శ్రావణమాసంలో కొత్త పెళ్లికూతుళ్లు మాత్రమే కాదు, ప్రతి ఇల్లు అందంగా ముస్తాబవుతుంది. ముత్తయిదువులందరూ ఇంటి అందాన్ని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందంగా అలంకరించిని ఇంట్లో స్వయంగా ఆ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. ఇంటిని పూలతోరణాలు, మామిడాకులతో అందంగా తీర్చిదిద్దుదాం. ఇంట్లో పూజ గది నుండి వంటగది వరకు ప్రతిదీ శుభ్రంగా ఉండేలా చూసుకుంటారు. అలాగే అలంకరణ నిమిత్తం ఇంటి ముందు, వసారాలో పెద్ద పెద్ద ఇత్తడి పాత్రలను, దీపపు కుందులను అమర్చుతారు. ఆరోగ్యంపై పెరుగుతున్న ప్రాధాన్యత నేపథ్యంలో ఇత్తడి, రాగి , కంచు పాత్రల వాడకం బాగా పెరిగింది.
చింతపండు:
ఇత్తడి, రాగి పాత్రల మురికి వదిలించాలంటే అందరికీ గుర్తొచ్చేది చింతపండు గుజ్జు. చింతపండుతో, ఆ తరువాత మట్టితో తోమడం పెద్దల నాటినుంచి వస్తున్నదే. చింతపండును నీళ్లలో నానబెట్టి ఆ గుజ్జుతో రుద్దితే ఇత్తడి సామానులకు పట్టిన మకిలి, చిలుము అంతా పోయి గిన్నెలు మెరుస్తాయి. నిమ్మకాయను కూడా ఉపయోగించవచ్చు. వీటిని ఆరనిచ్చి మెత్తని గుడ్డతో తుడిచి ఎండలో కాసేపు ఆరనివ్వాలి.
వంట సోడా: రాగి, ఇత్తడి మెరిసేలా చేయడానికి దానిపై బేకింగ్ సోడా, సబ్బును అప్లయ్ చేయాలి. ఆ తరువాత శుభ్రంగా తోమాలి.
గోధుమ పిండి: గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, టీస్పూన్ వైట్ వెనిగర్ మిక్స్ చేసి పేస్ట్ తయారు చేయండి. తరువాత ఈ పేస్ట్‌ను ఇత్తడి లేదా రాగి పాత్రలపై అప్లై చేసి, కాసేపు అలాగే ఉంచండి. స్క్రబ్బింగ్, క్లీనింగ్ తర్వాత అది మెరుస్తుంది.
వెనిగర్: ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి, పాలిష్ చేయడానికి వైట్ వెనిగర్ ఒక అద్భుతంగా పని చేస్తుంది. గ్లాసు నీటిలో రెండు చెంచాల వెనిగర్ ఉడికించింది. దీనికి లిక్విడ్ డిష్ వాషర్ కానీ, విమ్ పౌడర్ గానీ మిక్స్ చేసి తోమి కడిగితే, పూజా వస్తువులు మెరుస్తాయి.
నిమ్మ ఉప్పు: ఇత్తడి పాత్రలు కొత్తవిలా మెరిసిపోయేలా చేయడానికి నిమ్మ ఉప్పు ఉపయోగించండి. నిమ్మరసం, ఉప్పు కలపడం ద్వారా ఒక ద్రావణాన్ని సిద్ధం చేసి, దానిని ఇత్తడి పాన్‌కు అప్లై చేసి పాన్‌ను రుద్దండి. ఇలా చేయడం వల్ల ఇత్తడిపై నలుపు పోయి, ఇత్తడి పాత్రలు మెరుస్తాయి.
పీతాంబరీ: ఇత్తడి, రాగి పాత్రలను శుభ్రం చేయడానికి పీతాంబరిమరో బెస్ట్ ఆప్షన్. బాగా కడిగిన మెత్తటి గుడ్డతోతుడిచి ఆరనివ్వాలి.
Comments
Please login to add a commentAdd a comment