Perfect
-
హీరో దుల్కర్ భార్యని చూశారా? హీరోయిన్ల కంటే అందంగా! (ఫొటోలు)
-
పర్ఫెక్ట్ చపాతీ! మేడమ్‌జీ, ఐడియా అదుర్స్ : వీడియో వైరల్
ఇంటా బయటా మహిళలు మల్టీ టాస్కింగ్ చేస్తారు. ఉన్న సమయంలో అటు వంట చేస్తూనే, ఇటు పిల్లల్ని స్కూలుకు రడీ చేస్తూ, తాను ఉద్యోగానికి సిద్ధ మవుతూ ఈ విషయంలో శతావధానం చేస్తారంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి సమయంలోనే వారి బుర్రల్లో ఐడియాలు కూడా భలే తళుక్కు మంటాయి. ఈ క్రమంలో రోటీ మేకింగ్‌లో ఈజీ ట్రిక్ ఒకటి నెట్టింట్ వైరల్‌గా మారింది. ఆ కథా కమామిష్షు ఏంటో చూస్తే మీరు కూడా వావ్..! అంటారు. పర్ఫెక్ట్గా, రౌండ్‌గా చపాతీలు చేయడం అంటే కత్తిమీద సామే. దీనికి చాలా టైం కూడా పడుతుంది. అందుకే చపాతీలు రౌండ్‌గానే ఉండాలా ఏంటి? టేస్టీగా ఉంటా చాలదా అని సరిపెట్టేసుకుంటాం కదా. కానీ రోటీ తయారీలో ఒక మహిళ తెలివిగా వ్యవహరించింది. శ్రమను, సమయాన్ని ఆదా చేసేలా స్మార్ట్‌గా వ్యవహరించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మాయింది. దాదాపు మూడుకోట్లపైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. View this post on Instagram A post shared by Chandni⚡Vinay (@rajput_jodi_) రాజ్‌పుత్ జోడీ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ఈ వైరల్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలోని మిసెస్ పెర్ఫెక్ట్ మేడమ్... గోధుమ పిండిని మృదువుగా కలుపుకొని ఒక్కొక్కటి విడిగా విడిగా గాకుండా, చపాతీ కర్రతో చాలా వెడల్పుగా ఒక పెద్ద రోటీ లాగా వత్తుకుంది. ఆ తరువాత గుండ్రని ప్లేట్ సాయంతో పెద్ద చపాతీని కాస్తా గుండ్రటి చిన్న చపాతీలుగా కట్ చేసి పెట్టుకుంది. తరువాత చక్కగా కాల్చింది. ఈ సింపుల్ ట్రిక్ చూసి నెటిజన్లు అద్భుతం,సూపర్ అంటూ వ్యాఖ్యానించారు. -
కిన్‌సుగీ.. ఫెయిల్యూర్స్‌ని అంగీకరించే ఒక సక్సెస్ స్టోరీ!
శోభనా సమర్థ్.. ఒకప్పటి బాలీవుడ్ నటి, దర్శకురాలు, నిర్మాత. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ యాక్ట్రెస్ కాజోల్‌కి అమ్మమ్మ. ఒకసారి కాజోల్.. వాళ్లమ్మమ్మ బుగ్గలు పట్టుకుని ‘అమ్మమ్మా.. ఎంతందంగా ఉంటావే!’ అంటూ ముద్దు చేసిందట. ‘కారణమేంటో తెలుసా?’ అని అడిగిందట అమ్మమ్మ. ‘తెలీదు.. చెప్పూ’ అందట కాజోల్. ‘వికారంగా ఉన్న ఈ ముక్కే’ అందట అమ్మమ్మ తన ముక్కును చూపిస్తూ. అవాక్కయిందట మనవరాలు. ‘ఈ చిన్న ఇంపర్ఫెక్షనే లేకపోతే నేనసలు అందంగా కనిపించేదాన్నే కాను’ అందట చిన్నగా తలెగరేస్తూ! ఆ ఆత్మవిశ్వాసానికి అబ్బురపడుతూ కాజోల్.. వాళ్లమ్మమ్మ మొహంలోకి పరిశీలనగా చూసిందట మొదటిసారి. నిజమే ఆవిడ చెప్పినట్టుగా ఆమె మొహానికి ముక్కే మైనస్ అని గ్రహించిదట కాజోల్. ‘అలా ఎలా మేనేజ్ చేశావ్ అమ్మమ్మా’ అని అడిగిందట ఆశ్చర్యపోతూ! ‘మేనేజ్ చేయలేదు. యాక్సెప్ట్ చేశా. నా ముక్కును. ఇంపర్ఫెక్షన్ మేక్ యూ మోస్ట్ బ్యూటిఫుల్ అని నమ్మాను.అంతే నా అందంలో ముక్కూ అమరింది. నా అభినయంలో పార్ట్ అయింది’ అని చెప్పిందట. అక్కడితో ఆ సీన్ ఎండ్ అవలేదు. మనవరాలి తెరంగేట్రానికి బోలెడు స్ఫూర్తినిచ్చింది. అమ్మమ్మ మాటనే ఆచరణలో పెట్టి.. ఇంపర్ఫెక్షన్ని పర్ఫెక్ట్గా యాక్సెప్ట్ చేసే వారసత్వాన్ని పంచింది. ఎలాగంటే.. కాజోల్ రెండు కనుబొమలు కలుసుకుంటాయి. జీవితంలో దీన్ని దురదృష్టానికి ముడిపెడితే.. స్క్రీన్ మీద లుక్స్‌కి లంకె పెట్టారు. యూనీబ్రోతో స్క్రీన్ అపియరెన్స్ బాలేదు.. థ్రెడింగ్ చేయించుకో అని కాజోల్ ఆప్తుల నుంచి దర్శకనిర్మాతల దాకా అందరి దగ్గర్నుంచీ ఒత్తిడి వచ్చింది ఆమెకు. కానీ అమ్మమ్మ చెప్పిన మాటను మరచిపోలేదు కాజోల్. ఆచరణలో పెట్టింది. వేషాలు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు కానీ థ్రెడింగ్ ముచ్చటే లేదు అని తెగేసి చెప్పింది. సణుగుతునే వేషాలు ఇచ్చారు. హిట్ అయింది. ఆ యూనిబ్రో ఆమె యూనిక్ స్టయిల్ అయింది. తర్వాత ఎందరో అమ్మాయిలు ఆ స్టయిల్‌ను ఫాలో అయ్యేలా చేసింది. శారీరక లోపాన్ని అందంగా మలచుకోవడం అంటే ఇదే! ∙∙ ఒక అజేయుడి గురించీ చెప్పాలి. బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకోసారి గుర్తు చేసుకుందాం. అతను ఈతగాడు. పేరు మైఖేల్ ఫెల్ప్స్. అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెడ్డీ) బాధితుడు. ఈతలో ఎవరూ పోటీపడలేనంత ముందుకు వెళ్లాడు. విషయం ఏంటంటే చిన్నప్పుడు అంటే మైఖేల్‌కి ఏడేళ్లున్నప్పుడు మొహానికి తడి తిగిలితే చాలు చిరాకుపడిపోయేవాడట. వాళ్లమ్మ డెబ్బీ ఫెల్ప్స్ అబ్బాయిని స్విమ్మింగ్ పూల్‌లోకి తోస్తే మొహానికి తడి అంటకుండా ఈదడం నేర్చుకున్నాడట. కానీ దేనిమీదా ఏకాగ్రత ఉండేది కాదు. ఇల్లు పీకి పందిరేయడంలో దిట్ట. స్కూల్ నుంచీ మైఖేల్ మీద బోలెడు కంప్లయిట్స్ వచ్చేవి.. బాబు దేని మీద ఫోకస్ చేయట్లేదు అంటూ! అసలు వీడి ప్రాబ్లం ఏంటీ అని వాళ్లమ్మ.. కొడుకును డాక్టర్ దగ్గరకు తీసుకెళితే.. అప్పుడు తేలింది మైఖేల్‌కి ఏడీహెచ్‌డీ ప్రాబ్లం ఉందని! ఆనాటికి అతని వయసు 9 ఏళ్లు. చదువంటే ఇష్టపడేవాడు కాదు. కొడుకు సమస్య ఏంటో అమ్మకు తెలిసింది. ఏది చేయలేడో దాన్ని వదిలేసింది. చేయగల దాని మీద దృష్టి పెట్టింది. అప్పుడు గ్రహించింది.. స్విమ్మింగ్ పూల్‌లో గంటలు గంటలు ఈతకొట్టగలడని. ఫోకస్ లేని ఆ మైండ్‌ని దార్లో పెట్టేది నీళ్లే అని అర్థమైంది ఆమెకు. పిల్లాడికున్న ఏడీహెచ్‌డీని జయించడానికి ఈతను మించిన ఆయుధం లేదని ఫిక్స్ అయిపోయింది. ఫలితం..ఒలింపిక్స్‌లో 28 పతకాలు (అందులో 23 బంగారు పతకాలే), 7 వరల్డ్ రికార్డులు. మానసిక లోపాన్ని జయించడం అంటే ఇదే! ∙∙ వీటిని గెలుపు గాథలుగా వివరించ లేదు. లోపాలను గ్రహించి.. వాస్తవాన్ని అంగీకరించి.. వాటిని తమకు అనుకూలంగా మలచుకుని వాటితోనే జీవితాన్ని ఆస్వాదించి ఆనందంగా సాగిన వ్యక్తులను పరిచయం చేశాం. అనుభవంలోకి వచ్చిన పరిస్థితులను ఒప్పుకోవడానికి చాలా శక్తి కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? మనలో ఉన్న ఇతర పాజిటివ్ కోణాల నుంచి! ఎప్పుడైతే మనలోని మైనస్‌నే ప్రపంచం చూస్తూ పాయింట్ అవుట్ చేస్తుందో అప్పుడు మనకు ఈ స్ట్రెంత్ అవసరం అవుతుంది. ఆ మైనస్‌ను మెదడు అట్టడుగుపొరల్లోకి నెట్టేసి.. అట్టడుగున ఉన్న ప్లస్‌ని బయటకు తెచ్చి ప్రపంచం ఫోకస్‌ను ఆ పాజిటివ్ పాయింట్ మీదకు మరల్చాలంటే ముందు మైనస్‌ను అంగీకరించగలగాలి గౌరవంగా! ఇదే ఇంపర్ఫెక్షన్ని శక్తిగా మలచుకోవడమంటే! దీన్నే జపాన్‌లో కిన్‌సుగీ అంటారు. వైఫల్యంతో సఫలమవడమెలాగో నేర్పించడమే దాని తత్వం. ఫ్యాట్ లుక్‌తోనే హిట్స్ ఇచ్చి ట్రెండ్‌సెట్ చేసింది! జీరో సైజ్ ట్రెండ్‌గా ఉన్న బాలీవుడ్లో తన ఫ్యాట్ లుక్‌తోనే హిట్స్ ఇచ్చి ఆ ట్రెండ్‌ని మార్చేసింది విద్యాబాలన్. ‘లావు కదా.. మోడరన్ డ్రెసెస్ అంతగా సెట్ కావు ఆమెకు’ అంటూ పెదవి విరుస్తున్న ఇండస్ట్రీలో చీరల్లోనే కనిపిస్తూ నటననే కాదు గ్లామర్‌నూ పండించింది. వాస్తవానికి బ్యూటీ ఎక్స్‌పర్ట్‌ల అభిప్రాయం ప్రకారం విద్యాబాలన్.. ఇంపర్ఫెక్షన్ల పుట్ట. హార్మోన్ అసమతుల్యత వల్ల ఆమెకు సమస్యలు వచ్చాయి. వాటిని బహిరంగంగానే చెప్పింది. తను ఎలా ఉందో అలాగే స్క్రీన్ మీద కనిపిస్తోంది.. మేకప్తోగానీ.. సర్జరీలతోగానీ కరెక్షన్స్‌కు వెళ్లకుండా! ఫర్ఫెక్షన్కి కొలమానం లేదు పర్ఫెక్షన్ అనేదానికి ప్రామాణికం లేదు. ఒకరికి పర్ఫెక్ట్గా అనిపించింది మరొకరికి అనిపించకపోవచ్చు. అందుకే ఎవరి ప్రమాణాలనో ప్రామాణికంగా తీసుకుని పర్ఫెక్షన్ అనే మాయలో పడను. నా శరీరాకృతి విషయంలో చాలా విమర్శలనే ఎదుర్కొన్నాను. నా మీద నాకు ప్రేమ ఎక్కువే. ఆత్మవిశ్వాసమూ అంతకంటే ఎక్కువే. అందుకే నన్ను నేను కాన్ఫిడెంట్‌గా క్యారీ చేసి విమర్శించిన వాళ్లచేతే గ్లామర్ క్వీన్‌గా మెప్పు పొందాను అని అంటోంది ఇలియానా. వాల్ట్ డిస్నీ.. అతని కెరీర్ మొదట్లో ‘క్రియేటివిటీ లేదు.. పాడు లేదు.. నువ్వు పనికిరావు పో’ అన్నారట. ఆరోజు అతను ఆ మాటను పట్టించుకుని కుంగిపోయుంటే ఈ రోజు ప్రతి తరంలోని పిల్లలు సంతోషంతో పరవళ్లు తొక్కే మిక్కీ మౌస్, డొనాల్డ్ డక్ క్యారెక్టర్స్ పుట్టేవే కావు. కేట్ బాస్వర్త్ ఈ అమెరికన్ నటికి జన్యపరమైన కారణాల వల్ల ఒక కనుపాప తేనె రంగులో, ఇంకో కనుపాప నీలం రంగులో ఉంటాయి. ఆ లోపాన్నే గ్లామర్ ప్రపంచంలో తన ప్రత్యేకతగా చాటుకుంది. ‘ద గోల్డెన్ గర్ల్ ఆఫ్ వెల్నెస్’ కాన్‌డీస్ కూమై గురించి నాలుగు మాటలు.. ‘కిన్‌సుగీ వెల్నెస్ ద జపనీస్ ఆర్ట్ ఆఫ్ నరిషింగ్ మైండ్, బాడీ అండ్ స్పిరిట్’ రచయిత కాన్‌డీస్ కూమై స్వస్థలం అమెరికాలోని కాలిఫోర్నియా. తల్లి జపాన్ దేశస్థురాలు. తండ్రి అమెరికాలో స్థిరపడిన పోలండ్ దేశస్థుడు. ఈ నేపథ్యం వల్ల అమెరికాలో కూమై చాలా వివక్షనే ఎదుర్కొంది. కిన్‌సుగీని ప్రాక్టీస్ చేయడం వల్లే తట్టుకుని నిలబడగలిగాను అని చెబుతుంది. కూమై.. షెఫ్‌గా చాలా ప్రసిద్ధి. మాజీ మోడల్, రచయిత, జర్నలిస్ట్, ఆర్ట్ డైరెక్టర్, పాడ్‌కాస్ట్ హోస్ట్, ఫొటోగ్రాఫర్ కూడా! ప్రముఖ ఎల్ మ్యాగజైన్ ఆమెకు ‘ద గోల్డెన్ గర్ల్ ఆఫ్ వెల్నెస్’ అనే బిరుదునిచ్చింది పూర్వాపరాల్లోకి వెళితే.. నిజానికి కిన్‌సుగీ అనేది ఒక కళ. ఆర్ట్ ఆఫ్ రిపేర్. కిన్‌సుగీ అంటే గోల్డెన్ రిపేర్ లేదా గోల్డెన్ జాయినరీ. పగిలిపోయిన పింగాణీ పాత్రలను బంగారు లేదా వెండి వర్ణంతో అతికించే కళ. పగిలిపోయినవాటిని అతికిస్తే అవి మునుపటి రూపానికి రావు. ఆ పగుళ్లు సన్నగా.. ఎగుడు దిగుడుగా కనిపిస్తాయి. కాబట్టి ఆ అతుకును బంగారం, వెండి లేదా ప్లాటినం ద్రావకాలతో అద్దుతారు. దాంతో ఆ పాటరీ ఆ అతుకులతోనే అందంగా.. ఆకర్షణీయంగా.. ప్రత్యేకంగా కనిపిస్తుంది. కిన్‌సుగీని జలపాతాలు.. నదులు.. మైదానాలతో పోలుస్తారు. ఎందుకంటే అవి రకరకాల రూపాల్లోకి ఒదుగుతూ అందంగా కనిపిస్తుంటాయి కదా! ఈ కళ.. ‘మొత్తైనై’ అంటే ‘అయ్యో వృథా అయిపోయిందే’.. ‘ముషిన్’ అంటే ‘మార్పును అంగీకరించడం’ అనే భావనల్లోంచి పుట్టింది అని చెబుతారు. అందుకే మూలం కన్నా కొత్తగా.. అరుదైన అందమైన దాన్నిగా మలచే కళగా కిన్‌సుగీ విరాజిల్లుతోంది. ఈ కళ ఎప్పుడు మొదలైంది? 15వ శతాబ్దంలో మొదలైంది. అషికాగా యోషిమాసా అనే సైనికాధికారి చైనా నుంచి పింగాణీ టీ పాత్రను తెప్పించుకున్నాడు. అందంగా ఉండే ఆ పాత్ర అంటే అతనికి ఎంతో ఇష్టం. ఒకసారి అది అతని చేతిలోంచి జారి కిందపడి పగిలిపోయింది. దాన్ని అతికించివ్వమని చైనాకు పంపాడు. అతికించి చైనీయులు తిరిగి పంపారు. అష్టవంకరలు కనిపించేలా అతికించిన ఆ పాత్రను చూసి ఏడ్చినంత పనిచేశాడట అషికాగా యోషిమాసా. తమ దగ్గరున్న కళాకారులను పిలిచి.. ఆ టీ పాత్రను చూపిస్తూ.. ‘మీరేం చేస్తారో తెలియదు.. ఈ అతుకులకు కొత్తందం తీసుకురావాలి’ అని ఆజ్ఞాపించాడట. చిత్తమంటూ వాళ్లు చిత్తగించి.. రకరకాల ప్రయోగాలు చేసి.. చివరకు బంగారు ద్రావకంతో ఆ పగుళ్లను అద్దారు. అంతే ఆ పాత్ర ప్రత్యేక అందాన్ని సంతరించుకుంది. దాన్ని చూసిన అషికాగా యోషిమాసా మొహంలో ఆనందం పరచుకుంది. అప్పటి నుంచి ఆ అద్దకం ఆర్ట్‌గా మారింది. తర్వాత కాలంలో ఆ కళను జీవితానికీ అన్వయించుకోవడం మొదలుపెట్టారు జపనీయులు. అనుభవంలోకి వచ్చిన పరిస్థితులు.. బాధలను విశ్లేషించుకోసాగారు. ఆ విశ్లేషణ వాళ్లను వాస్తవాన్నించి పారిపోకుండా.. అంగీకరించి ముందుకు కదిలే స్థైర్యాన్నిచ్చింది. అలా భయంలోంచి ధైర్యానికి సాగుతున్న ఆ ప్రయాణంలో దాగున్న ఆనందాన్ని పట్టుకున్నారు వాళ్లు. ఆస్వాదించడం ప్రారంభించారు. దాంతో సమస్యలను చూసే వాళ్ల దృష్టికోణమే మారిపోయింది. ఇది కదా బతకడం అంటే అనే గ్రహింపుకి వచ్చేశారు. అదిగో అప్పుడే కిన్‌సుగీ ఓ తత్వంగానూ మారి స్థిరపడింది. లోపాలను స్వీకరించి.. వాటిని అందంగా మలచుకుని ఆత్మవిశ్వాసంతో సాగిపోవడమే ఈ జీవన కళ ఉద్దేశం. లోపాలు వరాలు ఎవరమైనా పర్ఫెక్షన్ కోసమే పాకులాడుతాం. అహాన్ని సంతృప్తిపరచుకోవడానికో.. కీర్తి కోసమో.. ఆరోగ్యం విషయంలోనో ఆ పర్ఫెక్షన్ని సాధించాలనుకుంటాం. జీవితంలో ఉత్కృష్టమైన వాటి గురించే కథలుగా చెప్పుకుంటాం. కానీ వైఫల్యాలను చెప్పుకోం. బలహీనతలను బయటపెట్టుకోం. తప్పులను దాచేస్తాం. బంధాలు.. అనుబంధాల్లోని అరమరికలను ఒప్పుకోం. ఎవరూ ఎందులోనూ పర్ఫెక్ట్ కాదు అనే నిజం తెలిసినా నిర్లక్ష్యం చేస్తాం. అసలు తప్పులు చేయడంలో.. తప్పుగా ప్రవర్తించడంలోనే అందరం ఎక్స్పర్ట్స్మి. ప్రశంసించాల్సింది ప్రతిభను కాదు. బలహీనతలను.. గాయాల తాలూకు మచ్చలను.. పొరపాట్లను చూపించుకునేందుకు చేస్తున్న ధైర్యాన్ని మెచ్చుకోవాలి. కానీ ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తాం. ఎదుటి వాళ్లను చూసి ప్రమాణాలను ఏర్పరచుకుంటాం. ప్రతికూల ఫలితాలకు భయపడతాం. మంచి, చెడు ఏ అనుభవమైనా అక్కరకొచ్చేదే. ఏదీ వృథా కాదు. కాస్త మనసుపెడితే లోపాలు.. వైఫల్యాలు వరాలుగా తోస్తాయి. ఫెయిల్యూర్స్ మన ఆత్మస్థైర్యాన్ని వెలికితీస్తాయి.. మరింత శక్తిమంతంగా నిలబెడతాయి. పింగాణీ పాత్ర పగులుకు ఎలాగైతే బంగారు ద్రావకంతో మెరుగులు పెడతారో అలాగన్నమాట. అందుకే లోపాలు వరాలు అంటున్నది. ఫెయిల్యూర్‌తో వక్తిత్వవికాసం జరుగుతుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ విజయాన్ని మించిన కిక్‌నిస్తుంది. దాన్ని ఆస్వాదించాలి.. అనుభవించాలి అని చెబుతుంది ఆర్ట్ ఆఫ్ హీలింగ్.. కిన్‌సుగీ. పర్ఫెక్షన్ వెంట పరుగులు పెట్టిన చాలామంది కిన్‌సుగీని లోతుగా అధ్యయనం చేశారు. ఆ అధ్యయనం.. తమ పరుగుకు అర్థంలేదని తేల్చింది. దాంతో ఆ పరుగును ఆపి కిన్‌సుగీని ప్రాక్టీస్ చేయసాగారు. వాళ్లలో కాన్‌డీస్ కూమై ఒకరు. న్యూయార్క్వాసి అయిన ఆమె కిన్‌సుగీ మీద ఆసక్తితో జపాన్ వెళ్లి అక్కడ కొన్నాళ్లుండి కిన్‌సుగీని ఔపోసన పట్టింది. ‘కిన్‌సుగీ వెల్నెస్ ద జపనీస్ ఆర్ట్ ఆఫ్ నరిషింగ్ మైండ్, బాడీ అండ్ స్పిరిట్’ అనే పుస్తకం రాసింది. అందులో.. ఒత్తిడిలేకుండా జీవితాన్ని హాయిగా ఆస్వాదించే టెక్నిక్స్ కొన్నింటిని విశదపరచింది. అవేంటో చూద్దాం.. వాబి సాబి జపాన్ భాషలో వాబి అంటే ఏకాంతం.. లేదా ఒంటరితనం. సాబి అంటే వెళ్లే సమయం. ఈ రెండూ కలసి.. మనలోని మంచి, చెడులను మనమెట్లా అంగీకరించాలి.. వాటితో మన జీవితాన్ని ఎలా పరిపుష్టం చేసుకోవాలో చెబుతాయి. ఒక్కమాటలో.. వాబి సాబి అంటే మన లోపాల్లోని అందాన్ని ఆస్వాంచమని అర్థం. జీవితమంతా పర్ఫెక్ట్ ఫ్రేమ్‌లో సాగడం అసాధ్యం. మన బలహీనతలను తెలుసుకోవడం అంటే మన శక్తిసామర్థ్యాలను సెలబ్రేట్ చేసుకోవడమే. ఈ సానుకూల దృక్ఫథమే జీవితాన్ని సరళం చేస్తుంది. జీవితాన్ని ప్రేమించేలా చేస్తుంది. మన మీద మనకు నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచుతుంది. ఇదే వాబి సాబి సారాంశం. గామన్ .. అంటే స్థితప్రజ్ఞత. తుఫాను వచ్చినా.. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నా సంయమనం కోల్పోకుండా.. ప్రశాంత చిత్తంతో ఉండడం. ఆవేశం ఆవహించకుండా చూసుకోవడం. దైనందిన జీవితంలో ఎదురయ్యే ఒత్తిడికి మనం స్పందించే తీరుతోనే దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. పొద్దస్తమానం ప్రతికూల పరిస్థితుల గురించి ఆలోచించకుండా సానుకూల పరిస్థితుల మీద దృష్టి పెట్టడం మంచిదని వివరిస్తుంది గామన్. యూయిమారు వ్యక్తిగత సంబంధాలు, పరస్పర సహాయసహకారాలు ఎంత అవసరమో చెబుతుంది. మన అనుబంధాల్లోని గాఢత మీదే మనకు దొరికే సహానుభూతి ఆధారపడి ఉంటుంది. మన ఆప్తులు, సన్నిహితుల పట్ల మనం శ్రద్ధ కనబరిస్తే వాళ్లూ మన పట్ల శ్రద్ధ కనబరుస్తారు అంటుంది కిన్సుగీలో భాగమైన యూయిమారు. సింపుల్‌గా ఇచ్చిపుచ్చుకోవడమే! యొషోకు.. అంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ, సౌండ్ బాడీ త్రూ సౌండ్ మైండ్ .. అన్నమాట. మెదడు నిరంతరం ఆరోగ్యకరమైన ఆలోచనలు చేస్తుంటేనే దాన్ని కలిగిన శరీరం ఆరోగ్యంగా.. దృఢంగా ఉంటుందనేది యొషోకు మంత్రం. ఏరకమైన ఆహారం తీసుకుంటున్నామనే దాని మీదే మైండ్, బాడీ కనెక్షన్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి సాత్వికమైన పౌష్టికాహారాన్ని తీసుకుంటే అదే స్థాయిలో మెదడు ఆలోచనలు అద్భుతంగా సాగుతాయి. శరీరమూ అంతే పాజిటివ్‌నెస్‌తో స్పందిస్తుంది. కన్షా.. అంటే మన అహాన్ని వీడడం.. అనుభవాలను మళ్లీ పేర్చుకోవడం! జీవితంలోని మంచి, చెడులు.. రెండింటినీ సమంగా స్వీకరించి, రెండింటికీ సమంగా కృతజ్ఞత తెలపాలంటుంది కన్షా. కిన్సుగీలో అత్యంత ప్రధానమైన అంశం ఇదే! కృతజ్ఞత ప్రాక్టీస్ చేయడం అంటే వర్తమానంలో బతకడం. లేని వాటి గురించి ఆలోచించకపోవడం.. కోరుకోకపోవడం! వీటితో మన మెదడుకు కేవలం సానుకూలతలనే చూడమనే సంకేతాలను ఇవ్వడం. ప్రతి చర్యకు ఓ కారణం ఉంటుంది. ఎలాంటి సమస్యకైనా ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ కారణం.. ఆ ఉద్దేశం మనల్ని మరింత శక్తిమంతంగా.. ఉన్నతంగా తీర్చిదిద్దాలి! ఇలా పుస్తకంలోనే కాదు జీవితంలోనూ అనుసరిస్తున్న ఈ కిన్‌సుగీ వెల్నెస్ టెక్నిక్స్ గురించి కూమై పాడ్కాస్ట్నూ నిర్వహిస్తోంది. ఆ శ్రవణమాధ్యమానికి ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాకమైన శ్రోతలున్నారు. చివరగా.. అదృష్టాదృష్టాలనే మాట లేకుండా.. బలాలు బలహీనతలతో సహా ఉన్నదున్నట్లుగా జీవితాన్ని అంగీకరించడం.. సుఖదుఃఖాలను సమంగా తీసుకోవడం.. అడ్డంకులను శక్తికి కొలమానంగా భావించడం, ఓటమిలోంచి గెలుపుకి దారి వేసుకోవడమనే తత్వాన్ని ఒంటబట్టించుకోవడమంటే సాధుపుంగవులుగా మరడమని కాదు. చేతుల్లో లేని వాటిని .. సరిచేయలేని వాటిని మెదడులో మోసే పనిపెట్టుకోవద్దని. చేయగలిగే వాటి మీదే మెదడు పెట్టమని. పోటీలు, పోల్చుకోవడాలు, ఒత్తిళ్లు, అంచనాలు, విఫలయత్నాలు, అసంతృప్తులు, కలలు, కల్లలు వంటివన్నీ ఆ ప్రాక్టీస్‌ని మన దరి చేరనీయకపోవచ్చు. భయం మన లోపాలను భూతద్దంలో చూపిస్తుండొచ్చు. ఆ భూతద్దాన్ని బ్రేక్ చేస్తే భయం అర్థం కోల్పోతుంది. అప్పుడు గెలుపు.. ఒటమి రెండూ సమంగా కనపడతాయి. బతుకు విలువ తెలుస్తుంది. మనకు కావల్సింది ఆ భూతద్దాన్ని పగలగొట్టే పరికరం. అదే ఈ కిన్‌సుగీ. బ్రేక్ చేసి ప్రాక్టీస్ చేయడమే ఆలస్యం! (చదవండి: నిండు గర్భిణి మళయాళ టీవీ నటి మృతి..ఆ టైంలో కూడా గుండె సమస్యలు వస్తాయా?) -
20 ఏళ్లు వెదికినా తగిన జోడీ దొరకలేదని..
బ్రిటన్‌కు చెందిన సారా విల్కిన్సన్ (42) అనే మహిళ సరైన భాగస్వామి కోసం 20 ఏళ్లుగా వెదుకుతూనే ఉంది. అయినా ప్రయోజనం లేకపోవడంతో, ఇక మరోమార్గం లేదని ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఇంగ్లండ్‌లోని ఫెలిక్స్‌స్టో నివాసి సారా ఇటీవల హార్వెస్ట్ హౌస్‌లో తనను తానే పెళ్లి చేసుకుంది. ఈ వివాహ వేడుక కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసింది. చిన్నప్పటి నుంచి పెళ్లిలో డైమండ్ రింగ్ ధరించాలని కలలుగనేదానినని, ఆ కలను ఇప్పుడు నెరవేర్చుకున్నానని సారా మీడియాకు తెలిపింది. బ్రిటిష్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం సారా వివాహం ముఖ్యాంశాలలో నిలిచింది. అయితే అధికారికంగా ఈ పెళ్లికి గుర్తింపు దక్కలేదు. సారా తన వివాహానికి ఘనమైన ఏర్పాట్లు చేసింది. అద్భుతమైన వివాహ వేదికను సిద్ధం చేసుకుంది. గ్రాండ్ వెడ్డింగ్‌ల మాదిరిగానే డెకరేషన్ నుంచి ఫుడ్, డ్రింక్స్ వరకు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేసినట్లు సారా తెలిపింది. ఈ పెళ్లి వేడుకకు రూ.10 లక్షలు ఖర్చు చేసింది. తన పెళ్లి ఖర్చుల కోసం సారా చాలా ఏళ్లుగా పొదుపు చేస్తూ, డబ్బులు దాచింది. ఈ వివాహానికి సారా విల్కిన్సన్ సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. సారా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం తమకు ఆశ్చర్యం కలిగించిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. సారా స్నేహితురాలు,ప్రొఫెషనల్ వెడ్డింగ్ ప్లానర్ కేథరీన్ క్రెస్వెల్ ఈ వేడుకను నిర్వహించారు. సారా పెళ్లి వేడుకలో స్నేహితులమంతా కలుసుకోవడం ఆనందంగా ఉందని కేథరీన్ చెప్పింది. కాగా సారా తనను తాను వివాహం చేసుకున్నప్పటికీ, తనకు సరైన జోడీ దొరికే వరకూ వెదుకుతూనే ఉంటానని తెలిపింది. ఇది కూడా చదవండి: నకిలీ న్యాయవాది విజయగాథ.. 26 కేసులు గెలిచి.. -
మల్టీఫంక్షనల్ పర్ఫెక్ట్ కుక్వేర్
శాండివిచ్ దగ్గర నుంచి వాఫిల్స్ వరకు అన్నింటినీ సిద్ధం చేయడంలో ఈ డివైస్ ప్రత్యేకం. వెజ్, నాన్‌వెజ్ అనే తేడా లేకుండా భోజన ప్రియులకు నచ్చిన రుచులను నిమిషాల్లో అందించే మల్టీఫంక్షనల్ బ్రేక్ ఫస్ట్ మేకర్ ఇది. అన్నివిధాలా సౌకర్యవంతంగా పనిచేస్తుంది. పైగా దీన్ని పట్టుకుని వెళ్లడానికి వీలుగా ఒకవైపు ప్రత్యేకమైన హ్యాండిల్ ఉంటుంది. ముందువైపు లాక్ చేసుకునే వీలుతో పాటు టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి రెగ్యులేటర్ కూడా ఉంటుంది. డివైస్‌ను నిలబెట్టుకోవడానికి వీలుగా ప్రత్యేకమైన స్టాండ్స్ ఉంటాయి. దానికే పవర్ కనెక్టర్‌ని చుట్టి పక్కకు స్టోర్ చేసుకోవచ్చు. ఆమ్లెట్స్, కట్లెట్స్ ఇలా చాలానే వండుకోవచ్చు. అవసరాన్ని బట్టి వాఫిల్స్ ప్లేట్, గ్రిల్ ప్లేట్లను మార్చుకుంటూ ఉండొచ్చు. (చదవండి: ఈ చీజ్ ధర వింటే ..కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!) -
శానిటైజర్ ఘటనలో నగరవాసి హమీద్
జీడిమెట్ల: ఏపీలోని ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి 16 మంది మృతి చెందిన కేసులో మూలాలు హైదరాబాద్ శివారులో వెలుగు చూస్తున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు జీడిమెట్లకు చెందిన సాలె శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీనివాస్ శానిటైజర్‌ను ఎలా తయారు చేయాలి అని యూట్యూబ్‌లో చూశాడు. అనంతరం ముడి సరుకులను జీడిమెట్ల పైప్‌లైన్ రోడ్డులో ఉన్న హమీద్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న పర్ఫెక్ట్ సాల్వెంట్ షాపులో నిషేధిత రసాయనం మిథైల్ క్లోరై‡డ్తో పాటు తదితర రసాయనాలను కొనుగోలు చేశాడు. అనంతరం లాభసాటిగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు నకిలీ శానిటైజర్లు సరఫరా చేస్తున్నాడు. ప్రకాశం జిల్లా కురిచేడు గ్రామంలో 16 మంది తాగిన శానిటైజర్ ఇక్కడ తయారయ్యిదేనని తెలుసుకుని ఏపీ పోలీసులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరి హస్తం ఉందో తేల్చేందుకు సన్నద్ధమయ్యారు. కాగా శ్రీనివాస్ ఇంటి వద్దనే శానిటైజర్ పరిశ్రమను నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో హమీద్ పాత్ర తేల్చేందుకు పోలీసులు విచారణ చేస్తున్నారు. -
మంచి తండ్రిగా మీకు మార్కులెన్ని?
సెల్ఫ్ చెక్ ఇంట్లో వస్తువులు ఉన్నాయా? లేదా? పిల్లలు సరిగా చదువుతున్నారా? లేదా? కుటుంబానికి రక్షణగా ఉంటున్నామా? లేదా?... ఇలా అన్ని విషయాలనూ గమనిస్తూ ఫ్యామిలీకి చేదోడువాదోడుగా కుటుంబ యజమాని ఉంటాడు. ఇలా చేసినప్పుడే కుటుంబంలో అతనికి విలువ ఉంటుంది. పిల్లలు ‘‘మా నాన్న మంచివాడు’’ అనాలన్నా... ‘‘అవర్ డాడీ ఈజ్‌ది బెస్ట్’’ అనిపించుకోవాలన్నా వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవటం తప్పనిసరి. పరిశీలనా దృష్టి ఎక్కువగా ఉండే పిల్లలు ఇతరులతో మిమ్మల్ని పోల్చుకొని ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు కాబట్టి, వారనుకున్న విధంగా మీరు ఉండటం అవసరం. యజమానిగా మీరు పర్ఫెక్ట్ డాడీనో కాదో ఒకసారి చెక్ చేసుకోండి. 1. మీ పిల్లలు మిమ్మల్ని చాలా ఇష్టపడతారు. ఎ. అవును బి. కాదు 2. మీరెంత బిజీగా ఉన్నా మీ పిల్లలతో సమయాన్ని గడుపుతారు. ఎ. అవును బి. కాదు 3. పిల్లల భవిష్యత్ గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎ. అవును బి. కాదు 4. సెలవు దొరికితే మీ సమయాన్ని కుటుంబంతోనే గడుపుతారు. ఎ. అవును బి. కాదు 5. పిల్లలకు ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా చే స్తారు. ఎ. అవును బి. కాదు 6. పిల్లలను అనవసరంగా కోప్పడరు. వారిని శారీరకంగా దండించే ప్రయత్నం ఎప్పటికీ చేయరు. ఎ. అవును బి. కాదు 7. పాఠశాలలో జరిగే పేరెంట్– టీచర్ సమావేశాలకు తప్పక హాజరవుతారు. ఎ. అవును బి. కాదు 8. పిల్లలపై ప్రేమ చూపించటానికి మొహమాటపడరు. ఎ. అవును బి. కాదు 9. మీ పిల్లలు ‘ఫలానా కావాలి నాన్నా’ అని అడిగిన సందర్భాలు చాలా తక్కువ. వాళ్లు అడగక ముందే సిద్ధం చేసి ఉంటారు. ఎ. అవును బి. కాదు 10. పిల్లల అవసరాలు తీర్చడంతోపాటు వారిని క్రమశిక్షణగా ఎలా పెంచాలో మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ లు ఐదు వస్తే కన్నతండ్రిగా మీరు యావరేజ్. ‘ఎ’ లు ఏడు దాటితే మీరు పర్ఫెక్ట్ తండ్రి, పిల్లలను శ్రద్ధగా పెంచటంలో మీకు వందమార్కులు వచ్చినట్లు. మీ పిల్లలు మిమ్మల్ని ఎంత గౌరవిస్తారో అంతే ప్రేమిస్తారు. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే పిల్లలని ప్రేమించి, వారిని సంరక్షించడం, బాధ్యత తీసుకోవడం విషయంలో మీరు తెలుసుకోవలసింది చాలా ఉంటుంది. -
పుష్కల స్నానం
–పుష్కరఘాట్లకు జలకళ –నిండుకుండలా జూరాల జలాశయం –నారాయణపూర్ నుంచి భారీగా వరద –జిల్లాలో ప్రధాన జలాశయాలకు జలకళ –14గేట్ల ద్వారా శ్రీశైలం రిజర్వాయర్‌కు నీటివిడుదల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ బిరబిరా పరుగులు తీస్తోంది. ఆల్మటి, నారాయణపూర్, జూరాలను దాటి శ్రీశైలం వైపునకు ఉరకలేస్తోంది. నిన్నమొన్నటి వరకు బోసిపోయిన పుష్కరఘాట్లు జలకళను సంతరించుకున్నాయి. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : వరుణుడు కరుణ కురిపించాడు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రప్రథమంగా ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలకు కొత్త శోభ తీసుకొచ్చాడు.. జిల్లాలో ఈనెల 12 నుంచి ప్రారంభంకానున్న కృష్ణా పుష్కరాలకు వారంరోజుల ముందే జిల్లాకు పుష్కరశోభ సంతరించుకుంది. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఘాట్లకు చాలినన్ని నీళ్లురాకపోతే స్నానాలకు ఇబ్బంది కలుగుతుందేమోనని భావించారు. అయితే మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తుండడంతో వరదనీరు పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఉన్న ప్రధాన ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో జిల్లాలోని జూరాల ప్రాజెక్టుతో పాటు దాని అనుబంధ జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. ఇక పుష్కరస్నానాలకు ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జూరాల జలాశయంలో 8.377టీఎంసీల నీరు నిల్వ ఉంది. 14గేట్ల ద్వార 2.63 లక్షల క్కూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. దిగువకు వరద ఉధృతి జూరాలకు ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి దాదాపు లక్షన్నర క్యూసెక్కుల నీటిని గురువారం జూరాలకు విడుదల చేశారు. శుక్రవారం నారాయణపూర్ ఎగువ ప్రాంతంలో భారీ వరదలు వస్తుండడంతో జూరాలకు మరో లక్ష క్యూసెక్కుల నీటి వదిలిపెట్టారు. దీనికి అనుగుణంగానే నీటిపారుదల శాఖ అధికారులు జూరాల ప్రాజెక్టు సామర్థ్యానికి మించి నీరు నిల్వ ఉండకుండా శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. దీంతో జిల్లాలోని 52పుష్కరఘాట్లలో కొన్ని మినహా అన్నికూడా పూర్తిస్థాయి నీటిమట్టంతో భక్తులు పుష్కరస్నానాలు ఆచరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదిలాఉండగా, సీఎం కేసీఆర్ పుష్కరాలను ప్రారంభించి పుణ్యస్నానం ఆచరించే అలంపూర్ మండలం గొందిమళ్ల వీఐపీ పుష్కరఘాట్‌లో నీళ్లు ఇంకా పూర్తిస్థాయికి చేరుకోలేదు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి ఈ ప్రాంతానికి నీళ్లు మళ్లాల్సి ఉండడంతో ఈనెల 10వ తేదీ వరకు గొందిమళ్ల ఘాట్‌కు నీళ్లొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. పుష్కరఘాట్లకు జలకళ ఇప్పటికే మక్తల్, గద్వాల, వనపర్తి నియోజకరవర్గాల్లోని అన్ని ఘాట్లు, బీచుపల్లి ప్రధాన పుష్కరఘాట్‌లోకి పూర్తిస్థాయికి నీళ్లు చేరుతున్నాయి. మరో ఒకటి రెండు రోజుల్లో మరికొన్ని ఘాట్లకు కృష్ణమ్మ వరద రానుందని అధికారులు చెబుతున్నారు. ఇక జిల్లాలో మరో వీఐపీ ఘాట్ సోమశిలకు శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి నీళ్లు రావాల్సి ఉంది. సామర్థ్యానికి అనుగుణంగా జలాశయం నిండకపోవడంతో ఈ ప్రాంతానికి నీళ్లు రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కృష్ణా పుష్కరాలకు జిల్లాలో రూ.250కోట్లతో అన్ని ఏర్పాట్లుచేసిన అధికారులు పుష్కర స్నానానికి నీటికొరత తీర్చడం ఎలాగని కొంత ఆందోళనకు గురయ్యారు. కృష్ణానదికి పుష్కలంగా నీళ్లు రావడంతో సంతోషం వ్యక్తంచేస్తున్నారు. -
మనిషి గతి ఇంతే!
హ్యూమర్ ప్లస్ మనుషులు లక్షా తొంభై రకాలు. మనకు గట్టిగా తొంభై రకాలే పరిచయమవుతారు. మిగిలిన లక్ష గురించి తెలుసుకోవడం ఇతరుల బాధ్యత. మనం చాలా పర్ఫెక్ట్ అనుకుంటాం కానీ మన డిఫెక్ట్స్ ఎదుటివాళ్లు కనిపెడతారు. ఇతరుల పిచ్చిని తెలుసుకోవడమే పనిగా పెట్టుకున్నవాళ్లు కొందరుంటారు. వాళ్లే పిచ్చాసుపత్రి డాక్టర్లు. జీతం తీసుకుని మరీ పిచ్చివాళ్లతో కలిసి జీవిస్తుంటారు. నాకు తెలిసిన డాక్టర్ ఒకాయన ఉన్నాడు. నైజీరియా ప్రభుత్వం డాక్టరేట్ ఇచ్చి సన్మానం చేస్తుందని ఈ-మెయిల్ వస్తే ఖర్చుల కోసం 50 వేలు బ్యాంక్‌లో కట్టాడు. ఆ తరువాత నైజీరియా నుంచి సమాధానం నై. అసలు నైజీరియా వాళ్లకి కొట్టుకు చావడానికే టైం లేదు, మధ్యలో ఈయన్ని పిలిచి సన్మానం ఎందుకు చేస్తారు. వాళ్లకేమైనా పిచ్చా? అందరి పిచ్చిని తెలుసుకునే ఈయన ఇది తెలుసుకోలేక డబ్బు పోగొట్టుకున్నాడు. మన గురించి ఎవడైనా గొప్పగా అనుకుంటే చాలు ఒళ్లు మరిచిపోతాం. మనకు అంత సీన్ ఉందా లేదా అనేది అవసరం. ఎవడి పెళ్లికి వాడే హీరో అయినట్టు మన జీవితానికి మనమే కథానాయకులం. మనంతటి వారు లేరనేది మన ఫిలాసఫీ. తాగినప్పుడు ఇది చాలామందికి తలకెక్కుతుంది. మీరు తాగుబోతులైనా కాకపోయినా పర్లేదు. అయితే మరీ మంచిది. కల్లు కాంపౌండ్‌లో గానీ వైన్‌షాప్‌లో గానీ కాసేపు కూర్చుని చూడండి. బోలెడంత వేదాంత చర్చ జరుగుతూ ఉంటుంది. ‘‘నేనెవర్ని? ఎలాంటివాన్ని? ఈ లోకాన్ని అడగండి అదే చెబుతుంది. డబ్బుదేముంది. మనుషులు ముఖ్యం. అన్నీ చూడ్డానికి దేవుడున్నాడు. కొంచెం సోడా పొయ్. ఆ బాయిల్డ్ పల్లీ తీసుకో.’’ ఇది ఫస్ట్ రౌండ్ చర్చ. థర్డ్‌కి వెళితే భాష బాషా సినిమాలో రజనీకాంత్‌లా విజృంభిస్తుంది. ‘‘నన్షు అందర్షు మోసమ్ష్ చేసినా నేనెవర్షి షేయలేద్షు...’’ నిషా కదా ష అక్షరం అంతటా తానై నర్తిస్తుంది. ‘ష’ ఒక వూతకర్రతో నడిచినట్టు తాగుబోతుల అడుగులు కూడా బడతడుతాయి. ఎంత తడబడినా మనం మనింటికే వెళితే సేఫ్, లేదంటే వీపు సాప్. మనుషులందరికీ వాస్తవం కంటే భ్రాంతి ఎక్కువ ఇష్టం. రియాల్టీలో క్రూయాల్టీ ఉంటుంది. దాన్ని తట్టుకోవడం కష్టం. అందుకే సినిమాలకెళ్లి రంగుల్లో కలల్ని కొనుక్కుంటాం. కొంతమంది దర్శకులు తెలివి మీరి తెరపైన కూడా జీవితాన్ని చూపించడానికి ప్రయత్నిస్తారు. అంతకంత అనుభవిస్తారు. ఉన్న జీవితంతోనే చస్తుంటే డబ్బిచ్చి కూడా జీవితాన్నే చూడమంటే ఎవరు చూస్తారు? లైఫ్ నుంచి, వైఫ్ నుంచి పారిపోవడానికి తాగడం మొదలుపెడతారు. ఎక్కింది దిగగానే ఎదురుగా నైఫ్లే వైఫ్. ఒకాయన ఉన్నాడు. ఆయనెప్పుడూ నోరే తెరవడు. ఒకటి మాట్లాడితే భార్య తంతుంది. రెండు మాట్లాడితే ఉతుకుతుంది. అందుకే ఆ మౌనదీక్ష. కాని మందు పడితే మౌనం పారిపోతుంది. అరుపులు, పెడబొబ్బలు, సవాళ్లు... బండి డౌన్ కాగానే గాలి తీసిన బెలూన్, మూగవాడి పిల్లనగ్రోవి. మనదేశం గొప్పతనం ఏమంటే ఇక్కడ కల్తీ కల్లు తాగి చచ్చిపోతారు. కల్తీ కల్లు దొరక్కపోతే కూడా చచ్చిపోతారు. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్. ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా పోయేది బరియల్ గ్రౌండ్‌కే! - జి.ఆర్.మహర్షి -
చీర కొంటున్నారా?
ఏ చీర కట్టుకున్నా బాగుంటుంది అని సరిపెట్టుకోవడం కాదు. ఏ చీరలో బాగుంటాం, శరీరాకృతికి, మేని రంగుకు ఎలాంటివి నప్పుతాయి అనేది తెలుసుంటే ఎంపిక పర్ఫెక్ట్ అని కితాబులు కొట్టేస్తారు. లావుగా ఉన్నవారు బాగా గంజిపెట్టినట్టున్న కాటన్ చీరలు కట్టుకుంటే మరింత లావుగా కనిపిస్తారు వయసు పైబడిన వారు పెద్ద పెద్ద ప్రింట్లు ఉన్న చీరలను ఎంచుకోకపోవడమే మంచిది ఎత్తు తక్కువ ఉన్నవారు పెద్ద పెద్ద ప్రింట్లు ఉన్న చీరలు కట్టుకుంటే మరింత పొట్టిగా కనిపిస్తారు పొడవుగా ఉన్నవారు పెద్ద అంచున్న చీర కట్టుకుంటే బాగుంటారు లావుగా ఉన్నవారు ముదురు రంగుల చీరలు ధరిస్తే చూడటానికి స్లిమ్‌గానూ, అందంగానూ కనిపిస్తారు.