పారిస్ ఒలింపిక్స్ ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో భారత్ పోరాటం ముగిసింది. ఇప్పటికే తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్, సీనియర్ ఆర్చర్ తరుణ్‌దీప్ రాయ్ నాకౌట్ మ్యాచ్‌ల్లో పరాజయం పాలవగా... బరిలో మిగిలిన ఏకైక భారత ఆర్చర్ ప్రవీణ్ జాధవ్ కూడా ఇంటిదారి పట్టాడు.
వ్యక్తిగత రికర్వ్ తొలి రౌండ్‌లో ప్రవీణ్ 0–6 (28–29, 29–30, 27–28)తో వెన్‌చావో (చైనా) చేతిలో ఓడాడు. ఇక మహిళల వ్యక్తిగత విభాగంలో దీపిక కుమారి, భజన్ కౌర్ శనివారం ప్రిక్వార్టర్స్ బరిలో దిగనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment