Vegetarians
-
ఆనంద్ మహీంద్రా మెచ్చే వంటకాలివే..! శాకాహారుల..
దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా అంటూ మంచి ఆసక్తికర విషయాలను నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారు. ఆయన ఇతరుల టాలెంట్‌ని, గమ్మత్తైన విషయాలను షేర్ చేస్తూ ఎడ్యుకేట్ చేస్తుంటారు. అలాంటి మహింద్రా ఈసారి తన కిష్టమైన వంటకాలు గురించి చెప్పుకొచ్చారు. తాను కూడా మంచి ఆహారప్రియుడేనని చెప్పకనే చెప్పారు. ఇంతకీ ఆయన మెచ్చే వంటకాలేంటంటే..ఆనంద్ మహీంద్రా తాజాగా సోషల్ మీడియాలో శాకాహార పంజాబీ వంటకాల పోస్ట్‌తో నెటిజన్లను ఆకర్షించారు. వంటకాల్లో మాంసాహార వంటకాల రుచే అగ్ర స్థానం అయినా ఆయన శాకాహార వంటకాలకే ప్రాధాన్యాత ఇచ్చారు. అంతేగాదు పంజాబ్ వంటకాలను శాకాహారుల స్వర్గంగా అభివర్ణించారు. ఎప్పుడైన సరదాగా పంజాబ్ నడిబొడ్డున తప్పనిసరిగా ఘుమఘుమలాడే ఈ ఏడు రకాల పంజాబీ వంటకాలను ట్రై చేయాల్సిందే అంటూ వాటి గురించి సవివరంగా వివరించారు.షాహి పనీర్పర్ఫెక్ట్ రుచి కోసం క్రీమీ గ్రేవీతో ఉంటే పనీర్ క్యూబ్స్ వంటకం బెస్ట్. ఇది తేలికపాటి సుగంధద్రవ్యాలు, పెరుగుతో రుచికరంగానూ, ఆకర్షణీయంగా ఉంటుంది. దీన్ని పరాఠాతో ఆస్వాదిస్తే ఆ రుచే వేరు అని చెబుతున్నారు మహీంద్రా. రాజ్మా చావల్గ్లూటెన్ ఫ్రీ మీల్ కోసం ట్రై చేయాలనుకుంటే..రాజ్మా డిష్‌ని తినాల్సిందే. చక్కగా ఉల్లిపాయలు, టమోటాలు, కొద్దిపాటి సుగంధద్రవ్యాలతో చేసే వంటకం లంచ్‌లో కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. దీన్ని రైతా, ఊరగాయలతో తింటే టేస్ట్ అదుర్స్.పాలక్ పనీర్పంజాబీ-స్టైల్ పాలక్ పనీర్‌ను ఆస్వాదించాలంటే ముందుగా పాలక్‌ని మెత్తని పేస్ట్‌గా చేయాలి. ఆ మిశ్రమన్ని ఉల్లిపాయాలు, టమాటాల మిశ్రమంలో వేసి ఉడికించి చివరగా క్యూబ్డ్ పనీర్లతో ఉడికించి తింటే అబ్బబ్బా..! ఆ రచే వేరేలెవెల్..!దాల్ మఖానీకిడ్నీ బీన్స్‌తో తయారు చేసే వంటకం. దీన్ని వెన్నతో తయారు చేసే క్రీమ్ లాంటి గ్రేవీతో కూడిన వంటకం. ఉత్తర భారతీయుల వంటకాల్లో అత్యంత టేస్టీ వంటకం ఇదే. తప్పక రుచి చూడాల్సిందే.పనీర్ టిక్కామంచి ఆకలితో ఉన్నవారికి తక్షణమే శక్తినిచ్చి సంతృప్తినిచ్చే మంచి వంటకం. చక్కగా మెరినేషన్ చేసిన క్యూబ్డ్ పనీర్‌ని బంగారు రంగులో వేయించి వివిధ కూరగాయలతో సర్వ్ చేస్తారు. ఇది ప్రతి వేడుకలో ఉండే అద్భుతమైన వంకటం. పుదీనా చట్నీతో తింటే టేస్ట్ అదిరిపోతుంది. చోలే భాతురేశెనగలతో చేసే కర్రీ. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా వండే రుచికరమైన వంటకం. పూరీ, పరాఠాలలో అదిరిపోతుంది. దీనిలో ఉల్లిపాయలు, ఊరగాయ వేసుకుని చాట్ మాదిరిగా తిన్నా ఆ టేస్ట్ ఓ రేంజ్లో ఉంటుంది. మక్కీ డి రోటీ విత్ సర్సన్ డా సాగ్సార్సన్ డా సాగ్ అనేది సుగంధ ద్రవ్యాలు, ఆవపిండితో చేసే కర్రీ. మక్కీ డి రోటీ అంటే మొక్కజొన్న పిండితో చేసే ఒకవిధమైన రోటీ. వీటిని పెనంపై కాల్చరు. బోగ్గుల మీద లేదా వేడి గ్రిడిల్‌పై నేరుగా కాల్చుతారు. ఇంకెందుకు ఆలస్యం ఆనంద్ మహీంద్రా మెచ్చే ఈ వంటకాలను ఓసారి ట్రై చేయండి మరీ..!.(చదవండి: యువరాజా ఇదేం అవేర్నెస్ క్యాంపెయిన్..? ఏంటీ తీరు..?) -
మల్టీఫంక్షనల్ పర్ఫెక్ట్ కుక్వేర్
శాండివిచ్ దగ్గర నుంచి వాఫిల్స్ వరకు అన్నింటినీ సిద్ధం చేయడంలో ఈ డివైస్ ప్రత్యేకం. వెజ్, నాన్‌వెజ్ అనే తేడా లేకుండా భోజన ప్రియులకు నచ్చిన రుచులను నిమిషాల్లో అందించే మల్టీఫంక్షనల్ బ్రేక్ ఫస్ట్ మేకర్ ఇది. అన్నివిధాలా సౌకర్యవంతంగా పనిచేస్తుంది. పైగా దీన్ని పట్టుకుని వెళ్లడానికి వీలుగా ఒకవైపు ప్రత్యేకమైన హ్యాండిల్ ఉంటుంది. ముందువైపు లాక్ చేసుకునే వీలుతో పాటు టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి రెగ్యులేటర్ కూడా ఉంటుంది. డివైస్‌ను నిలబెట్టుకోవడానికి వీలుగా ప్రత్యేకమైన స్టాండ్స్ ఉంటాయి. దానికే పవర్ కనెక్టర్‌ని చుట్టి పక్కకు స్టోర్ చేసుకోవచ్చు. ఆమ్లెట్స్, కట్లెట్స్ ఇలా చాలానే వండుకోవచ్చు. అవసరాన్ని బట్టి వాఫిల్స్ ప్లేట్, గ్రిల్ ప్లేట్లను మార్చుకుంటూ ఉండొచ్చు. (చదవండి: ఈ చీజ్ ధర వింటే ..కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!) -
శాఖాహార మొసలి బబియా ఇక లేదు
కేరళలోని కాసరగోడ్ జిల్లాలో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ప్రధాన ఆకర్షణగా నిలిచిని శాఖాహార బబియా అనే మొసలి మరణించింది. ఈ మొసలి కేరళలోని అనంతపుర గ్రామంలోని దేవాలయంలో ప్రధాన ఆకర్షణగా ఉండేది. కేవలం అన్నం మాత్రమే ఆహారంగా తీసుకుని జీవించేది. ఈ మొసలి అనంత ద్మనాభ స్వామి ఆలయం చెరువు మధ్యలో ఉండేది. ఈ ఆలయా చెరువులోకి ఈ మొసలి ఎలా వచ్చిందనేది ఎవరికి తెలియదు. పైగా దానికి బబియా అనే పేరు ఎవరు పెట్టారో కూడా తెలియదు. కానీ అది ఎప్పుడూ క్రూరంగా ప్రవర్తించలేదని ఆ చెరువులో ఉండే చేపలను కూడా తినలేదని ఆ ఆలయ పూజారి చెబుతున్నాడు. ఆ ఆలయ పూజారికి మొసలికి చాలా అవినాభావ సంబంధం ఉంది. రోజు పూజారి ఆ మొసలికి రెండు సార్లు అన్నాన్ని అందిస్తాడని, ఒక్కోసారి ఆయనే అన్నాన్ని బంతిలా చేసి ఆ మొసలి నోటికి అందిస్తాడని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. పురాతన ఆలయ సాంప్రదాయానికి అనుగుణంగా పూర్తి శాఖాహార మొసలి అని ఆలయ పూజారి చెబుతున్నాడు. పూరాణాల ప్రకారం తిరువనంతపురంలో ఉన్న అనంతపద్మనాభ స్వామి మూలస్థానం ఇదేనని, ఆయని ఇక్కడే స్థిరపడినట్లు భక్తుల విశ్వసిస్తారు. అదీగాక ఈ బబియా అనే మొసలిని ఆలయాన్ని రక్షించడానికి దేవుడు నియమించిన సంరక్షకురాలని భక్తుల ప్రగాఢంగా నమ్ముతారు. (చదవండి: మేక మొక్కులకు భక్తులే షాకయ్యారు.. శివయ్య వరమిస్తాడా?.. వీడియో వైరల్) -
మాంసాహారుల్లోనే ‘స్ట్రోక్’లు తక్కువ!
సాక్షి, న్యూఢిల్లీ : మెదడులో రక్తనాళాలు చిట్లి చనిపోవడం (బ్రెయిన్ స్ట్రోక్) మాంసాహారుల్లో ఎక్కువగా జరుగుతుందని, శాకాహారుల్లో తక్కువగా ఉంటుందని ప్రజలు గత కొంత కాలంగా నమ్ముతూ వస్తున్నారు. పర్యవసానంగా బ్రిటన్‌లో శాకాహారుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం వారి సంఖ్య 17 లక్షలకు చేరుకుంది. వాస్తవానికి మాంసాహారుల కన్నా శాకాహారుల్లోనే ఈ స్ట్రోక్స్ ఎక్కువగా వస్తాయని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు జరిపిన ఓ సుదీర్ఘ అధ్యయనంలో తేలింది. వారు 50 వేల మందిపై 18 ఏళ్లపాటు అధ్యయనం జరిపి ఈ విషయాన్ని తేల్చారు. మాంసాహారులకన్నా శాకాహారుల్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం 20 శాతం అధికమని పరిశోధకులు తెలిపారు. శాకాహారుల్లో మెదడు రక్తనాళాల గుండా తక్కువ కొలస్ట్రాల్, బీ12 లాంటి విటమిన్లు తక్కువగా ప్రవహించడం వల్ల రక్తనాళాలు చీలిపోయే అవకాశం ఎక్కువగా ఉందని వారు చెప్పారు. అయితే మాంసాహారుల్లో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు చెప్పారు. మాంసం తినేవారికన్నా శాకాహారులు, చేపలు తినే వారిలో గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ ఉంటుందని వారు తెలిపారు. మాంసహారులతో పోలిస్తే శాకాహారుల్లో గుండెపోటు వచ్చే అవకాశం 22 శాతం తక్కువని చెప్పారు. వారు తమ అధ్యయన వివరాలను బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు. సగటున 45 ఏళ్ల ప్రాయంగల 50వేల మందిని ఎంపిక చేసుకొని వారిపై పరిశోధకులు తమ అధ్యయనం చేశారు. వారిలో సగం మంది మాంసహారులుకాగా, మూడో వంతు మంది శాకాహారులుకాగా, ఐదో వంతు మంది చేపలు తినేవారు. వారిపై 18 ఏళ్లపాటు అధ్యయనం కొనసాగించగా వారిలో 2,820 మంది గుండె జబ్బులకు గురికాగా, 1,072 మంది బ్రెయిన్ స్ట్రోక్‌లకు గురయ్యారు. మాంసహారులపైన అధ్యయనం జరపడం చాలా సులువుగానీ శాకాహారులపై అధ్యయనం జరపడం కష్టమని వివిధ యూనివర్శిటీలకు చెందిన ప్రొఫెసర్లు అభిప్రాయపడ్డారు. శాకాహారుల్లో సాధారణ ఆకుకూరలు, కూయగారలు తినే వాళ్లు ఎక్కువగా ఉంటారని, దుంపలు, గింజలు, పప్పు దినుసులు, పండ్లు తినేవారు తక్కువగా ఉంటారని, శాకాహారుల మెదడు రక్తనాళాల్లో కొలస్ట్రాల్ శాతం తక్కువ ఉన్నవాళ్లు వీటిని తిన్నట్లయితే కచ్చితంగా కొలస్ట్రాల్ శాతం పెరుగుతుందని ‘బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్’ సీనియర్ డైటిస్ట్ ట్రేసి పార్కర్ చెప్పారు. నేటి పరిస్థితుల్లో బ్రెయిన్ స్ట్రోక్ కన్నా గుండెపోటు వల్లనే ఎక్కువ మంది మరణిస్తున్నందున శాకాహారమే ఒక విధంగా మేలని ఆయన వ్యాఖ్యానించారు. (చదవండి: ఇదీ శాకాహార చరిత్ర) -
వీగనిజాలు
ఆహారపు అలవాట్లను బట్టి మనుషుల్లో శాకాహారులు, మాంసాహారులు రెండు రకాల విభజన అందరికీ తెలిసినదే. శాకాహారులు ఎలాంటి మాంసాహారాన్నీ తీసుకోరు. అయితే, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి పాడి ఉత్పత్తులను తీసుకుంటారు. శాకాహారులు తీసుకునే పదార్థాలతో పాటు గుడ్లు, చేపలు, పక్షుల మాంసం, జంతుమాంసం వంటివన్నీ తీసుకుంటారు మాంసాహారులు. సనాతన మతాల్లో ఆచారాన్ని అతిగా పాటించే వారు వీరవైష్ణవ, వీరశైవ వర్గాలుగా ఏర్పడినట్లుగా గడచిన శతాబ్దిలో ఆహారపు అలవాట్లలోనూ ఒక కొత్త అతిధోరణి మొదలైంది. తెలుగులో వీళ్లని వీర శాకాహారులనవచ్చు.ఇంగ్లిష్‌లో వీళ్లనే ‘వీగన్స్’ అంటున్నారు. వీళ్ల సిద్ధాంతమేమిటంటే పశు పక్ష్యాదులను వస్తువులుగా పరిగణించరాదు. అవి కూడా మనుషుల మాదిరిగా సాటి జీవులే. అందువల్ల వాటి నుంచి లభించే ఉత్పత్తులేవీ తీసుకోరాదు. పూర్తిగా ఈ సిద్ధాంతాన్ని నమ్ముకున్నవారు కనీసం పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి పాడి ఉత్పత్తులను కూడా తీసుకోరు. కేవలం మొక్కలు, చెట్ల నుంచి లభించే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. పాల ఉత్పత్తులను కూడా తీసుకునే శాకాహారులను ఇంగ్లిష్‌లో వెజిటేరియన్స్ అంటారు. పాల ఉత్పత్తులను తీసుకోని వీర శాకాహారులకు ‘వీగన్స్’ అనే పేరును 1944లో తొలిసారిగా డొనాల్డ్ వాట్సన్ అనే జంతు హక్కుల పరిరక్షణ ఉద్యమ కార్యకర్త ఖాయం చేశాడు. అప్పటి నుంచి పాల ఉత్పత్తులను సైతం నిరాకరించే వీర శాకాహారులకు ‘వీగన్స్’ పేరు స్థిరపడిపోయింది. డొనాల్డ్ వాట్సన్ ఇంగ్లండ్‌లో ‘వీగన్స్ సొసైటీ’ని కూడా ప్రారంభించాడు. ‘వీగన్’ ఆహారం అన్ని వయసుల వారికి, అన్ని శారీరక స్థితులకు చెందిన వారికి పూర్తిగా ఆమోదయోగ్యమైనదేనని అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, డైటీషియన్స్ ఆఫ్ కెనడా, బ్రిటిష్ డైటెటిక్ అసోసియేషన్ సంస్థలు ప్రకటించాయి. అయితే, జర్మన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ మాత్రం ఈ వాదనతో విభేదించింది. పాలు, పాల ఉత్పత్తులు సైతం లేని వీగన్ ఆహారం అన్ని వయసుల వారికీ ఆమోదయోగ్యం అని చెప్పడం తగదని, చిన్నారి శిశువులు, ఎదిగే వయసులోని పిల్లలు, గర్భిణులు, బాలింతలు పూర్తిగా వీగన్ ఆహారంపైనే ఆధారపడితే వారికి తగిన పోషణ లభించదని తేల్చిచెప్పింది. వారు కనీసం పాలు, పాల ఉత్పత్తులనైనా తమ ఆహారంలో భాగంగా చేసుకోవడమే మంచిదని స్పష్టం చేసింది. ఇదీ శాకాహార చరిత్ర ఆదిమానవులు ఆకులు అలములు పండ్లు దుంపలతో పాటు జంతుమాంసాన్ని కూడా తినేవారు. తొలి నాళ్లలో పచ్చిమాంసాన్ని తినేవాళ్లు. నిప్పును కనిపెట్టిన తర్వాత కాల్చిన మాంసం రుచి మరిగారు.కంచు, ఇనుము వంటి లోహాలను కనుగొని వాటితో పాత్రలు తయారు చేయడం, మట్టిపాత్రలు తయారు చేయడం మొదలైన తర్వాత రుచికరమైన ఆహారాన్ని వండుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. తొలి నాగరికతల్లో చాలా చోట్ల మనుషులు మాంసాహారులుగానే ఉండేవారు. సింధులోయ నాగరికత విలసిల్లిన ప్రాంతంలో కొందరు శాకాహారులుగా జీవించారనేందుకు ఆధారాలు ఉన్నాయి. అప్పటి కాలంలో అంటే క్రీస్తుపూర్వం 3300–1300 సంవత్సరాల మధ్య కాలంలో మన దేశానికి వాయవ్య ప్రాంతంలో కొందరు శాకాహారులుగా ఉండేవారు. ఈ ప్రాంతంలో కొంత ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దానికి చెందిన జైన మత వ్యవస్థాపకుడు వర్ధమాన మహావీరుడు శాకాహారాన్ని ప్రోత్సహించాడు. ఆయన ప్రభావంతో భారత భూభాగంలోని చాలా ప్రాంతాలకు శాకాహారం విస్తరించింది. జీవహింస పాపమనే చింతన గలవారిలో చాలామంది శాకాహారులుగా మారారు. తొలినాటి శాకాహారులు ఇప్పటి వీగన్ల మాదిరి వీర శాకాహారులేమీ కాదు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో పాటు వారు పాలను, పాల ఉత్పత్తులను కూడా తీసుకునేవారు. చరిత్రకెక్కిన తొలినాటి శాకాహారుల్లో మౌర్య సామ్రాజ్యాన్ని ఏలిన చంద్రగుప్తుడు, అశోకుడు, ప్రాచీన తమిళకవి వళ్లువార్, రోమన్ కవి ఓవిద్, రోమన్ నాటకకర్త సెనెకా ది యంగ్, గ్రీకు తత్వవేత్తలు ఎంపెడాక్లిస్, థియోఫ్రాస్టస్, ప్లూటార్క్, పైథాగరస్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఆహారం కోసం జంతువులను, పక్షులను చంపడాన్ని పైథాగరస్ తీవ్రంగా వ్యతిరేకించేవాడని, వాటిని చంపేవారికి, వాటితో వంటకాలు తయారు చేసేవారికి కూడా దూరంగా ఉండేవాడని ప్లాటో రాశాడు. ఇప్పటి కాలంలో వీగన్స్గా పిలుచుకొనే వీరశాకాహార ధోరణికి క్రీస్తుశకం పదో శతాబ్దిలోనే మూలాలు ఏర్పడ్డాయి. అప్పటి కాలానికి చెందిన అరబ్ కవి అబ్దుల్ అల్ అలమారి వీరశాకాహారాన్ని పాటించేవాడు. పశుపక్ష్యాదులకు చెందిన ఎలాంటి ఉత్పత్తులనూ తీసుకునేవాడు కాదు. తన అనుచరులకు కూడా ఇదే సిద్ధాంతాన్ని బోధించేవాడు. మనుషులు పశుపక్ష్యాదులను తినేస్తున్నట్లయితే మరణానంతరం పశుపక్షుల ఆత్మలు మనుషుల్లో, మనుషుల ఆత్మలు పశుపక్ష్యాదుల్లోనికీ చొరబడే ప్రమాదం ఉందని, అలాంటి ప్రమాదం తలెత్తకుండా ఉండాలంటే మనుషులందరూ ఆహారం కోసం కేవలం వృక్షజాతులపై ఆధారపడటమే సరైన పద్ధతి అని ఆయన బలంగా నమ్మేవాడు. అప్పట్లో ఈ సిద్ధాంతం పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. అప్పటి కాలంలో అహింసావాద సిద్ధాంతాన్ని నమ్మేవారిలో చాలామంది స్వచ్ఛందంగా శాకాహారం వైపు మళ్లారు. నిర్ణీత ఆహారపు అలవాట్ల వల్ల చేకూరే ప్రయోజనాలపై మాత్రం వారిలో చాలామందికి తగిన అవగాహన ఉండేది కాదు. డొనాల్డ్ వాట్సన్ గత శతాబ్దిలో ‘వీగన్స్ సొసైటీ’ని ప్రారంభించినా, వీగన్ ఆహారానికి మాత్రం గడచిన దశాబ్దకాలంగా మాత్రమే ప్రాచుర్యం పెరుగుతూ వస్తోంది. శాకాహారం ప్రయోజనాలూ పరిమితులూ పాల ఉత్పత్తులను స్వీకరించే శాకాహారులను వెజిటేరియన్లుగా, పాల ఉత్పత్తులను సైతం ఆహారంలో భాగంగా చేసుకోని వారిని ‘వీగన్స్’గా పరిగణిస్తారు. నిజానికి శాకాహారంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నా, వాటితో పాటే కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. శాకాహారం వల్ల కలిగే ప్రయోజనాలు, అందులోని పరిమితులతో పాటు వీగన్ ఆహారంపై ప్రచారంలో ఉన్న విషయాల గురించి వాస్తవిక దృక్పథంలో అవగాహన కల్పించడానికే ఈ సమాచారం.. శాకాహారం చాలా మేలు చేస్తుంది. మాంసాహారం తీసుకోవడం వల్ల మన శరీరంలోకి కొన్ని సూక్ష్మజీవులు చేరుతాయి. అవి వ్యాధులకు కారణమవుతాయి. ఉదాహరణకు పందిమాంసం (పోర్క్) ద్వారా టేప్‌వార్మ్స్ వంటివి, బొవైన్ స్పాంజీతో ఎన్సెఫలోపతి, గొడ్డు మాంసంతో మ్యాడ్ కౌ డిసీజ్, ఆంథ్రాక్స్ వంటివి. గుడ్లు తినడం వల్ల సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఉంటాయి.ఫలితంగా న్యుమోనియా, బ్రాంకైటిస్, టైఫాయిడ్ వంటి వ్యాధులు రావచ్చు. శాకాహారంతో అలాంటి ప్రమాదం చాలా చాలా తక్కువ. ఇవీ పరిమితులు శాకాహారం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నా, దీనికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. కేవలం శాకాహారం మాత్రమే శరీరానికి కావలసిన అన్ని పోషకాలనూ పూర్తిగా అందించలేదు. ముఖ్యంగా ప్రొటీన్లు, విటమిన్ బి–12, విటమిన్–డి, ఐరన్ వంటి పోషకాలు తగినంతగా లభించాలంటే కనీసం పాలు, పాల ఉత్పత్తులనైనా తీసుకోవాల్సి ఉంటుంది. ∙శరీరానికి కావలసిన ప్రొటీన్లు శాకాహారంతో పోలిస్తే మాంసాహారం ద్వారానే తేలికగా లభిస్తాయి. చాలా వరకు శాకాహార పదార్థాల్లో ప్రొటీన్ల పరిమాణం తక్కువగా ఉంటుంది. శాకాహారం ద్వారా మాత్రమే పూర్తిగా ఆధారపడి శరీరానికి కావాల్సిన పరిమాణంలో ప్రొటీన్లు పొందాలంటే పప్పులు, సోయా వంటి గింజధాన్యాలు, వాటితో తయారయ్యే సోయా మిల్క్, తోఫు వంటి ఉత్పత్తులను తప్పనిసరిగా ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ప్రొటీన్లు పుష్కలంగా ఉండే కినోవా, అవిసెగింజలను కూడా రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. పాల ఉత్పత్తులు, గుడ్లు వంటి వాటితో పోలిస్తే ఇవేవీ అంత చౌకైన ప్రత్యామ్నాయాలు కావు. ∙యుక్తవయసు వచ్చిన నాటి నుంచి అంటే... 19 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు వయసు గలవారికి ప్రతి ఒక్కరికీ 1000 మిల్లీగ్రాముల క్యాల్షియమ్ అవసరం. ఇది పాల ఉత్పత్తుల్లో పుష్కలంగా ఉంటుంది. అయితే వీగనిజమ్ అవలంబించే వారికి అదే మొత్తంలో క్యాల్షియం లభ్యం కావాలంటే వాళ్లు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు అంటే పాలకూర, బ్రకోలీ, పొద్దుతిరుగుడు గింజలు, సోయా ఉత్పత్తులు వంటివి ప్రతిరోజూ తీసుకోవాలి. వీరశాకాహారం పేరిట పాలు, పాల ఉత్పత్తులను సైతం మానేసి, ప్రత్యామ్నాయాలను తగినంతగా తీసుకోలేకపోతే ఎముకలకు తీరని నష్టం వాటిల్లుతుంది.ఎముకల్లోకి క్యాల్షియం ఇంకిపోవాలంటే, శరీరానికి కీలకమైన విటమిన్–డి తగినంతగా అందాలి. పూర్తిగా ఎదిగిన యుక్తవయస్కులకు ప్రతిరోజూ 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ (ఐయూ) పరిమాణంలో విటమిన్–డి అవసరం. ఇది కూడా పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, సూర్యకాంతి ద్వారా లభిస్తుంది. పాలు, గుడ్లు మానుకునేవారు ఈ లోటును భర్తీ చేసుకోవడానికి తప్పనిసరిగా ప్రతిరోజూ సోయా ఉత్పత్తులు, పుట్టగొడుగులు వంటివి తీసుకోవాలి. ∙రక్తహీనత బారిన పడకుండా ఉండటానికి ఐరన్ చాలా అవసరం. ఇది మాంసాహారంలో తక్షణం లభిస్తుంది. అయితే శాకాహారం ద్వారానే ఇది లభ్యం కావాలంటే ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్, గుమ్మడి గింజలు, నువ్వులు, సోయాబీన్ నట్స్ వంటివి పుష్కలంగా తీసుకోవాలి. విటమిన్–సి ఎక్కువగా ఉండే నిమ్మజాతి పండ్లు టమాటాలు తినడం వల్ల కూడా ఐరన్ తేలిగ్గా శరీరంలోకి ఇంకుతుంది. ∙విటమిన్ బి–12 పూర్తిగా జంతు సంబంధ ఆహారంలోనే లభిస్తుంది. మాంసం తినకపోయినా, కనీసం పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా విటమిన్ బి–12 లోపం తలెత్తకుండా చూసుకోవచ్చు. విటమిన్ బి–12 లోపిస్తే మెదడు నరాల నుంచి అవయవాలకు ఆదేశాలు అందడంలో ఆటంకాలు, స్పృహతప్పడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఎండ కన్నెరగకుండా ఇళ్లకు, ఆఫీసులకు మాత్రమే పరిమితమవుతూ, కేవలం శాకాహారాన్ని మాత్రమే తీసుకునే వారిలో విటమిన్–డి, విటమిన్–బి12 లోపంతో వచ్చే నరాల సమస్యలు, ఎముకల సమస్యలు ఇటీవలి కాలంలో చాలా పెరిగాయి. అందుకే కేవలం వెజిటేరియన్ ఆహారంపైనే ఆధారపడే వారు, విటమిన్–డి, విటమిన్–బి12, ఐరన్ వంటి కీలకమైన పోషకాల కోసం సప్లిమెంట్ల వంటి ప్రత్యామ్నాయాలపై మరింత ఎక్కువ దృష్టిపెట్టాలి. వీగన్ ఆహారానికి పెరుగుతున్న ప్రాచుర్యం గడచిన దశాబ్దకాలంగా వీగన్ ఆహారానికి ప్రాచుర్యం పెరుగుతోంది. అమెరికా, ఇంగ్లండ్, నెదర్లాండ్స్ వంటి పాశ్చాత్య సంపన్న దేశాలతో పాటు చైనా, హాంకాంగ్ వంటి ప్రాచ్య దేశాల్లోనూ ప్రాసెస్ చేసిన వీగన్ ఆహార పదార్థాల మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. అమెరికాలో పాడి పరిశ్రమ ద్వారా వచ్చే పాలకు బదులు సోయా మిల్క్ వంటి ప్రత్యామ్నాయ ఉత్పత్తులను తీసుకునే వారి సంఖ్య గత ఎనిమిదేళ్లలోనే 41 శాతం మేరకు పెరిగింది. పూర్తిగా శాకాహార పదార్థాలతో తయారుచేసిన కృత్రిమమాంసం అమ్మే దుకాణాలు కూడా పాశ్చాత్య దేశాల్లో వెలిశాయి. జర్మనీలో 2011లో వీగన్ సూపర్‌మార్కెట్ ప్రారంభమైంది.యూరోప్‌లో వీగన్ల కోసం ప్రత్యేకంగా వెలిసిన తొలి సూపర్‌మార్కెట్ ఇదే. ప్రపంచవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు వీగన్ ఆహారం వైపు మళ్లుతున్నారు. ఇవీ ప్రయోజనాలు శాకాహారం వల్ల కలిగే ప్రయోజనాలను ఇటీవలి పరిశోధనలు తేటతెల్లం చేస్తున్నాయి. మాంసాహారంతో పోలిస్తే శాకాహారమే ఎంతో మేలైదని తెలిపే అధ్యయన ఫలితాలు తరచుగా వెల్లడవుతున్నాయి. వాటిలో వెల్లడైన ఫలితాల సారాంశం సంక్షిప్తంగా... ∙శాకాహారం మన శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను తొలగిస్తుంది. అందుకే శాకాహారాన్ని స్వాభావికమైన డీటాక్స్ (విషహరిణి)గా చెప్పవచ్చు. శాకాహారంలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది, విటమిన్లు, ఖనిజలవణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఒక అధ్యయన ఫలితం ప్రకారం శాకాహారం తినే జంతువులతో పోలిస్తే మాంసాహారం తినే వాటిల్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ 10 శాతం అదనంగా స్రవిస్తూ ఉంటుంది. ∙మాంసాహారం సాధారణంగా ఒకేరంగుతో కంటికి అంత ఆకర్షణీయంగా కనిపించదు. కానీ శాకాహారంలోని రకరకాల పదార్థాలు రకరకాల రంగులతో ఆకర్షణీయంగా ఉంటాయి. సహజంగా దొరికే రంగురంగుల ఆహారపదార్థాల్లో నచ్చిన వాటిని ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉండటం వల్ల వైవిధ్య భరితమైన విభిన్న తరహా ఆహారాలతో, అవి అందించే విభిన్న పోషకాలతో ఆరోగ్యం బాగుంటుంది. ∙ శాకాహారం తేలికగా జీర్ణమవుతుంది. కూరగాయలు, గింజలు, ఆకుకూరలతో కూడిన ఆహారంలో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మొలలు, స్థూలకాయం, డయాబెటిస్, మలబద్ధకం, హయటస్ హెర్నియా, డైవర్టిక్యులైటిస్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, పిప్పి పళ్లు (డెంటల్ కేరిస్), పిత్తాశయంలో రాళ్లు వంటి అనేక వ్యాధుల నివారణ స్వాభావికంగానే జరుగుతుంది. ∙పప్పులు, గింజలు, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో కూడిన శాకాహారంతో ఆరోగ్యానికి జరిగే మేలు అంతా ఇంతా కాదు. వీటిలోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల తరచుగా వీటిని తీసుకునేవారు స్థూలకాయం బారిన పడకుండా ఉంటారు. అంతేకాదు, యాంటీ ఆక్సిడెంట్లు మేని మెరుపును కాపాడతాయి. పండ్లు ఆకుకూరలు తరచూ తినేవారికి స్థూలకాయం వల్ల తలెత్తే డయాబెటిస్, హైబీపీ వంటి సమస్యలు కూడా చాలావరకు ఉండవు. పండ్లు, ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజలవణాలతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అందుతాయి. శాకాహారం వల్ల పిప్పిపళ్లు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా అరుదు. -
శాకాహారులకు, మాంసాహారులకు వేరువేరు సీట్లు
న్యూఢిల్లీ : దేశీయ రైళ్లు శాకాహారులు, మాంసాహారులను వేరు చేయనున్నాయా? ఆన్‌బోర్డు రైళ్లలో శాకాహారులకు, మాంసాహారులకు వేరు వేరు సీట్లు కేటాయించనున్నారా? అంటే ఏమో అది జరగవచ్చు అంటున్నారు కొందరు. ఆహారపు అలవాట్లను ఆధారంగా చేసుకుని రైళ్లలో వేరు వేరు సీట్లు కేటాయించేలా కోర్టు జోక్యం చేసుకోవాలని గుజరాత్ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిల్‌ను అహ్మదాబాద్‌లోని ఖాన్పూర్కు చెందిన ఈఈ సైద్ అనే న్యాయవాది దాఖలు చేశారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టు ప్రకారం ప్రయాణికుల ఆహారపు ఎంపికలను బట్టి రైళ్లలో సీట్లను కేటాయించేలా దేశీయ రైల్వేను ఆదేశించాలని కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. వచ్చే వారం ఈ పిల్ విచారణకు రానుంది. తాను వేసిన ఈ పిల్లో ఎలాంటి రాజకీయ కోణం లేదని పిటిషనర్ చెప్పారు. ప్రయాణికులకు మంచి ఆహారాన్ని అందించడంలో దేశీయ రైల్వే అత్యంత జాగ్రత్త వహించాలని సైద్ అన్నారు. ట్రైన్ బుక్ చేసుకునేటప్పుడే ఈ ఆప్షన్‌ను కల్పించాలని, దీంతో శాకాహార ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. వారి ఆహారపు అలవాట్లకు తగ్గట్టు సీట్లను ఎంపిక చేసుకునేలా ప్రోత్సహించవచ్చన్నారు. సైద్ తాను శాకాహారిగా చెప్పారు. ఈ పిల్లో రైల్వే మంత్రిత్వ శాఖను, దేశీయ రైల్వే కేటరిగింగ్, టూరిజం కార్పొరేషన్‌ను, పశ్చిమ రైల్వే జోన్‌ను, గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చారు. -
నేడు శాకాహారుల్లో ఎనిమిది రకాలు
సాక్షి, న్యూఢిల్లీ : శాకాహారం అనగానే మనకు గాంధీయిజం, ఆధ్యాత్మికవాదం, యోగా, బ్రాహ్మణవాదం ఎక్కువగా గుర్తొస్తాయి. ఎందుకంటే వీటిని విశ్వసించే వారిలో ఎక్కువ మంది శాకాహారులు ఉండడమే కారణం. భారత్, పాశ్చాత్య దేశాల్లో శాకాహారానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. శాకాహారం అనే పదం తినే ఆహారానికే పరిమితం కాలేదు. అదొక జీవన శైలి. అందుకోసమే అంతర్జాతీయంగా శాకాహారం కోసం ఉద్యమాలు జరిగాయి, జరుగుతున్నాయి. శాకాహారంతో నైతిక విలువలు కూడా ముడిపడి ఉన్నాయి. జంతువులను హింసించకపోవడం అన్నదే ఇక్కడ నైతిక విలువలకు ప్రమాణం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల్లో ఎక్కువ మంది శాకాహారులే ఉన్నా. భారతీయుల్లో మాత్రం మాంసం తినేవారే ఎక్కువ. భారత్‌లో తరతరాల నుంచి సంప్రదాయబద్దంగా బ్రాహ్మణుల లాంటి అగ్రకులస్థులు శాకాహారాన్ని పాటిస్తుంటే తక్కువ కులస్థులు మాంసాహారాన్ని తింటున్నారు. అందుకు కారణం వారి వారి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక నేపథ్యమే కారణం. ఒకప్పుడు అగ్ర, నిమ్న కులస్థులు అనే తేడా లేకుండా అందరూ మాంసం తిన్నట్లు శాస్త్రాల్లోనే రుజువులున్నాయి. దేశంలో జీవహింస కూడదంటూ జైన, బౌద్ధ మతస్థులు ముందుగా శాకాహారాలుగా మారారు. ఆ మతాల ప్రభావాన్ని అడ్డుకోవడానికి ఏడవ శతాబ్దంలో హిందూ సూక్తుల్తో శాకాహారవాదం ప్రారంభమైంది. అంతకంటే ముందే యూరప్‌లో ఆరవ శతాబ్దంలోనే శాకాహారవాదం మొదలైంది. ప్రముఖ గ్రీకు తాత్వికుడు పైథాగరస్ శాకాహారం ప్రాముఖ్యతపై రచనలు చేసి ప్రచారం చేశారు. అందుకనే అప్పట్లో అక్కడి శాకాహారులను పైథాగరియన్లు అని వ్యవహరించారు. 1847లో ఇంగ్లండ్‌లోని రామ్స్గేట్ పట్టణంలో పూర్తిగా శాకాహారులు ఉన్నట్లు బయటపడింది. ఆ తర్వాత 1850లో అమెరికాలోని న్యూయార్క్ సిటీలో కూడా ఓ శాకాహార సొసైటీ వెలుగులోకి వచ్చింది. పాశ్చాత్య దేశాలకన్నా ఎన్నో శతాబ్దాలు ముందుగా భారత్‌లో శాకాహారం ఉద్యమాలు వచ్చాయి. భారత్, పాశ్చాత్య ఉద్యమాలకు కూడా ఎంతో వ్యత్యాసం ఉంది. వేర్వేరు కారణాలతో వేర్వేరు శక్తుల నాయకత్వంలో ఈ ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. బ్రిటన్, అమెరికా రెండు దేశాల్లోనూ 19వ శతాబ్దంలో చర్చిల ప్రభావంతో శాకాహారవాదం వచ్చింది. విలువలు, నైతికత, పర్యావరణం, వన్యప్రాణ హక్కులు, ఆహారం–భద్రత అంశాల ప్రాతిపదికగా ఈ శాకాహార ఉద్యమం కొనసాగింది. ఇందుకోసం అక్కడి మనుషుల్లో మార్పు వచ్చింది. మార్పు కోసం వారు శాకాహారాన్ని ఆశ్రయించారు. అప్పుడే అది ఒక ఆహారానికి సంబంధించిన అంశం కాకుండా జీవనశైలిగా మారిపోయింది. అంటే జంతువుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ నైతిక విలువలను కలిగి ఉండడమే వారి జీవనశైలి. భారత్‌లో జైన, బైద్ధ మతాల ఆవిర్భావంతో శాకాహారం ఓ జీవనశైలిగా మారిపోయినప్పటికీ బలమైన కులవ్యవస్థ కారణంగా శాకాహారం, మాంసహారం అనేది ఎక్కువగా కులాలకే పరిమితం అవుతూ వస్తోంది. సమాజంలో తమకు సమాన గౌరవం లభించాలనే ఉద్దేశంతో గతంలో కొన్ని నిమ్న కులాల తరఫున శాకాహార ఉద్యమాలు జరిగాయి. శాకాహారులుగా మారిన దళితులు కూడా ఉన్నారు. బ్రాహ్మణులు మాత్రం తమ ఆధిపత్యం కోసం వారిని మాంసహారులంటూ దూరంగా ఉంచుతూ వచ్చారు. జంతువుల మాంసం తినడం మానేస్తే జంతు సంరక్షణకు కట్టుబడి ఉన్నట్లు కాదని, వాటి సంతానానికి వదిలేయాల్సిన పాలను మనం సేకరించి పాలు, పెరుగు, వెన్నగా తినడం కూడా మాంసహారం కిందకే వస్తుందన్న కొత్త వాదనలు కూడా పుట్టుకొచ్చాయి. శాకాహారం అంటే గౌరవం పెరగడంతో తాము ఒకరకమైన శాకాహారులమేనంటూ చెప్పుకోవడం మొదలవడంతో జనంలో ప్రస్తుతం ఎనిమిది రకాల శాకాహారులు మొదలయ్యారు. 1. పూర్తి విజిటేరియన్లు (ఏ రూపంలోనూ మాంసాన్ని తీసుకోకపోవడం), 2. ఎగ్‌టేరియన్లు (ఎగ్ తప్ప చికెన్, మాంసం తిననివారు), 3. కేకిటేరియన్లు (ఎగ్‌తో చేసిన కేక్‌ను తినేవారు), 4. గ్రేవిటేరియన్లు ( కూర అంటు తప్ప మాంసం తిననివారు), 5. రిస్ట్రిక్టేరియన్లు (ఇంటి బయట మాంసం తినేవారు), 6. బూజిటేరియన్లు (మద్యం సేవించినప్పుడే మాంసం తినేవాళ్లు), 7. ఫోర్సిటేరియన్లు (మిత్రులు లేదా బంధువుల బలవంతం వల్ల మాంసం తినేవాళ్లు), క్యాలెండర్టేరియన్లు (గురు, శని లాంటి కొన్ని వారాల్లో మాంసం ముట్టనివారు). ఈ మధ్య యువతలో ఫిట్నెస్ పిచ్చి పెరగడంతో వారు బహిరంగంగానో, రహస్యంగానో అత్యధికంగా ప్రొటీన్లు ఉండే మాంసాహారాన్ని ఆశ్రయిస్తున్నారు. -
ఆ తిండి విషయంలో మహిళలే ఎక్కువ
న్యూఢిల్లీ: ‘గోమాంసం లేదా మేక మాంసం కలిసిన తేనేరు (పోషక విలువల పేరిట గ్రీన్ టీలో గోమాంసం కలుపుతున్న విషయం తెల్సిందే) సేవించపోతే చనిపోతావని ఎవరైన వైద్యుడు సలహా ఇచ్చినా నేను చనిపోవడానికి ఇష్టపడతాను. అది శాకాహారం పట్ల నాకున్న కట్టుబాటు’ అని జాతిపిత మహాత్మాగాంధీ లండన్ విజిటేరియన్ సొసైటీతో 1931, నవంబర్ 20న చేసిన వ్యాఖ్య. శాఖాహారాన్ని అంతగా ప్రేమించే గాంధీ కూడా ఎన్నడూ గోమాంసాన్ని తినే వారిని ద్వేశించలేదు. వారిని అంటరాని వారిగా చూడలేదు. నేడు గోమాంసం పేరిట హత్యలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లాంటి దేశంలో మాంసాహారులు ఎంత మంది ఉన్నారో, శాకాహారాలు ఎంత మంది ఉన్నారో పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. దేశంలో ‘రిజిస్ట్రేషన్ సిస్టమ్ బేస్‌లైన్’ 2014లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం దేశంలో 29 మంది శాకాహారాలుండగా, 71 శాతం మంది మాంసాహారులు ఉన్నారు. జీవ హింస కూడదంటూ పెటా లాంటి సంస్థలు చేసిన ప్రచారం, శాకాహారం ఉత్తమమైనదంటూ శాకాహార ప్రోత్సాహక సంస్థలు చేసిన విస్తత ప్రచారం కారణంగా 2004 నుంచి 2014 వరకు, పదేళ్ల కాలంలో దేశంలో నాలుగు శాతం శాకాహారులు పెరిగారు. అంటే మాంసాహారుల సంఖ్య 75 నుంచి 71కి తగ్గింది. శాకాహారులు వాయువ్య రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే శాకాహారులు ఎక్కువ మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా అగ్రవర్ణాల్లోనే శాకాహారులు ఎక్కువగా ఉండగా, వారిలో బ్రాహ్మణలు ఎక్కువగా ఉన్నారు. బ్రాహ్మణుల్లో యాభై శాతం మంది శాకాహారులు ఉన్నారు. మొత్తం మాంసాహారుల్లో ఎస్సీ, ఎస్టీలే ఎక్కువ. వారిలో శాకాహారులు తక్కువ. మగవారితో పోలిస్తే ఇటు మాంసాహారుల్లోగానీ, శాకాహారుల్లోగానీ మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీల్లోని మాంసాహారుల్లోనూ మహిళదే పైచేయి. దేశంలో మొత్తం మాంసాహారుల్లో మహిళలు 71.6 శాతం కాగా, మగవాళ్లు 70.7 శాతం ఉన్నారు. ఎస్సీలో మాంసహారులు పురుషులు 76. 1 శాతంకాగా, మహిళలు 77.9శాతం, ఎస్టీల్లో పురుషులు 75.9 శాతంకాగా, మహిళలు 76 శాతం మంది ఉన్నారు. మాంసాహారంలో పోషక విలువలు ఎక్కువగా ఉండడం, తక్కువకు లభిస్తుండడం వల్ల ఎస్సీ,ఎస్టీలు, దిగువ కులాల వారు ఎక్కువగా మాంసహారాన్ని ఆశ్రయిస్తున్నారు. -
ప్రపంచమంతా మాంసాహారాన్ని మానేస్తే....
లండన్: మాంసాహారానికి స్వస్తి చెప్పి శాకాహారాన్ని ఆశ్రయించాలని ప్రపంచవ్యాప్తంగా విజిటేరియన్లు ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే. అందరూ శాకాహారాన్ని ఆశ్రయించడం వల్ల పర్యావరణాన్ని కూడా పరిరక్షించిన వారమవుతామన్న కొత్త వాదన కూడా శాకాహార ప్రోత్సహానికి దోహద పడుతోంది. ఈ మేరకు ప్రపంచమంతా మాంసాహారానికి స్వస్తి చెబితే ఏమవుతుంది? పళ్లు, కూరగాయల పెంపకం వల్ల వాతావరణంలో కలిసే కార్బన్డయాక్సైడ్ కన్నా కోళ్లు, మేకలు, ఆవులు, పందుల మాంసం వల్ల ఎక్కువ కార్బన్డయాక్సైడ్ వాతావరణంలో కలుస్తోంది. 226 గ్రాముల బంగాళ దుంపలు విడుదలచేసే కర్బన ఉద్గారాలు ఓ చిన్నకారు 0.2 కిలోమీటర్లకు విడుదల చేసే కర్బన ఉద్గారాలతో సమానం. అదే 226 గ్రాముల ఆవు మాంసం విడుదల చేసే కర్బన ఉద్గారాలు ఓ చిన్నకారు 12.7 కిలోమీటర్లకు విడుదల చేసే కర్బన ఉద్గారాలతో సమానమని ‘సైంటిఫిక్ అమెరికన్’ పత్రిక వెల్లడించింది. ప్రపంచమంతా మాంసాహారాన్ని మానేసి శాకాహారానికి మారితే పర్యావరణంలో కర్బన ఉద్గారాలు మూడింట రెండు వంతులు తగ్గుతాయని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలోని ఆక్స్ఫర్డ్ మార్టిన్ స్కూల్ జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. మాంసాహారాన్ని వదులుకోవడం వల్ల అపారంగా నీటి వనరులు కూడా మిగులుతాయి. చెరకు, కూరగాయలు, పళ్లు, పప్పు దినుసులు పండించడం కన్నా కోళ్లు, మేకలు, గొర్రెలు, ఆవుల పెంపకానికి ఎక్కువ నీటి వనరులు అవసరమవుతాయి. అన్నింటి కన్నా ఆవులకు ఎక్కువ నీరు అవసరం. శాకాహారం ఫలితంగా ప్రపంచమంతా పచ్చదనం అలుముకుంటుందని, పర్యావరణంతోపాటు మానవుల ఆరోగ్యం కూడా బాగుపడుతుందన్నది ఈ పరిశోధనల సారాంశం. మాంసాహారానికి స్వస్తి చెప్పడం వల్ల లాభాలే తప్ప నష్టాలే లేవా? ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి దాదాపు 400 కోట్ల నెమరువేసే జంతువులను, లక్షలాది కోట్ల కోళ్లను మాంసం కోసం పోషిస్తున్నారు. వీటికి స్వస్తి చెప్పడం వల్లన జీవవైవిద్యం దెబ్బతింటుంది. పేదలకు పౌష్టికాహారం మాంసం రూపంలోనే ఎక్కువగా దొరకుతుంది. అది వారికి దూరమైతే అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. మరో పక్క ప్రపంచంలో మాంసాహారంపై ఆధారపడి కోట్లాది మంది ప్రజలు ఉపాధి పొందుతున్నారు. మాంసాహారానికి స్వస్తి చెబితే వారంతా ఒక్కసారిగా రోడ్డున పడడమే కాకుండా కొన్ని జాతుల ప్రజల సంస్కతి, సంప్రదాయాలు కూడా దెబ్బతింటాయని కేంబ్రిడ్జి యూనివర్శిటీ ఓ అధ్యయనంలో తెలిపింది. నిరుద్యోగ సమస్య పెరిగి ప్రజల మధ్య అసమానతలు పెరుగుతాయని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైషమ్యాలు కూడా పెరుగుతాయని యూనివర్శిటీ అందులో హెచ్చరించింది. పలు ప్రాణాధార ఔషధాల్లో జంతు ఉత్పత్తులను వాడుతున్నారు. వాటికి కూడా స్పస్తి చెప్పాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా శాకాహారం గురించి ఎంత తీవ్రంగా ప్రచారం చేస్తున్న మాంసాహారం మానేసే వారు తక్కువే ఉన్నారు. కనుక ఇప్పట్లో మాంసాహారాలకు వచ్చే ముప్పేమి లేదు. -
ఎగ్స్(క్స్)లెంట్!
అటు వెజిటేరియన్స్నీ ఇటు నాన్ వెజిటేరియన్స్నీ కూడా అలరించే ఆహారం కోడిగుడ్డు. అయితే ఇది ఇంటీరియర్ డెకొరేటర్స్ని కూడా ఆకట్టుకుంటుంది తెలుసా? అదెలా అంటే.. ఇదిగో ఇలా. తమలోని సృజనాత్మకతకు పదునుపెట్టి కొందరు కోడిగుడ్డు గుల్లకి కొత్త ఆకారాన్ని తెచ్చారు. రంగురంగుల చిత్రాలు గీస్తే అది మంచి పెయింటింగ్ అయిపోయింది. సగానికి విరిచి నూనె పోసి ఒత్తు వేస్తే దీపమై వెలుగిస్తోంది. ఇంత మట్టి వేసి అందులో ఒక మొక్క పాతితే కుండీలా మారిపోయింది. మనం ఏం చేసినా అది మన ఇంటికి అందాన్ని తీసుకొస్తుందని తెలిసొచ్చింది. కాబట్టి కోడిగుడ్డు సొనను తినేయండి. కానీ దాని గుల్లను మాత్రం పారేయకండి. మెదడుకి పదును పెట్టి ఇలా ఏదో ఒకటి తయారు చేసి చూడండి! (ఇలాంటివి చేయమంటే సాధారణంగా వాడేసిన గుల్లలతోనే ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే వాడేసిన గుడ్డు గుల్ల సగం చిట్లిపోయి ఉంటుంది. అలా కాకుండా మొత్తం గుల్ల గుల్లలా కావాలంటే... గోడలకు మేకులు చేసే డ్రిల్లింగ్ మెషీన్‌తో చిన్న రంధ్రం చేసి, ఆ తర్వాత మెల్లగా సొనను తీసేయొచ్చు. లేదంటే పదునైన సూదిలాంటిదాన్ని మంటమీద బాగా కాల్చి, దానితో కూడా రంధ్రాన్ని చేయవచ్చు.) -
శాకాహారులకు మాంసకృత్తులు...
మనం తీసుకునే ఆహారంలో పిండిపదార్థాలు అవసరమైన శక్తిని సమకూరుస్తాయి. కొవ్వులు కొన్ని విటమిన్లను తమలో కరిగేలా చేసుకొని శరీరానికి అవసరమైన జీవక్రియలు జరిగేలా చూస్తాయి. మరి మాంసకృత్తులో? పోషకాహార శాస్త్ర పరిభాషలో ప్రోటీన్లు అని పిలిచే ఈ మాంసకృత్తులు ప్రధానంగా మాంసాహారంలో ఉంటాయి. కానీ వేర్వేరు సామాజిక నమ్మకాల కారణంగా కొంతమంది మాంసాహారాన్ని ముట్టుకోరు. వారికి ఈ మాంసకృత్తులు (ప్రోటీన్లు) సమకూరేదెలాగో తెలుసుకుందాం. మాంసకృత్తులు అంత అవసరమా? కండరాల మంచి సౌష్ఠవపూరిత నిర్మాణం కోసం, కండరాలు దెబ్బతిన్నప్పుడు వాటిని రిపేర్ చేయడం కోసం మాంసకృత్తులు (ప్రోటీన్లు) అవసరం. అందుకే గుండె ఆపరేషన్ జరిగాక కొవ్వులను తగ్గించాలనే డాక్టర్లు సైతం ఓపెన్ హార్ట్ సర్జరీ తర్వాత ఆ గాయం మానేవరకూ, ఆ రిపేర్ జరిగే వరకూ చికెన్‌లాంటివి తినమని సలహా ఇస్తుంటారు. మాంసాహారులకు ప్రోటీన్లు ఎలాగైనా అందుతాయి. మరి శాకాహారులకూ వారి జీవక్రియల కోసం మాంసకృత్తులు అవసరం కదా. వారు ఈ ప్రోటీన్లను ఎలా భర్తీ చేసుకుంటారు. అదృష్టవశాత్తూ కేవలం మాంసాహారంలోనే గాక... శాకాహారంలోని చాలా పదార్థాలలోనూ మాంసకృత్తులు ఉంటాయి. ఆయా ఆహారాల ద్వారా అవి శాకాహారులకూ అందుతాయి. అవేమిటో తెలుసుకుంటే మంచి శరీర సౌష్ఠవం, కండరాల నిర్మాణం, దెబ్బతిన్న కండరాల రిపేర్లను సులభంగా చేసుకోవచ్చు. ఆరోగ్యంగా జీవించవచ్చు. నట్స్, గింజలలో... ఎండుగా కనిపించే కొన్ని నట్స్‌లో, గింజలలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని గుప్పెట్లో పట్టుకుని కూడా సులభంగా తినవచ్చు. కాబట్టి మీటింగ్స్ మధ్య మధ్యలోనూ, జిమ్‌కు వెళ్లే ముందర తేలిగ్గా వీటిని తినవచ్చు. పైగా నట్స్, గింజలనుంచి లభ్యమయ్యే మాంసకృత్తులతో వ్యాధి నిరోధక శక్తి సమకూరుతుంది. ఇందులో మాంసాహారంలోని ప్రోటీన్లతో పీచు లభ్యం కాదు. కానీ ఈ నట్స్, గింజల (సీడ్స్) ద్వారా అదనంగా పీచు పదార్థం కూడా లభ్యమవుతుంది. మాంసాహారపు ప్రోటీన్లతో మలబద్దకం వస్తే శాకాహారంతో లభ్యమయ్యే ఈ ప్రోటీన్లతో దాన్ని నివారించినట్లు కూడా అవుతుంది. పైగా ఇందులోని మినరల్స్, విటమిన్-ఈ, ఒమెగా ఫ్యాటీ ఆసిడ్స్ వంటి పోషకాలు చాలా కాలం పాటు వ్యక్తులను యౌవనంగా ఉంచడానికి తోడ్పడతాయి. నట్స్, గింజల (సీడ్స్) ద్వారా ప్రోటీన్లను ఇచ్చే కొన్ని ఆహారపదార్థాలివే... జనుము గింజలు (హెంప్ సీడ్స్) : మనం ఆహారంగా వాడటానికి పెద్దగా ఇష్టపడకపోయినా... జనుము గింజల్లో (హెంప్ సీడ్స్) ప్రోటీన్లు నిండి కూరి కూరి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. 30 గ్రాముల జనుము గింజల్లో 22 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అంతేకాదు... ఇందులో మానవ జీవక్రియలకు అవసరమైన 10 అత్యవసరమైన అమైనోఆసిడ్స్ ఉన్నాయి. చాలాకాలం యౌవనంగా కనిపించేలా చేసే ఒమెగా 3-ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఉన్నాయి. అవిశె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్) : 100 గ్రాముల అవిశె గింజలలో 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి మంచి ప్రోటీన్ కోరుకునేవారికి అవిశె గింజలు ఉత్తమమైన వనరు. గుమ్మడి గింజలు (పంప్కిన్ సీడ్స్) 100 గ్రాముల గుమ్మడికాయ గింజల్లో 19 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇక ఇందులో ప్రోటీన్‌తో పాటు యాంటీఆక్సిడెంట్స్, ఫైటోన్యూట్రియెంట్స్ లాంటి అనేక పోషకాలు ఉంటాయి. పైగా గుమ్మడి గింజల్లో మెగ్నీషియమ్, మాంగనీస్, కాపర్, జింక్, ఐరన్ లాంటి పోషకాలూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచింది. జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా : ప్రతి 100 గ్రాముల ఈ ఎండుఫలాల్లో (నట్స్‌లో) దాదాపు 20 - 22 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. కాబట్టి పైన పేర్కొన్న గింజలు, నట్స్ ద్వారా శాకాహారులు ప్రోటీన్స్‌ను పొందవచ్చు. పాలు పాల ఉత్పాదనలలో : పాలలో రెండు రకాల ప్రోటీన్లు ఉంటాయి. మొదటి ప్రోటీన్‌ను ‘వే’ అంటారు. పాలలో ఇది 20 శాతం ఉంటుంది. మిగతా 80 శాతం ప్రోటీన్‌కు కేసీన్ అని పేరు. ఈ రెండూ చాలా ఉత్తమమైన ప్రోటీన్లు. శాస్త్రీయంగా చూస్తే ఈ రెండింటిలోనూ అత్యుత్తమ స్థాయి అమైనోయాసిడ్స్ నిండి ఉన్నాయి. ఇక పాలతో పాటు పాల ఉత్పాదనలైన పెరుగు, చీజ్‌లలోనూ ప్రోటీన్లు ఎక్కువ. పాలు, పాల ఉత్పాదనలలో 20 : 80 నిష్పత్తిలో లభించే వే, కేసీన్ ప్రోటీన్లు హైబీపీని నియంత్రిస్తాయి. ఇక 100 గ్రాముల చీజ్‌లో 11 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కూరగాయలు, పప్పులలో : సోయాబీన్స్‌లో : సోయా ఉత్పాదనల్లో చాలా పుష్కలమైన ప్రోటీన్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేసేవి. మనకు మాంసాహారం ద్వారా లభ్యమయ్యే ప్రోటీన్లతో పోలిస్తే సోయాతో దొరికే ప్రోటీన్ కూడా అంతే నాణ్యమైనదని చెప్పవచ్చు. మంచి శెనగల్లో : మంచి శెనగల్లోనూ ప్రోటీన్లతో పాటు డయటరీ ఫైబర్, పొటాషియమ్ పుష్కలంగా దొరుకుతుంది. కాయధాన్యాల్లో : లెంటిల్స్ అని పిలిచే కాయధాన్యాలలోనూ, అన్ని రకాల పప్పులలోనూ ప్రోటీన్ల పాళ్లు చాలా ఎక్కువే. అందుకే డాక్టర్లు శస్త్రచికిత్స జరిగాక పప్పులు ఎక్కువగా తినమంటూ రోగులకు సలహా ఇస్తుంటారు. అయితే పప్పు తినడం వల్ల సర్జరీ చేసిన గాయానికి చీము పడుతుందనే అపోహతో చాలామంది ఈ సూచనను పాటించరు. నిజానికి పప్పుల్లో చీము పట్టించే గుణం ఉండదు. చీము పట్టడం అన్నది గాయంలోని బ్యాక్టీరియాతో తెల్లరక్తకణాలు పోరాడటం వల్ల జరిగే ప్రక్రియ. అంతేతప్ప పప్పులు తింటే గాయానికి చీము పట్టదు. టోఫూ : టోఫూను గడ్డకట్టిన సోయా పాల పెరుగుగా అభివర్ణిస్తారు. తెల్లటి ఘన (క్యూబ్) ఆకృతిలో కనిపించే ఈ టోఫూ నిజానికి ప్రోటీన్ల గడ్డ అనుకోవచ్చు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. కాస్త మెత్తగా ఉండేవి, ఒక మోస్తరుగా ఉండేవి. మరీ గడ్డపెరుగులా గట్టిగడ్డలా ఉండేవి... ఇలా రకరకాలుగా లభ్యమవుతుంటాయి. వాస్తవానికి చైనా, జపాన్ లాంటి ప్రాచ్య ఆసియా దేశాలకు చెందిన ఈ ఆహార పదార్థాన్ని అనేక రకాల వంటకాలు, తీపి పదార్థాల తయారీలలో ఉపయోగిస్తారు. ఇందులో చాలా తక్కువ క్యాలరీలు ఉండి, ప్రోటీన్ల విషయానికి వస్తే చాలా ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. ఐరన్, క్యాల్షియమ్, మాంగనీస్ లవణాలూ పుష్కలంగా ఉంటాయి. శాకాహారంలో టోఫూ అంతగా ప్రోటీన్లు లభ్యమయ్యే ఇతర వనరులు చాలా తక్కువ. సోయా పాల నుంచి తయారు చేసే ఈ పూర్తి శాకాహార పదార్థాన్ని శాకాహారులు తమ ప్రోటీన్ వనరుల కోసం నిశ్చింతగా వాడుకోవచ్చు. సుజాత స్టీఫెన్, న్యూట్రిషనిస్ట్,సన్ ఫైన్ హాస్పిటల్స్ , మాదాపూర్,హైదరాబాద్. -
వెజిటేరియన్లలో విటమిన్ బి12 లోపిస్తే..!
మనం ఏ పని చేయాలన్నా అవసరమైనది మన మెదడు, నాడీ వ్యవస్థ చక్కగా ఉండటం. ఆ మెదడు నుంచి అన్ని అవయవాలకూ ఆదేశాలు సక్రమంగా అందడం. అందుకు ఉపయోగపడే అత్యంత కీలకమైన పోషకమే... ‘విటమిన్-బి12’. ఇది కేవలం మెదడు నుంచి అన్ని అవయవాలకూ ఆదేశాలు అందేలా చేయడమే కాదు... రక్తం పుట్టుకలోనూ పాలుపంచుకుంటుంది. ప్రతి కణంలో జరిగే జీవక్రియల్లో భాగస్వామ్యం తీసుకుని డీఎన్ఏ పుట్టుకలో, అమైనో యాసిడ్స్ కార్యకాలాపాల్లో (మెటబాలిజమ్‌లో) పాలుపంచుకుంటుంది. మాంసాహారంలోనే పుష్కలంగా లభించే విటమిన్ బి12... శాకాహార నియమాన్ని చాలా కఠినంగా పాటించేవారిలో చాలా తక్కువగా ఉంటుంది. దాంతో వారికి కొన్ని సమస్యలు రావడం సాధారణం. వాటిని అధిగమించి, మన నాడీవ్యవస్థనూ, కణాల్లోని జీవక్రియలనూ సక్రమంగా పనిచేయించడం ఎలాగో చెప్పుకుందాం. శాకాహారుల్లో విటమిన్ బి12 ఎందుకు తక్కువ... విటమిన్ బి12ను మొక్కలుగానీ, ఫంగస్గానీ... ఆ మాటకొస్తే జంతువులుగానీ సృష్టించలేవు. కేవలం బ్యాక్టీరియా దాంతో పాటూ ఆర్చియా అనే ఏకకణ జీవులు మాత్రమే ఈ విటమిన్‌ను సృష్టించగలవు. ఆర్చియా అనేది ఎంత చిన్న జీవి అంటే ఏకకణజీవికంటే కూడా తక్కువ స్థాయి జీవి. ఈ ఏకకణానికి న్యూక్లియస్ (కేంద్రకం) ఉండదు. ఇదొక కణమనీ, కణంలోని భాగాలని అని నిర్దిష్టంగా చెప్పేందుకు వాటి విభాగాలూ, పైపొరలూ కూడా ఉండవు. కానీ బ్యాక్టీరియా, ఆర్కియా వెలువరించే ఎంజైముల సంయోగంతో ఈ ప్రపంచంలో విటమిన్-బి12 స్వాభావికంగా తయారవుతుంది. పైగా దీని నిర్మాణం చాలా సంక్లిష్టమైనది. ఇది జంతువులకు మేలు చేసే బ్యాక్టీరియా మనుగడ సాగించే చోట... అంటే... జంతువుపై ఆధారపడి బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా వెలువరించే పదార్థాలతో జంతువులూ ఇలా పరస్పరం సహాయం (సింబయాసిస్) చేసుకుంటూ ఉండే ప్రదేశాలలో మాత్రమే ఈ విటమిన్ పుడుతుంది. అందుకే ఇది జంతుమాంసం, జంతు ఉత్పాదనల వనరులనుంచే ప్రధానంగా ఉత్పన్నమవుతుంది. అందుకే శాకాహార నియమాన్ని చాలా కఠినంగా పాటించేవారిలో ఇది చాలా తక్కువ. విటమిన్ బి12 లోపం ఉంటే... ⇒ విటమిన్ బి12 లోపం ఉన్నవారు ఎప్పుడూ చాలా అలసటగా, నీరసంగా ఉంటారు. నిస్సత్తువ ఆవరించి ఉన్నట్లుగా ఫీలవుతుంటారు. ⇒ విటమిన్ బి12 లోపం వల్ల ఆక్సిజన్‌ను అన్ని అవయవాలకూ తీసుకెళ్లే ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఈ కండిషన్‌ను ‘విటమిన్-బి12 అనీమియా’ అంటారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు మన శరీరం చాలా పెద్దసైజు ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తుంటుంది. వీటినే మెగాలోబ్లాస్టిక్, మ్యాక్రోసైటిక్ ఎర్రరక్తకణాలంటారు. ఇవి తమ విధిని సక్రమంగా నిర్వహించలేవు. ⇒ విటమిన్-బి12 అనీమియా వల్ల అలసట, నిస్సత్తువలతో పాటు ఒక్కోసారి ఊపిరి సరిగా అందకపోవడం జరగవచ్చు. ⇒ తలనొప్పి, చెవుల్లో ఏదో హోరు వినిపించడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. మరింత నిర్దిష్టమైన లక్షణాలు : చర్మం పసుపుపచ్చరంగులోకి మారడం నాలుకపూయడం నోట్లో పుండ్లు కొన్ని ప్రదేశాల్లో స్పర్శజ్ఞానం కోల్పోవడం నొప్పి ఎక్కువగా తెలియకపోవడం నడుస్తున్నప్పుడు పడిపోవడానికి అవకాశం చూపు సరిగా లేక స్పష్టంగా కనిపించకపోవడం క్షణక్షణానికీ మూడ్స్ మారిపోవడం డిప్రెషన్‌కు లోనుకావడం మతిమరపు రావడం. శాకాహారులతో పాటు... ఇంకా ఎవరెవరిలో తక్కువ... సాధారణంగా 75 ఏళ్లకు పైగా వయసు పైబడిన వారిలో ఇది తక్కువ పుట్టుకతో వచ్చే జబ్బు అయిన పెర్నీషియస్ అనీమియా అనే కండిషన్ ఉన్నవారిలో ఇది తక్కువ. ఈ కండిషన్ ఉన్నవారిలో ఒక ప్రోటీన్ లోపం వల్ల జీర్ణమైన ఆహారం నుంచి విటమిన్ బి12 ను సంగ్రహించే సామర్థ్యం లోపిస్తుంది. అందుకే ఇలాంటి కుటుంబ చరిత్ర ఉన్న వారిలో 60 ఏళ్లు దాటిన మహిళల్లో ఇది ఎక్కువ ఇక పొట్ట లోపలిపొర పలచబారిన వారిలోనూ ఇది తక్కువ పొట్టలో పుండ్లు (అల్సర్స్) ఉన్నవారిలో పొట్టలోని కొంతభాగాన్ని సర్జరీ ద్వారా తొలగించిన వారిలో జీర్ణవ్యవస్థకు సంబంధించిన దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారిలో చాలాకాలంగా అజీర్తి మందులు (ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ -పీపీఐ) వాడుతున్నవారిలోనూ విటమిన్ బి12 పాళ్లు తక్కువ. నిర్ధారణ : సాధారణంగా రక్తపరీక్ష ద్వారా విటమిన్ బి12 లోపం తెలుసుకుంటారు. ఇక ఎర్రరక్తకణాల సైజ్‌ను బట్టి కూడా విటమిన్ బి12 లోపాన్ని అంచనావేస్తారు. విటమిన్ బి12కు చికిత్స విటమిన్ బి12 తక్కువగా ఉందని రక్తపరీక్షలో నిర్ధారణ అయితే... అలాంటి రోగులకు సాధారణంగా ఆరు బి12 ఇంజెక్షన్లతో ఈ లోపాన్ని భర్తీ చేస్తారు. ఇది రోజుకు ఒకటిగానీ లేదా రెండు నుంచి నాలుగు రోజులకు ఒకటి చొప్పున ఇస్తారు. ఈ విటమిన్ బి12 అంతా కాలేయంలో నిల్వ అయి ఉంటుంది. కొన్ని నెలలపాటు శరీరానికి అవసరమైన జీవక్రియలకోసం శరీరం తన విటమిన్-బి12 అవసరాల కోసం దాన్ని కాలేయం నుంచి తీసుకొని వాడుకుంటుంది. ఒకవేళ పెర్నీషియస్ అనీమియా కారణంగా విటమిన్ బి12 లోపం ఉన్నవారైతే... జీవితకాలం పాటు డాక్టర్లు చెప్పిన మోతాదుల్లో విటమిన్ బి12ను తీసుకుంటూ ఉండాలి. ఇలా విటమిన్ బి12 తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ర్పభావాలు ఉండవు. ఇక కొందరిలో ఇది పెర్నీషియస్ అనీమియా వల్ల కాకుండా పోషకాహారలోపం వల్ల విటమిన్ బి12 లోపం ఏర్పడితే అప్పుడు ఇంజెక్షన్ రూపంలో కాకుండా సైనకోబాలమైన్ టాబ్లెట్ల రూపంలోనూ దీన్ని శరీరానికి అందిస్తారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఎవరికి వారుగా విటమిన్-బి12 టాబ్లెట్లను, ఇంజెక్షన్లను తీసుకోకూడదు. డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వీటిని తీసుకోవాలి. ఎందుకంటే... ఈ ఇంజెక్షన్లనూ, మాత్రలనూ తీసుకునే వారు ఒకవేళ ఇతర మాత్రలనూ వాడుతుంటే... విటమిన్ బి12 ఇంజెక్షన్లూ, మాత్రలూ వాటి కార్యకలాపాలకు అడ్డుపడకుండా చూసేలా డాక్టర్లు మోతాదులను నిర్ణయిస్తారు. నివారణ మాంసాహారంలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది గుడ్లు, సముద్రపు చేపలు, పాలలో ఇది ఎక్కువ. మాంసాహారం తీసుకోడానికి ఇష్టపడని వారు ఈ కింది ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విటమిన్ బి12ను పొందవచ్చు. శాకాహారులు పుష్కలంగా విటమిన్ బి 12 పొందాలంటే... విటమిన్ బి12తో సమృద్ధం చేసిన (విటమిన్ బి12 ఫోర్టిఫైడ్) బాదం పాలలో ఇది ఎక్కువ విటమిన్ బి12తో సమృద్ధం చేసిన కొబ్బరిపాలలోనూ ఇది చాలా ఎక్కువ పులిసిపోయే స్వభావం ఉన్న ఆహారంలోని ఈస్ట్ (న్యూట్రిషనల్ ఈస్ట్)తోనూ ఈ లోపాన్ని తొలగించుకోవచ్చు విటమిన్ బి12తో సమృద్ధం చేసిన సోయాపాలతో తక్షణం తినగలిగే తృణధాన్యాలు (సి రేల్స్)లో తక్కువ కొవ్వు ఉన్న పాలు తోడుబెట్టి చేసిన పెరుగులోనూ పాలలోనూ, చీజ్‌లోనూ, వెనిలా ఐస్‌క్రీమ్‌లోనూ విటమిన్ బి12 ఎక్కువ. అందుకే శాకాహారులు పైన పేర్కొన్న ఆహారంపై ఆధారపడవచ్చు. - డాక్టర్ ఎమ్. గోవర్థన్ సీనియర్ ఫిజీషియన్,కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
హడలె త్తిస్తోన్న ఆకు కూరలు
ఏ రకమైనా 3 కట్టలు రూ.10లు వినియోగదారులు విలవిల హైదరాబాద్ మహా నగరంలో మండుతున్న ఎండలకు తోడు ఆకు కూరల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. మార్కెట్లో ఏరకం కూరను కొందామన్నా నాలుగు రెమ్మల ధర రూ.10లకు పైమాటే పలుకుతోంది. ప్రత్యేకించి నాన్‌వెజ్ (మాంసాహారం) తినేవారు కొత్తిమీర, పుదీనా వంటివాటిని వినియోగించడం తప్పనిసరి. వెజిటేరియన్స్ కూడా అన్నిరకాల కూరగాయలతో పాటు కొత్తిమీర, పుదీనాలను విధిగా కొనుగోలు చేస్తారు. చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు ఇలా ఏ రకం వంటకానికైనా మషాలా వినియోగం తప్పనిసరి. దీనికి అదనంగా కొత్తిమీర, పుదీనాలను జత చేస్తే ఆ వంటకం ఘుమ ఘుమలాడాల్సిందే. అయితే... అన్ని రకాల కూరల్లో సువాసనకు ముడిసరుకుగా వినియోగించే కొత్తిమీర, పుదీనా ధరలు వినగానే వినియోగదారుడి జేబులను కాళీ చేస్తున్నాయి. శనివారం మార్కెట్లో చిటికెన వేలంత మందమున్న 3 చిన్న సైజ్ కొత్తిమీర కట్టలు రూ.10లు ధర పలికాయి. ఒక కట్ట కొంటే మాత్రం రూ.5లు వసూలు చేశారు. ‘కనీసం రూ.10లకు కొంటేనే కొత్తిమీుర ఇస్తాం... లేదంటే వెళ్లండి’ అంటూ వ్యాపారులు ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. మార్కెట్‌కు కొత్తిమీర తక్కువగా వస్తుండటమే ఇందుకు కారణంగా కన్పిస్తోంది. గుడిమల్కాపూర్, బోయిన్పల్లి, మాదన్నపేట్ మార్కెట్లకు ఉదయాన్నే రైతులు తీసుకొచ్చే సరుకును వ్యాపారులు హాట్‌కేకుల్లా ఎగరేసుకు పోతున్నారు. హోల్‌సేల్ మార్కెట్లో 4 కట్టలు రూ.10ల ప్రకారం విక్రయిస్తున్నారు. అయితే... వ్యాపారులు వాటిని తిరిగి చిన్నకట్టలుగా కట్టి 3 కట్టలు రూ.10-12ల ప్రకారం అమ్ముతున్నారు. తోపుడు బండ్లపై అమ్మేవారు ఇళ్ల వద్దకే తెస్తున్నామంటూ చిన్నకట్టకు రూ.6ల ప్రకారం వసూలు చేస్తున్నారు. పుదీనా ధర కూడా కొత్తిమీర ధరనే ఫాలో అవుతోంది. పాలకూర, తోటకూర, గోంగూర, బచ్చలకూర, గంగవాయిల్ కూర, చుక్కకూర, మెంతికూర ధరలు కూడా ఇదే వరుసలో ఉండటంతో సగటు వినియోగదారుడిని హడలెత్తిస్తోంది. వీటిలో ఏది కావాలన్నా 3-4 చిన్నకట్టలు రూ.10ల ప్రకారం ఇస్తున్నారు. వేసవిలో విరివిగా పండే ములక్కాడలు కూడా రూ.10లకు 4 చొప్పున విక్రయిస్తున్నారు. వీటిలో సైజ్‌ను బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ధర పలుకుతున్నాయి. వేసవిలో బోర్లు, బావులు ఎండిపోవడంతో ఆకుకూరల సాగు గణనీయంగా పడిపోయిందని రైతులు చెబుతున్నారు. ఈ కారణంగానే నగర డిమాండ్‌కు తగ్గట్టు ఆకుకూరలు సరఫరా కావట్లేదని, ఆ కొరతే ధరల పెరుగుదలకు దారితీసిందటున్నారు. ఆకుకూరలు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొనే పరిస్థితి లేదు. స్థానిక ఉత్పత్తులపైనే ఆధారపడాల్సి రావడంతో అదీ ఇదీ అని కాకుండా అన్ని రకాల ఆకుకూరల ధరలు ఇప్పుడు హడలెత్తిస్తున్నాయి. జూన్‌లో వర్షాలుపడి కొత్తసాగు దిగుబడి వచ్చే వరకు ఆకు కూరల ధరలు ఇలాగే ఉంటాయనివ్యాపారులు చెబుతున్నారు. ఆకు కూరల ధరలు కొత్తిమీర (3కట్టలు) రూ.10-12 పుదీనా (3-4కట్టలు) రూ.10 గోంగూర(4 కట్టలు) రూ.10 తోటకూర ’’ రూ.10 పాలకూర ’’ రూ.10 బచ్చలకూర ’’ రూ.10 చుక్కకూర ’’ రూ.10 మెంతికూర ’’ రూ.10 గంగబాయిల్కూర ’’ రూ.10 -
రాజస్థానీ ఘుమఘుమలు
భారతీయ రాచరికపు రుచులను టేస్ట్ చేయాలనుకుంటున్నారా... అయితే ఈ రాజస్థానీ ఫుడ్ ఫెస్ట్ మీ కోసమే! ఎక్కువగా వెజిటేరియన్స్ అయిన రాజస్థానీలు స్వీట్స్‌లోనూ స్పెషలిస్టులు. సాధారణంగా మీల్స్ తరువాత స్వీట్స్ తింటాం. కానీ రాజస్థానీలు మాత్రం భిన్నం. భోజనానికి ముందే స్వీట్స్ కానిచ్చేస్తారు. కాకినాడ కాజాలు, ఆత్రేయపురం పూతరేకులలాగా... రాజస్థాన్‌లోనూ జిల్లాకో ప్రత్యేక స్వీట్ ఉంది. 32 రకాల రాజస్థానీ స్పెషల్ డిషెస్తోపాటు ఇలాంటివెన్నో నగరవాసులకూ విందు చేయనున్నాయి. మార్చి ఒకటో తేదీ నుంచి స్క్వేర్, నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్లో పదిరోజుల పాటు ఈ రుచుల పండుగ కొనసాగనుంది. ఫుడ్ ఒక్కటే కాదు... చుట్టు పక్కల వాతావరణం రాజస్థాన్‌ను తలపించేలా డెకరేట్ చేస్తున్నారు. ఒంటె, గుర్రపు బొమ్మలు, చిలకల డోర్స్.. పూర్తిగా ఆ కల్చర్ ఉట్టిపడేలా ఇంటీరియర్ డిజైనింగ్ ఉండనుంది. వీటన్నింటికీతోడు రాజస్థానీ పప్పెట్ షో కూడా అలరించనుంది. ‘ముఖ్యంగా జైపూర్, మార్వార్, ఉదయపూర్ వంటి రాచరిక ప్రాంతాల వంటకాలు ఫెస్టివల్లో వడ్డించనున్నాం. చరకా ముర్గ్, రాజ్‌భోగ్ దాహి బార, లాల్ మాస్, రాజ్ పుటాన మాస్ కిచ్రీ, హల్దీకే సబ్జీ, గత్తేకా పలావ్... వంటివన్నీ రాజస్థానీ స్పెషల్స్. వీటితోపాటు లైవ్ జిలేబీ, గులాబీ రెక్కలు జోడించిన కలాకండ్‌తోపాటు స్పెషల్ డెజర్ట్స్ కూడా ఉన్నాయి. ఈ ఫెస్ట్ కోసం రాజస్థాన్‌నుంచి స్కిల్డ్ చెఫ్‌లు వస్తున్నారు’ అని చెబుతున్నాడు నోవాటెల్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ ముత్తుకుమార్. సాక్షి, సిటీ ప్లస్ -
‘తేడా’ చూపిస్తే అనుమతి కట్..
శాకాహారులకే ఫ్లాట్లు అమ్ముతామనే బిల్లర్డపై ఎమ్మెన్నెస్ ఆగ్రహం సాక్షి, ముంబై: కేవలం శాకాహారులకే ఫ్లాట్లు విక్రయిస్తామని పెత్తనం చలాయించే బిల్డర్ల ఆగడాలకు ముకుతాడు వేయాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) డిమాండ్ చేసింది. మాంసాహారులకు ఫ్లాట్లు విక్రయింంచేందుకు నిరాకరించే బిల్డర్లు కొత్తగా నిర్మించే భవనాలకు అనుమతి ఇవ్వకూడదని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) సభాగృహంలో జరిగిన సమావేశంలో ఎమ్మెన్నెస్ కార్పొరేటర్లు ప్రతిపాదించారు. దీంతో శాకాహారులకు ప్రాధాన్యత ఇచ్చే బిల్డర్ల గుండెల్లో దడ మొదలైంది. నగరంలో గత కొంతకాలంగా శాకాహారులకే ఫ్లాట్లు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా గుజరాతీ, మార్వాడి తదితర కులాల ప్రజలుంటున్న సొసైటీలలో, బహుళ అంతస్తుల భవనాల్లో మాంసాహారులకు చోటు దొరకడం లేదు. అందులో ఫ్లాటు అద్దెకు ఇవ్వాలన్నా, విక్రయించాలన్నా శాకాహారులకే ఇస్తున్నారు. ఇలా కొన్ని ప్రత్యేక కులాలు బృందాలుగా ఏర్పడి కొత్తగా నిర్మించే భవనాల్లో ఫ్లాట్లు బుకింగ్ చేసుకుంటారు. ఇందులో మాంసాహారులకు అవకాశమివ్వరు. వారు విధించే షరతులకు బిల్డర్లు కూడా తలొగ్గి మాంసాహారులకు ఫ్లాట్లు విక్రయించడం లేదు. దీంతో కుల, మత, భాషలతోపాటు భోజనం అలవాట్లపై ఆరాతీసి బిల్డర్లు ఇల్లు, ఫ్లాట్లు విక్రయిస్తున్నారు. దీని కారణంగా మాంసాహారులు ఫ్లాట్లు కొనుగోలు చేసుకోలేకపోతున్నారు. ఇలాంటి బిల్డర్లపై ఫిర్యాదులు నమోదుచేసినప్పటికీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇలా కుల, మతాలను విభజించే బిల్డర్లకు నూతన భవనాల అనుమతి ఇవ్వకూడదని ఎమ్మెన్నెస్‌కు చెందిన గట్ నాయకుడు సందీప్ దేశ్‌పాండే ప్రతిపాధించారు. దేశ్‌పాండే చేసిన ప్రతిపాదన ఈ నెలాఖరులో జరిగే స్థాయీ సమితి సమావేశంలో చర్చకు రానుంది. ఒకవేళ సమావేశంలో ఈ ప్రతిపాదనకు మంజూరు లభిస్తే అభిప్రాయ సేకరణ జరగనుంది. ఆ తర్వాత బీఎంసీ పరిపాలన విభాగం తుది నిర్ణయం తీసుకుంటుంది. కొత్త భవనాలకు అనుమతి ఇచ్చేముందు అన్ని వర్గాల ప్రజలకు ఇళ్లు, ఫ్లాట్లు విక్రయించాలని బిల్డర్లకు షరతులు విధిస్తారు. భవన నిర్మాణ పనులు ప్రారంభించాలంటే బీఎంసీ నుంచి ‘ఐఓడీ’ జారీ అవుతుంది. ఈ ఐఓడీలో కొత్త నియమాలు పొందుపరిస్తే బిల్డర్ నుంచి అఫిడవిట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సదరు బిల్డరు కొనుగోలుదారులకు ఫ్లాట్లు విక్రయించేందుకు నిరాకరిస్తే నియమ, నిబంధనల ప్రకారం అతడిపై చర్యలు తీసుకునేందుకు అవకాశముంటుంది. -
దిగొచ్చిన ధరలు
కాసింత ఊరట - ఏపీఎంసీలోకి గణనీయంగా దిగుమతులు - అమాంతం తగ్గిన కూరగాయల ధరలు - వినియోగదారులకు కాసింత ఊరట సాక్షి, ముంబై : కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడంతో గృహిణులకు కొంతమేర ఊరట లభించింది. మొన్నటి వరకు ధరలు మండిపోవడంతో ఆర్థికభారంతో ‘వంటి’ల్లు అతలాకుతలమైంది. వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) లోకి కూరగాయాల లోడుతో వస్తున్న ట్రక్కులు, టెంపోల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఫలితంగా సరుకు నిల్వలు పెరిగిపోయి ధరలు దిగివచ్చాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏపీఎంసీలోకి కూరగాయల లోడుతో 614 వాహనాలు వచ్చాయి. మొన్నటితో పోలిస్తే వాహనాల సంఖ్య రెట్టింపు అయ్యింది. మరోపక్క వర్షాల కారణంగా అవి కుళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇక తప్పని పరిస్థితుల్లో వ్యాపారులు ఒక్కసారిగా ధరలు తగ్గించేశారు. శ్రావణమాసంలో శాఖాహారులకు ఊరట గత ఆదివారం నుంచి శ్రావణ మాస ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. అత్యధిక శాతం ప్రజలు శాఖహారులుగా మారారు. గణేశ్ ఉత్సవాలు పూర్తయ్యే వరకు ఈ ఉపవాసాలు కొందరు నిష్టతో పాటిస్తారు. కూరగాయలు డిమాండ్ గణనీయంగా పెరగనున్నాయని ఆందోళన చెందిన వినియోగదారులకు ఏపీఎంసీలోకి సరుకు భారీగా రావడంతో పరిస్థితులు అనుకూలంగా మారాయి. మార్కెట్లో దాదాపు 30-40 శాతం ధరలు దిగివచ్చాయి. నిల్వచేయడమూ కష్టమే.. ఏపీఎంసీలోకి ట్రక్కులు, టెంపోలు పెద్ద సంఖ్యలో రావడంతో వాటిని ఎక్కడ నిలపాలనేది వ్యాపారులకు తలనొప్పిగా మారింది. ఖాళీ చేస్తే తప్ప వాహనాలు బయటకు వెళ్లలేవు. పగలు, రాత్రి తేడాలేకుండా టెంపోలు, ట్రక్కులు వస్తూనే ఉన్నాయి. వీటిని క్రమబద్ధీకరించడం పెద్ద సవాలుగా మారింది. అడ్డగోలుగా ధరలు తగ్గించి కూరగాయలను విక్రయించేందుకు నానా తంటాలు పడుతున్నారు. మొన్నటి వరకు రూ.90 చొప్పున విక్రయించిన కేజీ టమాటలు ప్రస్తుతం రూ.60-65 వరకు దిగివచ్చాయి.వర్షాలు ఇలాగే కురిస్తే కూరగాయల దిగుబడి మరింత పెరగనుంది. మొన్నటి వరకు పేదలకే కాకుండా మధ్య తరగతి కుటుంబాలకు కూడా అందకుండాపోయిన కూరగాయలు ఒక్కసారిగా అందరికీ అందుబాటు ధరల్లోకి వచ్చాయి. -
శాఖాహారంతో అరోగ్యం: ఆదాశర్మ
-
పచ్చగడ్డే కాదు.. పచ్చిమాంసమూ తింటాయి!
జంతు ప్రపంచం * పుట్టినప్పుడు దాదాపు అన్ని జింకలకీ ఒంటిమీద తెల్లని మచ్చలుంటాయి. కాలం గడిచేకొద్దీ కొన్నింటికి చెరిగిపోతాయి. కొన్నిటి శరీరంపై మిగిలిపోతాయి! * పుట్టిన అరగంటకే ఇవి నడుస్తాయి. నెల తిరిగేసరికే పరుగెత్తుతాయి. * ఇవి నాలుగు పళ్లతో పుడతాయి. మిగతా పళ్లు తరువాత మొలుస్తాయి! * జింకలన్నీ శాకాహారులని చాలామంది అనుకుంటారు. కానీ కొన్ని రకాల జింకలు మాంసాన్ని కూడా తింటాయి! * వీటి చెవులు ఎంత బాగా పని చేస్తాయంటే... కొన్ని కిలోమీటర్ల దూరంలో వినిపించే శబ్దాలను కూడా స్పష్టంగా వినగలవు. అంతేకాదు... శబ్దం వచ్చే దిశకు తమ చెవుల్ని తిప్పి మరీ వింటాయి! * చిన్నగా కనిపిస్తుంటాయి కానీ ఇవి చాలా ఆహారాన్ని తింటాయి. దాదాపు గంట, రెండు గంటల పాటు తింటే కానీ వీటికి కడుపు నిండదు! * చలికాలం వస్తే ఇవి బద్దకంగా అయిపోతాయి. ఆహారం కూడా చాలా తక్కువగా తీసుకుంటాయి. మళ్లీ వేసవి రాగానే ఎక్కడలేని హుషారు వచ్చేస్తుంది! * ఏదైనా ప్రమాదం సంభవించబోతోందని అనుమానం వస్తే ఇవి తమ తోకల్ని పెకైత్తుతాయి. దాన్ని చూసిన ఇతర జింకలు పరుగందుకుంటాయి! * ఇవి కాస్త పిరికివనే చెప్పాలి. చిన్న చిన్న వాటికే బెదిరిపోతుంటాయి. శత్రువు దాడి చేసినప్పుడు మొదట ధైర్యంగా పరుగు తీసినా... ఉండేకొద్దీ బలహీనమైపోతాయి. దాంతో వాటికి చేతికి చిక్కి ఆహారంగా మారిపోతాయి! * ఇవి ఎప్పుడూ నేరుగా పరుగెత్తవు. వంకర టింకరగా, ముందువెనుకలు చూసుకోకుండా పరుగులు తీస్తాయి. దాంతో ఆ వేగాన్ని నియంత్రించుకోలేక ఒక్కోసారి అడ్డొచ్చినవాటిని గుద్దేస్తుంటాయి. అందుకే కొన్నిసార్లు చనిపోతుంటాయి కూడా!