Archers
-
జ్యోతి సురేఖకు గ్రూప్-1 డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం: ఏపీ కేబినెట్ ఆమోదం
మహిళా స్టార్ ఆర్చర్, అర్జున అవార్డు గ్రహీత, తెలుగు తేజం వెన్నం జ్యోతి సురేఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. ఆమెకు గ్రూప్-1 డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. కాగా విజయవాడకు చెందిన వెన్నం జ్యోతి సురేఖ ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక ఈవెంట్లలో స్వర్ణ, రజత పతకాలు గెలిచింది. అమెరికాలో జరిగిన ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో కాంపౌండ్ విభాగంలో మూడు రజత పతకాలు సాధించి సత్తా చాటింది. ఈ క్రమంలో ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో 5వ ర్యాంక్ సాధించింది. అదే విధంగా.. లాన్‌కాస్టర్ క్లాసిక్ అంతర్జాతీయ ఇండోర్ ఆర్చరీ టోర్నమెంట్లో పసిడి పతకం సొంతం చేసుకుంది. తద్వారా అంతర్జాతీయ ఇండోర్ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా జ్యోతి సురేఖ ఘనత సాధించింది. ఇలా ఎన్నెన్నో రికార్డులు సాధించి దేశ, రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేసిన ఆమెను సీఎం జగన్ ప్రభుత్వం ఉద్యోగంతో గౌరవించేందుకు సిద్ధమైంది. చదవండి: Commonwealth Games 2022: ‘కామన్వెల్త్’ జట్టులో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి -
జ్యోతి సురేఖకు నిరాశ.. బొపన్న, సానియా జంటలకు షాక్!
ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనాలో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత ఆర్చరీ జట్ల ఎంపిక కోసం నిర్వహిస్తున్న సెలెక్షన్ ట్రయల్స్‌లో ఆంధ్రప్రదేశ్ స్టార్ ప్లేయర్ జ్యోతి సురేఖ విఫలమైంది. సోనిపట్‌లో మంగళవారం జరిగిన మహిళల కాంపౌండ్ విభాగం ట్రయల్స్‌లో సురేఖ రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఎలిమినేషన్ రౌండ్లోనే నిష్క్రమించింది. సురేఖ 2014, 2018 ఆసియా క్రీడల్లో కాంస్యం, రజతం సాధించింది. ఇతర క్రీడాంశాలు బొపన్న జంట ఓటమి కాలిఫోర్నియా: మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)–షపోవలోవ్ (కెనడా) ద్వయం 2–6, 1–6తో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన బోపన్న జంటకు 61,100 డాలర్ల (రూ. 46 లక్షల 19 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సానియా జోడీ పరాజయం కాలిఫోర్నియా: మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నీ మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా మీర్జా (భారత్)–కిర్‌స్టెన్ ఫ్లిప్కెన్స్ (బెల్జియం) ద్వయం 3–6, 6–7 (3/7)తో జావోజువాన్ యాంగ్ (చైనా)–ఎకతెరీనా (రష్యా) జోడీ చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్లో మనిక బత్రా–అర్చన జంట ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) దోహా కంటెండర్ టోర్నీ మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మనిక బత్రా–అర్చన కామత్ (భారత్) ద్వయం 13–11, 8–11, 11–5, 13–11తో సూ వాయ్ యామ్–లీ హో చింగ్ (హాంకాంగ్) జోడీని ఓడించి సెమీఫైనల్‌కు చేరింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మనిక 5–11, 2–11, 4–11తో యింగ్ హాన్ (జర్మనీ) చేతిలో... పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సత్యన్ (భారత్) 11–5, 8–11, 7–11, 4–11తో కార్ల్సన్ (స్వీడన్) చేతిలో ఓడిపోయారు. చదవండి: Kane Williamson: వెయ్యిసార్లు చూసినా అదే నిజం.. చెత్త అంపైరింగ్! పాపం కేన్ మామ! -
విల్లు వదిలి వంట గదిలో...
కోల్‌కతా: టోక్యో ఒలింపిక్స్ తర్వాత పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్న ఆ జంటకు కరోనా ‘శరా’ఘాతంలా తగిలింది. మెగా ఈవెంట్ ఏకంగా ఏడాదిపాటు వాయిదా పడటంతో వారి ప్రణాళిక మారిపోయింది. ఒలింపిక్స్‌కు సమయముంది కాబట్టి ఇక ముందుగా పెళ్ళికే వీరిద్దరు సిద్ధమైపోతున్నారు. భారత అగ్రశ్రేణి ఆర్చర్లు దీపికా కుమారి, అతాను దాస్ గురించే ఇదంతా. వీరిద్దరి నిశ్చితార్థం జరిగి దాదాపు రెండేళ్లవుతోంది. టోక్యో ఒలింపిక్స్‌కు వీరిద్దరు ఇప్పటికే అర్హత సాధించారు. రాంచీకి చెందిన దీపిక, ప్రస్తుతం కోల్‌కతాలో దాస్‌తో కలిసే ఉంటోంది. ఇప్పుడు లభించిన విరామంలో ఆమె దృష్టి ప్రస్తుతం విల్లంబులకంటే వంటగదిపైనే ఉంది. ఇదే విషయాన్ని తాను చెప్పుకుంది. ‘ఇప్పటివరకు నాకు అన్నం, కొంత వరకు పప్పు వండటం మాత్రమే వచ్చు. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నా. ముఖ్యంగా చికెన్ వంటకాలంటే ఇష్టం. రాంచీ నుంచి మా అమ్మ ఆన్లైన్లో ఇవన్నీ నాకు నేర్పిస్తోంది. ప్రాణాయామంతో రోజు మొదలు పెడితే బ్రేక్‌ఫాస్ట్ తర్వాత నా పని వంట నేర్చుకోవడమే’ అని దీపిక చెప్పింది. దీపిక, అతాను దాస్ కలిసి ప్రస్తుతం తమ ఇంట్లోనే ఐదు మీటర్ల తాత్కాలిక రేంజ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి అసలు లక్ష్యంతో పోలిస్తే ఇది ఏమాత్రం లెక్కలోనికి రాదు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకంటే ఏమీ చేయలేం. ఒక రకంగా ఇది కంప్యూటర్ గేమ్లాంటిదే. కానీ కనీసం ఆర్చరీని మరచిపోకుండా ఇది గుర్తు చేస్తున్నట్లు, క్యాంప్ మొదలయ్యే సమయానికి ఆటపై ఆసక్తి పోకుండా ఉంచుతుందనేది మా నమ్మకం. కనీసం రెండు గంటల పాటు ఇలా సాధన చేస్తున్నాం’ అని దీపిక వెల్లడించింది. టోక్యో ఒలింపిక్స్ ముగియగానే పెళ్లి చేసుకోవాలనుకున్నా... ఇప్పుడు కరోనా నుంచి అంతా సాధారణ స్థితికి మారగానే వివాహ ఏర్పాట్లు మొదలుపెడతామని వీరిద్దరు చెప్పారు. దీపిక 2012, 2016 ఒలింపిక్స్‌లలో, అతాను 2016 ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. -
కాంస్యంతో సరి
మెడెలిన్ (కొలంబియా): ప్రపంచ ఆర్చరీ కప్ స్టేజి 4లో భారత్ ఓ కాంస్యంతో సరిపుచ్చుకుంది. టాప్ ఆర్చర్లు దూరంగా ఉన్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన కాంస్య పతక ప్లేఆఫ్‌లో సర్వేష్ పరేక్, సందీప్ కుమార్, ఇసయ్యా రాజేందర్ సనమ్లతో కూడిన కాంపౌండ్ టీమ్ విజేతగా నిలిచింది. తమకన్నా పటిష్టమైన వెనిజులా జట్టును 231-222 తేడాతో వీరు మట్టికరిపించారు. కాంపౌండ్ మిక్స్‌డ్‌లోనూ కాంస్య పతకం కోసం పోరాడిన పరీక్, త్రిష దేవ్ 150-156 తేడాతో అమెరికా జోడి చేతిలో ఓడారు. -
ఆర్చరీ మెరుపులు
- విజయవాడ చేరుకున్న పూర్వాష, జ్యోతిసురేఖ - ఏషియన్ గేమ్స్ పతక విజేతలకు ఘనస్వాగతం విజయవాడ స్పోర్ట్స్ : ఏషియన్ గేమ్స్‌లో బెజవాడ కీర్తిపతాకను ఎగురవేసి నగరానికి వచ్చిన ఆర్చర్లకు ఘనస్వాగతం లభించింది. ఇంచియాన్ (కొరియా)లో జరిగిన 17వ ఏషియన్ గేమ్స్‌లో విజయవాడ నుంచి భారత కాంపౌండ్ మహిళా ఆర్చరీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాలు సాధించిన పూర్వాష, వెన్నం జ్యోతి సురేఖ నగరానికి చేరుకున్నారు. శుక్రవారం పూర్వాష తన కోచ్ ఎల్.చంద్రశేఖర్‌తో కలిసి గన్నవరం చేరుకోగా జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి పి.రామకృష్ణ, జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి కె.పి.రావు, క్రీడాసంఘాల ప్రతినిధులు నామిశెట్టి వెంకట్, డి.శ్రీహరి, శాతవాహన కళాశాల పీడీ సంగీతరావు, ఓల్గా ఆర్చరీ అకాడమీ అర్చర్లతో పాటు పూర్వాష చదువుకున్న విశ్వభారతి విద్యానికేతన్ స్కూల్ విద్యార్థులు పాల్గొని ర్యాలీగా నగరానికి చేరుకున్నారు. ఏపీ ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ, విజయవాడ ఓల్గా అకాడమీ ఆర్చర్లు తప్పకుండా పతకాలు సాధిస్తారని ముందుగానే చెప్పామని, అదిప్పుడు నిజమైందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సీఎంను కలిసిన సురేఖ భారత జట్టుతో శుక్రవారం ఢిల్లీ వచ్చిన మరో ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ అక్కడ్నుంచి హైదరాబాద్‌కు చేరుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి శనివారం నగరానికి చేరుకుంది. గన్నవరం విమానాశ్రయంలో ఆమెకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు, క్రీడాసంఘాలు, సహచర ఆర్చర్లు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఘనస్వాగతం పలికారు. జ్యోతి సురేఖకు సీబీఆర్ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ సీబీఆర్ ప్రసాద్ రూ.5 లక్షల చెక్కును అందజేశారు. 1951 ఢి ల్లీలో జరిగిన తొలి ఏషియన్ గేమ్స్‌లో కృష్ణా జిల్లాకు చెందిన కామినేని ఈశ్వరరావు, దండమూడి రాజగోపాలరావు వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించగా.. ఇన్నేళ్ల తరువాత జ్యోతి సురేఖ కాంస్య పతకం సాధించిందన్నారు. ఆమెకు ఏ విధమైన సహకారం కావాలన్నా అందిస్తానని ప్రసాద్ హామీ ఇచ్చారు. జ్యోతిసురేఖ వెంట తండ్రి సురేంద్ర, డీఎస్డీవో పి.రామకృష్ణ, కేఎల్‌యూ డెరైక్టర్ రామకృష్ణ, శాయ్ కోచ్ వినాయకప్రసాద్, సెపక్తక్రా అసోసియేషన్ అధ్యక్షుడు అర్జా పాండురంగారావు ఉన్నారు.