utensils
-
శ్రావణమాసం : రాగి, ఇత్తడి, పూజా పాత్రలు తళ తళలాడాలంటే, చిట్కాలివిగో!
శ్రావణమాసంలో కొత్త పెళ్లికూతుళ్లు మాత్రమే కాదు, ప్రతి ఇల్లు అందంగా ముస్తాబవుతుంది. ముత్తయిదువులందరూ ఇంటి అందాన్ని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందంగా అలంకరించిని ఇంట్లో స్వయంగా ఆ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. ఇంటిని పూలతోరణాలు, మామిడాకులతో అందంగా తీర్చిదిద్దుదాం. ఇంట్లో పూజ గది నుండి వంటగది వరకు ప్రతిదీ శుభ్రంగా ఉండేలా చూసుకుంటారు. అలాగే అలంకరణ నిమిత్తం ఇంటి ముందు, వసారాలో పెద్ద పెద్ద ఇత్తడి పాత్రలను, దీపపు కుందులను అమర్చుతారు. ఆరోగ్యంపై పెరుగుతున్న ప్రాధాన్యత నేపథ్యంలో ఇత్తడి, రాగి , కంచు పాత్రల వాడకం బాగా పెరిగింది.చింతపండు:ఇత్తడి, రాగి పాత్రల మురికి వదిలించాలంటే అందరికీ గుర్తొచ్చేది చింతపండు గుజ్జు. చింతపండుతో, ఆ తరువాత మట్టితో తోమడం పెద్దల నాటినుంచి వస్తున్నదే. చింతపండును నీళ్లలో నానబెట్టి ఆ గుజ్జుతో రుద్దితే ఇత్తడి సామానులకు పట్టిన మకిలి, చిలుము అంతా పోయి గిన్నెలు మెరుస్తాయి. నిమ్మకాయను కూడా ఉపయోగించవచ్చు. వీటిని ఆరనిచ్చి మెత్తని గుడ్డతో తుడిచి ఎండలో కాసేపు ఆరనివ్వాలి.వంట సోడా: రాగి, ఇత్తడి మెరిసేలా చేయడానికి దానిపై బేకింగ్ సోడా, సబ్బును అప్లయ్ చేయాలి. ఆ తరువాత శుభ్రంగా తోమాలి. గోధుమ పిండి: గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, టీస్పూన్ వైట్ వెనిగర్ మిక్స్ చేసి పేస్ట్ తయారు చేయండి. తరువాత ఈ పేస్ట్‌ను ఇత్తడి లేదా రాగి పాత్రలపై అప్లై చేసి, కాసేపు అలాగే ఉంచండి. స్క్రబ్బింగ్, క్లీనింగ్ తర్వాత అది మెరుస్తుంది.వెనిగర్: ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి, పాలిష్ చేయడానికి వైట్ వెనిగర్ ఒక అద్భుతంగా పని చేస్తుంది. గ్లాసు నీటిలో రెండు చెంచాల వెనిగర్ ఉడికించింది. దీనికి లిక్విడ్ డిష్ వాషర్ కానీ, విమ్ పౌడర్ గానీ మిక్స్ చేసి తోమి కడిగితే, పూజా వస్తువులు మెరుస్తాయి.నిమ్మ ఉప్పు: ఇత్తడి పాత్రలు కొత్తవిలా మెరిసిపోయేలా చేయడానికి నిమ్మ ఉప్పు ఉపయోగించండి. నిమ్మరసం, ఉప్పు కలపడం ద్వారా ఒక ద్రావణాన్ని సిద్ధం చేసి, దానిని ఇత్తడి పాన్‌కు అప్లై చేసి పాన్‌ను రుద్దండి. ఇలా చేయడం వల్ల ఇత్తడిపై నలుపు పోయి, ఇత్తడి పాత్రలు మెరుస్తాయి.పీతాంబరీ: ఇత్తడి, రాగి పాత్రలను శుభ్రం చేయడానికి పీతాంబరిమరో బెస్ట్ ఆప్షన్. బాగా కడిగిన మెత్తటి గుడ్డతోతుడిచి ఆరనివ్వాలి. -
పాత పాత్రలతో వంటకాలకు కొత్త రుచులు!
సంప్రదాయంగా వస్తున్న అనేక రకాల వంట పాత్రలతో వంటకాలకు కొత్త రుచులను అద్దవచ్చునని పాకశాస్త్ర నిపుణులు అంటున్నారు. సంప్రదాయ వంట పాత్రలపై నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ విభిన్న రుచులు, సువాసనల సమ్మేళనమైన తెలంగాణ వంటకాలు సంప్రదాయ వంటపాత్రల్లో వండడం ద్వారా మరింత సువాసనను, రుచులను జోడించవచ్చని వివరించారు.సాధారణంగా రుచికి, వంటకు ఉపయోగించే పాత్రలకి ఉన్న సంబంధాన్ని తక్కువగా పరిగణనలోకి తీసుకుంటారని, అయితే వారసత్వంగా మనకు అందివచ్చిన పాత్రలను మాత్రం ఆ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే రూపొందించారన్నారు. ఈ సందర్భంగా గోల్డ్ డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా మాట్లాడుతూ, ‘మట్టి సువాసనలను నింపే మట్టి కుండల నుంచి, ఇనుప పాత్రల వరకు సాంప్రదాయ తెలంగాణ వంట పాత్రలు ప్రతి వంటకానికి తమదైన ప్రత్యేకతను అద్దడం ద్వారా వాటికి ప్రామాణికతను జోడిస్తాయి‘ అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు సంప్రదాయ వంట పాత్రల విశిష్టతలను వివరించారు.రాతి చిప్ప: ఇదొక రాతితో తయారు చేసిన పాత్ర. దీనిని కల్ చట్టి అని కూడా పిలుస్తారు. తెలంగాణ వంటశాలలలో ఓ రకంగా మల్టీ టాస్కర్ ఇది. సన్నటి మంటపై వండితే రుచి బాగుంటుందనుకునే వంటకాలు అయిన పప్పు, సాంబార్లకు ఇది అనువైనదిగా ఉంటుంది. మరింత రుచిని కల్పిస్తుంది. చేతితో చెక్కిన ఈ పాత్రలను ఆహారాన్ని నిల్వ చేయడానికి కూడా ఉపయోగిస్తారు.ఉరులి: ఒక గుండ్రని వంట పాత్ర ఇది. వివిధ రకాల వంటకాలకు అనువైనది ఈ ఉరులి. కేరళకు చెందిన నైపుణ్యం కలిగిన కళాకారుల చేతుల మీదుగా ఫుడ్–గ్రేడ్ ఇత్తడితో రూపొందింది. ఈ పాత్ర కడాయి తరహాలో ఉపయోగపడుతుంది. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, టమాటాలతో వండిన బెండకాయ వేపుడు (వేయించిన ఓక్రా)తో సహా తెలంగాణలో పలు వంటకాలకు రుచికరమైన ప్రామాణికతను జోడిస్తుంది.మురుకు అచ్చు: ఇది కరకరలాడే మురుకులు లేదా జంతికలు కోసం తప్పనిసరిగా ఉండవలసిన సర్వ సాధారణ సాధనం.అట్టుకల్: సిల్ బత్తా, కల్ బత్తా వంటి విభిన్న పేర్లతో పిలిచే ఈ గ్రైండింగ్ రాయి మొత్తం మసాలాలు, ధాన్యాలు, పప్పులను సువాసనగల పేస్ట్‌లు పౌడర్లుగా మారుస్తుంది. దీనిలో చట్నీలను రుబ్బడం వల్ల అది ఒక కొత్త ఆకర్షణను అందిస్తుంది. ఇంటి వంటల మధురమైన జ్ఞాపకాలను సమున్నతం చేస్తుంది.మట్టి పాత్రసహజమైన మట్టితో రూపొందించిన ఈ సంప్రదాయ కుండ, కోడి కూర (ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ) చేయడానికి సరైన పాత్ర. మట్టికి మాత్రమే కలిగిన ప్రత్యేక లక్షణాలు తేమను నిలుపుకోవడంలో దీనికి సహాయపడతాయి. ఈ కుండలు అవసరమైన పోషకాలను కూడా కలిగి ఉంటాయి.ది మ్యాజిక్ ఆఫ్ కాస్ట్ ఐరన్: కాస్ట్ ఐరన్ తో చేసిన వంటసామాను తో కూడా తెలంగాణ వంటకాలు వండుతారు. ఈ దఢమైన కుండలు సన్నగా దోసెలు, నోటిలో కరిగిపోయే హల్వా, గుంట పొంగనాలు వంటి వాటికి బాగా అనుకూలం. -
మల్టీఫంక్షనల్ పర్ఫెక్ట్ కుక్వేర్
శాండివిచ్ దగ్గర నుంచి వాఫిల్స్ వరకు అన్నింటినీ సిద్ధం చేయడంలో ఈ డివైస్ ప్రత్యేకం. వెజ్, నాన్‌వెజ్ అనే తేడా లేకుండా భోజన ప్రియులకు నచ్చిన రుచులను నిమిషాల్లో అందించే మల్టీఫంక్షనల్ బ్రేక్ ఫస్ట్ మేకర్ ఇది. అన్నివిధాలా సౌకర్యవంతంగా పనిచేస్తుంది. పైగా దీన్ని పట్టుకుని వెళ్లడానికి వీలుగా ఒకవైపు ప్రత్యేకమైన హ్యాండిల్ ఉంటుంది. ముందువైపు లాక్ చేసుకునే వీలుతో పాటు టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి రెగ్యులేటర్ కూడా ఉంటుంది. డివైస్‌ను నిలబెట్టుకోవడానికి వీలుగా ప్రత్యేకమైన స్టాండ్స్ ఉంటాయి. దానికే పవర్ కనెక్టర్‌ని చుట్టి పక్కకు స్టోర్ చేసుకోవచ్చు. ఆమ్లెట్స్, కట్లెట్స్ ఇలా చాలానే వండుకోవచ్చు. అవసరాన్ని బట్టి వాఫిల్స్ ప్లేట్, గ్రిల్ ప్లేట్లను మార్చుకుంటూ ఉండొచ్చు. (చదవండి: ఈ చీజ్ ధర వింటే ..కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!) -
ప్రకృతి ప్రేమకు నిదర్శనం
నగర జీవనంలో ప్రతిదీ యూజ్ అండ్ త్రోగా మారుతోంది.‘ఈ కాంక్రీట్ వనంలో ప్రకృతి గురించి అర్థం చేసుకుంటున్నదెవరు’.అని ప్రశ్నిస్తారు. హైదరాబాద్ నల్లగండ్లలో ఉంటున్న నిదర్శన.అపార్ట్మెంట్ సంస్కృతిలో వ్యర్థాలను ఎలా వేరు చేయాలి,ప్లాస్టిక్ వాడకాన్ని ఎలా తగ్గించాలనే విషయాల మీద నెలకు ఒకసారి నాలుగేళ్లుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తోంది. కార్పోరేట్ కంపెనీలో మార్కెటింగ్ కమ్యూనికేషన్స్‌లో మేనేజర్‌గా వర్క్ చేసిన నిదర్శన సస్టెయినబుల్ లివింగ్ పట్ల ఆసక్తి పెరిగి, పర్యావరణ హిత వస్తువుల వాడకాన్ని ప్రోత్సహిస్తూ,హస్తకళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. పర్యావరణానికి మేలు చేసే పని ఏ కొంచెమైనా ఎంతో సంతృప్తినిస్తుందని చెబుతోంది. ‘‘ఈ రోజుల్లో మనం ఏ పని చేసినా అది ప్రకృతికి మేలు చేసేదై ఉండాలి. ఈ ఆలోచన నాకు నాలుగేళ్ల క్రితం కలిగింది. దీనికి కారణం మన దగ్గర చేస్తున్న పెళ్లిళ్లు, పార్టీలు. ఫంక్షన్లకు వెళ్లినప్పుడు అక్కడ యూజ్ అండ్ త్రో ఏరియా చూస్తే మనసు వికలమయ్యేది. దీంతో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి, సస్టైనబుల్ లివింగ్ మార్గం పట్టాను. ఈవెంట్స్‌కి స్టీల్ గిన్నెల రెంట్ మాటీ పేరతో ఫౌండేషన్ ఏర్పాటు చేశాను. నాలాగే ఆలోచించే మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఫంక్షన్లకు స్టీల్ పాత్రలు నామమాత్రపు రెంట్‌తో ఇచ్చే బ్యాంక్ ఏర్పాటు చేశాను. ఆ తర్వాత ఇదే థీమ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాను. ఎవరింట్లో పెళ్లి, పండగ, పుట్టిన రోజులు జరిగినా మా దగ్గర నుంచి స్టీల్ పాత్రలు రెంట్‌కు తీసుకోవచ్చు. అలాగే, అపార్ట్మెంట్స్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాను. ఈ వర్క్‌షాప్స్‌లో కిచెన్ గార్డెనింగ్, కంప్రోస్ట్, ఎకో ఫ్రెండ్లీ గిఫ్ట్ థీమ్స్.. వంటివన్నీ అందుబాటులో ఉంటాయి. హస్తకళాకారుల నుంచి.. నెలకు ఒకసారి గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలను చూసుకొని పర్యావరణ స్పృహ కలిగించడానికి ఎకో ఫెస్ట్ ఏర్పాటు చేయడం మొదలుపెట్టాను. ఇందుకు ఇతర స్వచ్ఛంద సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీ సభ్యులు, ఐటీ ఉద్యోగులు తమ మద్దతును తెలియజేస్తున్నారు. నా టీమ్‌లో స్వచ్ఛందంగా పనిచేసే పది మంది బృందంగా ఉన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలలోని నగరాలలోనూ ఈ ఎకో ఫెస్ట్ ఏర్పాటు చేస్తాను. ఇందులో హస్తకళాకారులు తయారుచేసిన రకరకాల కళాకృతులు, జ్యువెలరీ బాక్సులు, ఇత్తిడి, రాగి వస్తువులు, జ్యూట్ కాటన్ పర్సులు, ఇంటీరియర్ వస్తువులు .. వంటివన్నీ ఉంటాయి. హస్తకళాకారులే నేరుగా వచ్చి తమ వస్తువులు అమ్ముకోవచ్చు. ఒక్కొక్క కళాకారుడి నుంచి సేకరించిన వస్తువులను కూడా ప్రదర్శనలో ఉంచుతాను. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ కళాకారులకు అందజేస్తుంటాను. గ్రామీణ కళాకారులకు తమ హస్తకళలను ఎక్కడ అమ్మితే తగినంత ఆదాయం వస్తుందనే విషయంలో అంతగా అవగాహన ఉండదు. అందుకే, ఈ ఏర్పాట్లు చేస్తుంటాను. దీని ద్వారా కళకు, కొనుగోలుదారుకు ఇద్దరికీ తగిన న్యాయం చేయగలుగుతున్నాను అనే సంతృప్తి లభిస్తుంది. ‘ది బాంటిక్ కంపెనీ( పేరుతో ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా హస్తకళాకృతులను అందుబాటులో ఉంచుతున్నాను. ఎకో ఫ్రెండ్లీ గిఫ్టింగ్ కార్పోరేట్ కంపెనీలలో పండగల సందర్భాలలో ఇచ్చే కానుకలకు కన్‌స్టలెన్సీ వర్క్ కూడా చేస్తాను. ఇక్కడ కూడా ఎకో థీమ్‌తో కస్టమైజ్డ్ గిఫ్ట్ బాక్స్‌లు తయారుచేసి అందిస్తుంటాను. ఇక ఇళ్లలో జిరగే చిన్న చిన్న వేడుకలకూ ఎలాంటి కానుకలు కావాలో తెలుసుకొని, వాటిని తయారుచేయించి సప్లయ్ చేయిస్తుంటాను. కార్పోరేట్ కంపెనీలలో వర్క్‌షాప్స్ కార్పోరేట్ కంపెనీలలో సస్టెయినబులిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేస్తాను. అక్కడ ఉద్యోగులు పర్యావరణ హిత వస్తువులతో తమ జీవన విధానాన్ని ఎలా అందంగా తీర్చిదిద్దుకోవచ్చో, ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చో కార్యక్రమాల ద్వారా తెలియజేస్తుంటాను. అంతేకాదు, కిచెన్ వ్యర్థాలను ఎలా వేరు చేయాలి, కిచెన్ గార్డెన్‌ను తమకు తాముగా ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనే విషయాల మీద వర్క్‌షాప్స్ ఉంటాయి. అంతేకాదు, రోజువారీ జీవన విధానంలో ప్రతీది పర్యావరణ హితంగా మార్చుకుంటే కలిగే లాభాలనే వివరిస్తుంటాను. ఇదేమంత కష్టమైన పని కాదని వారే స్వయంగా తెలుసుకోవడం, తాము ఆచరిస్తున్న పనులు గురించి ఆనందంగా తెలియజేస్తుంటారు. మంచి జీవనశైలిని నలుగురికి పంచడంలోనే కాదు ప్రకృతికి మేలు చేస్తున్నాన్న సంతృప్తి కలుగుతుంది. అదే విధంగా గ్రామీణ కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నానన్న ఆనందమూ కలుగుతుంది’ అని తెలియజేస్తారు నిదర్శన. – నిర్మలారెడ్డి ఫొటోలు: మోహనాచారి -
బయోడీగ్రేడబుల్ ప్లేట్లు, కప్పులు వాటితోనే చేయాలి: బీఐఎస్
న్యూఢిల్లీ: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) బయోడీగ్రేడబుల్ (మట్టిలో కలిసిపోయే) ఆహార పాత్రలకు నాణ్యత ప్రమాణాలను విడుదల చేసింది. ఇటువంటి ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ప్లేట్లు, కప్పులు, గిన్నెలు, ఇతర పాత్రలను తయారు చేయడానికి ఆకులు, తొడుగులు వంటి వ్యవసాయ ఉప ఉత్పత్తులను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ముడి పదార్థాలు, తయారీ పద్ధతులు, పనితీరు, పరిశుభ్రత వంటి అంశాలను ప్రామాణికంగా చేసుకుని ఐఎస్ 18267: 2023 ధ్రువీకరణను బీఐఎస్ జారీ చేస్తుంది. హాట్ ప్రెస్సింగ్, కోల్డ్ ప్రెస్సింగ్, మౌల్డింగ్, స్టిచింగ్ వంటి తయారీ సాంకేతికతలను సైతం బ్యూరో నిర్ధేశిస్తుంది. -
ఆరోగ్యరక్షణలో ప్రధానపాత్ర
ఒక వ్యాధి అంతు చూసేలోపు మరొకటి వచ్చిపడుతోంది. మానవ జీవనం తింటే తంటా తినకపోతే మంట అన్నట్టుంది. కల్తీమయమవుతున్న ఆహారంతో పాటు అవి వండుకునే పాత్రలు సైతం అనారోగ్య కారణాలలో ప్రధాన‘పాత్ర’ పోషిస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. సరికొత్త వంటపాత్రలు మార్కెట్లోకి రావడానికి అవే దోహదం చేస్తున్నాయి. - శిరీష చల్లపల్లి సాధారణంగా అల్యూమినియం, మెటల్స్ మిక్స్డ్ స్టీల్, నాన్‌స్టిక్ వంటి వంటపాత్రలు వండేటప్పుడు పుట్టే ఉష్ణోగ్రత వల్ల ఆ లోహాలను ఆహారపదార్థాల్లోకి పంపిస్తాయి. ఆహారం తీసుకునేటప్పుడు రకరకాల మెటల్స్ కొంచెం కొంచెంగా మన శరీరంలోకి వెళతాయి. దీని పరిణామాలు వివిధ రకాల కొత్త జబ్బులుగా బయటపడుతుంటాయి. అప్పుడు వాటి చికిత్స ఖర్చు లక్షల పైమాటే.. అయితే దీనికి పరిష్కారంగా వచ్చిందే సర్జికల్ గ్రేడ్ స్టీల్. ఏమిటీ స్టీల్... మన శరీరంలో బోన్ సర్జరీ జరిగినప్పుడు, మోకాలి చిప్పను రీప్లేస్ చేసినప్పుడు, కాలి ఎముకలకు జత చేసే సర్జికల్ రాడ్స్ మెటల్‌తోనే ఈ పాత్రలు కూడా తయారు చేస్తారు. ఈ మెటల్ని సర్జికల్ గ్రేడ్ స్టీల్ అని అంటారు. దీనితో చేసిన బౌల్స్ లేదా కుక్కర్లలో వండితే ఎట్టి పరిస్థితుల్లోనూ మెటల్ కరగడం కానీ, తద్వారా తినే భోజనంలో కల్తీ కానీ జరగవు. పైగా భోజనం చాలా సహజంగా, కలర్ సైతం మారకుండా ఒక కొత్త అనుభూతిని మిగులుస్తుంది. లాభాల బౌల్స్.. ఈ స్టీల్‌తో తయారు చేసిన బౌల్స్ అండ్ కుక్కర్స్‌తో చాలా ప్రయోజనాలున్నాయి. ఆయిల్ లేకుండా బిరియానీ, వేపుళ్లు మాత్రమే కాదు దోసెలు, ఆమ్లెట్లు, చపాతీలు, పిజ్జాలు సైతం చేసుకోవచ్చు. అంతేకాదు వాటర్ లేకుండానే కూరగాయల్ని ఉడికించే మ్యాజిక్ కూడా ఇందులో ఉంది. ఇంకొక ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే బియ్యం కుక్కర్లో పెట్టిన ఒక నిమిషం 45 సెకన్లలోనే అన్నం రెడీ అవుతుంది. ఫాస్ట్ అండ్ ఫ్యాట్ ఫ్రీ కుక్కింగ్ కావడంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని సరికొత్త రుచితో ఆస్వాదించవచ్చు. బౌల్స్ సెట్ ఖరీదు మాత్రం లక్షపై మాటే.. కనీసం 2 కేజీలుండే ఒక్కో బౌల్ ప్రారంభ ధర రూ.15 వేలు. కూరగాయల నుంచి వచ్చే విటమిన్స్, మినరల్స్, న్యూట్రిషినల్ వాల్యూస్ వంటివన్నీ మనం తినే వంటల్లో చేరి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు తయారీదారులు. వండడం సులువు.. ఈ పాత్రలలో వండటం సులువు. ఒక బౌల్లో ఒకేసారి రెండు మూడు రకాలను వండుకునేసౌకర్యం ఉంది. గ్యాస్‌తో పాటు టైం కూడా ఆదాకావడం వీటి ప్రత్యేకత. ఇంట్లో వాడుకునే కుక్కర్లతో అనేక రకాల ప్రమాదాలు జరగటం మనందరికీ తెలుసు. కానీ ఈ తరహా సర్జికల్ గ్రేడ్ స్టీల్‌తో తయారైన కుక్‌వేర్‌తో మాత్రం ఎటువంటి బ్లాస్ట్‌లు జరగవు. స్పెషల్ ప్రాసెస్‌తో తయారు చేయడంతో ఎటువంటి టెన్షన్ ఉండదు. నగరంలో చాలామంది వీటిని వినియోగిస్తున్నారు. - సరోజ, మేనేజర్, ఏఎంసీ కుక్ వేర్ యూనిట్ -
మొసలితో మహిళ పోరు: వంటపాత్రలే ఆయుధాలు
కేంద్రపార: ప్రమాదపుటంచుల్లో ఉన్నప్పుడు గడ్డి పరకైనా వజ్రాయుధంలా కనిపిస్తుందంటారు. రోజూ తోమే వంటపాత్రలే తన ప్రాణాలను కాపాడతాయని ఆమె కూడా ఊహించలేదు. ఒళ్లు గగుర్పొడిచేలా తనపై దాడిచేసిన మృత్యువు నుంచి ఆమె తప్పించుకున్న వైనం.. కనబరచిన ధైర్యసాహసం నిజంగా ఆశ్చర్యకరం.. వివరాల్లోకి వెళితే.. ఒడిశా బంగాళా తీరంలోని కేంద్రపార జిల్లా సింగిరి గ్రామంలో గుండా చిన్నపాటి సముద్ర పాయ వెళుతుంది. ఆ ఊరి మహిళలందరూ బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం లాంటి పనులన్నీ సముద్ర పాయ వద్దే చేస్తుంటారు. రోజూలానే సావిత్రీ సమాల్ (37) అనే మహిళ శుక్రవారం ఉదయం గిన్నెలు కడిగేందుకు అక్కడికి వెళ్లింది. తీక్షణంగా పనిచేసుకుంటూ ఉండగా పిల్లిలా వచ్చిన ఓ భారీ మొసలి ఆమెపై దాడి చేసింది. సావిత్రి కాలిని నోట కరుచుకుని నీళ్లలోకి లాక్కెల్లింది. కొద్ది క్షణాల తర్వాత తేరుకున్న ఆమె.. అప్పటికే తన చేతుల్లో ఉన్న గరిటె, పాత్రలతో మొసలిపై ఎదురుదాడికి దిగింది. దాని నుదిటిపై పదేపదే మోదింది. దెబ్బలకు తాళలేక మొసలి ఆమె కాలిని వదిలివేయడంతో సావిత్రి ఒక్క దూకుతో ఒడ్డుకు చేరుకుంది. విషయం తెలసుకున్న చుట్టుపక్కలవారు సావిత్రిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆశ్చర్యకరంగా చిన్నపాటి గాయం తప్ప ప్రమాదమేమీ లేకపోవడంతో ప్రధమ చికిత్స అందించి ఆమెను ఇంటికి పంపించారు వైద్యులు. సావిత్రి సాహసాన్ని గురించి తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఆమెకు నష్టపరిహారాన్ని ఇప్పిస్తామని హామీఇచ్చారు. కాగా, సింగిరి గ్రామంలో మనుషులపై మొసలి దాడికి దిగడం ఇదే మొదటిసారని, ఇక ముందు నదీపాయ దగ్గర అప్రమత్తంగా ఉంటానని చెబుతోంది సాహస నారి సావిత్రి.