Asian Games 2023- Archery: ఆసియా క్రీడల ఆర్చరీ క్వాలిఫయింగ్ రౌండ్‌లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల కాంపౌండ్
క్వాలిఫయింగ్‌లో విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ 704 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది.
భారత్‌కే చెందిన ప్రపంచ చాంపియన్ అదితి స్వామి 696 పాయింట్లతో నాలుగోర్యాంక్‌ను దక్కించుకుంది. టీమ్ విభాగంలోనూ భారత్‌కు టాప్ ర్యాంక్ దక్కింది. టీమిండియా 2087 పాయింట్లు స్కోరు చేసి నేరుగా క్వార్టర్ ఫైనల్లో పోటీపడనుంది.
ధీరజ్‌కు ఆరో ర్యాంకు
పురుషుల కాంపౌండ్ క్వాలిఫయింగ్‌లో ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలే 709 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో, అభిషేక్ వర్మ 708 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో నిలిచారు. పురుషుల రికర్వ్ క్వాలిఫయింగ్‌లో అతాను దాస్ 678 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్ 675 పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో నిలిచారు. మహిళల రికర్వ్ క్వాలిఫయింగ్‌లో అంకిత 649 పాయింట్లతో పదో ర్యాంక్‌లో, భజన్ కౌర్ 640 పాయింట్లతో 14వ ర్యాంక్‌లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment