trick
-
పర్ఫెక్ట్ చపాతీ! మేడమ్‌జీ, ఐడియా అదుర్స్ : వీడియో వైరల్
ఇంటా బయటా మహిళలు మల్టీ టాస్కింగ్ చేస్తారు. ఉన్న సమయంలో అటు వంట చేస్తూనే, ఇటు పిల్లల్ని స్కూలుకు రడీ చేస్తూ, తాను ఉద్యోగానికి సిద్ధ మవుతూ ఈ విషయంలో శతావధానం చేస్తారంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి సమయంలోనే వారి బుర్రల్లో ఐడియాలు కూడా భలే తళుక్కు మంటాయి. ఈ క్రమంలో రోటీ మేకింగ్‌లో ఈజీ ట్రిక్ ఒకటి నెట్టింట్ వైరల్‌గా మారింది. ఆ కథా కమామిష్షు ఏంటో చూస్తే మీరు కూడా వావ్..! అంటారు. పర్ఫెక్ట్గా, రౌండ్‌గా చపాతీలు చేయడం అంటే కత్తిమీద సామే. దీనికి చాలా టైం కూడా పడుతుంది. అందుకే చపాతీలు రౌండ్‌గానే ఉండాలా ఏంటి? టేస్టీగా ఉంటా చాలదా అని సరిపెట్టేసుకుంటాం కదా. కానీ రోటీ తయారీలో ఒక మహిళ తెలివిగా వ్యవహరించింది. శ్రమను, సమయాన్ని ఆదా చేసేలా స్మార్ట్‌గా వ్యవహరించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మాయింది. దాదాపు మూడుకోట్లపైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. View this post on Instagram A post shared by Chandni⚡Vinay (@rajput_jodi_) రాజ్‌పుత్ జోడీ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ఈ వైరల్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలోని మిసెస్ పెర్ఫెక్ట్ మేడమ్... గోధుమ పిండిని మృదువుగా కలుపుకొని ఒక్కొక్కటి విడిగా విడిగా గాకుండా, చపాతీ కర్రతో చాలా వెడల్పుగా ఒక పెద్ద రోటీ లాగా వత్తుకుంది. ఆ తరువాత గుండ్రని ప్లేట్ సాయంతో పెద్ద చపాతీని కాస్తా గుండ్రటి చిన్న చపాతీలుగా కట్ చేసి పెట్టుకుంది. తరువాత చక్కగా కాల్చింది. ఈ సింపుల్ ట్రిక్ చూసి నెటిజన్లు అద్భుతం,సూపర్ అంటూ వ్యాఖ్యానించారు. -
ప్రధాని మోదీ మ్యాజిక్ ట్రిక్.. ఫిదా అయిన చిన్నారులు
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తనను కలవడానికి వచ్చిన కొందరు చిన్నారులను కాయిన్ ట్రిక్ తో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మోదీ "మ్యాజిక్ ట్రిక్" చేశారు. ప్రధాని మోదీ నుదిటికి నాణెం పెట్టుకుంటారు. తల వెనుక భాగంలో తట్టగానే ఆ నాణెం ముందుకు పడిపోతుంది. ఈ దృగ్విశయాన్ని పిల్లలు విస్మయంతో చూశారు. #Watch | PM Modi's "Memorable Moments" With Children pic.twitter.com/4r2AysENHu — NDTV (@ndtv) November 16, 2023 పిల్లల నుదిటిపై నాణెం అంటించి వారి తల భాగంలో నొక్కినప్పుడు మాత్రం నాణెం పడిపోదు. ఇదిలాగో తెలియక పిల్లలు విచిత్రంగా చూస్తారు. అయితే.. ఈ క్రమంలో పిల్లల నుదిటిన అంటించిన నాణాన్ని మోదీ మరో చేతితో లాక్కుంటారు. సరదాగా పిల్లలతో ప్రధాని మోదీ పిల్లలతో ఈ మ్యాజిక్ చేశారు. ఈ విషయాన్ని మరిచిపోలేని జ్ఞాపకాలుగా పేర్కొంటూ ప్రధాని మోదీ ట్విట్టర్(ఎక్స్)లో షేర్ చేశారు. ఈ ఏడాది రక్షా బంధన్ వేడుకల్లోనూ ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులతో సరదాగా గడిపారు. పిల్లలు ప్రధానికి ఘనస్వాగతం పలికి రాఖీ కట్టారు. అఖిల భారతీయ శిక్షా సమాగమ్ వేడుకలో భాగంగా కూడా ప్రధాని మోదీ పిల్లలతో ముచ్చటించారు. పిల్లల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇదీ చదవండి: జిన్‌పింగ్ ఓ నియంత.. బైడెన్ నోట మళ్లీ అదే మాట! -
మీకు తెలుసా!..బ్రెడ్‌తో పాదాల పగుళ్లు మాయం!
కోమలంగా ఉండాల్సిన పాదాలు కాస్త చూసేందుకు అస్యహంగా ఉన్నాయా!. కనీసం బయటకువెళ్లలేని స్థితిలో ఉన్నారా. మరోవైపు ఆ పగుళ్లు వల్ల వచ్చే బాధ కారణంగా చన్నీటిలో పాదాలు పెట్టాలన్న భయం వేస్తుంది. ఎన్నో క్రీంలు వాడినా పాదాల పగుళ్లు సమస్య నుంచి బయటన పడలేక పోతుంటే ఈ చక్కటి చిట్కాను ఫాలోకండి. మంచి ఫలితం ఉంటుంది. ఏంటీ.. దీంతోనా! అని షాక్ అవ్వద్దు!. వర్షాకాలం లేదా శీతాకాలం వస్తే అందర్నీ వేధించే సమస్యే కాలు పగుళ్లు ఓ పట్టాన నయం కావు. పైగా మరింత పెద్దవై రక్తం కారి నొప్పి కూడా వస్తుంటుంది. చెప్పులు వేసుకుని నడవాలన్న చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓ పక్క ఎవ్వరైన ఈ పగుళ్లు చూసి అసహ్యించుకుంటారేమోనని భయపడతాం. అందుకని అవికనిపించకుండా ఉండేలా సాక్స్ వంటి ఉపయోగించి మరీ దాచే ప్రయత్నం చేస్తాం. పోనీ మార్కెట్లో ఉండే పగుళ్లు తగ్గే క్రీం ట్రై చేసినా పెద్దగా ఫలితం ఉండదు. కొబ్బరి నూనె, పసుపు వంటి ఎన్నో చిట్కాలు వాడి విసిగి వేసారిపోయి ఉంటే ఇలా ట్రై చేసి చూడండి. ఇంతకీ ఆ చిట్కా ఏంటంటే.. బ్రెడ్‌తో కాలా పగుళ్ల సమస్యకు చెక్‌పెట్టొచ్చు. ఏంటీ బ్రెడ్! అని ఆశ్చర్యపోవద్దు. ఔను నిజంగానే దాంతో ఈజీగా పగుళ్లు తగ్గిపోతాయట. ముందుగా ఓ బ్రెడ్ స్లైడ్ తీసుకుని దాన్ని యాపిల్ వెనిగర్‌లో ముంచి మీ మడమను కవర్ చేసేలా ప్లాస్టిక్ కవర్‌తో గట్టిగా చుట్టేయాలి. ఇలా పగుళ్లు ఉన్న చోటల్లా ఇలా యాపిల్ వెనిగర్‌లో ముంచిన బ్రెడ్‌ని పెట్టి, ప్లాస్టిక్ కవర్‌తో గట్టిగా కట్టేయాలి. ఆ తర్వాత ఫలితం చూసి కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ ప్రదేశం అంతా గట్టిగా అయ్యి నెమ్మదిగా అక్కడ చర్మం పొలుసులుగా వ్చేసి క్లీన్ అయిపోతుంది. ఎలా అంటే పార్లర్‌కి వెళ్లి పెడిక్యూర్ చేయించుకున్న మాదిరి ఉంటాయి పాదాలు. తప్పక ట్రై చెయ్యండి. (చదవండి: శిల్పంలా ఉండే శృతి హాసన్ బ్యూటీ సీక్రెట్ ఇదేనా!) -
ఐస్‌క్రీం కొనడానికి వచ్చి ఏం చేశాడో తెలుసా... నవ్వాగదు!
చాలా సార్లు దుకాణాల్లో అమ్మే వ్యక్తులను ఏదోరకంగా వస్తువులను పట్టుకువెళ్లిపోయే వాళ్లను చూసే ఉంటాం. అంతేందుకు చాలా మటుకు అమ్మేవాణ్ణి ఏదోరకంగా మాయ చేసి ఇచ్చిన రేటుకుంటే ఎక్కవ వస్తువులను తీసుకుపోయే వాళ్లను కూడా చూసి ఉంటాం. ఇలా బహిరంగంగా అందరూ చూస్తుండగా, అదీ కూడా షాపింగ్ మాల్లో ఒక టర్కీష్ ఐసీక్రీంని పట్టుకుపోతాడు. అది ఎక్కడ జరిగిందో ఏంటో అని ఆలోచింకండి చదివేయండి. (చదవండి: బంపర్ ఆఫర్....వ్యాక్సిన్ తీసుకో..బహుమతి పట్టు) ఒక షాపింగ్ మాల్లో ఒక టర్కిష్ ఐస్‌క్రీం దుకాణదారుడు అత్యంత నైపుణంగా ఐస్‌క్రీం కోన్‌పై ఐస్క్రీంని చాలా వెరైటీగా అలంకరిస్తాడు. అందుకోసం అని ఒక కస్టమర్ ఆ దుకాణదారుడు వద్దకు వచ్చి నిలబడతాడు. ఆ వ్యాపారి ఒక కోన్ తీసుకుని పట్టుకోమని సదరు వ్యక్తికి ఇస్తాడు. ఇంతలో సదరు వ్యాపారి చాలా నైపుణ్యంతో ఐస్క్రీ పెడదామని చూస్తుండగానే కొనడానికి వచ్చిన ఆ వ్యక్తి ఆ ఐస్క్రీంని మొత్తం తీసుకుని పట్టకుపోతాడు. దీంతో అక్కడ ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా చప్పట్లు కొడతూ నవ్వుతుంటారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి చూడండి. (చదవండి: యాహూ! నేను పగలుగొట్టేశాను) -
హవ్వా.. అదేం బౌలింగ్ అశ్విన్!
చెన్నై: ఐపీఎల్లో ‘మన్కడింగ్’తో వివాదం రేపిన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. వికెట్లు తీసేందుకు మైదానంలో రకరకాల విన్యాసాలు చేసే అశ్విన్.. తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్)లో కొత్త ట్రిక్‌తో క్రికెట్ అభిమానులను విస్మయానికి గురిచేశాడు. శుక్రవారం జరిగిన టీఎన్‌పీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌లో దిందిగల్ డ్రాగన్స్(డీడీ)తో చెపాక్ సూపర్ గిల్లీస్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో గిల్లీస్ టీమ్‌పై డ్రాగన్స్ జట్టు 10 పరుగుల తేడాతో గెలిచింది. చెపాక్ సూపర్ గిల్లీస్ చివరి 2 బంతులకు 17 చేయాల్సివుండగా డీడీ కెప్టెన్ అశ్విన్ విచిత్రంగా బంతిని విసిరి అందరినీ ఆశ్చర్యంతో ముంచెత్తాడు. ముందు చేతిని ఉపయోగించకుండా, రాంగ్ ఫుట్‌తో అతడు బంతిని విసిరాడు. అశ్విన్ విన్యాసంపై సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతావా అంటూ ప్రశ్నిస్తున్నారు. ముందుగా బ్యాటింగ్ చేసిన దిందిగల్ డ్రాగన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 115 పరుగులు చేసింది. కెప్టెన్ అశ్విన్ 19 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 37 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చెపాక్ సూపర్ గిల్లీస్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 105 పరుగులే చేసింది. కాగా, ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్‌ను కింగ్స్ పంజాబ్ కెప్టెన్ అశ్విన్ మన్కడింగ్ ద్వారా ఔట్ చేయడం తీవ్ర దుమారం రేపిన సంగతి క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. (చదవండి: అశ్విన్ తప్పు చేశాడా!) What's Ashwin doing 😂 https://t.co/9RwED0mQSq — Gurdeep (@gurdeep0701) July 19, 2019 -
నెల్లూరులో ‘ రాజకీయ కుట్ర’
సాక్షి , నెల్లూరు: జిల్లాలో అధికార పార్టీ వేధింపుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. కేవలం పార్టీ మారారనే ఏకైక కారణంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనంజయరెడ్డిపై తెలుగుదేశం పార్టీ కక్ష కట్టింది. అన్ని అనుమతులు, తీర్మానాలతో ఖర్చులను నిధులు దుర్వినియోగం అయినట్లు హడావుడిగా చిత్రీకరించారు. వాటిపై హడావుడిగా విచారణ నిర్వహించినట్లు చేసి కలెక్టర్ వద్దకు విచారణకు హాజరుకావాలని చైర్మన్‌కు నోటీసులు జారీ చేయడం రాజకీయంగా దుమారం రేగింది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ సాగుతూ సర్వత్రా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న క్రమంలో జిల్లాలో రాజకీయ కక్షలతో విచారణకు తెరతీశారు. కేవలం వ్యక్తిగత టార్గెట్ చేసి రాజకీయంగా ప్రతిష్టను మసకబార్చటం కోసం హడావుడిగా కుట్ర రాజకీయలు తెర తీసి ఈ నెల 25న కలెక్టర్ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై న్యాయపరంగానే తేల్చుకోవటానికి చైర్మన్ వర్గం సన్నద్ధమైంది. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు కొన్ని ఏళ్ల క్రితం అనుమతులతో చేసిన ఖర్చులకు ఇప్పుడు విచారణకు తెరతీశారు. అది కూడా తేల్చాల్సిన అంశాలు వదిలేసి టార్గెట్ చేసే దిశగా కొత్త అంశాలను తెరపైకి తెచ్చారు. జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్‌గా మెట్టుకూరు ధనంజయరెడ్డి 2013లో ఎన్నిక అయి నేటికీ కొనసాగుతున్నారు. ఈ క్రమంలో గత నెల ముందు వరకు టీడీపీలో కీలక నేతగా వ్యవహరించారు. గత నెల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ నుంచి ఉదయగిరి, ఆత్మకూరు అసెంబ్లీ, నెల్లూరు పార్లమెంట్ స్థానాల్లో ఒక చోట అవకాశం కల్పిస్తామని స్వయంగా చంద్రబాబు నాయుడే అనేక మార్లు చెప్పిన పరిస్థితి. ఈ క్రమంలో జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాలు, దివంగత వైఎస్సార్ కుటుంబంతో 20 ఏళ్లకుపైగా ధనంజయరెడ్డికి వ్యక్తిగతంగా అనుబంధం ఉండడంతో ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి జిల్లాలో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. పార్టీ మారడంతో వేధింపుల పర్వానికి అధికార పార్టీ తెరతీసింది. వాస్తవానికి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో కుదువ పెట్టిన బంగారం విషయంలో గతంలో దుర్వినియోగం జరిగితే దీనిపై అప్పట్లో చైర్మన్ హోదాలో ధనంజయరెడ్డి విచారణ కోరగా విచారణకు కమిటీ వేశారు. దానికి సంబంధించి విచారణ ప్రకియ ముగియడం, పాలకవర్గం కూడా వివరణ ఇచ్చింది. అంతవరకు విచారణ సజావుగానే సాగింది. కొత్తగా విచారణ ఇప్పుడు పాత విచారణను పక్కన పెట్టి దాని కొనసాగింపుగా కొత్త విచారణ మొదలుపెట్టి ధనంజయరెడ్డికి నోటీసులు జారీ చేశారు. 2013, 2014లో చేసిన ఖర్చులపై ఇప్పుడు విచారణ నిర్వహిస్తున్నామని దీనికి చైర్మన్ ధనంజయరెడ్డి, పాలకవర్గం వ్యక్తిగతంగా ఈ నెల 25న కలెక్టర్ ముత్యాలరాజు ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. నోటీసుల్లో ఏముందంటే.. రాజధాని నిర్మాణం కోసం అందరి నుంచి ముఖ్యమంత్రి భారీగా విరాళాలు సేకరించారు. రాజధానికి బాగా విరాళాలు వస్తున్నాయని చెప్పుకునేందుకు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విరాళాలు పంపమని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో బ్యాంక్ పాలకవర్గం సమావేశంలో నిర్ణయం తీసుకుని 2014 డిసెంబర్ 9వ తేదీన రూ.6 లక్షల విరాళాన్ని ప్రభుత్వానికి పంపారు. దీనిపై విచారణ వేశారు. అలాగే బ్యాంక్ కాంప్లెక్స్‌లోని షాపుల ఆద్దెలు బాగా తక్కువగా ఉండటం, కొందరు మొండి బకాయిలుగా మారిన క్రమంలో పాలక మండలి తీర్మానంతో బిడ్లు ఆహ్వానించి షాపులను కేటాయించారు. ఈ క్రమంలో అద్దెలు తగ్గించడం వల్ల, అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని వల్ల రూ.42.30 లక్షలు నష్టం వాటిల్లిందని, దీనిని దుర్వినియోగంగా చూపారు. అలాగే బ్యాంక్ ఏర్పడి 100 ఏళ్లు అయిన సందర్భంగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించి, దానికి సీఎం చంద్రబాబు నాయుడును కూడా ఆçహ్వానించి, శత జయంతి వేడుకల్ని నిర్వహించారు. దానికి బ్యాంక్ ద్వారా రూ.35 లక్షలు ఖర్చును పాలకవర్గం అనుమతితో సబ్ కమిటీ వేసి దాని మేరకు సహకార శాఖ నిబంధనలకు లోబడి ఖర్చు చేశారు. సీఎం హాజరుకానప్పటికీ జిల్లా మంత్రులు నారయణ, సోమిరెడ్డి మొదలుకుని ఎమ్మెల్యేలు అందరూ హాజరై బ్యాంక్ బాగా పనిచేస్తుందని కితాబు ఇచ్చారు. ఇప్పుడు దీనిని కూడా దుర్వినియోగంగా చూపించి విచారణకు ఆదేశించారు. ఈమూడు అంశాలపై విచారణకు హాజరై వివరణ ఇవ్వాలనేది నోటీసుల సారాంశం బీద రవిచంద్ర ఒత్తిడితోనే.. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ఒత్తిడితో అధికారులు తలొగ్గారనే ప్రచారం బలంగా సాగుతోంది. అధికార పార్టీలో ఉన్నంత వరకు అంతా మంచిగా కనిపించి ఒక్కసారి పార్టీ మారగానే వేధింపులకు గురి చేసి వ్యక్తిగతంగా రాజకీయ ప్రతిష్ట దిగజార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వాస్తవానికి ఇవ్వన్నీ కూడా కొన్నేళ్ల క్రితం టీడీపీలో ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు. వీటికి బీద రవిచంద్ర కూడా హాజరయ్యారు. సహకార బ్యాంక్‌లో అవినీతి ఆరోపణలు ఉన్న ఒక అధికారి సలహాతో ఈ తతంగం నడిపారు. ఆగమేఘాల మీద కలెక్టర్ విచారణ చేయాలని ఒత్తిడి తెచ్చి బ్యాంక్ డీజీఎం, సీఈఓలను మూడు రోజుల విచారణకు పిలిచి హడావుడిగా లెక్కలు వేయించి విచారణ చేసినట్లు చూపించి, నోటీసులు జారీ చేశారు. దీనిపై చైర్మన్ మెట్టుకూరు ధనంజయరెడ్డి న్యాయపోరాటం ద్వారా తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. -
గ్యాస్ ‘ట్రిక్’
–దారిమళ్లుతున్న వంటగ్యాస్ –కార్లకూ వినియోగం –పెరిగిన 3కేజీల సిలిండర్ల వినియోగం –యథేచ్ఛగా ఫిల్లింగ్ సెంటర్ల నిర్వహణ ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : వంటగ్యాస్ దారిమళ్లుతోంది. నిబంధనల ప్రకారం సబ్సిడీపై అందించే ఈ గ్యాస్‌ను గహావసరాలకే వినియోగించాలి. కొందరు అక్రమార్కులు వ్యాపార అవసరాల కోసం వినియోగిస్తున్నారు. కొందరు చిన్నచిన్న సిలిండర్లలో గ్యాస్‌ను ఫిల్లింగ్ చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇది ప్రమాదకరమని తెలిసినా.. పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా 3కేజీల సిలిండర్ల ఫిల్లింగ్ జిల్లావ్యాప్తంగా 3కేజీల సిలిండర్లలో వంటగ్యాస్ ఫిల్లింగ్ యథేచ్ఛగా సాగుతోంది. దీనికోసం వ్యాపారులు రహస్య స్థావరాలను ఏర్పాటుచేసుకుంటున్నారు. కొందరు దుకాణాల్లోనే బహిరంగంగా ఫిల్లింగ్ చేసేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. విద్యార్థులు, పెళ్లికాని ఉద్యోగులు, పెళై ్లనా కుటుంబాలకు దూరంగా ఉన్న ఉద్యోగులు ఈ చిన్న సిలిండర్ల వినియోగానికి ప్రాధాన్యం ఇస్తుండడంతో వ్యాపారులు ఎక్కడకక్కడ ఫిల్లింగ్సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాలతోపాటు, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఫిల్లింగ్ కేంద్రాలు నడుస్తున్నాయి. నిబంధనల ప్రకారం.. గ్యాస్ ఫిల్లింగ్ నేరం. పైగా ప్రమాదకరం కూడా. అయినా వ్యాపారులు ధనార్జన మాయలో ప్రమాదాలను పట్టించుకోవడం లేదు. కార్లకూ వంటగ్యాసే ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌తోపాటు గ్యాస్‌తో నడిచే కార్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. నిబంధనల ప్రకారం.. ఈ కార్లలో సీఎన్జీ గ్యాస్‌ను మాత్రమే వినియోగించాలి. కొన్ని ఆటోలూ సీఎన్జీ గ్యాస్ ద్వారానే నడుస్తాయి. ఇలాంటి వాహనాలు జిల్లాలో సుమారు 8వేలు ఉన్నట్టు అంచనా. వీటికోసం జిల్లాలో కేవలం ఆరు గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ స్టేషన్లు దగ్గరలో లేని వినియోగదారులు వంటగ్యాస్‌ను వాహనాలకు వినియోగిస్తున్నారు. ఫలితంగా ప్రతిరోజూ వేలాది గహావసర సిలిండర్లు దుర్వినియోగమవుతున్నట్టు సమాచారం. తక్కువ ధరకే గ్యాస్ వంట గ్యాస్ సిలిండర్లను ఆయా గ్యాస్ కంపెనీలు సబ్సీడీ లేకుండా ప్రజలకు 14.2 కేజీల సిలిండర్‌ను రూ.549కి అందిస్తున్నాయి. ఆ లెక్కన కేజీ గ్యాస్‌కు సుమారు రూ.40 అవుతోంది. కానీ మార్కెట్లో లభ్యమవుతున్న 3 కేజీల సిలిండర్‌ను కేవలం రూ.80 నుంచి రూ.90కే ప్రై వేటు వ్యాపారులు అందించడం విచిత్రంగా అనిపిస్తోంది. అంటే ప్రభుత్వం అందించే ధర పక్రకారం 3 కేజీల గ్యాస్‌కు సుమారు రూ.120 అవుతుండగా.. ప్రై వేటు వ్యాపారులు మాత్రం కేవలం రూ. 80 – 90 మధ్యనే అందిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. వీరికి ఇంత తక్కువ ధరకు గ్యాస్ రావడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ప్రమాదకరం గహావసర సిలిండర్లలోని గ్యాస్‌ను చిన్న సిలిండర్లు, కార్లు, ఆటోల్లో నింపడం ప్రమాదకరం. నింపే సమయంలో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. కొన్ని సందర్భాల్లో సిలిండర్లు పేలిపోవడం, భారీ అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలోæ గ్యాస్ అక్రమ ఫిల్లింగ్‌కు పాల్పడుతున్న వారిపై ఆయా ప్రాంతాల్లో స్థానికులు ఫిర్యాదులూ చేశారు. అయినా అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ ఫిలింగ్కు పాల్పడితే చర్యలు గ్యాస్ అక్రమ ఫిల్లింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. గ్యాస్ ఫిల్లింగ్‌కు లైసెన్స్ ఉన్న వారు మాత్రమే చేయాలి. జిల్లాలో 3 కేజీలు, 5 కేజీల సిలిండర్లు విక్రయించడానికి ఎక్కడా లైసెన్సులివ్వలేదు. అలాగే చిన్న కార్లు ఆటోల్లో గృహావసర గ్యాస్‌ను వినియోగించిన వారిపైనా చర్యలు తీసుకుంటాం. డి.శివశంకర రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి. -
ఈ ఐఫోన్ ట్రిక్ మీకు తెలుసా?
మీరు ఐఫోన్ వాడుతున్నారా? కొన్నిసార్లు మీ ఐఫోన్ లో సిగ్నల్ ఫుల్ గా చూపిస్తూ.. కనీసం ఒక మెసేజ్ పంపినా వెళ్లడం లేదా? అయితే ఈ ట్రిక్ మీకోసమే. పైకి ఫుల్ గా సిగ్నల్ కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి ఉన్న సిగ్నల్ స్ట్రెంథ్ ఎంత అనేది ఈ ట్రిక్ ద్వారా తెలుసుకోవచ్చు. ఐఫోన్ లో సిగ్నల్ చూపే గీతలు (బార్స్) సిగ్నల్ రేంజ్ ను మాత్రమే తెలుపుతాయి. కానీ సిగ్నల్ సామర్థ్యాన్ని కాదు. కొన్నిసార్లు సిగ్నల్ రేంజ్ లో ఉండటంతో ఈ బార్స్ ఫుల్ గా కనిపిస్తాయి. కానీ మెసేజ్ చేయాలన్న, కాల్ చేయాలన్న మీ ఐఫోన్ స్ట్రగుల్ అవుతుంటుంది. ఇలాంటి సమయంలో మీ ఐఫోన్ లోని సిగ్నల్ స్ట్రెంథ్ ఎంతో తెలుసుకోవడానికి ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అయితే సరిపోతుంది. యాక్సెస్ ఫీల్డ్ టెస్ట్ మోడ్: ఇందుకు *3001#12345#*కి కాల్ చేయాలి. దీంతో మీ ఫోన్ ఫీల్డ్ టెస్ట్ మోడ్ లోకి మారుతుంది. సిగ్నల్ సంఖ్యరూపంలో కనిపిస్తుంది. ఇప్పుడు లాక్ బటన్ గట్టిగా నొక్కి.. పవర్ ఆఫ్ (స్విచ్ఛాఫ్) బటన్ కనిపించేవరకు ప్రెస్ చేయాలి. దాదాపు ఆరు సెకండ్ల పాటు ఇప్పుడు హోమ్ బటన్ ను ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఫోన్ హోమ్ స్క్రీన్ లోకి వెళుతుంది. సిగ్నల్ స్ట్రెంథ్ నంబర్ రూపంలో ఉంటుంది. స్ట్రెంథ్, రేంజ్ ను మార్చి చూసుకోవాలంటే బార్స్ ను ట్యాప్ చేస్తే సరిపోతుంది. సిగ్నల్ స్ట్రెంథ్ ఇలా కనిపిస్తుంది. మీకు సిగ్నల్ స్ట్రెంథ్ సంఖ్య నెగిటివ్ (రుణాత్మక) రూపంలో కనిపిస్తుంది. ఈ సంఖ్య జీరోకు చేరువగా ఉంటే మీ సిగ్నల్ స్ట్రెంథ్ చాలా బాగా ఉన్నట్టు అర్థం 0 నుంచి -80 వరకు ఉంటే మంచి సిగ్నల్ ఉన్నట్టు భావిస్తారు. -100 నుంచి -120 మధ్య ఉంటే మీ ఐఫోన్ సిగ్నల్ చాలా దారుణంగా ఉన్నట్టు అర్థం మళ్లీ బ్యాక్ రావాలంటే... మళ్లీ ఈ నెంబర్ (*3001#12345#* )ను డయల్ చేస్తే సరిపోతుంది. ఈ ఫీచర్ మాయమై.. మీరు మాములు మోడ్ లోకి వచ్చేస్తారు.