Vennam Jyothi Surekha
-
నాలుగో ర్యాంక్‌లో జ్యోతి సురేఖ..
ఆర్చరీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ నాలుగో స్థానంలో నిలిచింది.గత ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్‌లో ఉన్న జ్యోతి సురేఖ కొరియాలో జరిగిన ప్రపంచకప్ స్టేజ్–2 టోరీ్నలో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోవడంతో ఆమె ర్యాంక్‌లో మార్పు వచ్చింది. భారత్‌కే చెందిన అదితి 10వ ర్యాంక్‌లో, పరీ్ణత్ కౌర్ 12వ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. టీమ్ విభాగంలో సురేఖ, అదితి, పరీ్ణత్ బృందం నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. -
జ్యోతి సురేఖకు నిరాశ.. క్వార్టర్ ఫైనల్లో ఓటమి
యెచోన్ (దక్షిణ కొరియా): ప్రపంచకప్ ఆర్చరీ టోర్నీ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లకు నిరాశ ఎదురైంది. భారత స్టార్స్, ప్రపంచ రెండో ర్యాంకర్ వెన్నం జ్యోతి సురేఖ, ప్రపంచ 12వ ర్యాంకర్ పర్ణీత్ కౌర్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరగ్గా... ప్రపంచ చాంపియన్ అదితి రెండో రౌండ్ లో, అవనీత్ కౌర్ రెండో రౌండ్లో నిష్క్రమించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో జ్యోతి సురేఖ 142–145తో ప్రపంచ మూడో ర్యాంకర్ సారా లోపెజ్ (కొలంబియా) చేతిలో... పర్ణీత్ 138–145తో హాన్ సెంగ్యోన్ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి చవిచూశారు. అదితి 142–145తో అలెక్సిస్ రూయిజ్ (అమెరికా) చేతిలో, అవనీత్ 143–145తో ఒ యుహూన్ (కొరియా) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ప్రథమేశ్ సెమీఫైనల్లోకి ప్రవేశించగా... ప్రియాంశ్ మూడో రౌండ్లో, అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్ రెండో రౌండ్లో ఓడిపోయారు. సెమీస్‌లో యూకీ–ఒలివెట్టి జోడీ పారిస్: ఓపెన్ పార్క్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 7–6 (7/4)తో సాండర్ అరెండ్స్–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంటను ఓడించింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ, ఒలివెట్టి జోడీ పది ఏస్‌లు సంధించింది. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. నేడు జరిగే సెమీఫైనల్లో సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–వాసెలిన్ (ఫ్రాన్స్)లతో యూకీ, ఒలివెట్టి తలపడతారు. -
జ్యోతి సురేఖకు రజతం
తావోయువాన్ సిటీ (చైనీస్ తైపీ): వరల్డ్ ఇండోర్ ఆర్చరీ సిరీస్‌లో భాగంగా జరిగిన తైపీ ఓపెన్ టోర్నీలో మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు స్వర్ణ, రజత పతకాలు లభించాయి. ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ రజత పతకం సాధించింది. అదే విధంగా.. భారత్‌కే చెందిన పర్ణీత్ కౌర్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. కాగా ఫైనల్లో జ్యోతి సురేఖ 145–146తో పర్ణీత్ కౌర్ చేతిలో ఓడిపోయింది. ఇక పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్ ప్రథమేశ్ స్వర్ణ పతకం నెగ్గాడు. ఫైనల్లో ప్రథమేశ్ 149–148తో మైక్ ష్లాసెర్ (నెదర్లాండ్స్)ను ఓడించాడు. -
క్వాలిఫయింగ్‌లో జ్యోతి సురేఖ ‘టాప్’
Asian Games 2023- Archery: ఆసియా క్రీడల ఆర్చరీ క్వాలిఫయింగ్ రౌండ్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల కాంపౌండ్ క్వాలిఫయింగ్‌లో విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ 704 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. భారత్‌కే చెందిన ప్రపంచ చాంపియన్ అదితి స్వామి 696 పాయింట్లతో నాలుగోర్యాంక్ను దక్కించుకుంది. టీమ్ విభాగంలోనూ భారత్‌కు టాప్ ర్యాంక్ దక్కింది. టీమిండియా 2087 పాయింట్లు స్కోరు చేసి నేరుగా క్వార్టర్ ఫైనల్లో పోటీపడనుంది. ధీరజ్‌కు ఆరో ర్యాంకు పురుషుల కాంపౌండ్ క్వాలిఫయింగ్‌లో ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలే 709 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో, అభిషేక్ వర్మ 708 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో నిలిచారు. పురుషుల రికర్వ్ క్వాలిఫయింగ్‌లో అతాను దాస్ 678 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్ 675 పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో నిలిచారు. మహిళల రికర్వ్ క్వాలిఫయింగ్‌లో అంకిత 649 పాయింట్లతో పదో ర్యాంక్‌లో, భజన్ కౌర్ 640 పాయింట్లతో 14వ ర్యాంక్‌లో నిలిచారు. -
బంగారు బాణం.. మన జ్యోతి సురేఖ! ఎన్నో ప్రపంచరికార్డులు
ఒకవైపు బెర్లిన్ , బర్మింగ్‌హామ్, పారిస్... మరో వైపు మెక్సికో, అంటాల్యా, సాల్ట్‌లేక్ సిటీ... ఇంకోవైపు గ్వాంగ్జూ, బ్యాంకాక్, ఢాకా, టెహ్రాన్ , షాంఘై... నగరం పేరు మారితేనేమి...ఫలితం మాత్రం అదే! వేదికతో, ప్రత్యర్థులతో పని లేదు. ఒక్కసారి గురి పెడితే ఆ బాణం కచ్చితంగా లక్ష్యం చేరాల్సిందే! దాదాపు దశాబ్ద కాలంగా భారత ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ చేస్తోంది అదే! వరుస విజయాలతో తనకంటూ ఎలాంటి పోటీ లేకుండా ఎదురు లేకుండా సాగిపోతోంది ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి. ఎక్కడ బరిలోకి దిగినా తనదైన రీతిలో సత్తా చాటి పతకం ఖాయం చేసుకోవడం సురేఖకు అలవాటుగా మారిపోయింది. ప్రపంచ చాంపియన్ షిప్ అయినా ప్రపంచ కప్ అయినా సురేఖ సాగిస్తున్న విజయయాత్ర భారత ఆర్చరీలో అనితర సాధ్యం. ఏకంగా 48 అంతర్జాతీయ పతకాలు ఆమె ఖాతాలో ఉండటం విశేషం. తాజాగా భారత జట్టు ప్రపంచ వేదికపై తొలి స్వర్ణంతో మెరవడంలోనూ సురేఖదే కీలక పాత్ర. మినీ నేషనల్ ఆర్చరీ చాంపియన్ షిప్, 2008... విజయవాడలో జరిగిన ఈ పోటీల్లో జ్యోతి సురేఖ కెరీర్లో తొలిసారి ఒక పతకం గెలుచుకుంది. ఈ టోర్నీలో మొత్తం ఐదు స్వర్ణాలతో మొదలైన ప్రస్థానం ప్రపంచ చాంపియన్ షిప్లో ఎనిమిది పతకాలు సాధించే వరకు, ప్రపంచ రికార్డులు నెలకొల్పే వరకు సాగుతోంది. అంతకు ఏడాది క్రితమే ఆమె మొదటిసారి ఆర్చరీ ఆటలోకి అడుగు పెట్టింది. అప్పటి వరకు ఆమెను మరో ఆటలో తీర్చిదిద్దాలని తండ్రి సురేంద్ర కుమార్, తల్లి శ్రీదుర్గ అనుకున్నారు. అందుకే మూడేళ్ల వయసులో స్విమ్మింగ్ వైపు సురేఖను తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఐదేళ్ల వయసు కూడా రాక ముందే సురేఖ ఐదు కిలోమీటర్ల పాటు కృష్ణా నదిని ఈది అరుదైన ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. దాంతో స్విమ్మర్‌గా ఆమె కెరీర్ మొదలైనట్లు అనిపించింది. అయితే కొంత కాలం తర్వాత స్విమ్మింగ్ ఈవెంట్లలో పోటీ పడే పరిస్థితికి వచ్చేసరికి అంతా మారిపోయింది. ఆమె బలహీనమైన కాళ్లు స్విమ్మింగ్‌లాంటి క్రీడాంశానికి సరిపోవని అక్కడి కోచ్‌లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్రెడ్డి చేతులమీదగా సత్కారం అందుకుంటున్న సురేఖ(2019) క్రీడలంటే ఎంతో ఆసక్తి ఉన్న సురేంద్ర ఎలాగైనా తన కూతురిని క్రీడల్లో మేటిని చేద్దామనే లక్ష్యంతో ఉన్నాడు. దాంతో ప్రత్యామ్నాయం గురించి ఆయన ఆలోచించాడు. టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి రాకెట్ స్పోర్ట్ విషయంలో కూడా మున్ముందు ఇదే సమస్య ఎదురు కావచ్చని అనిపించింది. దాంతో అన్ని విధాలుగా ఆలోచించి సురేఖను ఆర్చరీ వైపు నడిపించాడు. అయితే ఆ నిర్ణయం ఎంత సరైనదో తర్వాత ఆయనకూ తెలిసింది. 11 ఏళ్ల వయసులో ఆర్చరీ విల్లును చేతిలో పెట్టినప్పుడు సురేఖ ఇంత దూరం వెళుతుందని, ఇన్ని ఘనతలు సాధిస్తుందని సురేంద్ర ఊహించలేదు. కోచ్‌ల మార్గనిర్దేశనంలో... విజయవాడలోనే మాజీ ఆటగాడు జె.రామారావు వద్ద సురేఖ ఆర్చరీలో ఓనమాలు నేర్చుకుంది. నాలుగేళ్ల పాటు కోచ్‌గా ఆయనే పూర్తి స్థాయి శిక్షణనివ్వడంతో సురేఖ ఆట మెరుగైంది. ఈ క్రమంలో 2011లో సురేఖ అరుదైన ఘనతను సాధించింది. జాతీయ స్థాయి పోటీల్లో విశేషంగా రాణిస్తూ 15 ఏళ్ల వయసులో సీనియర్ చాంపియన గా అవతరించింది. అదే ఏడాది సబ్ జూనియర్, జూనియర్ నేషనల్స్‌లో విజేత అయిన ఆమె మూడు వయో విభాగాల్లోనూ ఒకే ఏడాది చాంపియ¯Œ గా నిలిచిన తొలి ఆర్చర్‌గా నిలిచింది. ఈ దశలో సురేఖ మరింత ముందుకు వెళ్లాలంటే ఆమెకు అత్యుత్తమ స్థాయి శిక్షణ అవసరమని కోచ్ సూచించారు. దాంతో రెండేళ్ల పాటు సొంత ఖర్చులతో తండ్రి ఆమెను అమెరికా పంపించి కోచింగ్ ఇప్పించాడు. ఈ శిక్షణతో ఆమె ఆట ఎంతో మెరుగైంది. స్వదేశం తిరిగొచ్చాక దాని ఫలితం బాగా కనిపించింది. 