సంప్రదాయంగా వస్తున్న అనేక రకాల వంట పాత్రలతో వంటకాలకు కొత్త రుచులను అద్దవచ్చునని పాకశాస్త్ర నిపుణులు అంటున్నారు. సంప్రదాయ వంట పాత్రలపై నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ విభిన్న రుచులు, సువాసనల సమ్మేళనమైన తెలంగాణ వంటకాలు సంప్రదాయ వంటపాత్రల్లో వండడం ద్వారా మరింత సువాసనను, రుచులను జోడించవచ్చని వివరించారు.
సాధారణంగా రుచికి, వంటకు ఉపయోగించే పాత్రలకి ఉన్న సంబంధాన్ని తక్కువగా పరిగణనలోకి తీసుకుంటారని, అయితే వారసత్వంగా మనకు అందివచ్చిన పాత్రలను మాత్రం ఆ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే రూపొందించారన్నారు. ఈ సందర్భంగా గోల్డ్ డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా మాట్లాడుతూ, ‘మట్టి సువాసనలను నింపే మట్టి కుండల నుంచి, ఇనుప పాత్రల వరకు సాంప్రదాయ తెలంగాణ వంట పాత్రలు ప్రతి వంటకానికి తమదైన ప్రత్యేకతను అద్దడం ద్వారా వాటికి ప్రామాణికతను జోడిస్తాయి‘ అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు సంప్రదాయ వంట పాత్రల విశిష్టతలను వివరించారు.
రాతి చిప్ప:
ఇదొక రాతితో తయారు చేసిన పాత్ర. దీనిని కల్ చట్టి అని కూడా పిలుస్తారు. తెలంగాణ వంటశాలలలో ఓ రకంగా మల్టీ టాస్కర్ ఇది. సన్నటి మంటపై వండితే రుచి బాగుంటుందనుకునే వంటకాలు అయిన పప్పు, సాంబార్‌లకు ఇది అనువైనదిగా ఉంటుంది. మరింత రుచిని కల్పిస్తుంది. చేతితో చెక్కిన ఈ పాత్రలను ఆహారాన్ని నిల్వ చేయడానికి కూడా ఉపయోగిస్తారు.
ఉరులి:
ఒక గుండ్రని వంట పాత్ర ఇది. వివిధ రకాల వంటకాలకు అనువైనది ఈ ఉరులి. కేరళకు చెందిన నైపుణ్యం కలిగిన కళాకారుల చేతుల మీదుగా ఫుడ్–గ్రేడ్ ఇత్తడితో రూపొందింది. ఈ పాత్ర కడాయి తరహాలో ఉపయోగపడుతుంది. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, టమాటాలతో వండిన బెండకాయ వేపుడు (వేయించిన ఓక్రా)తో సహా తెలంగాణలో పలు వంటకాలకు రుచికరమైన ప్రామాణికతను జోడిస్తుంది.
మురుకు అచ్చు:
ఇది కరకరలాడే మురుకులు లేదా జంతికలు కోసం తప్పనిసరిగా ఉండవలసిన సర్వ సాధారణ సాధనం.
అట్టుకల్:
సిల్ బత్తా, కల్ బత్తా వంటి విభిన్న పేర్లతో పిలిచే ఈ గ్రైండింగ్ రాయి మొత్తం మసాలాలు, ధాన్యాలు, పప్పులను సువాసనగల పేస్ట్‌లు పౌడర్‌లుగా మారుస్తుంది. దీనిలో చట్నీలను రుబ్బడం వల్ల అది ఒక కొత్త ఆకర్షణను అందిస్తుంది. ఇంటి వంటల మధురమైన జ్ఞాపకాలను సమున్నతం చేస్తుంది.
మట్టి పాత్ర
సహజమైన మట్టితో రూపొందించిన ఈ సంప్రదాయ కుండ, కోడి కూర (ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ) చేయడానికి సరైన పాత్ర. మట్టికి మాత్రమే కలిగిన ప్రత్యేక లక్షణాలు తేమను నిలుపుకోవడంలో దీనికి సహాయపడతాయి. ఈ కుండలు అవసరమైన పోషకాలను కూడా కలిగి ఉంటాయి.
ది మ్యాజిక్ ఆఫ్ కాస్ట్ ఐరన్:
కాస్ట్ ఐరన్ తో చేసిన వంటసామాను తో కూడా తెలంగాణ వంటకాలు వండుతారు. ఈ దఢమైన కుండలు సన్నగా దోసెలు, నోటిలో కరిగిపోయే హల్వా, గుంట పొంగనాలు వంటి వాటికి బాగా అనుకూలం.
Comments
Please login to add a commentAdd a comment