Archery World Cup: India Jyothi Ojas Win Gold In Compound Mixed Team - Sakshi
Sakshi News home page

Jyothi Surekha Vennam: శెభాష్‌ జ్యోతి సురేఖ- ప్రవీణ్‌.. భారత్‌ ఖాతాలో స్వర్ణం

Published Sat, Apr 22 2023 3:50 PM | Last Updated on Sat, Apr 22 2023 4:12 PM

Archery World Cup: India Jyothi Ojas Win Gold In Compound Mixed Team - Sakshi

జ్యోతి సురేఖ- ప్రవీణ్‌ (PC: Twitter)

Archery World Cup: ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఖాతాలో మరో పసిడి పతకం చేరింది. ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–1 టోర్నీలో కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ- మహారాష్ట్ర ప్లేయర్‌ ఓజస్‌ ప్రవీణ్‌ దేవ్‌తలె జోడీ భారత్‌కు స్వర్ణం అందించారు. తుర్కియేలోని అంటాల్యా వేదికగా శనివారం జరిగిన ఫైనల్లో భారత జోడీ- చైనీస్‌ తైపీ ద్వయంతో తలపడింది.

ఈ క్రమంలో 159- 154తో ప్రత్యర్థిపై గెలుపొంది సురేఖ- ప్రవీణ్‌ భారత్‌ ఖాతాలో గోల్డ్‌ మెడల్‌ చేర్చారు. కాగా జ్యోతి సురేఖకు మెగా ఈవెంట్‌లో ఇది రెండో స్వర్ణ పతకం. పారిస్‌లో 2022లో జరిగిన వరల్డ్‌కప్‌-3లో జ్యోతి సురేఖ- అభిషేక్‌ వర్మతో కలిసి విజేతగా నిలిచారు. తాజాగా ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–1 టోర్నీ ఫైనల్లో ప్రవీణ్‌తో కలిసి చెన్‌ యి సువాన్‌–చెన్‌ చియె లున్ జోడీని ఓడించి తన ఖాతాలో మరో పసిడి పతకం జమచేసుకున్నారు.

చదవండి: WC 2011: నాడు కోహ్లికి నేను ఏం చెప్పానంటే: సచిన్‌ టెండుల్కర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement