ojas
-
క్వాలిఫయింగ్‌లో జ్యోతి సురేఖ ‘టాప్’
Asian Games 2023- Archery: ఆసియా క్రీడల ఆర్చరీ క్వాలిఫయింగ్ రౌండ్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల కాంపౌండ్ క్వాలిఫయింగ్‌లో విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ 704 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. భారత్‌కే చెందిన ప్రపంచ చాంపియన్ అదితి స్వామి 696 పాయింట్లతో నాలుగోర్యాంక్ను దక్కించుకుంది. టీమ్ విభాగంలోనూ భారత్‌కు టాప్ ర్యాంక్ దక్కింది. టీమిండియా 2087 పాయింట్లు స్కోరు చేసి నేరుగా క్వార్టర్ ఫైనల్లో పోటీపడనుంది. ధీరజ్‌కు ఆరో ర్యాంకు పురుషుల కాంపౌండ్ క్వాలిఫయింగ్‌లో ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలే 709 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో, అభిషేక్ వర్మ 708 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో నిలిచారు. పురుషుల రికర్వ్ క్వాలిఫయింగ్‌లో అతాను దాస్ 678 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్ 675 పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో నిలిచారు. మహిళల రికర్వ్ క్వాలిఫయింగ్‌లో అంకిత 649 పాయింట్లతో పదో ర్యాంక్‌లో, భజన్ కౌర్ 640 పాయింట్లతో 14వ ర్యాంక్‌లో నిలిచారు. -
Archery World Cup: శెభాష్ జ్యోతి సురేఖ- ప్రవీణ్.. భారత్ ఖాతాలో స్వర్ణం
Archery World Cup: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఖాతాలో మరో పసిడి పతకం చేరింది. ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీలో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ- మహారాష్ట్ర ప్లేయర్ ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలె జోడీ భారత్‌కు స్వర్ణం అందించారు. తుర్కియేలోని అంటాల్యా వేదికగా శనివారం జరిగిన ఫైనల్లో భారత జోడీ- చైనీస్ తైపీ ద్వయంతో తలపడింది. ఈ క్రమంలో 159- 154తో ప్రత్యర్థిపై గెలుపొంది సురేఖ- ప్రవీణ్ భారత్ ఖాతాలో గోల్డ్ మెడల్ చేర్చారు. కాగా జ్యోతి సురేఖకు మెగా ఈవెంట్లో ఇది రెండో స్వర్ణ పతకం. పారిస్‌లో 2022లో జరిగిన వరల్డ్‌కప్-3లో జ్యోతి సురేఖ- అభిషేక్ వర్మతో కలిసి విజేతగా నిలిచారు. తాజాగా ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీ ఫైనల్లో ప్రవీణ్‌తో కలిసి చెన్ యి సువాన్–చెన్ చియె లున్ జోడీని ఓడించి తన ఖాతాలో మరో పసిడి పతకం జమచేసుకున్నారు. చదవండి: WC 2011: నాడు కోహ్లికి నేను ఏం చెప్పానంటే: సచిన్ టెండుల్కర్ INDIAN DOMINANCE 💪 🇮🇳 It's gold for Jyothi Surekha Vennam and Ojas Pravin Deotale in Antalya#ArcheryWorldCup pic.twitter.com/hhk9OsjifV — World Archery (@worldarchery) April 22, 2023 -
పసిడి పోరుకు జ్యోతి సురేఖ జోడీ
అంటాల్యా (తుర్కియే): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీలో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు పతకం ఖరారైంది. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, మహారాష్ట్ర ప్లేయర్ ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలె ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన సురేఖ–ఓజస్ రెండో రౌండ్లో 159–157తో మరియా–గైల్స్ (లక్సెంబర్గ్)లపై... క్వార్టర్ ఫైనల్లో 159–156తో సోఫీ–అడ్రియన్ గోంటీర్ (ఫ్రాన్స్)లపై... సెమీఫైనల్లో 157–155తో ఫాతిన్ నూర్‌ఫతే–జువైది (మలేసియా)లపై గెలిచారు. నేడు జరిగే ఫైనల్లో చెన్ యి సువాన్–చెన్ చియె లున్ (చైనీస్ తైపీ)లతో జ్యోతి సురేఖ–ఓజస్ తలపడతారు. రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మాత్రం అతాను దాస్–భజన్ కౌర్ (భారత్) ద్వయం తొలి రౌండ్లో 3–5తో డెన్మార్క్ జోడీ చేతిలో ఓడిపోయింది. ధీరజ్ అద్భుతం... పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ధీరజ్ బొమ్మదేవర అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. తొలి రౌండ్లో ధీరజ్ 6–0తో థియో కార్బొనెటి (బెల్జియం)పై, రెండో రౌండ్లో 6–4తో కెజియా చాబిన్ (స్విట్జర్లాండ్)పై, మూడో రౌండ్లో 6–4తో జిగా రావ్నికర్ (స్లొవేనియా)పై, నాలుగో రౌండ్లో 6–5తో అమెరికా దిగ్గజం బ్రాడీ ఇలిసన్పై, క్వార్టర్ ఫైనల్లో 6–4తో తరుణ్‌దీప్ రాయ్ (భారత్)పై గెలుపొందాడు. ప్రపంచ మాజీ చాంపియన్, మూడు ఒలింపిక్ పతకాలు నెగ్గిన ఇలిసన్తో జరిగిన మ్యాచ్‌లో ధీరజ్ ‘షూట్ ఆఫ్’లో గెలిచాడు. ఇద్దరూ 10 పాయింట్లు స్కోరు చేసినా ధీరజ్ కొట్టిన బాణం 10 పాయింట్ల లక్ష్యబిందువుకు అతి సమీపంలో ఉండటంతో విజయం ఖరారు చేసుకున్నాడు. ఆధిక్యంలో అర్జున్ సాటీ జుల్డిజ్ ఓపెన్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీలో ఎనిమిది రౌండ్ల తర్వాత తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఏడు పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన నాలుగు గేముల్లో మూడింట గెలిచిన అర్జున్, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. వఖిదోవ్ (ఉజ్బెకిస్తాన్), బిబిసారా (కజకిస్తాన్), బోరిస్ గెల్ఫాండ్ (ఇజ్రాయెల్)లపై నెగ్గిన అర్జున్ జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమెర్‌తో జరిగిన గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు. 12 మంది అగ్రశ్రేణి ప్లేయర్ల మధ్య 11 రౌండ్లపాటు ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. నేడు చివరి మూడు రౌండ్లు జరుగుతాయి. -
చెస్ చాంప్స్ ఓజస్, త్రిష
సాక్షి, హైదరాబాద్: బ్రిలియంట్ ట్రోఫీ చెస్ టోర్నమెంట్లో ఎం. ఓజస్, కె. త్రిష విజేతలుగా నిలిచారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో జరిగిన ఈ టోర్నీ జూనియర్స్ విభాగంలో చిన్మయ విద్యాలయాకు చెందిన ఓజస్, ఓపెన్ కేటగిరీలో ఎనీ టైమ్ చెస్అకాడమీకి చెందిన త్రిష టైటిళ్లను కైవసం చేసుకున్నారు. జూనియర్ విభాగంలో ఆరు రౌండ్లు ముగిసేసరికి ఓజస్ 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, ఏ. రఘురామన్, సాయి భార్గవ్ చెరో 5 పాయింట్లతో రెండో స్థానం కోసం పోటీపడ్డారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా రఘురామన్ రెండోస్థానాన్ని, సాయి భార్గవ్ మూడో స్థానాన్ని సాధించారు. ఓపెన్ కేటగిరీలో త్రిష, పి. షణ్ముఖ తేజ చెరో 5.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరుతో త్రిష విజేతగా నిలిచింది. షణ్ముఖ తేజ రెండో స్థానంతో సరిపెట్టుకోగా, దిగ్విజయ్ సునీల్ (5) మూడో స్థానాన్ని సాధించాడు. ఆదివారం జరిగిన జూనియర్స్ చివరి రౌండ్ మ్యాచ్‌ల్లో ఓజస్ (6) సాయి భార్గవ్ (5)పై, అశ్మితా రెడ్డి (5) నిఖిలేశ్ (4)పై, నిగమశ్రీ (5) సంతోష్ కుమార్ (4)పై, రఘురామన్ (5) శ్రీనందమ్ (4)పై, స్నేహ (5) హిమేశ్ (4)పై నెగ్గారు. సీనియర్స్ విభాగంలో త్రిష (5.5) తరుణ్ (4.5)పై, షణ్ముఖ తేజ (5.5) దీప్తాంశ్ (4.5)పై, విశ్వనాథ్ (5) రాజు (4)పై, సత్యనారాయణ (5), రామ్ (4)పై, దిగ్విజయ్ (5) ఫణి కనూరి (4)పై విజయం సాధించారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా చెస్ సంఘం కార్యదర్శి కె. కన్నారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఇతర వయో విభాగాల విజేతల వివరాలు అండర్–14 బాలురు: 1. బి. సాకేత్, 2. మెహుల్ పండూగ్; బాలికలు: 1. ఎన్.స్నేహ. అండర్–12 బాలురు: 1. శ్రీహిత్ రెడ్డి, 2. మహిజిత్; బాలికలు: అశ్మితా రెడ్డి, 2.శ్రీ హర్షిత. అండర్–10 బాలురు: 1. ఆర్యన్ రఘురామ్, 2. సాయి భార్గవ్; బాలికలు: 1. నిగమశ్రీ, 2. భవిష్య. అండర్–8 బాలురు: 1. పార్థ్ గుప్తా, 2. సంతోష్ కుమార్; బాలికలు: 1. శ్రాగ్వి, 2. జస్మిత. అండర్–6 బాలురు: 1. కె. సూర్య, 2. పవన్ కుమార్; బాలికలు: 1. సస్య.