పారిస్: ఆర్చరీ పోటీల్లో గురి లక్ష బిందువుపైనే ఉంటుంది. ఇది కుదిరితే 10 కాస్త అటుఇటు తప్పితే 9, 8, 7 పాయింట్లు సహజం. కానీ ఆఫ్రికన్ దేశం చాద్ ఆర్చర్ ఇజ్రాయెల్ మదయె దాదాపు టార్గెట్ రింగ్స్ బోర్డుకే దూరమయ్యే బాణం సంధించాడు. త్రుటిలో బోర్డులో పడింది... కానీ వచి్చంది ఒకే పాయింట్! వినడానికి విడ్డూరంగా ఉన్న మదయె రెండో సెట్‌లో మూడు షాట్లలో ఒకటి ఒక్క పాయింటే తెచ్చి పెట్టింది. విలువిద్యలో కొరియన్ ఆర్చర్లకు తిరుగుండదు.
పైగా మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్ అయిన కిమ్ వూ జిన్ ముందు 36 ఏళ్ల మదయె ఓ పిల్లబచ్చ! ఈ మ్యాచ్‌లో 26–29, 15–29, 25–30 స్కోరుతో కిమ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి సెట్‌లో 26 పాయింట్లు సాధించిన మదయె రెండో సెట్‌లో కేవలం 15 పాయింట్లే చేశాడు. అంటే మూడు బాణాల స్కోరుకు (10+10+10)కు సగమన్నమాట!
ఇందులో మూడో షాట్ ఒక పాయింట్ తేవడంతో అతను సగం స్కోరుకు పరిమితమయ్యాడు. అయితే మూడో సెట్‌లో పుంజుకొని 25 పాయింట్లు సాధించాడు. ఇంత ఘోరంగా మదయె ఓడినప్పటికీ స్టేడియంలోని కొరియన్ అభిమానుల నుంచి ఓదార్పు లభించింది. చప్పట్లతో మదయెకు వీడ్కోలు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment