పర్‌ఫెక్ట్‌ చపాతీ! మేడమ్‌జీ, ఐడియా అదుర్స్‌ : వీడియో వైరల్‌ | Video: Time Saving Tip To Prepare Rotis Quickly | Sakshi
Sakshi News home page

పర్‌ఫెక్ట్‌ చపాతీ! మేడమ్‌జీ, ఐడియా అదుర్స్‌ : వీడియో వైరల్‌

Published Sat, Mar 16 2024 10:39 AM | Last Updated on Sat, Mar 16 2024 10:56 AM

Time Saving Tip To Prepare Rotis Quickly Video - Sakshi

ఇంటా బయటా  మహిళలు మల్టీ టాస్కింగ్‌ చేస్తారు. ఉన్న సమయంలో అటు వంట చేస్తూనే, ఇటు పిల్లల్ని స్కూలుకు రడీ చేస్తూ, తాను ఉద్యోగానికి సిద్ధ మవుతూ ఈ విషయంలో శతావధానం చేస్తారంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి సమయంలోనే వారి బుర్రల్లో ఐడియాలు కూడా భలే తళుక్కు మంటాయి. ఈ క్రమంలో రోటీ మేకింగ్‌లో ఈజీ ట్రిక్‌ ఒకటి నెట్టింట్‌ వైరల్‌గా మారింది. ఆ  కథా కమామిష్షు ఏంటో చూస్తే మీరు కూడా వావ్‌..! అంటారు.

పర్ఫెక్ట్‌గా, రౌండ్‌గా చపాతీలు చేయడం అంటే కత్తిమీద సామే. దీనికి చాలా టైం కూడా పడుతుంది. అందుకే చపాతీలు రౌండ్‌గానే ఉండాలా ఏంటి?  టేస్టీగా ఉంటా చాలదా అని సరిపెట్టేసుకుంటాం కదా.

కానీ రోటీ తయారీలో ఒక మహిళ తెలివిగా వ్యవహరించింది. శ్రమను, సమయాన్ని ఆదా చేసేలా స్మార్ట్‌గా వ్యవహరించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మాయింది. దాదాపు మూడుకోట్లపైగా వ్యూస్‌ను సొంతం  చేసుకుంది.  

రాజ్‌పుత్‌  జోడీ అనే ఇన్‌స్టాగ్రామ్  ఖాతా ఈ వైరల్‌ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలోని  మిసెస్‌ పెర్‌ఫెక్ట్‌ మేడమ్‌... గోధుమ పిండిని మృదువుగా కలుపుకొని ఒక్కొక్కటి విడిగా విడిగా గాకుండా, చపాతీ కర్రతో  చాలా వెడల్పుగా ఒక పెద్ద రోటీ లాగా వత్తుకుంది. ఆ తరువాత గుండ్రని ప్లేట్‌ సాయంతో పెద్ద చపాతీని కాస్తా గుండ్రటి చిన్న చపాతీలుగా కట్‌ చేసి పెట్టుకుంది.  తరువాత చక్కగా కాల్చింది.  ఈ సింపుల్ ట్రిక్ చూసి నెటిజన్లు అద్భుతం,సూపర్‌ అంటూ వ్యాఖ్యానించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement