ఆర్చరీలో కొత్త ప్రపంచ రికార్డు | A new world record in archery | Sakshi
Sakshi News home page

ఆర్చరీలో కొత్త ప్రపంచ రికార్డు

Jul 26 2024 4:33 AM | Updated on Jul 26 2024 4:33 AM

A new world record in archery

694 పాయింట్లతో కొరియా అమ్మాయి లిమ్‌ సిహైన్‌ ఘనత

పారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడలు నేడు అధికారికంగా ప్రారంభమవుతున్నా... గురువారం ఈ క్రీడల్లో తొలి ప్రపంచ రికార్డు నమోదైంది. మహిళల ఆర్చరీ రికర్వ్‌ వ్యక్తిగత ర్యాంకింగ్‌ రౌండ్‌లో దక్షిణ కొరియా అమ్మాయి లిమ్‌ సిహైన్‌ కొత్త ప్రపంచ రికార్డుతోపాటు ఒలింపిక్‌ రికార్డును కూడా నెలకొల్పింది. 

లిమ్‌ సిహైన్‌ 694 పాయింట్లు స్కోరు చేసింది. తద్వారా 692 పాయింట్లతో కాంగ్‌ చాయెంగ్‌ (దక్షిణ కొరియా; 2019లో) సాధించిన ప్రపంచ రికార్డును లిమ్‌ బద్దలు కొట్టింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కొరియాకే చెందిన ఆన్‌ సాన్‌ 680 పాయింట్లతో నెలకొల్పిన ఒలింపిక్‌ రికార్డును కూడా లిమ్‌ సిహైన్‌ తిరగరాసింది.  

Advertisement
 
Advertisement
Advertisement