
శాండివిచ్ దగ్గర నుంచి వాఫిల్స్ వరకు అన్నింటినీ సిద్ధం చేయడంలో ఈ డివైస్ ప్రత్యేకం. వెజ్, నాన్‌వెజ్ అనే తేడా లేకుండా భోజన ప్రియులకు నచ్చిన రుచులను నిమిషాల్లో అందించే మల్టీఫంక్షనల్ బ్రేక్ ఫస్ట్ మేకర్ ఇది. అన్నివిధాలా సౌకర్యవంతంగా పనిచేస్తుంది. పైగా దీన్ని పట్టుకుని వెళ్లడానికి వీలుగా ఒకవైపు ప్రత్యేకమైన హ్యాండిల్ ఉంటుంది.
ముందువైపు లాక్ చేసుకునే వీలుతో పాటు టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి రెగ్యులేటర్ కూడా ఉంటుంది. డివైస్‌ను నిలబెట్టుకోవడానికి వీలుగా ప్రత్యేకమైన స్టాండ్స్ ఉంటాయి. దానికే పవర్ కనెక్టర్‌ని చుట్టి పక్కకు స్టోర్ చేసుకోవచ్చు. ఆమ్లెట్స్, కట్లెట్స్ ఇలా చాలానే వండుకోవచ్చు. అవసరాన్ని బట్టి వాఫిల్స్ ప్లేట్, గ్రిల్ ప్లేట్‌లను మార్చుకుంటూ ఉండొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment