ఎగ్స్(క్స్)లెంట్! | Eggs (X) Lent! | Sakshi
Sakshi News home page

ఎగ్స్(క్స్)లెంట్!

Published Sun, Apr 10 2016 12:11 AM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

ఎగ్స్(క్స్)లెంట్!

ఎగ్స్(క్స్)లెంట్!

అటు వెజిటేరియన్స్‌నీ ఇటు నాన్ వెజిటేరియన్స్‌నీ కూడా అలరించే ఆహారం కోడిగుడ్డు. అయితే ఇది ఇంటీరియర్ డెకొరేటర్స్‌ని కూడా ఆకట్టుకుంటుంది తెలుసా? అదెలా అంటే.. ఇదిగో ఇలా. తమలోని సృజనాత్మకతకు పదునుపెట్టి కొందరు కోడిగుడ్డు గుల్లకి కొత్త ఆకారాన్ని తెచ్చారు. రంగురంగుల చిత్రాలు గీస్తే అది మంచి పెయింటింగ్ అయిపోయింది. సగానికి విరిచి నూనె పోసి ఒత్తు వేస్తే దీపమై వెలుగిస్తోంది. ఇంత మట్టి వేసి అందులో ఒక మొక్క పాతితే కుండీలా మారిపోయింది.

మనం ఏం చేసినా అది మన ఇంటికి అందాన్ని తీసుకొస్తుందని తెలిసొచ్చింది. కాబట్టి కోడిగుడ్డు సొనను తినేయండి. కానీ దాని గుల్లను మాత్రం పారేయకండి. మెదడుకి పదును పెట్టి ఇలా ఏదో ఒకటి తయారు చేసి చూడండి!

(ఇలాంటివి చేయమంటే సాధారణంగా వాడేసిన గుల్లలతోనే ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే వాడేసిన గుడ్డు గుల్ల సగం చిట్లిపోయి ఉంటుంది. అలా కాకుండా మొత్తం గుల్ల గుల్లలా కావాలంటే... గోడలకు మేకులు చేసే డ్రిల్లింగ్ మెషీన్‌తో చిన్న రంధ్రం చేసి, ఆ తర్వాత మెల్లగా సొనను తీసేయొచ్చు. లేదంటే పదునైన సూదిలాంటిదాన్ని మంటమీద బాగా కాల్చి, దానితో కూడా రంధ్రాన్ని చేయవచ్చు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement