గ్యాస్‌ ‘ట్రిక్‌’ | gas trick | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ ‘ట్రిక్‌’

Published Mon, Oct 10 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 4:54 PM

గ్యాస్‌ ‘ట్రిక్‌’

గ్యాస్‌ ‘ట్రిక్‌’

–దారిమళ్లుతున్న వంటగ్యాస్‌ 
–కార్లకూ వినియోగం 
–పెరిగిన 3కేజీల సిలిండర్ల వినియోగం
–యథేచ్ఛగా ఫిల్లింగ్‌ సెంటర్ల నిర్వహణ 
 
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) :
వంటగ్యాస్‌ దారిమళ్లుతోంది. నిబంధనల ప్రకారం సబ్సిడీపై అందించే ఈ గ్యాస్‌ను గహావసరాలకే వినియోగించాలి. కొందరు అక్రమార్కులు వ్యాపార అవసరాల కోసం వినియోగిస్తున్నారు. కొందరు చిన్నచిన్న సిలిండర్లలో గ్యాస్‌ను ఫిల్లింగ్‌ చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇది ప్రమాదకరమని తెలిసినా.. పట్టించుకోవడం లేదు. 
యథేచ్ఛగా 3కేజీల సిలిండర్ల ఫిల్లింగ్‌ 
జిల్లావ్యాప్తంగా 3కేజీల సిలిండర్లలో వంటగ్యాస్‌ ఫిల్లింగ్‌ యథేచ్ఛగా సాగుతోంది. దీనికోసం వ్యాపారులు రహస్య స్థావరాలను ఏర్పాటుచేసుకుంటున్నారు. కొందరు దుకాణాల్లోనే బహిరంగంగా ఫిల్లింగ్‌ చేసేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. విద్యార్థులు, పెళ్లికాని ఉద్యోగులు, పెళై ్లనా కుటుంబాలకు దూరంగా ఉన్న ఉద్యోగులు ఈ చిన్న సిలిండర్ల వినియోగానికి ప్రాధాన్యం ఇస్తుండడంతో వ్యాపారులు ఎక్కడకక్కడ ఫిల్లింగ్‌సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాలతోపాటు, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఫిల్లింగ్‌ కేంద్రాలు నడుస్తున్నాయి. నిబంధనల ప్రకారం.. గ్యాస్‌ ఫిల్లింగ్‌ నేరం. పైగా ప్రమాదకరం కూడా. అయినా వ్యాపారులు ధనార్జన మాయలో ప్రమాదాలను పట్టించుకోవడం లేదు. 
కార్లకూ వంటగ్యాసే 
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌తోపాటు గ్యాస్‌తో నడిచే కార్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. నిబంధనల ప్రకారం.. ఈ కార్లలో సీఎన్‌జీ గ్యాస్‌ను మాత్రమే వినియోగించాలి. కొన్ని ఆటోలూ సీఎన్‌జీ గ్యాస్‌ ద్వారానే నడుస్తాయి. ఇలాంటి వాహనాలు జిల్లాలో సుమారు 8వేలు ఉన్నట్టు అంచనా. వీటికోసం జిల్లాలో కేవలం ఆరు గ్యాస్‌ ఫిల్లింగ్‌ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ స్టేషన్లు దగ్గరలో లేని వినియోగదారులు వంటగ్యాస్‌ను వాహనాలకు వినియోగిస్తున్నారు. ఫలితంగా ప్రతిరోజూ వేలాది గహావసర సిలిండర్లు దుర్వినియోగమవుతున్నట్టు సమాచారం.
తక్కువ ధరకే గ్యాస్‌
వంట గ్యాస్‌ సిలిండర్లను ఆయా గ్యాస్‌ కంపెనీలు సబ్సీడీ లేకుండా ప్రజలకు 14.2 కేజీల సిలిండర్‌ను రూ.549కి అందిస్తున్నాయి. ఆ లెక్కన కేజీ గ్యాస్‌కు సుమారు రూ.40 అవుతోంది. కానీ మార్కెట్‌లో లభ్యమవుతున్న 3 కేజీల సిలిండర్‌ను కేవలం రూ.80 నుంచి రూ.90కే ప్రై వేటు వ్యాపారులు అందించడం విచిత్రంగా అనిపిస్తోంది. అంటే ప్రభుత్వం అందించే ధర పక్రకారం 3 కేజీల గ్యాస్‌కు సుమారు రూ.120 అవుతుండగా.. ప్రై వేటు వ్యాపారులు మాత్రం కేవలం రూ. 80 – 90 మధ్యనే అందిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. వీరికి ఇంత తక్కువ ధరకు గ్యాస్‌ రావడంపై విస్మయం వ్యక్తమవుతోంది.   
ప్రమాదకరం
గహావసర సిలిండర్లలోని గ్యాస్‌ను చిన్న సిలిండర్లు, కార్లు, ఆటోల్లో నింపడం ప్రమాదకరం. నింపే సమయంలో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. కొన్ని సందర్భాల్లో సిలిండర్లు పేలిపోవడం, భారీ అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలోæ గ్యాస్‌ అక్రమ ఫిల్లింగ్‌కు పాల్పడుతున్న వారిపై ఆయా ప్రాంతాల్లో స్థానికులు ఫిర్యాదులూ చేశారు. అయినా అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
అక్రమ ఫిలింగ్‌కు పాల్పడితే చర్యలు 
గ్యాస్‌ అక్రమ ఫిల్లింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. గ్యాస్‌ ఫిల్లింగ్‌కు లైసెన్స్‌ ఉన్న వారు మాత్రమే చేయాలి. జిల్లాలో 3 కేజీలు, 5 కేజీల సిలిండర్లు విక్రయించడానికి ఎక్కడా లైసెన్సులివ్వలేదు. అలాగే చిన్న కార్లు ఆటోల్లో గృహావసర గ్యాస్‌ను వినియోగించిన వారిపైనా చర్యలు తీసుకుంటాం.
డి.శివశంకర రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement