
కాంస్యంతో సరి
మెడెలిన్ (కొలంబియా): ప్రపంచ ఆర్చరీ కప్ స్టేజి 4లో భారత్ ఓ కాంస్యంతో సరిపుచ్చుకుంది. టాప్ ఆర్చర్లు దూరంగా ఉన్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన కాంస్య పతక ప్లేఆఫ్‌లో సర్వేష్ పరేక్, సందీప్ కుమార్, ఇసయ్యా రాజేందర్ సనమ్‌లతో కూడిన కాంపౌండ్ టీమ్ విజేతగా నిలిచింది.
తమకన్నా పటిష్టమైన వెనిజులా జట్టును 231-222 తేడాతో వీరు మట్టికరిపించారు. కాంపౌండ్ మిక్స్‌డ్‌లోనూ కాంస్య పతకం కోసం పోరాడిన పరీక్, త్రిష దేవ్ 150-156 తేడాతో అమెరికా జోడి చేతిలో ఓడారు.