ఆరోగ్యరక్షణలో ప్రధానపాత్ర
ఒక వ్యాధి అంతు చూసేలోపు మరొకటి వచ్చిపడుతోంది. మానవ జీవనం తింటే తంటా తినకపోతే మంట అన్నట్టుంది. కల్తీమయమవుతున్న ఆహారంతో పాటు అవి వండుకునే పాత్రలు సైతం అనారోగ్య కారణాలలో ప్రధాన‘పాత్ర’ పోషిస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. సరికొత్త వంటపాత్రలు మార్కెట్‌లోకి రావడానికి అవే దోహదం చేస్తున్నాయి. - శిరీష చల్లపల్లి
సాధారణంగా అల్యూమినియం, మెటల్స్ మిక్స్‌డ్ స్టీల్, నాన్‌స్టిక్ వంటి వంటపాత్రలు వండేటప్పుడు పుట్టే ఉష్ణోగ్రత వల్ల ఆ లోహాలను ఆహారపదార్థాల్లోకి పంపిస్తాయి. ఆహారం తీసుకునేటప్పుడు రకరకాల మెటల్స్ కొంచెం కొంచెంగా మన శరీరంలోకి వెళతాయి. దీని పరిణామాలు వివిధ రకాల కొత్త జబ్బులుగా బయటపడుతుంటాయి. అప్పుడు వాటి చికిత్స ఖర్చు లక్షల పైమాటే.. అయితే దీనికి పరిష్కారంగా వచ్చిందే సర్జికల్ గ్రేడ్ స్టీల్.
ఏమిటీ స్టీల్...
మన శరీరంలో బోన్ సర్జరీ జరిగినప్పుడు, మోకాలి చిప్పను రీప్లేస్ చేసినప్పుడు, కాలి ఎముకలకు జత చేసే సర్జికల్ రాడ్స్ మెటల్‌తోనే ఈ పాత్రలు కూడా తయారు చేస్తారు. ఈ మెటల్‌ని సర్జికల్ గ్రేడ్ స్టీల్ అని అంటారు. దీనితో చేసిన బౌల్స్ లేదా కుక్కర్‌లలో వండితే ఎట్టి పరిస్థితుల్లోనూ మెటల్ కరగడం కానీ, తద్వారా తినే భోజనంలో కల్తీ కానీ జరగవు. పైగా భోజనం చాలా సహజంగా, కలర్ సైతం మారకుండా ఒక కొత్త అనుభూతిని మిగులుస్తుంది.
లాభాల బౌల్స్..
ఈ స్టీల్‌తో తయారు చేసిన బౌల్స్ అండ్ కుక్కర్స్‌తో చాలా ప్రయోజనాలున్నాయి. ఆయిల్ లేకుండా బిరియానీ, వేపుళ్లు మాత్రమే కాదు దోసెలు, ఆమ్లెట్లు, చపాతీలు, పిజ్జాలు సైతం చేసుకోవచ్చు. అంతేకాదు వాటర్ లేకుండానే కూరగాయల్ని ఉడికించే మ్యాజిక్ కూడా ఇందులో ఉంది. ఇంకొక ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే బియ్యం కుక్కర్‌లో పెట్టిన ఒక నిమిషం 45 సెకన్లలోనే అన్నం రెడీ అవుతుంది. ఫాస్ట్ అండ్ ఫ్యాట్ ఫ్రీ కుక్కింగ్ కావడంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని సరికొత్త రుచితో ఆస్వాదించవచ్చు. బౌల్స్ సెట్ ఖరీదు మాత్రం లక్షపై మాటే.. కనీసం 2 కేజీలుండే ఒక్కో బౌల్ ప్రారంభ ధర రూ.15 వేలు. కూరగాయల నుంచి వచ్చే విటమిన్స్, మినరల్స్, న్యూట్రిషినల్ వాల్యూస్ వంటివన్నీ మనం తినే వంటల్లో చేరి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు తయారీదారులు.
వండడం సులువు..
ఈ పాత్రలలో వండటం సులువు. ఒక బౌల్‌లో ఒకేసారి రెండు మూడు రకాలను వండుకునేసౌకర్యం ఉంది. గ్యాస్‌తో పాటు టైం కూడా ఆదాకావడం వీటి ప్రత్యేకత. ఇంట్లో వాడుకునే కుక్కర్లతో అనేక రకాల ప్రమాదాలు జరగటం మనందరికీ తెలుసు. కానీ ఈ తరహా సర్జికల్ గ్రేడ్ స్టీల్‌తో తయారైన కుక్‌వేర్‌తో మాత్రం ఎటువంటి బ్లాస్ట్‌లు జరగవు. స్పెషల్ ప్రాసెస్‌తో తయారు చేయడంతో ఎటువంటి టెన్షన్ ఉండదు. నగరంలో చాలామంది వీటిని వినియోగిస్తున్నారు. - సరోజ, మేనేజర్, ఏఎంసీ కుక్ వేర్ యూనిట్