్ ఆర్చరీ టీమ్ కాంస్య పతక పోరులో బొమ్మదేవర ధీరజ్- అంకితా భకత్ జోడీ ఓటమి పాలైంది. యునైటెడ్ స్టేట్స్ బ్రాడీ-కేసీ జంట చేతిలో6-2 తేడాతో భారత జోడీ ఓటమి చవిచూసింది. సెమీస్‌లో ఓటమి.. కాంస్య పతకపోరుకు మనోళ్లుసెమీ ఫైనల్లో సౌత్ కొరియా జోడీ లిమ్- కిమ్ జోడీ చేతిలో ధీరజ్- అంకిత ఓడిపోయారు. 6-2తో పరాజయం పాలై స్వర్ణ పతక రేసుకు అర్హత సాధించే అవకాశం కోల్పోయారు. అయితే, కాంస్య పతకం కోసం అమెరికాతో తలపడతారు. ఇక సౌత్ కొరియాతో పాటు జర్మనీ ఫైనల్‌కు చేరింది.ఇప్పటికి మూడు పతకాలుప్యారిస్లో ఇప్పటికే భారత్ మూడు పతకాలు ఖాతాలో వేసుకుంది. షూటింగ్ వ్యక్తిగత విభాగంలో మనూ భాకర్, స్వప్నిల్ కుసాలే.. టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్ పతకాలు గెలిచారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలిచిన మనూ.. సరబ్‌జోత్‌తో కలిసి ఇదే విభాగంలో టీమ్ మెడల్(కాంస్యం), స్వప్నిల్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత షూటర్‌గా గుర్తింపు పొందాడు. ఇక ఇప్పటికే రెండు పతకాలు గెలిచిన.. మనూ 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఫైనల్‌కు చేరి మూడో పతకానికి గురిపెట్టింది. -
Paris Olympics 2024: క్వార్ట్సర్స్‌కు చేరిన భారత మహిళా ఆర్చరీ టీమ్..
ప్యారిస్ ఒలింపిక్స్-2024 ఆరంభ వేడుకలకు ఒకరోజు ముందే ఆర్చరీ బృందం పోటీలకు సిద్ధమైంది. విశ్వ క్రీడల తాజా ఎడిషన్‌లో భాగంగా గురువారం మహిళల, పురుషుల ర్యాంకింగ్ రౌండ్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ నేటి షెడ్యూల్(భారత కాలమానం ప్రకారం)👉జూలై 25, గురువారం- ఆర్చరీ👉వేదిక- పర్షియన్ కాంప్లెక్స్‌లోని లెస్ ఇన్వాలిడెస్. 1867లో దీనిని నిర్మించారు.👉మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్ - మధ్యాహ్నం ఒంటి గంటకు ఆరంభం👉పురుషుల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్- సాయంత్రం 5:45 నిమిషాలకు ఆరంభంక్వార్ట్సర్స్కు చేరిన భారత మహిళా ఆర్చరీ టీమ్..ఒలింపిక్స్‌లో భారత మహిళా ఆర్చరీ బృందం శుభారంభం చేసింది. మహిళల టీమ్ ఈవెంట్లో అంకిత భకత్, భజన్ కౌర్, దీపికా కుమారితో కూడిన త్రయం క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. సీడింగ్ నిర్ణయాత్మక రౌండ్లో భారత బృందం నాలుగో స్ధానంలో నిలిచింది. భారత బృందంలో అంకిత భకత్ 666 పాయింట్లతో 11వ స్ధానంలో నిలవగా.. భజన్ కౌర్(659 పాయింట్లు), దీపికా కుమారి(658 పాయింట్లు) వరుసగా 22, 23వ స్ధానాల్లో నిలిచారు.Update: నాలుగో స్ధానంలో భారత్..11వ సెట్ ముగిసే సరికి భారత మహిళా ఆర్చరీ బృందం నాలుగో స్ధానంలో నిలిచింది. ఐదో స్ధానంలో ఉన్న జట్టు కంటే భారత్ 13 పాయింట్లు ఆధిక్యంలో ఉంది. మూడో స్ధానంలో ఉన్న మెక్సికోను ఆధిగమించే అందుకు భారత ఆర్చర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా టాప్-4లో నిలిచిన నాలుగు జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు ఆర్హత సాధిస్తాయి.Update: ఫస్ట్‌హాఫ్(36 షాట్స్) ముగిసే సరికి భారత మహిళా అర్చర్లు ఏ స్ధానాల్లో ఉన్నారంటే?🎯అంకిత భకత్ 335 పాయింట్లు- 12వ స్థానం🎯భజన్ కౌర్ 330 పాయింట్లు- 23వ స్థానం🎯దీపికా కుమారి 327 పాయింట్లు- 38వ స్థానం🎯మహిళా టీమ్: ఆరో స్థానం👉పోటీలో ఉన్న ఆర్చర్లు మొత్తం- 64👉ఇంకా 6 ఎండ్స్(36 షాట్లు) మిగిలి ఉన్నాయి.🎯1 ఎండ్= ఆరుసార్లు బాణం వేసే అవకాశంఅప్డేట్: 4 ఎండ్స్(24 షాట్స్) తర్వాత భారత మహిళా బృందం ఏ స్థానంలో ఉందంటే?🎯అంకిత భకత్ 225 పాయింట్లు- 8వ స్థానం🎯భజన్ కౌర్ 218 పాయింట్లు- 31వ స్థానం🎯దీపికా కుమారి 217 పాయింట్లు- 38వ స్థానం🎯మహిళా టీమ్: నాలుగో స్థానం👉పోటీలో ఉన్న ఆర్చర్లు మొత్తం- 64👉ఇంకా 8 ఎండ్స్(48 షాట్లు) మిగిలి ఉన్నాయి.🎯1 ఎండ్= ఆరుసార్లు బాణం వేసే అవకాశంమన ఆర్చర్లు వీరే.. భారత్ నుంచి మహిళా విభాగంలో మాజీ వరలల్డ్ నంబర్ వన్ దీపికా కుమారి, 26 ఏళ్ల అంకితా భకత్, 18 ఏళ్ల భజన్ కౌర్ పాల్గొంటున్నారు. దీపిక ఒలింపిక్స్‌లో పోటీపడటం ఇది నాలుగోసారి.ఇక పురుషుల విభాగంలో తరుణ్‌దీప్ రాయ్, బొమ్మదేవర ధీరజ్, పర్వీన్ రమేశ్ జాదవ్ ఈసారి విశ్వక్రీడల్లో పాల్గొంటున్నారు. అయితే, ఈ ఆర్చరీలో భారత్‌కు ఇంత వరకు ఒక్కసారి కూడా పతకం లభించలేదు.ర్యాంకింగ్ రౌండ్ ఫార్మాట్ ఇదీవ్యక్తిగత, టీమ్ ఈవెంట్ల ఆధారంగా ఆర్చర్లకు సీడింగ్ ఇస్తారు. అత్యుత్తమంగా రాణించిన ఆర్చర్లు, వారి బృందం తదుపరి దశకు అర్హత సాధిస్తుంది.మెన్స్ టీమ్, వుమెన్స్ టీమ్ సీడింగ్స్‌ను ఆయా ఆర్చర్ల వ్యక్తిగత స్కోర్లను కలిపి నిర్ణయిస్తారు. టాప్ ఫోర్ సీడింగ్‌లో ఉన్న టీమ్‌లు నేరుగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెడతాయి. 5- 12 మధ్య సీడింగ్ ఉన్న జట్లు రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధిస్తాయి.ఇక మిక్స్డ్ టీమ్ విభాగంలో మెన్స్, వుమెన్స్ అత్యుత్తమ స్కోర్ల ఆధారంగా సీడింగ్ ఇస్తారు. అత్యుత్తమ సీడింగ్‌లో ఉన్న 16 జట్లు మాత్రమే ఫైనల్ ఈవెంట్‌కు అర్హత సాధిస్తాయి. -
క్వాలిఫయింగ్‌లో జ్యోతి సురేఖ ‘టాప్’
Asian Games 2023- Archery: ఆసియా క్రీడల ఆర్చరీ క్వాలిఫయింగ్ రౌండ్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల కాంపౌండ్ క్వాలిఫయింగ్‌లో విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ 704 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. భారత్‌కే చెందిన ప్రపంచ చాంపియన్ అదితి స్వామి 696 పాయింట్లతో నాలుగోర్యాంక్ను దక్కించుకుంది. టీమ్ విభాగంలోనూ భారత్‌కు టాప్ ర్యాంక్ దక్కింది. టీమిండియా 2087 పాయింట్లు స్కోరు చేసి నేరుగా క్వార్టర్ ఫైనల్లో పోటీపడనుంది. ధీరజ్‌కు ఆరో ర్యాంకు పురుషుల కాంపౌండ్ క్వాలిఫయింగ్‌లో ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలే 709 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో, అభిషేక్ వర్మ 708 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో నిలిచారు. పురుషుల రికర్వ్ క్వాలిఫయింగ్‌లో అతాను దాస్ 678 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్ 675 పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో నిలిచారు. మహిళల రికర్వ్ క్వాలిఫయింగ్‌లో అంకిత 649 పాయింట్లతో పదో ర్యాంక్‌లో, భజన్ కౌర్ 640 పాయింట్లతో 14వ ర్యాంక్‌లో నిలిచారు. -
రెండో సీడ్‌గా జ్యోతి సురేఖ, ధీరజ్
World Archery Championship Qualifications- బెర్లిన్ (జర్మనీ): ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, బొమ్మదేవర ధీరజ్ మెరిశారు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ ర్యాంకింగ్ రౌండ్లో మహిళల కాంపౌండ్ విభాగంలో జ్యోతి సురేఖ 701 పాయింట్లు... పురుషుల రికర్వ్ విభాగంలో ధీరజ్ 683 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచారు. ఫలితంగా నాకౌట్ దశలో రెండో సీడింగ్ పొందిన జ్యోతి సురేఖ, ధీరజ్లకు నేరుగా మూడో రౌండ్‌కు ‘బై’ లభించింది. ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి జోడీ సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీ తొలి రౌండ్లో... సిక్కి రెడ్డి–ఆరతి సారా సునీల్ జంట క్వాలిఫయింగ్‌లో నిష్క్రమించాయి. తొలి రౌండ్ మ్యాచ్‌లో గాయత్రి–ట్రెసా జాలీ 21–16, 21–17తో కేథరీన్ చోయ్–జోసెఫిన్ వు (కెనడా)లపై గెలిచారు. అశి్వని–తనీషా 11–21, 21–14, 17–21తో ఫెబ్రియానా కుసుమ–అమాలియా ప్రతవి (ఇండోనేసియా) చేతిలో... సిక్కి రెడ్డి–ఆరతి 14–21, 17–21తో సు యిన్ హుయ్–లీ చి చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు. -
ప్రపంచకప్ ఆర్చరీ టోర్నీలకు సురేఖ, ధీరజ్
సోనీపత్ (హరియాణా): ఈ ఏడాది జరిగే మూడు ప్రపంచకప్ టోర్నీలు... ప్రపంచ చాంపియన్‌షిప్... అనంతరం ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల, మహిళల రికర్వ్, కాంపౌండ్ జట్లను భారత ఆర్చరీ సంఘం సోమవారం ప్రకటించింది. పురుషుల రికర్వ్ జట్టులో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు తరఫున పోటీపడ్డ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మదేవర ధీరజ్... మహిళల కాంపౌండ్ జట్టులో ఆంధ్రప్రదేశ్ మేటి క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ, తెలంగాణ అమ్మాయి తనిపర్తి చికిత చోటు సంపాదించారు. సోనీపత్‌లోని భారత స్పోర్ట్స్ అథారిటీ కేంద్రంలో నిర్వహించిన ట్రయల్స్ ఆధారంగా జట్లను ఎంపిక చేశారు. పురుషుల, మహిళల రికర్వ్ విభాగాల్లో ఎనిమిది మంది చొప్పున... పురుషుల, మహిళల కాంపౌండ్ విభాగాల్లో ఎనిమిది మంది చొప్పున ఎంపిక చేశారు. ఇందులో టాప్–4లో నిలిచిన వారికి తొలి ప్రాధాన్యత లభిస్తుంది. రెండు ప్రపంచకప్ టోర్నీలు ముగిశాక టాప్–4లో నిలిచిన వారు విఫలమైతే తదుపరి టోర్నీకి 5 నుంచి 8 స్థానాల్లో నిలిచిన వారికి చాన్స్ ఇస్తారు. మూడు ప్రపంచకప్ టోర్నీలు అంటాల్యాలో (ఏప్రిల్ 18–23)... షాంఘైలో (మే 16–21)... కొలంబియాలో (జూన్ 13–18) జరుగుతాయి. ప్రపంచ చాంపియన్‌షిప్ జూలై 31 నుంచి ఆగస్టు 6 వరకు జర్మనీలో... ఆసియా క్రీడలు సెప్టెంబర్‌లో చైనాలో జరుగుతాయి. ట్రయల్స్‌లో విఫలమైన ‘ట్రిపుల్ ఒలింపియన్’ దీపిక కుమారి మహిళల రికర్వ్ జట్టులో చోటు సంపాదించలేకపోయింది. మార్చి 18న ఐఎస్ఎల్ ఫైనల్ ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్ మార్చి 18న గోవాలోని ఫటోర్డా పట్టణంలో జరుగుతుంది. ప్లే ఆఫ్ మ్యాచ్‌లు మార్చి 3న మొదలవుతాయి. ఇప్పటికే టాప్–2లో నిలిచిన ముంబై సిటీ, డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఎఫ్‌సీ నేరుగా సెమీఫైనల్ చేరాయి. -
Archery: మెరిసిన సురేఖ, ధీరజ్.. టాప్‌లో నిలిచి.. సత్తా చాటి..
కోల్‌కతా: ఈ ఏడాది జరిగే ప్రపంచకప్ టోర్నీలు, ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత ఆర్చరీ జట్లను ఎంపిక చేసేందుకు నిర్వహించిన ఓపెన్ సెలెక్షన్ ట్రయల్స్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు బొమ్మదేవర ధీరజ్, వెన్నం జ్యోతి సురేఖ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. మంగళవారం ముగిసిన ఈ ట్రయల్స్‌లో పురుషుల రికర్వ్ విభాగంలో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ) జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ధీరజ్ ఓవరాల్‌గా 2767 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. పార్థ్ సాలుంకే (మహారాష్ట్ర), జయంత తాలుక్దార్ (జార్ఖండ్), అతాను దాస్ (పీఎస్‌పీబీ), సుఖ్‌చెయిన్ సింగ్ (సర్వీసెస్), తరుణ్‌దీప్ రాయ్ (సర్వీసెస్), సుఖ్మణి (మహారాష్ట్ర), నీరజ్ చౌహాన్ వరుసగా రెండు నుంచి ఎనిమిది ర్యాంక్‌ల్లో నిలిచారు. తద్వారా ఈ ఏడాది జరిగే అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనే భారత జట్టులో చోటు సంపాదించేందుకు అర్హత పొందారు. మరోవైపు మహిళల కాంపౌండ్ విభాగంలో జ్యోతి సురేఖ ఓవరాల్‌గా 2828 పాయింట్లు సాధించి టాప్ ర్యాంక్‌లో నిలిచింది. సురేఖతోపాటు పర్ణీత్ కౌర్, అదితి, ప్రగతి, సాక్షి చౌదరీ, ముస్కాన్, ఐశ్వర్య శర్మ, సృష్టి సింగ్ కూడా ఈ ఏడాది జరిగే మెగా ఈవెంట్స్‌లో పాల్గొనే టీమిండియా సెలెక్షన్స్‌కు అర్హత పొందారు. మహిళల రికర్వ్ విభాగం ట్రయల్స్‌లో ‘ట్రిపుల్ ఒలింపియన్’ దీపిక కుమారి ఏడో ర్యాంక్‌లో నిలిచి భారత జట్టులో పునరాగమనం చేయడానికి అర్హత సాధించింది. చదవండి: IND vs NZ 1st ODI: టీమిండియాతో తొలి వన్డే.. న్యూజిలాండ్‌కు బిగ్ షాక్ WTC- Ind Vs Aus: పిచ్‌లు అలా ఉంటే టీమిండియాదే సిరీస్.. కనీసం ఈసారైనా..