ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ మరో పతకానికి చేరువైంది. మిక్స్‌డ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్లో బొమ్మదేవర ధీరజ్- అంకితా భకత్ జోడీసెమీ ఫైనల్ చేరుకుంది. శుక్రవారం నాటి క్వార్టర్ ఫైనల్లో స్పానిష్ జంట కనాలెస్- గొంజాలెజ్‌పై విజయం సాధించింది. ఆద్యంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచి స్పెయిన్ ద్వయాన్ని 5-3తో ఓడించి జయభేరి మోగించింది.
తద్వారా ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్ చేరిన భారత తొలి ఆర్చరీ జోడీగా చరిత్ర సృష్టించింది. మరో క్వార్టర్స్ పోరులో సౌత్ కొరియా జంట.. ఇటలీపై గెలుపొందింది. ఈ క్రమంలో భారత్- సౌత్ కొరియా జట్ల మధ్య సెమీ ఫైనల్ పోటీ మొదలుకానుంది.
కాంస్య పతక పోరులో భారత్ ఓటమి
మిక్స్‌డ్ ఆర్చరీ టీమ్ కాంస్య పతక పోరులో బొమ్మదేవర ధీరజ్- అంకితా భకత్ జోడీ ఓటమి పాలైంది. యునైటెడ్ స్టేట్స్ బ్రాడీ-కేసీ జంట చేతిలో6-2 తేడాతో భారత జోడీ ఓటమి చవిచూసింది.
సెమీస్‌లో ఓటమి.. కాంస్య పతకపోరుకు మనోళ్లు
సెమీ ఫైనల్లో సౌత్ కొరియా జోడీ లిమ్- కిమ్ జోడీ చేతిలో ధీరజ్- అంకిత ఓడిపోయారు. 6-2తో పరాజయం పాలై స్వర్ణ పతక రేసుకు అర్హత సాధించే అవకాశం కోల్పోయారు. అయితే, కాంస్య పతకం కోసం అమెరికాతో తలపడతారు. ఇక సౌత్ కొరియాతో పాటు జర్మనీ ఫైనల్‌కు చేరింది.
ఇప్పటికి మూడు పతకాలు
ప్యారిస్‌లో ఇప్పటికే భారత్ మూడు పతకాలు ఖాతాలో వేసుకుంది. షూటింగ్ వ్యక్తిగత విభాగంలో మనూ భాకర్, స్వప్నిల్ కుసాలే.. టీమ్ ఈవెంట్లో సరబ్‌జోత్ సింగ్ పతకాలు గెలిచారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలిచిన మనూ.. సరబ్‌జోత్‌తో కలిసి ఇదే విభాగంలో టీమ్ మెడల్(కాంస్యం), స్వప్నిల్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత షూటర్‌గా గుర్తింపు పొందాడు. ఇక ఇప్పటికే రెండు పతకాలు గెలిచిన.. మనూ 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఫైనల్‌కు చేరి మూడో పతకానికి గురిపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment