దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా అంటూ మంచి ఆసక్తికర విషయాలను నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారు. ఆయన ఇతరుల టాలెంట్‌ని, గమ్మత్తైన విషయాలను షేర్ చేస్తూ ఎడ్యుకేట్ చేస్తుంటారు. అలాంటి మహింద్రా ఈసారి తన కిష్టమైన వంటకాలు గురించి చెప్పుకొచ్చారు. తాను కూడా మంచి ఆహారప్రియుడేనని చెప్పకనే చెప్పారు. ఇంతకీ ఆయన మెచ్చే వంటకాలేంటంటే..
ఆనంద్ మహీంద్రా తాజాగా సోషల్ మీడియాలో శాకాహార పంజాబీ వంటకాల పోస్ట్‌తో నెటిజన్లను ఆకర్షించారు. వంటకాల్లో మాంసాహార వంటకాల రుచే అగ్ర స్థానం అయినా ఆయన శాకాహార వంటకాలకే ప్రాధాన్యాత ఇచ్చారు. అంతేగాదు పంజాబ్ వంటకాలను శాకాహారుల స్వర్గంగా అభివర్ణించారు. ఎప్పుడైన సరదాగా పంజాబ్ నడిబొడ్డున తప్పనిసరిగా ఘుమఘుమలాడే ఈ ఏడు రకాల పంజాబీ వంటకాలను ట్రై చేయాల్సిందే అంటూ వాటి గురించి సవివరంగా వివరించారు.
షాహి పనీర్
పర్ఫెక్ట్ రుచి కోసం క్రీమీ గ్రేవీతో ఉంటే పనీర్ క్యూబ్స్ వంటకం బెస్ట్. ఇది తేలికపాటి సుగంధద్రవ్యాలు, పెరుగుతో రుచికరంగానూ, ఆకర్షణీయంగా ఉంటుంది. దీన్ని పరాఠాతో ఆస్వాదిస్తే ఆ రుచే వేరు అని చెబుతున్నారు మహీంద్రా.
రాజ్మా చావల్
గ్లూటెన్ ఫ్రీ మీల్ కోసం ట్రై చేయాలనుకుంటే..రాజ్మా డిష్‌ని తినాల్సిందే. చక్కగా ఉల్లిపాయలు, టమోటాలు, కొద్దిపాటి సుగంధద్రవ్యాలతో చేసే వంటకం లంచ్‌లో కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. దీన్ని రైతా, ఊరగాయలతో తింటే టేస్ట్ అదుర్స్.
పాలక్ పనీర్
పంజాబీ-స్టైల్ పాలక్ పనీర్‌ను ఆస్వాదించాలంటే ముందుగా పాలక్‌ని మెత్తని పేస్ట్‌గా చేయాలి. ఆ మిశ్రమన్ని ఉల్లిపాయాలు, టమాటాల మిశ్రమంలో వేసి ఉడికించి చివరగా క్యూబ్డ్ పనీర్‌లతో ఉడికించి తింటే అబ్బబ్బా..! ఆ రచే వేరేలెవెల్..!
దాల్ మఖానీ
కిడ్నీ బీన్స్‌తో తయారు చేసే వంటకం. దీన్ని వెన్నతో తయారు చేసే క్రీమ్ లాంటి గ్రేవీతో కూడిన వంటకం. ఉత్తర భారతీయుల వంటకాల్లో అత్యంత టేస్టీ వంటకం ఇదే. తప్పక రుచి చూడాల్సిందే.
పనీర్ టిక్కా
మంచి ఆకలితో ఉన్నవారికి తక్షణమే శక్తినిచ్చి సంతృప్తినిచ్చే మంచి వంటకం. చక్కగా మెరినేషన్ చేసిన క్యూబ్డ్ పనీర్‌ని బంగారు రంగులో వేయించి వివిధ కూరగాయలతో సర్వ్ చేస్తారు. ఇది ప్రతి వేడుకలో ఉండే అద్భుతమైన వంకటం. పుదీనా చట్నీతో తింటే టేస్ట్ అదిరిపోతుంది.
చోలే భాతురే
శెనగలతో చేసే కర్రీ. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా వండే రుచికరమైన వంటకం. పూరీ, పరాఠాలలో అదిరిపోతుంది. దీనిలో ఉల్లిపాయలు, ఊరగాయ వేసుకుని చాట్ మాదిరిగా తిన్నా ఆ టేస్ట్ ఓ రేంజ్‌లో ఉంటుంది.
మక్కీ డి రోటీ విత్ సర్సన్ డా సాగ్
సార్సన్ డా సాగ్ అనేది సుగంధ ద్రవ్యాలు, ఆవపిండితో చేసే కర్రీ. మక్కీ డి రోటీ అంటే మొక్కజొన్న పిండితో చేసే ఒకవిధమైన రోటీ. వీటిని పెనంపై కాల్చరు. బోగ్గుల మీద లేదా వేడి గ్రిడిల్‌పై నేరుగా కాల్చుతారు. ఇంకెందుకు ఆలస్యం ఆనంద్ మహీంద్రా మెచ్చే ఈ వంటకాలను ఓసారి ట్రై చేయండి మరీ..!.
(చదవండి: యువరాజా ఇదేం అవేర్‌నెస్ క్యాంపెయిన్..? ఏంటీ తీరు..?)
Comments
Please login to add a commentAdd a comment