ఆగస్టు మాసం వచ్చిందంటే పండుగ వాతావరణం వచ్చినట్టే. ఒకవైపు శ్రావణమాస సందడి.మరోవైపు ఆగస్టు 15 స్వాత్రంత్ర్య దినోత్సవ సంబరాలతో దేశభక్తి వెల్లివిరుస్తుంది. అంతేనా ఈ ఆగస్టు మాసంలో రాఖీపండుగ, కృష్ణాష్టమి కూడా కూడా. అలాగే శివుడ్ని కూడా ఆరాధిస్తారు. ముఖ్యంగా పవిత్ర శ్రావణమాసంలో మహిళలు శుక్రవార లక్ష్మీవ్రతం, మంగళవార వ్రతాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఉపవాసం ఉంటారు. పుజాదికాలు, వంటలు చేయాలంటే శరీరానికి శక్తి కావాలి కదా. ఉపవాస దీక్షకు భంగం కాకుండా, శరీరం బలహీన పడకుండా ఉత్సాహంగా పనిచేసుకునేలా కొన్ని పానీయాల గురించి తెలుసుకుందాం.
ఉపవాసంలో శక్తినిచ్చే పానీయాలు
ఉపవాసం ఉన్నప్పు హైడ్రేషన్ చాలా ముఖ్యం. ఆకలిగా అనిపించినప్పుడు డీహైడ్రేషన్‌కు గురవుతాము. దీన్ని నివారించడానికి ద్రవాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. అయితే సాధారణంగా కాఫీ, టీలతొ ఉపవాసాన్ని ఆచరిస్తారు చాలామంది. తక్షణ శక్తికోసం ఇవి కొంతవరకు ఉపయోగ పడతాయి. కానీ ఖాళీ కడుపుతో కాఫీ, టీలకు బదులుగా మజ్జిగ ,కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు పనిచేస్తాయి. గ్యాస్ సమస్యలు రాకుండా కడుపులో చల్లగా ఉండేలా చేస్తాయి.
మజ్జిగ: ఉపవాసాల సమయంలో మజ్జిగను మించింది మరొకటి ఉండదు. పల్చటి మజ్జిగ శరీరానికి శక్తిని ఇస్తుంది. ఉపవాస దీక్షకు భంగం అనుకుంటే ఉప్పును మానివేసి,చక్కెర కలుపుకొని తాగవచ్చు.రుచికోసం వేయించిన జీలకర్ర పొడి,పుదీనా, నిమ్మరసం కలిపి తాగొచ్చు. కడుపునకు చల్లదనాన్నిచ్చి, ఉత్సాహంగా ఉంటుంది.
నిమ్మరసం: బాగా నీరసం అనిపించినపుడు ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటానికి నిమ్మరసం చాలా మంచిది. ఒక గ్లాసు నీళ్లలో కొద్దిగా నిమ్మరసం, తెనె కలుపుకొని తాగితే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి శరీరానికి తక్షణ శక్తినిస్తుంది.
కొబ్బరి నీళ్లు: సహజసిద్ధంగా లభించే కొబ్బరి నీరు గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. పొటాషియం, సోడియం, మాంగనీస్ వంటి ఎలక్ట్రోలైట్లు ఉన్నాయి. శక్తినిచ్చి, నీరసం రాకుండా కాపాడుతుంది.
పండ్ల రసాలు: ఉపవాసం సమయంలో సీజన్‌లో దొరికే అన్ని రకాల పండ్లను తినవచ్చు. మరింత శక్తి కావాలనుకుంటే బత్తాయి, యాపిల్, పైనాపిల్,మామిడి పండ్ల రసాలు, మిల్క్ షేక్ తాగవచ్చు. దానిమ్మ, జామ తదితర పండ్లతో సలాడ్‌లా చేసుకొని తినవచ్చు.
బాదం పాలు బాదం పాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. శ్రావణ మాసంలో వాతావరణంలో బాదం పాలు తాగడం వల్ల తక్షణ శక్తిలభిస్తుంది. వేడి పాలల్లో కొద్దిగా జీడి పప్పు పలుకులు, పంచదార లేదా తేనె,బాదం పొడిని కలుపుకుని తాగాలి. దీంతో పొట్ట నిండుగా ఉండి, మనసుకు ఉత్సాహంగా అనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment