భారతీయ రాచరికపు రుచులను టేస్ట్ చేయాలనుకుంటున్నారా... అయితే ఈ రాజస్థానీ ఫుడ్ ఫెస్ట్ మీ కోసమే! ఎక్కువగా వెజిటేరియన్స్ అయిన రాజస్థానీలు స్వీట్స్‌లోనూ స్పెషలిస్టులు. సాధారణంగా మీల్స్ తరువాత స్వీట్స్ తింటాం. కానీ రాజస్థానీలు మాత్రం భిన్నం. భోజనానికి ముందే స్వీట్స్ కానిచ్చేస్తారు. కాకినాడ కాజాలు, ఆత్రేయపురం పూతరేకులలాగా... రాజస్థాన్‌లోనూ జిల్లాకో ప్రత్యేక స్వీట్ ఉంది. 32 రకాల రాజస్థానీ స్పెషల్ డిషెస్‌తోపాటు ఇలాంటివెన్నో నగరవాసులకూ విందు చేయనున్నాయి. మార్చి ఒకటో తేదీ నుంచి స్క్వేర్, నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్‌లో పదిరోజుల పాటు ఈ రుచుల పండుగ కొనసాగనుంది. ఫుడ్ ఒక్కటే కాదు... చుట్టు పక్కల వాతావరణం రాజస్థాన్‌ను తలపించేలా డెకరేట్ చేస్తున్నారు. ఒంటె, గుర్రపు బొమ్మలు, చిలకల డోర్స్.. పూర్తిగా ఆ కల్చర్ ఉట్టిపడేలా ఇంటీరియర్ డిజైనింగ్ ఉండనుంది. వీటన్నింటికీతోడు రాజస్థానీ పప్పెట్ షో కూడా అలరించనుంది.
‘ముఖ్యంగా జైపూర్, మార్వార్, ఉదయపూర్ వంటి రాచరిక ప్రాంతాల వంటకాలు ఫెస్టివల్‌లో వడ్డించనున్నాం. చరకా ముర్గ్, రాజ్‌భోగ్ దాహి బార, లాల్ మాస్, రాజ్ పుటాన మాస్ కిచ్రీ, హల్దీకే సబ్జీ, గత్తేకా పలావ్... వంటివన్నీ రాజస్థానీ స్పెషల్స్. వీటితోపాటు లైవ్ జిలేబీ, గులాబీ రెక్కలు జోడించిన కలాకండ్‌తోపాటు స్పెషల్ డెజర్ట్స్ కూడా ఉన్నాయి. ఈ ఫెస్ట్ కోసం రాజస్థాన్‌నుంచి స్కిల్డ్ చెఫ్‌లు వస్తున్నారు’ అని చెబుతున్నాడు నోవాటెల్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ ముత్తుకుమార్.
సాక్షి, సిటీ ప్లస్
రాజస్థానీ ఘుమఘుమలు
Published Sun, Feb 22 2015 4:35 AM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM
Advertisement
Advertisement