వెన్నం జ్యోతి సురేఖ(ఫైల్ ఫొటో)
మహిళా స్టార్ ఆర్చర్, అర్జున అవార్డు గ్రహీత, తెలుగు తేజం వెన్నం జ్యోతి సురేఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. ఆమెకు గ్రూప్-1 డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది.
కాగా విజయవాడకు చెందిన వెన్నం జ్యోతి సురేఖ ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక ఈవెంట్లలో స్వర్ణ, రజత పతకాలు గెలిచింది. అమెరికాలో జరిగిన ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో కాంపౌండ్ విభాగంలో మూడు రజత పతకాలు సాధించి సత్తా చాటింది. ఈ క్రమంలో ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో 5వ ర్యాంక్ సాధించింది.
అదే విధంగా.. లాన్‌కాస్టర్ క్లాసిక్ అంతర్జాతీయ ఇండోర్ ఆర్చరీ టోర్నమెంట్‌లో పసిడి పతకం సొంతం చేసుకుంది. తద్వారా అంతర్జాతీయ ఇండోర్ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా జ్యోతి సురేఖ ఘనత సాధించింది. ఇలా ఎన్నెన్నో రికార్డులు సాధించి దేశ, రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేసిన ఆమెను సీఎం జగన్ ప్రభుత్వం ఉద్యోగంతో గౌరవించేందుకు సిద్ధమైంది.
చదవండి: Commonwealth Games 2022: ‘కామన్వెల్త్’ జట్టులో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి
Comments
Please login to add a commentAdd a comment