2014లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా ఆర్చరీ గ్రాండ్ ప్రీ టోర్నీలో మిక్స్డ్, వ్యక్తిగత విభాగాల్లో ఒక్కో స్వర్ణం సాధించి సురేఖ అందరి దృష్టిలో నిలిచింది. ఈ రెండు స్వర్ణాలు ఆమె కెరీర్‌కు బంగారు బాట వేశాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) జాతీయ క్యాంప్‌లో భారత చీఫ్ కోచ్ జీవ¯Œ జోత్ సింగ్ శిక్షణతో ఆమె కెరీర్ మరో మలుపు తిరిగింది. ఆయన కోచింగ్, మార్గనిర్దేశనం సురేఖను వరుస విజయాల వైపు నడిపించాయి. 2015 ఆసియా కప్‌లో సురేఖ ఖాతాలో తొలి వ్యక్తిగత అంతర్జాతీయ స్వర్ణం చేరింది. ఆ తర్వాత ఆమె ఎదురు లేకుండా సాగిపోయింది. సీనియర్ విభాగంలో 2014నుంచి 2023 వరకు ప్రతి ఏటా ఆమె పతకాలు గెలుస్తూనే రావడం విశేషం. గెలుపే లక్ష్యంగా... వ్యక్తిగత, మిక్స్డ్, టీమ్ విభాగాల్లో కలిపి సురేఖ ఇప్పటి వరకు 48 అంతర్జాతీయ పతకాలు గెలుచుకోగా, వాటిలో 16 స్వర్ణాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో కూడా ఆమె 62 పతకాలు అందుకుంది. ఇటీవల బెర్లిన్‌లో జరిగిన పోటీల్లో ఒక స్వర్ణం, ఒక కాంస్యం కూడా సాధించడంలో ఓవరాల్‌గా వరల్డ్ ఆర్చరీ చాంపియన్ షిప్లో ఆమె పతకాల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఏ రకంగా చూసినా ఈ ఘనత అసాధారణం. భారత ఆర్చరీ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో వరుసగా మూడు వరల్డ్ చాంపియన్ షిప్‌లలో పతకాలు గెలుచుకోవడం ఆమె ఘనతను చూపిస్తోంది. అయితే సురేఖ పాల్గొనే కాంపౌండ్ ఈవెంట్ ఒలింపిక్స్‌లో క్రీడాంశం కాకపోవడం వల్ల ఆమె సాధించిన విజయాలకు తగినంత గుర్తింపు దక్కలేదు. ఒలింపిక్స్‌లో రికర్వ్ ఈవెంట్ మాత్రమే ఉండటంతో ఆమెకు ఒలింపిక్స్‌లో పోటీ పడే అవకాశమే దక్కలేదు. అయితే ఇదేమీ ఆమె స్థాయిని తగ్గించదు. కెరీర్లో వేగంగా ఎదుగుతున్న సమయంలో ఈవెంట్ మారే అవకాశం రాకపోగా, తర్వాతి ఒలింపిక్స్‌లో కాంపౌండ్‌ను చేరుస్తారంటూ వచ్చిన వార్తలతో పూర్తిగా తన ఆటపైనే సురేఖ దృష్టి పెట్టింది. ఎక్కడ పోటీ పడినా గురి చూసి బాణాలు సంధించడం, పతకం సాధించడమే లక్ష్యంగా శ్రమించింది. సుదీర్ఘ కాలంగా సురేఖ భారత మహిళల ఆర్చరీకి ముఖచిత్రంగా మారింది. కఠోర శ్రమ, పట్టుదలతో పాటు మానసిక దృఢత్వం సురేఖను పదునైన ఆర్చర్‌గా మార్చాయి. ఇన్ని విజయాల తర్వాత కూడా నిర్విరామంగా సాధన చేస్తూ పోటీ పడుతున్న సురేఖ మున్ముందు మరిన్ని పతకాలు గెలుచుకోవడం ఖాయం. 713/720... పెద్ద సంఖ్యలో పతకాలు గెలుచుకోవడమే కాదు జ్యోతి సురేఖ పేరిట ప్రపంచ రికార్డు కూడా ఉంది. మహిళల కాంపౌండ్‌లో అత్యధిక పాయింట్లు స్కోరును ఆమె నమోదు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో తుర్కియేలోని అంటాల్యాలో జరిగిన వరల్డ్ కప్‌లో సురేఖ మొత్తం 720 పాయింట్లకుగాను 713 పాయింట్లు సాధించింది. 2015లో కొలంబియా ఆర్చర్ సారా లోపెజ్ సాధించిన వరల్డ్ రికార్డును ఆమె సమం చేసింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 709 పాయింట్లతో ఉన్న ఆసియా రికార్డును కూడా ఆమె బద్దలు కొట్టింది. ఆటలో ఘనతలు సాధిస్తూనే చదువులోనూ మేటిగా ఉన్న సురేఖ బీటెక్ (కంప్యూటర్స్), ఎంబీఏ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో పని చేస్తోంది. మొహమ్మద్ అబ్దుల్ హాది -
ఫైనల్లో జ్యోతి సురేఖ బృందం.. విజయవాడ అమ్మాయికి ఆరో పతకం ఖరారు
బెర్లిన్ (జర్మనీ): ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్ మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో వెన్నం జ్యోతి సురేఖ, అదితి, పరిణీత్ కౌర్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన టీమ్ ఈవెంట్లో రెండో సీడ్‌గా నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన భారత జట్టు 230–228తో తుర్కియే జట్టుపై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరింది. క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 228–226తో చైనీస్ తైపీపై, సెమీఫైనల్లో 220–216తో కొలంబియాపై నెగ్గి ఫైనల్లోకి అడుగు పెట్టింది. శుక్రవారం జరిగే ఫైనల్లో మెక్సికోతో భారత్ ఆడుతుంది. తాజా ప్రదర్శనతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి సురేఖకు ఈ మెగా ఈవెంట్ చరిత్రలో ఆరో పతకం ఖరారైంది. -
రెండో సీడ్‌గా జ్యోతి సురేఖ, ధీరజ్
World Archery Championship Qualifications- బెర్లిన్ (జర్మనీ): ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, బొమ్మదేవర ధీరజ్ మెరిశారు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ ర్యాంకింగ్ రౌండ్లో మహిళల కాంపౌండ్ విభాగంలో జ్యోతి సురేఖ 701 పాయింట్లు... పురుషుల రికర్వ్ విభాగంలో ధీరజ్ 683 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచారు. ఫలితంగా నాకౌట్ దశలో రెండో సీడింగ్ పొందిన జ్యోతి సురేఖ, ధీరజ్లకు నేరుగా మూడో రౌండ్‌కు ‘బై’ లభించింది. ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి జోడీ సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీ తొలి రౌండ్లో... సిక్కి రెడ్డి–ఆరతి సారా సునీల్ జంట క్వాలిఫయింగ్‌లో నిష్క్రమించాయి. తొలి రౌండ్ మ్యాచ్‌లో గాయత్రి–ట్రెసా జాలీ 21–16, 21–17తో కేథరీన్ చోయ్–జోసెఫిన్ వు (కెనడా)లపై గెలిచారు. అశి్వని–తనీషా 11–21, 21–14, 17–21తో ఫెబ్రియానా కుసుమ–అమాలియా ప్రతవి (ఇండోనేసియా) చేతిలో... సిక్కి రెడ్డి–ఆరతి 14–21, 17–21తో సు యిన్ హుయ్–లీ చి చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు. -
World Cup Archery: సురేఖ జోడీకి స్వర్ణం
World Cup Archery- షాంఘై: వరల్డ్ కప్ ఆర్చరీ స్టేజ్–2 (కాంపౌండ్ విభాగం)లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ సత్తా చాటింది. మిక్స్డ్ డబుల్స్‌లో ఆమె స్వర్ణపతకాన్ని సొంతం చేసుకుంది. సురేఖ– ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలే జోడి ఫైనల్లో 156–155 స్కోరు తేడాతో కొరియా జంట కిమ్ జోంగో–ఓహ్యూహ్యూన్ను ఓడించింది. తొలి మూడు ఎండ్లలో ఇరు జట్లు సమంగా పోటీ పడుతూ వరుసగా 39, 39, 39 చొప్పున పాయింట్లు సాధించడంతో స్కోరు 117–117తో సమంగా నిలిచింది. చివరి ఎండ్‌లో భారత ద్వయం 39 పాయింట్లు నమోదు చేయగా...కొరియా 38కే పరిమితమైంది. దాంతో సురేఖ–ఓజస్లకు పసిడి దక్కింది. పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో భారత ఆర్చర్ ప్రథమేశ్ జౌకర్ సంచలనం సృష్టించాడు. ఫైనల్లో ప్రథమేశ్ 149–148తో నెదర్లాండ్స్‌కు చెందిన వరల్డ్ నంబర్‌వన్ మైక్ స్కోసర్పై విజయం సాధించాడు. 19 ఏళ్ల ప్రథమేశ్ కెరీర్లో ఇది రెండో అంతర్జాతీయ టోర్నీ మాత్రమే. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు చెందిన అవనీత్ కౌర్ కాంస్యం గెలుచుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో అవనీత్ 147–144తో ఐపెక్ తోమ్రుక్ (తుర్కియే)ను ఓడించింది. -
ప్రపంచకప్ ఫైనల్స్ టోర్నీకి ఆంధ్రప్రదేశ్ ఆణిముత్యం అర్హత
ఆర్చరీ సీజన్ ముగింపు టోర్నీ ప్రపంచకప్ ఫైనల్స్‌కు భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో మెక్సికోలో జరుగుతుంది. తుర్కియేలో గతవారం జరిగిన ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో, మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించింది. ఈ ప్రదర్శనతో సురేఖకు మరో మూడు ప్రపంచకప్‌లు మిగిలి ఉండగానే ఫైనల్స్‌కు బెర్త్ దక్కింది. ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీ కొలంబియాలో జూన్ 13 నుంచి 18 వరకు జరుగుతుంది. -
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి.. ఏకంగా 7 స్థానాలు ఎగబాకి..!
ప్రపంచకప్‌లో రెండు స్వర్ణాలు సాధించి సత్తాచాటిన ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ వ్యక్తిగత విభాగంలో మరో మైలురాయిని అందుకుంది. మంగళవారం ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సురేఖ 4వ స్థానానికి (కాంపౌండ్) చేరుకుంది. ఇప్పటి వరకు 11వ ర్యాంక్‌లో ఉన్న ఆమె తాజా ప్రదర్శనతో ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకటం విశేషం. -
పసిడి పోరుకు జ్యోతి సురేఖ జోడీ
అంటాల్యా (తుర్కియే): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీలో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు పతకం ఖరారైంది. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, మహారాష్ట్ర ప్లేయర్ ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలె ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన సురేఖ–ఓజస్ రెండో రౌండ్లో 159–157తో మరియా–గైల్స్ (లక్సెంబర్గ్)లపై... క్వార్టర్ ఫైనల్లో 159–156తో సోఫీ–అడ్రియన్ గోంటీర్ (ఫ్రాన్స్)లపై... సెమీఫైనల్లో 157–155తో ఫాతిన్ నూర్‌ఫతే–జువైది (మలేసియా)లపై గెలిచారు. నేడు జరిగే ఫైనల్లో చెన్ యి సువాన్–చెన్ చియె లున్ (చైనీస్ తైపీ)లతో జ్యోతి సురేఖ–ఓజస్ తలపడతారు. రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మాత్రం అతాను దాస్–భజన్ కౌర్ (భారత్) ద్వయం తొలి రౌండ్లో 3–5తో డెన్మార్క్ జోడీ చేతిలో ఓడిపోయింది. ధీరజ్ అద్భుతం... పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ధీరజ్ బొమ్మదేవర అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. తొలి రౌండ్లో ధీరజ్ 6–0తో థియో కార్బొనెటి (బెల్జియం)పై, రెండో రౌండ్లో 6–4తో కెజియా చాబిన్ (స్విట్జర్లాండ్)పై, మూడో రౌండ్లో 6–4తో జిగా రావ్నికర్ (స్లొవేనియా)పై, నాలుగో రౌండ్లో 6–5తో అమెరికా దిగ్గజం బ్రాడీ ఇలిసన్పై, క్వార్టర్ ఫైనల్లో 6–4తో తరుణ్‌దీప్ రాయ్ (భారత్)పై గెలుపొందాడు. ప్రపంచ మాజీ చాంపియన్, మూడు ఒలింపిక్ పతకాలు నెగ్గిన ఇలిసన్తో జరిగిన మ్యాచ్‌లో ధీరజ్ ‘షూట్ ఆఫ్’లో గెలిచాడు. ఇద్దరూ 10 పాయింట్లు స్కోరు చేసినా ధీరజ్ కొట్టిన బాణం 10 పాయింట్ల లక్ష్యబిందువుకు అతి సమీపంలో ఉండటంతో విజయం ఖరారు చేసుకున్నాడు. ఆధిక్యంలో అర్జున్ సాటీ జుల్డిజ్ ఓపెన్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీలో ఎనిమిది రౌండ్ల తర్వాత తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఏడు పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన నాలుగు గేముల్లో మూడింట గెలిచిన అర్జున్, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. వఖిదోవ్ (ఉజ్బెకిస్తాన్), బిబిసారా (కజకిస్తాన్), బోరిస్ గెల్ఫాండ్ (ఇజ్రాయెల్)లపై నెగ్గిన అర్జున్ జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమెర్‌తో జరిగిన గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు. 12 మంది అగ్రశ్రేణి ప్లేయర్ల మధ్య 11 రౌండ్లపాటు ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. నేడు చివరి మూడు రౌండ్లు జరుగుతాయి. -
Archery World Cup Stage 1: భారత జట్లకు నిరాశ
అంటాల్యా (తుర్కియే): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీలో కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత మహిళల, పురుషుల జట్లకు నిరాశ ఎదురైంది. మహిళల టీమ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, అదితి, అవ్నీత్ కౌర్‌లతో కూడిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. క్వాలిఫయింగ్‌లో టాప్ ర్యాంక్‌లో నిలిచిన భారత జట్టుకు నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడే అవకాశం లభించింది. మాడిసన్ కాక్స్, డానిలె లుట్జ్, కాసిడి కాక్స్లతో కూడిన అమెరికా జట్టు 233–225 పాయింట్ల తేడాతో భారత జట్టును ఓడించింది. ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలె, రజత్ చౌహాన్, ప్రథమేశ్ సమాధాన్ జావ్కర్లతో కూడిన భారత పురుషుల కాంపౌండ్ జట్టు రెండో రౌండ్లో 234–236 పాయింట్ల తేడాతో చైనీస్ తైపీ జట్టు చేతిలో ఓడిపోయింది. -
Antalya:ఆర్చరీ వరల్డ్‌కప్ స్టేజ్–1 టోర్నీ బరిలో సురేఖ
కొన్నేళ్లుగా ఆర్చరీ ప్రపంచకప్ టోర్నీలలో నిలకడగా పతకాలు సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ వెన్నం జ్యోతి సురేఖ మరో కొత్త సీజన్‌కు సిద్ధమైంది. అంటాల్యాలో నేటి నుంచి వరల్డ్‌కప్ స్టేజ్–1 టోర్నీ జరగనుంది. జ్యోతి సురేఖతోపాటు అవ్నీత్ కౌర్, అదితి స్వామి, సాక్షి చౌదరీ మహిళల కాంపౌండ్ టీమ్, వ్యక్తిగత విభాగాల్లో బరిలోకి దిగుతారు. 52 దేశాల నుంచి 394 మంది ఆర్చర్లు రికర్వ్, కాంపౌండ్ ఈవెంట్స్‌లో ఈ టోర్నీలో ఆడనున్నారు. -
Archery: మెరిసిన సురేఖ, ధీరజ్.. టాప్‌లో నిలిచి.. సత్తా చాటి..
కోల్‌కతా: ఈ ఏడాది జరిగే ప్రపంచకప్ టోర్నీలు, ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత ఆర్చరీ జట్లను ఎంపిక చేసేందుకు నిర్వహించిన ఓపెన్ సెలెక్షన్ ట్రయల్స్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు బొమ్మదేవర ధీరజ్, వెన్నం జ్యోతి సురేఖ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. మంగళవారం ముగిసిన ఈ ట్రయల్స్‌లో పురుషుల రికర్వ్ విభాగంలో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ) జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ధీరజ్ ఓవరాల్‌గా 2767 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. పార్థ్ సాలుంకే (మహారాష్ట్ర), జయంత తాలుక్దార్ (జార్ఖండ్), అతాను దాస్ (పీఎస్‌పీబీ), సుఖ్‌చెయిన్ సింగ్ (సర్వీసెస్), తరుణ్‌దీప్ రాయ్ (సర్వీసెస్), సుఖ్మణి (మహారాష్ట్ర), నీరజ్ చౌహాన్ వరుసగా రెండు నుంచి ఎనిమిది ర్యాంక్‌ల్లో నిలిచారు. తద్వారా ఈ ఏడాది జరిగే అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనే భారత జట్టులో చోటు సంపాదించేందుకు అర్హత పొందారు. మరోవైపు మహిళల కాంపౌండ్ విభాగంలో జ్యోతి సురేఖ ఓవరాల్‌గా 2828 పాయింట్లు సాధించి టాప్ ర్యాంక్‌లో నిలిచింది. సురేఖతోపాటు పర్ణీత్ కౌర్, అదితి, ప్రగతి, సాక్షి చౌదరీ, ముస్కాన్, ఐశ్వర్య శర్మ, సృష్టి సింగ్ కూడా ఈ ఏడాది జరిగే మెగా ఈవెంట్స్‌లో పాల్గొనే టీమిండియా సెలెక్షన్స్‌కు అర్హత పొందారు. మహిళల రికర్వ్ విభాగం ట్రయల్స్‌లో ‘ట్రిపుల్ ఒలింపియన్’ దీపిక కుమారి ఏడో ర్యాంక్‌లో నిలిచి భారత జట్టులో పునరాగమనం చేయడానికి అర్హత సాధించింది. చదవండి: IND vs NZ 1st ODI: టీమిండియాతో తొలి వన్డే.. న్యూజిలాండ్‌కు బిగ్ షాక్ WTC- Ind Vs Aus: పిచ్‌లు అలా ఉంటే టీమిండియాదే సిరీస్.. కనీసం ఈసారైనా.. -
Archery World Cup: సురేఖ డబుల్ ధమాకా
పారిస్: పునరాగమనంలో భారత స్టార్ ఆర్చర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ చిరస్మరణీయ ప్రదర్శనతో అదరగొట్టింది. పారిస్‌లో శనివారం జరిగిన ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నీలో విజయవాడకు చెందిన 25 ఏళ్ల జ్యోతి సురేఖ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకం, వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించింది. ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ జంట భారత్‌కు తొలిసారి స్వర్ణ పతకాన్ని అందించింది. ఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ ద్వయం 152–149 పాయింట్ల తేడాతో (40–37, 36–38, 39–39, 37–35) సోఫీ డోడెమోంట్–జీన్ ఫిలిప్ (ఫ్రాన్స్) జోడీపై విజయం సాధించింది. ఒక్కో జంట నాలుగు బాణాల చొప్పున నాలుగుసార్లు లక్ష్యంపై గురి పెట్టాయి. తొలి సిరీస్‌లో భారత జోడీ పైచేయి సాధించగా, రెండో సిరీస్‌లో ఫ్రాన్స్ జంట ఆధిక్యంలో నిలిచింది. మూడో సిరీస్‌లో రెండు జోడీలు సమంగా నిలువగా... నాలుగో సిరీస్‌లో మళ్లీ భారత జంట ఆధి క్యం సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. మిక్స్డ్ టీమ్ ఫైనల్ అనంతరం జరిగిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలోనూ విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ రాణించింది. ముందుగా సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సురేఖ 147–145తో సోఫీ డోడెమోంట్ (ఫ్రాన్స్)ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఎల్లా గిబ్సన్ (బ్రిటన్)తో జరిగిన ఫైనల్లో సురేఖ ‘షూట్ ఆఫ్’లో త్రుటిలో స్వర్ణ పతకాన్ని కోల్పోయింది. నిర్ణీత 15 బాణాల తర్వాత ఇద్దరూ 148–148తో సమంగా నిలిచారు. అనంతరం విజేతను నిర్ణయించేందుకు ఇద్దరికీ చెరో షాట్ ఇవ్వగా... గిబ్సన్, జ్యోతి సురేఖ ఇద్దరూ 10 పాయింట్లు స్కోరు చేశారు. అయితే గిబ్సన్ బాణం 10 పాయింట్ల వృత్తం లోపల ఉండగా... సురేఖ వృత్తం అంచున తగిలింది. దాంతో గిబ్సన్‌కు స్వర్ణం, సురేఖకు రజతం లభించాయి. -
జ్యోతి సురేఖకు గ్రూప్-1 డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం: ఏపీ కేబినెట్ ఆమోదం
మహిళా స్టార్ ఆర్చర్, అర్జున అవార్డు గ్రహీత, తెలుగు తేజం వెన్నం జ్యోతి సురేఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. ఆమెకు గ్రూప్-1 డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. కాగా విజయవాడకు చెందిన వెన్నం జ్యోతి సురేఖ ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక ఈవెంట్లలో స్వర్ణ, రజత పతకాలు గెలిచింది. అమెరికాలో జరిగిన ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో కాంపౌండ్ విభాగంలో మూడు రజత పతకాలు సాధించి సత్తా చాటింది. ఈ క్రమంలో ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో 5వ ర్యాంక్ సాధించింది. అదే విధంగా.. లాన్‌కాస్టర్ క్లాసిక్ అంతర్జాతీయ ఇండోర్ ఆర్చరీ టోర్నమెంట్లో పసిడి పతకం సొంతం చేసుకుంది. తద్వారా అంతర్జాతీయ ఇండోర్ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా జ్యోతి సురేఖ ఘనత సాధించింది. ఇలా ఎన్నెన్నో రికార్డులు సాధించి దేశ, రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేసిన ఆమెను సీఎం జగన్ ప్రభుత్వం ఉద్యోగంతో గౌరవించేందుకు సిద్ధమైంది. చదవండి: Commonwealth Games 2022: ‘కామన్వెల్త్’ జట్టులో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి -
ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన తెలుగమ్మాయి
ఆంధ్రప్రదేశ్ మహిళా స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో నిలిచింది. సోమవారం విడుదల చేసిన ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో విజయవాడకు చెందిన 25 ఏళ్ల జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్‌ను అందుకుంది. కాంపౌండ్ విభాగంలో ఓ భారత ఆర్చర్ మూడో ర్యాంక్‌లో నిలువడం ఇదే ప్రథమం. సురేఖ ఖాతాలో ప్రస్తుతం 188.45 పాయింట్లు ఉన్నాయి. -
విజేత జ్యోతి సురేఖ
సాక్షి, హైదరాబాద్: లాన్‌కాస్టర్ క్లాసిక్ అంతర్జాతీయ ఇండోర్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత స్టార్ ఆర్చర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా అంతర్జాతీయ ఇండోర్ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఆమె ఘనత సాధించింది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన ఈ టోర్నీలో జ్యోతి సురేఖ మహిళల ఓపెన్ ప్రొ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో పోటీపడింది. జాతీయ పోటీల్లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహించే సురేఖ ఫైనల్లో 131–129 పాయింట్ల తేడాతో పేజ్ పియర్స్ (అమెరికా)పై విజయం సాధించి చాంపియన్‌గా అవతరించింది. విజయవాడకు చెందిన సురేఖ క్వాలిఫికేషన్ రౌండ్లో 660 పాయింట్లకుగాను 653 పాయింట్లు స్కోరు చేసి రెండో ర్యాంక్‌లో నిలిచింది. -
Vennam Jyothi Surekha: ఆసియా ఆర్చరీ పోటీలకు జ్యోతి సురేఖ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మేటి ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ఆరోసారి ఆసియా సీనియర్ ఆర్చరీ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. ఈ మెగా టోర్నీ నవంబర్ 11 నుంచి 19 వరకు ఢాకాలో జరగనుంది. ఈ టోర్నీలో పాల్గొనే భారత మహిళల కాంపౌండ్ విభాగం జట్టును జంషెడ్ పూర్లో నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్ ఆధారంగా ఎంపిక చేశారు. ఈ ట్రయల్స్‌లో జ్యోతి సురేఖ ర్యాంకింగ్ రౌండ్లో 720 పాయింట్లకుగాను 709 పాయింట్లు స్కోరు చేసింది. రౌండ్ రాబిన్ ఈవెంట్లో ఏడు మ్యాచ్‌లు ఆడి ఆరింటిలో నెగ్గి టాప్ ర్యాంక్‌లో నిలిచింది. పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు తరఫున బరి లోకి దిగిన విజయవాడకు చెందిన జ్యోతి సురేఖకిది ఆరో ఆసియా చాంపియన్‌షిప్ కానుంది. గతంలో ఆమె ఐదుసార్లు ఈ ఈవెంట్లో పాల్గొని ఎనిమిది పతకాలను సాధించింది. చదవండి: Virat Kohli: కెప్టెన్‌గా ఇదే చివరిసారి.. అంపైర్‌తో కోహ్లి వాగ్వాదం -
Vennam Jyothi Surekha: 3 రజతాలతో మెరిసి.. కెరీర్ బెస్ట్ ర్యాంకులో
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో జరిగిన ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో కాంపౌండ్ విభాగంలో మూడు రజత పతకాలు సాధించిన భారత అగ్రశ్రేణి ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ మెరిసింది. సోమవారం విడుదల చేసిన ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి సురేఖ ఏకంగా ఎనిమిది స్థానాలు పురోగతి సాధించి కెరీర్ బెస్ట్ 5వ ర్యాంక్‌లో నిలిచింది. కాంపౌండ్ విభాగంలో ఇప్పటివరకు భారత ఆర్చర్ సాధించిన అత్యుత్తమ ర్యాంక్ ఇదే కావడం విశేషం. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ర్యాంకింగ్స్‌లో సురేఖ క్రితంసారి 13వ ర్యాంక్‌లో నిలిచింది. ఇక పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్ అభి షేక్ వర్మ మూడు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌ను అందుకున్నాడు. మరోవైపు రికర్వ్ విభాగం మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్స్‌లో దీపిక కుమారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను కోల్పోయింది. దక్షిణ కొరియాకు చెందిన ఆన్ సాన్ నాలుగు స్థానాలు ఎగబాకి కొత్త వరల్డ్ నంబర్‌వన్‌గా అవతరించింది. దీపిక రెండో ర్యాంక్‌కు పడిపోయింది. చదవండి: సానియా మీర్జా ఖాతాలో 43వ డబుల్స్ టైటిల్ -
రెండో పసిడి పతక వేటలో వెన్నం జ్యోతి సురేఖ
యాంక్టన్ (అమెరికా): ఇప్పటికే మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకం రేసులో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ రెండో పసిడి పతకం కోసం పోటీపడనుంది. ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్ కాంపౌండ్ మిక్స్డ్ విభాగంలో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (భారత్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ ద్వయం 159–156తో కిమ్ యున్హీ–కిమ్ జాంగ్‌హో (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సురేఖ 146–142తొ సో చేవన్ (దక్షిణ కొరియా) పై, మూడో రౌండ్లో 147–144తో ఇంగె వాన్ డెర్ వాన్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించింది. చదవండి: IPL 2021 2nd Phase MI Vs KKR: ముంబైపై 7 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం -
ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌నకు మన అమ్మాయి
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో అమెరికాలో జరిగే ప్రపంచ సీనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత కాంపౌండ్ జట్టులోకి ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఎంపికైంది. సెప్టెంబర్ 19 నుంచి 26 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్ల ఎంపిక కోసం పాటియాలాలో రెండు రోజులపాటు సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) తరఫున మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్లో బరిలోకి దిగిన సురేఖ 360 పాయింట్లకుగాను 357 పాయింట్లు స్కోరు చేసింది. ఈ క్రమంలో 356 పాయింట్లతో గతంలో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును ఆమె బద్దలు కొట్టింది. మహిళల విభాగంలో జ్యోతి సురేఖతోపాటు ముస్కాన్ కిరార్, ప్రియా గుర్జర్ జట్టులోకి ఎంపికయ్యారు. పురుషుల విభాగంలో అభిషేక్ వర్మ, సంగమ్‌ప్రీత్ సింగ్ బిస్లా, రిషభ్ యాదవ్ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. -
జ్యోతి సురేఖను అభినందించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి : భారత ఆర్చర్, అర్జున పురస్కార గ్రహీత వెన్నం జ్యోతి సురేఖను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. మంగళవారం జ్యోతి సురేఖ సచివాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా జ్యోతి సరేఖను సీఎం వైఎస్ జగన్ శాలువతో సత్కరించారు. జ్యోతి సురేఖ తాను సాధించిన పతకాలను సీఎం వైఎస్ జగన్‌కు చూపించారు. జ్యోతి సురేఖ వెంట మంత్రి పేర్ని నాని కూడా ఉన్నారు. కాగా, జ్యోతి సురేఖ ఆర్చరీలో కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నారు. ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో, ఈ ఏడాది జూన్‌లో జరిగిన 50వ ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆమె పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. -
మరో స్వర్ణంపై సురేఖ గురి
బ్యాంకాక్: మిక్స్డ్ టీమ్ విభాగంలో కనబరిచిన ప్రదర్శనను మహిళల టీమ్ విభాగంలోనూ పునరావృతం చేయడంతో... ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ రెండో స్వర్ణ పతకం రేసులో నిలిచింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అభిషేక్ వర్మతో కలిసి ఇప్పటికే ఫైనల్ చేరిన జ్యోతి సురేఖ... మంగళవారం జరిగిన మహిళల టీమ్ కాంపౌండ్ విభాగంలో ముస్కాన్ కిరార్, ప్రియా గుర్జర్లతో కలిసి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ)పై నిషేధం ఉండటంతో... ఈ టోర్నీలో భారత క్రీడాకారులు ప్రపంచ ఆర్చరీ పతాకం కింద పోటీపడుతున్నారు. మహిళల టీమ్ కాంపౌండ్ సెమీఫైనల్లో సురేఖ, ముస్కాన్, ప్రియ బృందం 229–221తో సయ్యదా, ఫార్సి, అరెజులతో కూడిన ఇరాన్ జట్టును ఓడించింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో 226–225తో కన్యవీ, కనోక్నాపుస్, నారెయుమోన్‌లతో కూడిన థాయ్‌లాండ్ జట్టుపై గెలిచింది. నేడు జరిగే టీమ్ ఫైనల్లో కొరియాతో భారత్ తలపడుతుంది. ఈ ఫైనల్ తర్వాత మిక్స్డ్ టీమ్ ఈవెంట్ తుది పోరులో సురేఖ–అభిõÙక్ వర్మ జంట చైనీస్ తైపీకి చెందిన యి సువాన్ చెన్–చియె లున్ చెన్ జోడీతో ఆడుతుంది. మూడు కాంస్యాలు... మంగళవారం భారత ఆర్చర్లు మూడు కాంస్య పతకాలు గెలిచారు. పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగం కాంస్య పతక పోరులో అతాను దాస్ 6–5తో జిన్ హాయెక్ ఓ (దక్షిణ కొరియా)పై గెలుపొందాడు. పురుషుల రికర్వ్ టీమ్ విభాగం కాంస్య పతక మ్యాచ్‌లో అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్, జయంత తాలుక్దార్లతో కూడిన భారత జట్టు 6–2తో చైనాను ఓడించింది. మహిళల రికర్వ్ టీమ్ విభాగంకాంస్య పతక మ్యాచ్‌లో దీపిక కుమారి, బొంబేలా దేవి, అంకితలతో కూడిన భారత జట్టు 5–1తో జపాన్‌పై గెలిచింది. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో అభిõÙక్ వర్మ, రజత్ చౌహాన్, మోహన్ భరద్వాజ్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో భారత్ 229–221తో ఇరాన్‌పై గెలిచి నేడు జరిగే ఫైనల్లో కొరియాతో పోరుకు సిద్ధమైంది. -
‘క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం’
సాక్షి, విజయవాడ: ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన జ్యోతి సురేఖ, ఆమె తండ్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆర్చరీ కోచ్ చెరుకూరి సత్యనారాయణ గురువారం ర్యాలీ నిర్వహించారు. స్ధానిక మొగల్రాజ్ పురం సిద్ధార్థ కాలేజీ నుంచి శాప్ కార్యాలయం వరకు తలపెట్టిన ర్యాలీలో 13 జిల్లాలకు చెందిన ఆర్చరీ అసోసియేషన్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ.. జ్యోతి సురేఖ, అమె తండ్రితో పది రోజుల్లో క్షమాపణ చెప్పిస్తామని శాప్ చైర్మన్ హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు క్షమాపణ చెప్పలేదన్నారు. వారిద్దరూ క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం చేస్తానని ఆయన తెలిపారు. తనను, తన కుటుంబాన్ని జ్యోతి సురేఖ అవమానించారని మండిపడ్డారు. గురుశిష్య సంబంధాలను సురేఖ గౌరవించాలని సూచించారు. జోత్యి సురేఖ ఏపీ తరపున ఆడడం లేదన్నారు. మరోవైపు ఆర్చరీ క్రీడాకారులకు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న నగదు, ఇళ్ల స్థలాలను వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.