గతంతో పోల్చితే చిరుధాన్యాల పెద్ద ఉపయోగాల గురించి పల్లె, పట్టణం అనే తేడా లేకుండా విస్తృత అవగాహన పెరిగింది. దీనికి సాక్ష్యంగా నిలిచే వీడియోను ప్రధానమంత్రి నరేంద్రమోదీ షేర్ చేశారు. ‘వైబ్రెంట్ విలేజెస్’ కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఒక గ్రామంలోకి వెళ్లారు.
ఆ గ్రామంలోని ఒక మహిళ మంత్రిగారికి చిరుధాన్యాలతో చేసిన సంప్రదాయ వంటల రుచి చూపించడమే కాదు... జొన్నె రొట్టె నుంచి రాగి లడ్డు వరకు చిరుధాన్యాలు చేసే మంచి గురించి మంచిగా మాట్లాడింది. ప్రధాని ప్రశంస అందుకొంది. ‘ప్రతి పల్లెలో ఇలాంటి దృశ్యం కనిపించాలి’... ‘క్షేత్రస్థాయి నుంచి మొదలైన స్పృహ, చైతన్యం వేగంగా విస్తరిస్తుంది’... ‘కనుల విందు చేసే వీడియో’... ఇలాంటి కామెంట్స్ కనిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment